వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఇది సిల్లీ గా ఉండోచ్చు.కాని ఏమి చేయను నాకు చెప్పలేనంత సంతోషం గా ఉంది.
నా బ్లాగ్ మొదలు పెట్టాక వంద హిట్స్ కే తెగ సంబరపడిపోయాను.అప్పుడే ఒక పోస్ట్ వేయలనుకున్న.
మరి చిన్నతనపు అమాయక చేష్ట లా అనిపించింది.నిజం చెప్పాలంటే ఆ వందలోని మూడు వంతుల హిట్స్ నావే అయిఉంటాయి.కొత్త మోజు కదా!వద్దు అనుకుంటూనే ఒకసారి చూడటం.అలా నేనే ఎక్కు సార్లు చూసుకున్నాను.

నాకు ఇప్పుడు మహా సంబరంగా ఉంది..ఈ 1116 నంబర్ చూసాక,ఎంత సంబరం అంటే నేను చిన్నపిల్ల గా ఉన్నపుడు మా రాముతాతయ్య (మా తాతయ్య అన్నా)రాత్రులు ఇంటికి తిరిగివస్తూ నాకు పొట్లం తెచ్చేవారు.ఎంత రాత్రి అయినా తాతయ్య పొట్లం కోసం ఎదురుచూసి ,పొట్లం పట్టుకునే నిద్ర పోయేదాన్ని.ఎంత రాత్రి అయినా అంటే ఏడు లేదా ఎనిమిది,అప్పుడు మా ఇంట్లో తొమ్మిది తరువాత అంటే అర్దరాత్రి క్రింద లెక్క .ఏడునరకి దూరదర్శన్ లో వార్తలు అయ్యాక ఇంక నిద్రే .తాతయ్య పొట్లం చూడగానే ఎంత సంతోషమంటే మాటలలో చెప్పలేను.తాతయ్య ఊరు మలుపులో ఉండగానే నాకు తెలిసిపోయేది.ఎలా అంటే తాతయ్య మంచి స్ట్రాంగ్ సాయబుగారి అత్తరు వాడేవారు.రాముతాతయ్య వస్తున్నారు అని గుమ్మం కచేదాన్ని.తాతయ్యకి మరి లేట్ అయితే పొట్లం ఇంటికి తీసుకెళ్ళేవారు.నాకు పిచ్చ టెన్షన్ మా పెద్ద నాన్నమ్మ తినేస్తారని.లేచిలేవటమే వెళ్లి నాన్నమ్మ ని అడిగి పొట్లం తెచ్చుకునేదాన్ని.నాన్నమ్మ కొన్ని సార్లు తాతయ్య తేలేదు అని ఏడిపించేవారు,నేను తాతయ్యని అడుగుతా అనగానే వద్దులే అమ్మ అని నా పొట్లం నాకు ఇచ్చేవారు.తాతయ్య ఎక్కువగా నాకోసం మిక్సర్ ఇంక పసుపుకాగితం చుట్టిన ఆరంజ్ బిళ్ళలు (చాకిలేట్స్)తెచ్చేవారు.ఇంక చాల రకాలు తెచ్చేవారు.

అప్పటినా సంబరం లా ఈప్పుడు అంభారాన్నిఅంటినట్లు ఉంది.నేను బ్లాగ్ రాయటానికి ముందు మా ఆయనకి చెపితే హ హ్హ హ అన్నారు.భయం వేసింది వదిలేద్దాం ,హ్యాపీగా అందరి బ్లాగ్స్ చదువుతూ ఎంజాయ్ చేద్దాం లే !అనుకున్నా కాని చదువుతున్న కొద్ది నేను రాయాలి అనిపించి౦ది.తాతయ్య కోసం వెయిట్ చేసినట్లు మంచి టైం కోసం వెయిట్ చేశాను.నేను రాయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చాక నా ఫేవరేట్ ప్లేస్ పేరు మీదా మీ ముందుకు వచ్చాను.నాకు రాయటం అలవాటు లేదు కాని డైరీ రాస్తాను.కొన్ని కొన్ని పేజీలు తరువాత చదువుతున్నపుడు నాకే ముచ్చటేస్తుంది.ఇంక నేను లెటర్ బాగా తరుచు రాసే అలవాటు ఉండేది. లెటర్ చదువుతుంటే నువ్వు ఎదురుగా ఉన్నట్లు ఉంది అనేవారు.అదే కొంచం గుర్తుచేసుకుని ,ఓకే లే మరి రాయలేక పొతే ఏముంది వదిలేద్దాం అని మొదలుపెట్టా.

కాని ఎంత టెన్షన్ అమ్మో ఎవరైనా కఠినం గా కామెంట్స్ రాస్తే అని అనిపించినప్పుడు ,నా ఈ పోస్ట్ వలన ఎవరైనా హార్ట్ అవుతారా !కొన్ని సార్లు అంతా రాసాక నాకే సిల్లీ గా అన్పించి డిలీట్ చేసి,అయ్యో అన్ని ఆయాస పడ్డాను.అన్ని టెన్షన్స్ మద్య ఈ రోజు వెయ్యి మైలురాయి దాటింది నా మనసు పుస్తకం.(నాన్నమ్మ ఉదయం ఇస్తారని తెలిసిన టెన్షన్ పడ్డటు).

నా బ్లాగ్ చూసి అముల్యమైన మీ అభిప్రాయాలూ పంపినా అందరికి పేరు పేరునా నా ధన్యవాదాలు.
మంచి చెడు అన్ని మనలోనే ఉంటాయి అని నమ్ముతా నేను.ఎందుకంటే అందరికి నచ్చేవారు ఎవరు ఉండరని నా ఫీలింగ్.కాని మనిషిగా పుట్టక విగ్జ్ఞాత తో మంచి చెడులు బేరీజు వేసుకుంటూ మంచి వైపే నడవాలి అనుకుంటాం ,కాని మనకి మంచి అనిపించింది అందరికి మంచి అనిపించాలని లేదు.నా ప్రపంచం చాలా చిన్నది.నా పరిది లో నా మనసులోని ఫీలింగ్స్ రాయాలని అనుకుంటున్నా.మంచి చెడులు చెప్పి ప్రోత్సహించండి.కాని విమర్శ సున్నితం గా చేయండి ప్లీజ్.

ఇంక మా తాతయ్య పొట్లం కోసం ఎదురుచుసినట్లు ఇప్పటినుంచి 10000 కోసం ఎదురుచూస్తున్నా.
హిట్స్ ప్రతిభకి కొలమానం కాదు కాని అదో తృప్తి.నా బ్లాగ్ కి వచ్చి టైం సుత్తి అని ఫీల్ అయినవారికి సారీ లు చెపుతూ...

మా ఇంట్లో ఆఖరిది ,పెద్దలందరి గారాల పట్టి మా చిన్న చెల్లెలు వర్ష.మా చిన్నగారి అమ్మాయి.ఇంట్లో నేను పెద్ద వర్ష ఆఖరు.మేము మొత్తం ఏడుగురం కజిన్స్ .మా బావ గాడు తప్ప అందరికి వర్ష అంటే కోపం.అన్నింటికి వాయి వాయి అని ఏడుస్తూనే ఉండేది." "అంటే కంప్లేంట్ "ఆ" అంటే కంప్లేంట్.

ఫై గా ఆవిడగారికి మా తాతయ్య పెద్ద సపోర్ట్ అన్నిటికి దొంగ ఏడుపులు ,పితురిలు ఆవిడా చెపితే మా తాతయ్య అది చిన్న పిల్ల అని మమ్మల్ని తిట్టేవారు.మమ్మల్ని తిడుతుంటే హీరోయిన్ గారు విజయ గర్వం మమ్మల్ని చూసేది రక్షసి తవిది అప్పటి మా క్షొభ చెప్పనలవి కానిది.పెద్ద దానిని కదా అధిక మోతాదులో ఆక్షి౦తలు నాకే .....

అమ్మో అయ్యో అమ్మగారి గారాలు చూడాలి,తాతయ్య మీరంటే నాకు ప్రాణం అనేది తాతయ్య ఫ్లాట్,నాన్నమ్మ మీరు వండితే అబ్బ సూపరో అనిఅనగానే మా నాన్నమ్మ డమేల్,మా నాన్న తో కబుర్లు చెప్పి ఆయనని ,అత్తయ్య కేమో అత్తా వాడి పువ్వు వలె మెత్తన అని పాడి మరి పడగోట్టేసింది.అందరి కి ఆవిడా తప్ప మేము కనిపించేవాళ్ళం కాదు.

ఒకసారి మా మావయ్య యూరప్ వెళ్ళారు,వచ్చే అప్పుడు మా అందరికి మంచి మంచి గిఫ్త్స్ తెచ్చారు.

అందరికి పేరు పేరునా ఎవరివి వారికీ ఇచ్చారు వాటితో పాటు అయిదు నెయిల్ పాలిష్ లు కుడా తెచారు. కవర్ నాకు ఇచ్చి అంతా తల ఒకటి తీసుకోండి అన్నారు.నాల్గు గుడ్ ఒకటి మాత్రం అసలు బాగోలేదు.

అది ఎలా అయినా మా రాకాసికి ఇవ్వాలని అనుకున్నా..మా వర్ష కి ఉన్నా వజ్రం లాంటి గుణం ఏంటంటే ఎవరినా తీసుకున్నదే దానికి కావాలి.నేను మిగతా నల్గుర్ని పిలిచి చూపించా అంతా ఏది నాకు (పెద్ద దాన్ని కదా )చెప్పి వాళ్ళని కవలింది తిసుకోమన్న.అంతా సెలెక్ట్ చేసుకున్నాం .మరి వర్ష ఇది తీసుకుంటుందా !అమ్మే దానికి నా వస్తువులే నచ్చుతాయి ,అని ఒకరు.లేదు నాదే నచ్చుతుంది నా మీదే చుంచు కళ్లు అని అందరికి టెన్షన్ .

ఇంతలొ మా పిన్నులు ఇద్దరు వచ్చి విషయం ఆరా తీసి నా ప్లాన్ విని నవ్వుకుని అల్ ది బెస్ట్ చెప్పారు.నాకు చాలా ఎనర్జీ వచ్చింది.ఇంతకీ మేడం ఎక్కడో చుడండి అని వెతికాను.తాతయ్య పక్కన కుర్చుని వేడి ఇడ్లి లో కారపొడి,నెయ్యి వేసి లాగిస్తుంది.తాతయ్య తినిపిస్తున్నారు,నేను వెళ్లి అని నోరుతెరిచా ,అమ్మ ఏంటి వెకిలి వేషాలు కావాలంటే ప్లేట్ లో పెట్టుకుని తిను అని పక్కకు లాగి మరి పద్దతి గా చెప్పారు,మరి వర్ష అన్నా అన్నిటికి దానితో పోలికేంటి అది చిన్న పిల్ల .నీకు దానికి తేడా లేదు అని ,చేయగల్గినంత పెద్ద కళ్లు చేసి చెప్పారు.తాతయ్య నన్ను పిలిచి ఫ్రెష్ వెన్న వేసి ఇడ్లి ముక్క నోట్లో పెట్టారు ,అప్పుడు నేను అమ్మవంక (దమ్ముంటే ఎప్పుడు మీ కళ్లు సైజు చూపించండి ) విజయ గర్వం వీర మందహాసం చేశాను.మా వర్ష ఇరికించి నవ్వుతుందే అదే నవ్వు .ఎంతయినా నా బుల్లి చెల్లి కదా.

వర్ష అసలు పేరు వరలక్ష్మి ,ఇంట్లో వర్ష అని పిలుస్తాం .మా బల్లి లాంటి బుల్లి చెల్లికి వరలక్ష్మి అంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది.తాతయ్య ,నాన్నమ్మ వాళ్లు లేని టైం లో వరం వరం నీకు పెట్టాలి కారం,నువ్వు

మాకు పెద్ద శాపం అది ఇది నా విధాలు గా ఆడుకునేవాళ్ళం.

ఇంక వర్ష ఇడ్లి అంతు చూసాక పిలిచి నెయిల్ పోలిష్ మేటర్ చెప్పి అప్పుడే అంతా మొదటిసారి చూస్తున్నట్లు గా జీవి౦చెస్తు అంతా బాగోని నెయిల్ పోలిష్ మీద పడి ట్యాగ్ అఫ్ వార్ మొదలుపెట్టాం.

మా అత్తయ్య వచ్చి, నేను ఇస్తాను అని చెప్పి తలొకటి ఇస్తుంటే ,అప్పటివరకు వోరు విప్పని మా న౦గనాచి తుంగబుర్ర "నాకు అదే కావాలి"అని మా ప్లాన్ సుఖాంతం చేసింది.అత్తయ్య వెళ్ళాక మేము ముందు సెలెక్ట్ చేసుకున్నట్లు గా శాంతియుతం గా ఎవరిదీ వాళ్ళు తీసుకున్నాం.ఒయ్యారి భామా తిప్పుకుంటూ దాని స్టైల్ లో ఒక లుక్ లూకి వెళ్లి పోయింది.

అమ్మ అని అరుచుకుంటూ వెళ్లి ,పిన్నికి చూపించి ,నేయిల్ పోలిష్ వేయించుకుని చేతులు గాలి లో నే పెట్టుకుని తిరిగేది.తను మర్చిపోతే మేము అయ్యో వర్ష గోళ్ళరంగు పోతుంది అనిగుర్తు చేసేవాళ్ళం.వర్ష గేటు(గుమ్మం)అని పోగిదేవాళ్ళం.సూపర్ గోళ్ళరంగు కొట్టేసావ్ వర్ష అంటే ఉబ్బి తబ్బిబు అయిపోయేది.ఇంక అప్పటి నుంచి వర్ష తో పెద్ద గా ప్రొబ్లెంస్ రాలేదు .మేము వర్షని మాకు నచ్చినట్లు గా ముల్ద్ చేసేసాం.

తరువాత ఇంట్లో అందరికి వర్ష తో సహా మా మేటర్ తెలిసిపోయింది.అంతా అవునా అని నవ్వారు,మా నాన్నమ్మ పెద్దదానికి పెళ్లి చేస్తే నాకు అదే కావాలి ,వాడె కావాలి అంటుదేమో అన్నారు.అలాగే నా పెళ్ళికి అ౦ది కుడా..ఇప్పుడు మాకు గారాల పట్టి మా బుల్లి చెల్లి ని "నాకు అదే కావాలి" వర్ష అని ఉడికిస్తూ ఉంటాం. ఈప్పుడు మాత్రం వరల్డ్ లో ది బెస్ట్ చెల్లెలు అవార్డు అంటూ ఉంటే అది తప్పక మా వర్ష కే ఇవ్వాలి.

iam sorry dear varsha,we love u so much.

వంటల తంటాలు రాయాలని ప్రమదావనం లో తీర్మానం అయ్యింది.
సో నేను సై సై అన్నా........ఇంకా నేను చేసినా వంట అయితే హిట్ లేదా ఫట్ కానీ ఎవరేజ్ గా ఆడటం తక్కువనే అనే చెప్పాలి నేను వంటా లో,ఒంటరి గా బుడి బుడి అడుగులు వేస్తున్నపుడు.
నా మొదటి వంటా ఆమ్లెట్ అప్పుడు నా వయసు ఏడు లేదా ఎనిమిది ఏళ్ళు ఉండొచ్చు.కబురు కాకరకాయ లేకుండా మా చిన్న మేనమావ మా అమ్మ ని చూడటానికి ఉరు నుంచి వచ్చారు.
మా అమ్మ,నాన్నమ్మ ఎప్పుడు లేంది ఆ రోజు ప్రొద్దుటే మాకు ఆ రోజు కి సరిపడా అన్ని అమర్చిసాయంత్రం అన్నం ఒకటే వండుకునేలా పెట్టి వెళ్లారు.మర్నాడు తెల్లవారే వస్తారు అన్నా మాటా...ఈ లోపు విషయం తెలియక (మా అమ్మని)అక్కని చూడటానికి మా మావయ్య వచ్చారు.
అది ఏడు గంటలకి అప్పటికి మా నిద్రకి పక్కలు వెన్నెల వాకిట్లో సర్దుకునే టైం.ఇంకేముంది వంట వండాల్సి వచ్చింది.ఇంట్లో మా నాన్న,తాతయ్య వాళ్లు తినటానికి తప్ప వంటిల్లు వైపు చూడరు అనుకోండి.ఇంక ఆడ జట్టు నేను ,మా చెల్లి( నాల్గు లేదా అయిదు),మా తాతమ్మ(మా నాన్నమ్మ అత్తగారు)పనిపాప లు ఉన్నాము.తాతమ్మ అన్నం వండారు వార్చారు (ఈ వార్చటం నాకు ఈప్పటికీ రాదు అనుకోండి అది వేరే విషయం),నేను ఆమ్లెట్ రెడీ చేశాను.మా ఇంట్లో అప్పట్లో చాల ఆచారం అవి ఉండేవి .పని వాళ్ళని వంట ఇంట్లో కి రానిచేవారు కాదు .సో నాకు వచ్చి రానట్లు గా రెండు అంగులాలికి తగ్గకుండా ఉల్లి తరుగు తరిగి తాతమ్మ చెప్పినట్లు ఉప్పు,కారం,గరం మసాల పొడి,ఇంక పసుపు వేసి కలిపి చేసేసాను.తాతమ్మ అన్ని అర చెంచా అర చెంచా అని చెపితే నేను విశాలా హృదయం తో కొంచం ఎక్కువే వేసి కలిపాను .తాతమ్మే ఆమ్లెట్ వేసారు అనుకోండి.మావయ్యకి వడ్డన చేసాం.ఆవకాయ,అమ్మ పెట్టి వెళ్ళిన చారు,ఆవకాయ,ఉదయం చేసిన ఫ్రెష్ వెన్నపూస .మావయ్య తో సుత్తి కొడుతూ పక్కనే ఉన్నాను.ఆవకాయ అయ్యింది,ఆమ్లెట్ కి వచ్చారు కలుపుకుని మొఖం చిత్ర విచిత్రం గా పెట్టి నోట్లో ముద్దా తీసేసేరు.తరువాత చారు,మజ్జిగ తో ఫినిష్ చేసారు.నేను నేనే చేశాను ఆమ్లెట్ అనిగొప్ప చెప్పే లోపే మావయ్య ఫీల్ చూసి చెప్పలేదు.మావయ్య వెళ్ళాక నేను తిని చుస్తీ మావయ్య తెచ్చినా నేను ఆబగా తినేసిన బిస్కట్లు వాంతీ అయ్యే అంటా పని అయ్యింది.గొడ్డు కారం,పసుపు ముద్దా గా తియ్యగా ఉంది,తీరా చుస్తే ఉప్పు బదులు పంచదారా వేసాను.ఆమ్లెట్ కి ఫ్రై లకి కళ్లు ఉప్పు (రాళ్ళ ఉప్పు)పోటు(దంపించి)వేయించి ఉంచేవారు.మనం ఆ ఫైన్ సాల్ట్ అనుకుని పంచదారా వేసేసనన్న మాటా.
తరువాత ఈ భయంకర నిజం ఎవరికీ చెప్పకుండా నాలో సమాది చేశాను.చిన్ననాటి అలవాట్లు చిరకాలం ఉండును అంటారు గా అలా మొదలు పెట్టినా వంట లో ప్రయోగాలు ఇంకా గత ఇరవై సంవత్సరాలు గా పట్టువదలక సాగిస్తూనే ఉన్నా.పెళ్ళయి కొత్తలో మా ఆయనకి మినపప్పు (పెసరపప్పు)అనుకుని వండి పెట్టా.పప్పు బద్ద చెదరలేదు కాని సూపర్ గా జిగురు జిగురు పాకం లా వచ్చింది.మా ఆయనని వేరేకాపారం పెట్టిన కొత్తలో శెలవు కదా అని మర్నాడు టిఫిన్ పురమా యించ మంటే సింపుల్ గా గారెలు అంటే ఆ రాత్రి జాగారమే చేశాను.నానమ్మని హౌ ,అని ఫోన్ లో అడిగి అన్ని చెప్పినట్లే చేశా కాని గోడ టపాకాయలా ( అష్ట వకారాలు అకారాల తో నూనె లో వేయగానే )పేలాయి కారణం ఏవిరా అంటే నీళ్లు ఎక్కువ వేయకుండా రుబ్బాలి అంటే నేను మరి ఒక స్పూన్ వేసి రుబ్బను.అవి పేలి నూనె పడి బొబ్బలు కుడా వచ్చాయి.
అలా ఫోన్ ని నమ్ముకుని,పుస్తకాలు నమ్ముకుని,ఈ మద్య టి.వి నమ్ముకుని ఇంక ప్రయోగాలు చెస్తునే ఉన్నాను.ఇంక ప్రూవ్ కాని ఫార్ములాలు చాలా నే ఉన్నాయి.హిట్ అయితే టేబుల్ మీదకి లేదా ముకంటి కి కుడా తెలియకుండా డస్ట్ బిన్ లోకి ...పాపం నా వంటా మా ఆయనకంటే డస్ట్ బిన్ ఎక్కువ తింటుంది.నౌ ఓకే లెండి.కొంచం ఇంప్రూవ్ అయ్యాను.నాకు వంటా బాగా వండటం కంటే చెత్త వంటకి తినబుల్ గా చేయటం చాలా ఇష్టం .
ఇది అమ్మ లారా ,అయ్యలారా నా వంటా గోలా....

మొన్నదేశం కాని దేశం లో జ్యోతిర్మయి ......నిన్న ప్రణిత ,స్వాప్నిక ........నేడు లావణ్య .......
ఎటు పోతున్నాం మనం.మమ్మల్ని బ్రతకనివ్వండి.ఎన్నాళ్ళు ఇంక ఎన్నేళ్ళు గాంధీ గారు కలలు కన్నా స్వాతంత్ర్యం రాక పోయినా కనీసం పట్టపగలు అయినా బిక్కు మంటూ భయపడకుండా ఉండే రోజు వస్తుందా ??????

పసి పాపా నుంచి పండు ముసలి అవ్వని అయినా కనికరం లేని కామం తో కళ్లు ముసుకు పోయిన మృగాల చేత అకృత్యాలు బలి అయ్యి అల్లాడుతున్నారు. పక్కింటి ఆరేళ్ళ పాపా ని ఆటల పేరు తో అసహ్యం గా ప్రవర్తించే పశువులు.పదేళ్ళయినా లేని పసి మొగ్గ లాంటి పిల్లని బస్సులో తాకుతూ రాక్షస ఆనందం పొందే శాడిస్టుగాళ్ళు .వావివరసలు మర్చిపోయి రెచ్చిపోతున్నదుర్మార్గులు .సినిమా హల్లో కుర్చిలా సందులోంచి ముట్టుకుని వీరత్వం అనుకునే పిచ్చి కుక్కలు.
ప్రేమ పేరు తో ఒకడు,పెళ్లి పేరు తో ఒకడు ,అవసరాలని ఆసరా తీసుకుని ఒకడు,భయ పెట్టి ఒకడు,బలవంతం గా ఒకడు ,ఇంక ఎన్నో ఎన్నెన్నో ఎంతమందో.రక్షక బటులే భక్షకులు అవ్వుతుంటే ఎవరకి చెప్పాలి.ఏమని చెప్పాలి .ఎలా ఏడవాలి .....మరో మగాడు అయినా నాన్న, అన్నా తమ్ముడు ,మొగుడు తో నా ...ఎలా చెప్పగలం . అవమానించ బడ్డ ఆడకూతురు కి వీళ్ళు ఆ జాతి వారే అని గుర్తు వస్తే.???????.ఆమె మనసు ఆక్రందన ఈ పురుష ప్రపంచం ఉహ కి అందుతుందా ....

పరాయి ఆడవాళ్ళని ఆబగా చూసి చోంగా కార్చుకునే ఈ మగాళ్ళకి తెలియదా తనని ఓ తల్లి కన్నదని;ఆమె స్తన్యం తాగి ఇంతా అయ్యామని .రాఖి కట్టే తన చెల్లిలాగే మరో అన్నకి చెల్లెలు అని .
మాటాల తో చేతల తో అమ్మ లాంటి ఓ ఆంటీ అని ,తోబుట్టువు లాంటి ఆడపిల్లని వికారా చేష్టల తో హింసిస్తున్నమని.

పూర్వమే ఆడవాళ్లు మనఃశాంతి గా ఉండేవారేమో, ఇంటి గడప దాటకుండా .మనం అబివృద్ది చెందుతున్న దాని కంటే అధ పాతాళం వైపుకి ఎక్కువ పోతున్నాం.ఇలానే కొనసాగితే ఆడవాళ్లు అమ్మ అవడానికే భయపడే రోజు వస్తుందేమో.అవమానాలు,అకృత్యాలు,మాసిక క్షొభ అన్ని ఆడవాళ్ళ కే.తల్లిని,ఆవుని,జన్మభూమిని పూజించే భారతీయ సంసృతి మాయమయ్యింది.ప్రతి దేవుడి పేరుకి ముందు ఆయన భార్య పేరుతొ స్తుతించే మన దేశం లో స్త్రీ దక్కుతున్నా మర్యాదలు చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుని ...ఛీ ఛీ ఛీ అంటుంటే మనం వార్తలో ఉన్నామని ఆనందిద్దాం.

పాపాలు చేసుకుంటే నరకానికి పోతారట.కాని నాకు ఈ క్షణం అనిపిస్తుంది .మహాపాపం కి శిక్ష ఆడజన్మేమో....................అని.

దయచేసి ఎవరు కామెంట్స్ రాయకండి..నా మనసు ఆక్రోశం రాసుకున్న....