వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

నా బొమ్మకి  పెళ్లి   అనగానే  పిల్లోడు  ఇలా ఉండాలి  అలా  ఉండాలి అని నా మనోదర్పణం లో

కలలు మొదలు పెట్టా!!!బొమ్మేటి  పెళ్లి ఏమిటి అన్పిస్తుందా??? ఆఖరి వరకు చదివి అప్పుడు తెలుస్తుంది...

ఇక కధలోకి  వస్తే ............పెళ్ళికొడుకు వేటలో  నా రిక్వరిమెంట్..........

ఆజానబహుడా??ఏమో ??లోకం కోసం కాక నా బొమ్మ కోసం ఆలోచించేవాడా??ఇలా....ఎన్నో ఏవో

గజిబిజి గందరగోళం..

నా బొమ్మ మాత్రం చదువు లో సరస్వతి ,పనిలో పార్వతి తిండి తినడంలో మాత్రం శుద్ధ దద్దమ్మ అందుకే అమ్మలా

కడుపు చూడాలి ఇంకా చిన్నపిల్ల ఏమిటి ఇది క్వాలిటి డిలిట్ డిలిట్ ...

మనస్సులో  మాట చెప్పదు.,,,మనమే కనిపెట్టాలి,,,అయితే నా బంగారు మనస్సు కనిపెట్టే మనసు ఉన్నవాడై

ఉండాలి......ఎదో కాకి పిల్లకి కాకి ముద్దని నా అపురూపం కానీ,,, అడగనిదే అమ్మయినా పెట్టదు అని అన్నారు కదా

 మన గురించి మనమే కాస్తా చూసుకోవాలి !!!

ఈ మద్యన ఆడపిల్ల వాళ్ళు మరి అతి చెయ్య బట్టే కొత్త కొత్త సిన్నులు ,బడాయిలు వస్తున్నాయి....


అలా అని  ఇలా వదలలేక పోయా ఇక ఏమైనా ఒక గుణగణ పట్టి రాసెయ్యాలి అని మొదలుపెట్టా!!

నిజాయితీ  ఉండి,,,ముంగిలా ఉంటే నో .....కలుపుకోలుతనం గా అలాని పెద్దాచిన్న లేకుండా ఉంటే నో  నో .....

నో ..నో....గౌరవమర్యాదలు ఉండాలి  మరి పెద్దతరహగా కుడా నో.నో నో ...సరదా,సరసం తెలియాలి ,,వెకిలిగా కుదరదే

 కుదరదు ...బాద్యతాయుతం గా ఉండాలి ...

 ****నిజాయితీ+కలుపుకోలుతనం +గౌర్వమర్యడలు+సరదాసరసం+బాద్యతయుతుడు=నా బొమ్మ ****

  ఇక నా వల్ల కాదు ఎలా ఎలా ఎలా లా లా లా లా లా లా లా .....................................????????????????

ఒకే ఒక్క ముక్కలో సకల గుణవంతుడు కావాలి ....................................................................................

#########పెళ్ళైన తరువాత బాధలోనూ,భయంలోను ,కష్టంలోనూ ,కన్నీళ్ళలోను ,కలవరింతలలోను   మేము

ఎవరు గుర్తురాకుండా చూసేవాడు#########

అలా ని నా బుజ్జి తల్లికి మేము గుర్తురాకపోతే ఎలా సుఖంలో ,సంతోషంలో ,పోలమారిన ప్రతిసారి గుర్తు రావాలి..

చాలా స్వార్ధం గా ఉంది కదా !!!అయినా నాకు నచ్చింది...

ఇంతకీ నా బొమ్మ ఎవరో చెప్పలేదు కదా!!!నేను అల్రాడీ ఓ చెల్లితో నానాకష్టాలు పడుతుండగా మా చిన్నన్న కి ఓ


బుజ్జి తమ్ముడు పుట్టాలి అని కోరుకుంటే ..చిన్నాన్న  ఫోన్ పాప అని  .....నా హుషార్ హుషార్ ...ఇష్టం నేను

చూడటానికి వెళ్ళా కాని చూశాక బుల్లి బుల్లి చేతులు చాపి ,మెరిసే చూపుతో ,బోసినవ్వుల నా బొమ్మ ...ఆ రోజు

ఎప్పటికి మర్చిపోలేను...ఇక అప్పుడే ఫిదా అయిపోయా !!ఇక సెలవులు కోసం లేదా పిన్ని కోసం చాలా

ఎదురుచుసేదాన్ని..పిన్ని టైం టైం కి అన్నిపాపకి  చుస్తూ నాకు ఆడుకోవటానికి చాలా ఎక్కువ ఉండేది కాదు

అయినా ,,,చాలా ఎంజాయ్ చేసేదాన్ని....నాకు ఉహ తెలిసాక నేను చుసిన  బుజ్జి పాప మా ఇంట్లో అందుకే ,,నాకు

 ఎప్పటికి చాలా స్పెషల్....... ఇదిగో  ఇక్కడ నా బొమ్మ అపూర్వ...

పెళ్లి  ఈ నెల ఆఖరున నా దీవెన ప్రార్దన అన్ని నా బొమ్మ ఎప్పుడు హాయిగా ఉండాలి..

ప్రేమతో ,
సుమక్క .


మన దేశానికి మంచిరోజులు రావటానికి ఉన్న విఘ్నాలు తొలగించటానికి పూజలు అందుకోవటానికి వినాయకుడు ఊరురా వాడవాడా ప్రతిలోగిలికి వచ్చేస్తున్నాడు కమ్మని మట్టి వాసనతో...నాకు వీలుయినంతలో అందరికి మట్టి బొమ్మకి పూజలు చెయ్యండి చెప్పటం http://vaalukobbarichettu9.blogspot.com/2009/08/blog-post_20.htmlఅలవాటు!!నేను ఇప్పటిఎవరికీ చెప్పలేదు ఎందుకంటే నాకే బోలెడు మంది చెప్పారు..ఎవరు చెప్పిన సరే తప్పకుండా అని చెపుతున్నా!!భలే మార్పు గతనాల్గు ఏళ్ల నుంచి చుస్తే ఈ సారి నా పరిధిలో వందకి వంద మంది మట్టి గణపాయ్ లకే పట్టం కడుతున్నారు..మాటలలో చెప్పలేని ఆనందం ఇది నాకు..
మాకు ఇక్కడ మట్టిదోరకదు కనుక నేను ఎప్పుడు పసుపు విఘ్నేశ్వరుడికే కే పూజ చేస్తాను..కొంతమంది ఇక్కడ మిత్రులు ప్లే డోవ్ తో చేస్తారు..అది ఎంతవరకు శ్రేయస్కరమో నాకు తెలియదు..ఏది ఏమైనా చాలా మటుకు మార్పు వచ్చింది..ఈ సారి చాలామటుకు పందిళ్ళలో కుడా మట్టి ప్రతిమలే పెడుతున్నారట!!కొంతమంది పందిళ్ళ నిర్వాహకులు పందిళ్ళలో ప్లాస్టిక్ కవర్స్ నిషేదించి తమ వంతు సామాజిక బాధ్యతని నేరవేర్చుతూ ఆదర్శం గా నిల్చుతున్నారు.. అన్ని చానల్స్ వారు ఈ విజయానికి భాగస్వాములే!!!!
పాస్టర్ ఆఫ్ పారిస్ వద్దో అని కాలుష్యనివారణ మండలి మట్టివినాయకుల్ని పంచటం,స్కూల్ పిల్లలకి అవగాహన కల్పించటం,వారి మట్టి ఇచ్చి బొమ్మలతయరి ని ప్రోత్సహించటం బహుమతులు ఇవ్వటం లాంటి పోటీలు పెట్టి మట్టి లంభోధరుడిని పూజకి చాలా కృషి చేస్తుంది..ఒక్క గణపతి నిమర్జనం వల్లనే కాలుష్యం జరగటం లేదు>> ఇలాగే ఇతర కాలుష్యకారకాలమీద కుడా ప్రజలలో అవగాహ కల్పిస్తే బాగుంటుంది..మొత్తానికి దేశం మొత్తంగా మనప్రభుత్వమే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ని (గణపతి బొమ్మలకి)నిషేధం విధించవచ్చు కదా!!ఏమో ఇందులో సాధ్యసాధ్యాలు నాకు తెలియవు..ఏది ఏమైనా ఈ సారి మాత్రం సర్వత్రా శుభప్రదం గా మట్టి బొమ్మల కే పూజ అంటున్నారు....ఇప్పుడు టి.వి వాళ్ళు ఇంత పెద్ద బొమ్మ అంత పెద్ద బొమ్మ అని జనాన్ని తప్పు దోవ పట్టించకుండా ఎకో ప్రెండ్లీ గణేష లే చూపించి ప్రోత్సహిస్తే బాగుంటుంది...
మన పార్వతితనయునికి అన్ని ఆవిరి మీద వండిన పదార్ధాలే ఇష్టం కదా!!తయారీ చాలా ఈజీ!!డైజేషన్ ఈజీ..నునె మాటే ఉండదు..పత్రీ,ఫలాలు చాలా ప్రీతి ఈశ్వరమానస పుత్రునికి!!!చిన్నప్పుడు కనిపించిన ఆకులు అన్ని పత్రీపత్రీ అని కోసేవాళ్ళం!!ఇప్పుడు మాకు దొరికే ఓన్లీ తులసీపత్రం తోనే పూజ!!!పుస్తకాలకి బోట్లు పెట్టేసి దేవుడ్ని కనిపించకుండా పూవులు,పత్రీ తో కప్పేసి మర్నాడు పాలవెల్లికి ఉన్న ఒక్కొక్కో పండు తినేసేదాన్ని!!!అందుకే గజముఖధారి పాలవెల్లి పెట్టి ఇప్పటికి పూజ చేసేచాన్స్ ఇవ్వలేదు...ఇప్పుడు పెడదామా అంటే ఇన్నాళ్ళు లెంది ఎందుకు అని అనిపిస్తుంది...పూజ కబోడ్ లో ఉండే పొడుగాటి రాడ్ కి అన్ని పళ్ళు,మామిడాకులు కట్టేసేస్తాను..పిల్లలపుస్తకాలు,మా సాబ్ సొంతఖర్చులపద్దులు పెట్టి నాకు విఘ్నరాజుకి మాత్రమే తెలిసేలా బ్లాగ్ చిత్తూ కుడా పెట్టుకుంటున్నా!!!! నాకు ఉన్న పుస్తకం అదే మరి ఏం చెయ్యను..లాపి లో బ్లాగ్ ని తెరచి పెట్టి పూజ చేద్దాం అని ఉన్న మా సాబ్ ఛలోక్తులు సహించే ఓపిక లేక ఊరుకున్నా!!!
వారం చూసుకుని దేవుడి మండపం కదిపేసి తరువాతి వచ్చే శుక్రవారం నిమర్జనం చేస్తాం!!శుక్రవరమా???అనకండి అదే వీకెండ్ మాకు ఇక్కడ!!!అంతా కలిపి ఎంచక్కా తలోరకం వండుకుని వెళ్లి దేవుడికి నిమర్జనం చేసేసి వస్తాం!!ఇక్కడ అందరికి విధిగా చెపుతాను అమ్మలారాఅంతా న్యూస్ పేపర్స్ లో చుట్టి తెండి అని!!అంతా అలా గత ఆరు ఏళ్ల నుంచి నియమంగా పాటిస్తున్నాం...అంతా ఇంట్లో ప్రధమపుజ్యడ్ని ఇంటిదగ్గర ఉన్న మండపాలలో కవర్స్ లో పెట్టి ఇస్తారు.. అలా కాకుండా న్యూస్ పేపర్ లో పొట్లం చుట్టి ఇస్తే మరింత పర్యావరణానికి మేలు జరుగుతుంది..మట్టితో చేసిన గణనాయకుడికి పూజ చేసేసాం ,కాగితం లో చుట్టి నిమర్జనం చేసేసాం మేము పర్యావరణానికి తెగ సెల్ప్ చేసేస్తున్నాం అనుకోకుండా వీలు అయినంతలో ప్లాస్టిక్ వాడకం తగ్గించటం!!మన పిల్లలకి కాస్తా అవగాహన కల్పి౦చాలీ..రోజుకి ఒక కవరు వాడకం మన వాళ్ళ తగ్గినా చాలా మేలు జరుగుతుంది...మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే రేపుటి తరాలకి మార్గదర్శకాలు!!తద్వారా జరిగే మేలు ఎవరికీ చెప్పనవసరంలేదు...
అందరికి వరసిద్ధి వినాయకుడుసకల శుభాలు కల్గాజేయాలని,
అవినీతిరహిత,కాలుష్యరహిత దేశం గా ప్రపంచ లో అగ్రగామి కావాలని కోరుకుంటూ......
మీ,
సుభద్ర

అసలే వేసవిశెలవులు పిల్లలు ఇంట్లో>>>>> బయట 55 డిగ్రీల వేడీ>>>>ఆ పైగా పగటి పూట (సిటికి)బయటకి వెళ్ళడం తినటానికి ఏమి ఉండవు రందాన్ కదా!!!పైగా పబ్లిక్ ప్లేస్ లో నీళ్లు కుడా తాగకూడదు...రెండునర నెలల సెలవులకి ఇక్కడే ఇరుకుపోయిన నామీద నేనే తెగ జాలి పడుతూ మీకు నా ప్రయోగశాలలో పుట్టిన కొత్త రుచులు చూపిద్దామని ఈ పోస్ట్ మొదలు పెట్టా!!!
ముఖ్య గమనిక >>>రుగ్మతలకి బ్లాగ్ కాని రాసే నేను కాని ఏవిధంగాను బాధ్యులంకాము.
ఇంతకీ కొబ్బరిపొడి కధ చెప్పలేదు కదా!!ఉసుపోని మంగలి పిల్లి తల గొరిగినట్లు టైం పాస్ కి ఓ మరాఠి దోస్త్ ఇంటికెళ్ళితే వాళ్ళు చేసుకున్న స్నాక్ చాలా బాగుంటుందని,,,,వాళ్ళ పూణే లో ఇంకా సూపర్ గా ఉంటుందని చెప్పి టేస్ట్ కి మా నల్గురికి రెండు పెట్టి నచ్చితే మళ్ళి చేసిన్నప్పుడు బాక్స్ పంపుతా అని మాటిచ్చి పెట్టింది..పిల్లలు ,మా సాబ్ తినగా మిగిలితే అనుకుంటు౦డగా మా పెద్దోడు ప్లేట్ మీద జంప్ చేసి ఒకటి నాల్గు ముక్కల్లో హాంఫట్ జం బడెల్ బుచుక్ అన్పించేస్తే మా చిన్నోడు,మా సాబ్ నా వైపు కుడా చూడకుండానే కానిచ్చేశారు...నా మదిలోనే త్యాగశీలివమ్మ------పాట పాడేసుకుంటూడగా మా పెద్దోడు సూపర్ ఆంటీ అని పోగిడేసి నా నేర్చుకోమని ఆర్డర్ వేశాడు..ఇంతకీ ఏమిటా ఆ పదార్ధం అనుకుంటున్నారా??అక్కడికే వస్తున్నాఏంటా సూపర్ టేస్ట్ అను అడుగగా వడాపావ్ అంది నా దోస్త్ !!!నా బబెక్కిరి ఫీలింగ్ బయట పడకుండా ఓ అదా నువ్వు మన లేడీస్ పార్టికి చేసావ్ అదా అన్నాను...యస్ యస్ అంది..ఇట్ వస్ గ్రేట్ దట్ డే అన్నాను...
ఆ రెసిపి తెలుసుకుని తరించి ఇంటికి వస్తూ మా సాబ్ అబిప్రాయం అడగగా చెయ్యి తినిపెడతా అన్నారు..మా పెద్దోడు మర్నాడే ముహూర్తం కుడా నిర్ణయించాడు..ఇక తప్పేదేముంది..సెలవుల పుణ్యమా అని నేను వాడు పుల్ గా బేవార్స్ కదా కష్టపడి అర్ధరాత్రి వరకు ఇంగ్లీష్,హిందీ,తెలుగు సినిమాలు ఉద్దరించి>>>>నేను అయితే శక్తి కొద్ది బ్లాగ్ లోకాన్ని హితోధికం సేవిస్తూ ఆలస్యంగా పడుకుని,మరి ఆలస్య ౦ నిద్ర లేస్తూ(ఓన్లీ మా సాబ్ నైట్ షిఫ్ట్ అప్పుడే) ఆయనుంటే ఎర్లీటు బెడ్ ఎర్లీ టు రైజ్ !!!!
ఇంతకీ వడా పావ్ అంటే పావ్(బ్రెడ్ )మద్యలో సదరు కొబ్బరిపొడి వేసి ఆలు బోండా పెట్టి ఒకనోక్కు నొక్కడమే!!!శుబ్రంగా ఆలు బోండా తినక ఎందుకోచ్చిన్ పాట్లు అంటే వింటే కదా!!!వడాపావో అని నా ప్రాణాలు డిగ్గింగ్ పట్టాడు మా పెద్దోడు..ఎందుకోచ్చిన తిళ్ళు రా నాయన అన్నం లో సాంబార్ వేసుకుని తినక సాంబార్ లో అన్నం ఉండకేసుకుని బిసిబెళ్ళబాత్ అని,పెరుగులో అన్నం మన ముని వేళ్ళతో కలుపుకోక పెరుగులో అన్నాన్ని ఉరేసి అవిఇవి పోసి కర్డ్ రైస్లు..
ఇంతకీ అపర్ణ ఇంటి ప్లాన్ వేసిన నన్ను నేనే నానా విధాలు స్తోత్రాలు చేసుకుంటూ మర్నాడు వడాపావ్ చేశాను ఆ తాకిత తడిగిత తై>>>>>
కావలసినపదార్ధాలు>>>>>కడుపునొప్పికి మీకు అలవాటు అయినమందు లేదా కాస్తా వాము నములి ఓ పుట ఉపవాసం చేసిన సరిపోతుంది..
ముందుగా కొబ్బరిపొడి కి రడీ చెయ్యాలి కదా కాస్తా ఎండు కొబ్బరికి(కోనసీమలో పుట్టి కోనసీమలో మెట్టిన నాకు ఎండు కొబ్బరి ఎక్కడ నప్పుతుంది మీ అంతరాత్మ సాక్షి గాచెప్పండి)పొడి ముకిడి లో వేయించిన ఎండు మిర్చి,పచ్చివెల్లుల్లి,ఉప్పు వేసిమి మిక్సీ తోడపాసమో,చెవిపాశామో పెడితే మిక్సీ బాధతో డుర్ డుర్ డుర్ మంటే మన కొబ్బరిపొడి రడీ!!!కొబ్బరిపొడి రుచి చేసి చూడండి రంగు,రుపుకి క్రింద బొమ్మ పెట్టాను చూడండి.....

ఇదే మన టైటిల్ కొబ్బరిపొడి మీరు సోది బాబోయ్ అన్నా సరే మరో పిట్ట కధ చెప్పాలి,,,,,కొబ్బరిపొడి చేశాక రుచి చుస్తినికదా!!!నాకు కపాలమోక్షం జరుగే౦తలా పంచేంద్రియాలు ఎరుపెక్కి నీల్లుకరతం పట్టాయి..నాల్గు ఐదు గొడ్లు వేసుకుని కారం అదేనండి గొడ్డుగొడ్డుగొడ్డు కారం..ఆ కారాన్ని మర్డర్ చెయ్యడానికి మరికాస్తా ఎండుకొబ్బరి(ఈ పదం రాయతానికే నచ్చటం లేదు నాకు)..మళ్ళి రుచికి రుచి(అదేబాబు ఉప్ప్పు) కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు మళ్ళి రుచి చస్తే అవును చస్తే అదేనండి చంపేసాకదా అది కాస్తా ఆఖరి శ్వాస విడిచింది..మళ్ళి ముకిడి ఎండు మిర్చి వేపుడి,మిక్సికి పిక్కపాసం అదే రాగం లో డుర్ డుర్ లు...అలా సాగిన ప్రహసనం లో నాకు నచ్చని ఎండుకొబ్బరి పొడి గు౦డై,పిండై ,పొడై డబ్బాడు అయ్యింది..అరీ దేవుడా అనుకుంటూ మా పెద్దోడికి వడాపావ్ లాంచనం తీర్చాను...ఓ రోజంతా తిని ఇక వద్దు అనేశాడు..పావ్ లు కుడా అయ్యిపోయాయి..కాని ఎండుకోబ్బరిపోడి నన్ను తక్కువ చేస్తావా???అని డబ్బాలో మూడు వంతులు బెల్లి డాన్స్ మొదలు పెట్టి౦ది..ఆ తిప్పుడు చూడలేక సగటు ఇల్లాలిగా ఎండుకొబ్బరి డేస్ట్ బిన్ పొట్టలో పోయ్యలేక కళ్ళుమూసుకుని నా తపస్సశక్తి అంతా ఉపమోగించి నేనేకనుక బంగారం మీద అతి మోజు ఉన్న భారతీయ ఇల్లాలి ని అయితే,ఒక్కవీసమేత్తు పుట్టింటి పక్షపాతిని అయితే రకరకాల నా ఎజక్టివ్స్(ajectives) తలవగానే మా 55 డిగ్రీల ఎండలో నాల్గు గంటలు ఎండిన వరి పిండి వడియాలా ఎన్నో అవియాలో పెళపెళ వచ్చేశాయి....ఆ అవిడియాలో ఒకటి మచ్చుకి మీకోసం విపులంగా వంకాయ బజ్జి..వంకాయతో బజ్జి విన్నాకాని దాని కధ కామామీసు తెలియదుకాని ఇది నా పేటెంట్ అని సగర్వం గా తెలియజేస్తూ>>>
...గుత్తువంకాయ మల్లె నాట్లు/గాట్లు (మీఇష్టం) పెట్టేసుకుని కాస్తా నునే (వెయ్యి౦చి)లోస్నానాలు చేయ్యి౦చి ప్రక్కనే పెట్టుకోవాలి..వంకాయలు పూర్తిగా మగ్గకూడదు...పుర్తి గా చల్లార్చాలి...ఆ టైం లో బజ్జి పిండి కలపాలి వడాపావ్ చెయ్యగా మిగిలిన ఎండుకొబ్బరి ....అప్పుటికి గాట్లుపెట్టి నూనెలో దేవిన వంకాయలు చల్లరుతాయి..నవ్వేసి ప్రెండ్ అయిపోయిన కొబ్బరిపోడిని మద్యలో కురేసి >>>అబ్బ క్రింద పోటోకి రండమ్మ>>>>>
మన వంకాయలు ఇలా ముచ్చటగా ముస్తాబై మనల్ని ఉరిస్తాయి >>>>మనం ఊరిపోయి నోట్లో వేసుకోకూడదు ..ఇందాక బజ్జి పిండిని ఎలా కలిపానంటే సెనగపిండిలో కొంచం బియ్యపిండి వేసి,జీలకర్ర చేర్చి,ఉప్పుకారం తగిలించి (కావాలంటే అల్లంవెల్లుల్లి వెయ్యవచ్చు)నీళ్ళుపోసి బజ్జి పిండిని తయారు చేసామా!!!!ఆ బజ్జిపిండితో ముస్తాబు అయిన వంకాయలకి బట్టలు వెయ్యలన్నమాట!!! ఎలాగో చూపించనా వచ్చేయండి అయితే>>>>>
ఇంతే ఇలా అన్నమాటా!!!ఆ తరువాత అబ్బ అక్కడే కూర్చుంటే పనులు అవ్వవు కాస్తా కదలండి>>>>>>>>>>>>>>>>>>>
మన వంకాయలు సూపర్ స్వీమ్మర్స్ నమ్మరా!!!అయితే బాగా కాగిన నునేలో వెయ్యండి ఇట్టే తేలిపోతాయి...ఇలా మళ్ళి నునె లో స్విమ్మింగ్ చేయిస్తే మగ్గల్సినవి మగ్గి నునె వేడికి కాస్తా ట్యాన్ అయిక గోల్డెన్ కలర్ కి వచ్చాక కుస్తా కారం గా చిల్లిగార్లిక్ సాస్ తో తింటే అబ్బ అబ్బ అంతే..బజ్జీలు తింటున్నంత సేపు మీరు ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్!!!!!వంకాయలబజ్జీల ప్లేట్ చేతిలోపెట్టి మీరు ఏమికోరిన ఎదుటవాళ్ళు ఉ ఉ ఉ అనాల్సిందే>>>ఉదాహరణకి బంగారం కాసుకి ఇంకో పదివేలు రేటు పెరిగినా ,మీరో నాగ్లు ఐదు కేజీలు పెరిగినా సరిపడేలా వడ్డాణం అడగండి ఉమ్ ఉమ్!!! మన వంకాయ బజ్జీలు లుక్కేయ్యండి...
ఇన్ని చేసిన మిగిలి పొయ్యింది కొబ్బరి పొడి..మళ్ళి నా అనుభం అంతా రంగరించి ఉల్లిపాయసమోసా చేశాను..అమలాపురం డీలక్స్ ధియేటర్ సమోసా గుర్తు వచ్చేసింది నాకు..మూడు వంటలలో సమోసాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి మా ఇంట్లో>>>ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయించి పచ్చి వాసనా పోయాక కొబ్బరిపొడి డబ్బా బోర్లేసా!!!రడీ మేడ్ సమోసా షీట్స్ లో చుట్టేసి వెయ్యి౦చాను..వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందట!!పొడి అయిపోయాక తరువాత కేరళప్రెండ్ చెప్పింది..
Posted by Picasa


ఓ మూడునెలల క్రితం పొద్దుటే నాన్న పోన్, ,,,కట్  చేశా మళ్ళి చేద్దామని,, ,నేనే రెండు,మూడు రోజులకి ఒక్కసారి పోన్ చేస్తూ ఉంటాను..మా నాన్ననుంచి  పోన్ అంటే మీ పొలానికి చేర్చి ఓ ముక్క అమ్మకానికి వచ్చింది కొనాలి అని పీకల మీద కూర్చుంటారు..మేము వద్దు అన్న అది ఇది చెప్పి తానూ బజానా ఇచ్చేస్తా అనో అయినంత పంపితే అవేజు మీద అలా మీకు భారం లేకుండా నేను చూసుకుంటా కదా అంటూ,మీరు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తారు..ఇక ఆఖరిఅస్త్రం గా మా అత్తగారికి,మావగార్నిబాగా బ్రెయిన్ వాష్ చేసి మా మీద ప్రయోగిస్తారు...ఈ ఆలోచనతో నాన్నకి పోన్ చేసాను..నాన్న ఫోన్ కలిపాను..నాన్న చాలా డల్ గా కాకినాడ సైట్ అమ్మకం పెట్టారట కదా తల్లి???సొమ్ము అవసరం అయితే పొలాలు అమ్మేయండి అన్నారు..మా నాన్న తో నే నేను మాట్లాడుతున్నది అని అనుమాన౦ వచ్చింది..ఇప్పటి ఆ మాట మా నాన్న అన్నారంటే నమ్మలేకపోతున్నా ..నాన్న అవి ఇవి మాట్లాడి వ్యవసాయం ఇక చెయ్యలేన్నని,తన కష్టాలు అన్ని చెప్పికోచ్చారు...ఇది 1996 తుఫాన్ అప్పటి నుంచి వింటున్నా కాని ఈ సారి నాన్న గొంతు లో వణుకు ఓ క్షణం నాన్న కన్నీళ్లు పెట్టి నట్లు అన్పించింది..ఏమో నాకు ఉహ తెలిసినప్పటి నుంచి పోల౦ తప్ప ఇకేమి తెలియదు,,అన్నిఇ అనుకులి౦చిన ఈ సారి పొలం బీడు లా వదిలేలంతే చాలా కష్టం గా ఉంది అన్నారు...అదేం నాన్న అంటే ఈ పంటల విరామం గురించి చెప్పారు..నాకు నోట మాట రాలేదు...అప్రయత్నం గానే చేమ్మగిలాయి నా కళ్ళు..పంట వెయ్యక పొతే అన్న ఉహకే నా పరిస్ధితి ఇలా ఉంటే పోలామే లోకం గా బ్రతికే మా నాన్న లాంటి వాళ్ళ బాధ ఎలా ఉండి ఉంటుందో కదా!!!!!నాన్న కి తోచినట్లు ఏదో సర్ది చెప్పేసి పోన్ పెట్టేశాను ...
నాన్న కి ఎంతవరకు స్వాంతన దొరికిందో తెలియదు కాని స్ధిరం పొయ్యింది...ఆలోచనల కుమ్మరి పురుగులు ఒకటికి పది అయి నా మెదడు అంతా దోలిసేశాయి...ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు మండలాలో వేయ్యరట!!నాన్న మా ట ప్రకారం లక్ష ఎకరాలు పైమాటే...తద్వారా పాలపరిశ్రమ గ్రాసం దొరక దెబ్బతింటుంది...ఈ విధంగా పాలబ్బాయిలు,చిన్న చిన్న వ్యాపారులు,ఎరువులషాపువాళ్ళు,కూలీలు అందరికి కష్టమే!!!అసలు కోనసీమ పంట పచ్చదనం లేకుండా ఉహించటం ఎలా???????మూడునెలల ముందు గానే చెప్పిన ఇప్పటికాని ప్రభుత్వం కళ్ళు తెరలేదు... కొన్ని చోట్ల అధికారులు బెదిరింపులకి దిగుతున్నారట!!రైతుల మీద కేసులు పెట్టారు అయినా మొక్కవోలని దైర్యంతో ఉద్యమిస్తున్నారు రైతులు...మనకి పులావ్ కి బాసుమతి బియ్యం,అన్నానికి సన్నబియ్యంపండిస్తూ తాముమాత్రం సర్కారోడి ముతకబియ్యం తింటున్న సన్న చిన్నకారు రైతులు ఇంతకన్నా ఏం చేస్తారు తన కడుపు పూర్తిగా నిండక పోయినా అందరి ఆకలి తీర్చే రైతుకి ఆక్రోశం కట్టలు తెంచుకున్నది... కన్నతల్లికి తిండి పెట్టకుండా మాడ్చితే ఎంతో పొలాన్నిబీడు పెట్టడం అంతే..కూలీలకు వరి లేకపోతే మరోపని కాని కౌలు రైతుల కి మరీ కష్టం..అన్ని విధాలా భామినే నమ్ముకుని రాత్రి పగలు ఆ పొలం గట్టునే గడుపుతూ గడుపుతారు..ఎవరోపొలాన్ని తమది భావించి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి తొలకరి ,దాలవా,అపరాలు ఏదో ఒకటి రాకపోతుందా ఇంతకు ఇంతా కొందాం అనుకుంటూ ఉన్న కాస్తా బంగారం కూదవపెట్టి నిండా ములిగిపోతున్నారు..ఇల్లు కట్టుకోవాలని నా చిన్నప్పటినుంచి కలకంటున్న మా వెంకన్న ముసలివాడు అయిపోయాడు... కూతుళ్ళ పెళ్లి తాపత్రయంలో,పంట మీద పంట నష్టపోయి నలభై ఏళ్లకే ఆరవై ఏళ్లు వాడిలా మారిన వెంకటరమణ,అదే కొల్లాయి కట్టు అదే వ్యవసాయం ఏ మాత్రం మారలేదు మా భూషణం పరిస్ధితి..ఇంకా ఎందఱో ఎన్ని కధలో!
రైతు అంటేనే చిన్నచూపు మన సమాజం లో ,రైతుకి గౌరవమే లేదు...వ్యవసాయాన్ని చేద్దామనుకునే వాళ్ళు లేరు..
దేశం అంతా అన్నం పెడుతూ,దేశాభివృద్ధికి కీలక పాత్ర ఉన్న గుర్తి౦పులేదు..పంజాట్,హర్యానా లాంటి రాష్ట్రంలో అన్ని విధాల రైతులు ముదంజలో మన రాష్ట్రంలో మాత్రం రైతు పరిస్ధితి చాలా దైనీయ్యం గా ఉంది..మిల్లర్లు,వ్యాపారులు రైతుని దోసేసుకుంటున్నారు...ప్రభుత్వం సరియిన నిల్వ సౌకర్యాలు కల్పింనందుకు అయినకాడికి పంట అమ్ముకునే దుస్ధితి...పంట కాల్వలు రీపేర్లు నిమిత్త మూసేసి అదికారులు ఇష్టరాజ్యం గా నీరు వదులుతుంటు౦టే నీరు సకాలం లో అందక ఎండిపంటకి ఎవరు బాధ్యలు???? ప్రతిసారి కంటి తుడుపు చర్యలే కాని శాశ్వత పరిష్కారం అన్న మాటే లేదు!!!ఎప్పుడో విన్నట్లు గుర్తు పంట వెయ్యకపోతే పొలాలు ఉప్పు తెరుతాయని,ఈ ప్రభావం కనీసం ఐదు ఆరేళ్ళు భూసారం మీద పంట మీద ఉంటుంది..ఈ నష్టం నుంచి సన్న,చిన్నకారురైతులు ఆర్ధిక౦గా కోలుకోవటానికి పదేళ్లు సమయం పడుతుంది..ఓ పంట వెయ్యలంటే ఉన్న కొద్ది పాటి అవగాహన బట్టి ఎకరానికి 40 కూలిపనులు కావాలి ఒక్కో 200-250రు/ ఉంటుంది..ఎరువులు బస్తాకి 280-300ఉంటుంది ఎకరానికి 3 బస్తాలు వాడతారు..తరువాత గులికలు,ఎలుకలబుట్టలు,దుక్కి, దమ్ము,దేవుడు దయ కలిపి పంట చేతికి రావాలంటే 22-25 వేలు ఖర్చు అవుతుంది..ప్రస్తుతంధాన్యం ఏడు వందలు ఉంది,తడిసిన ధాన్యం అయితే మూడు వందలు రేటు పలుకుతుంది..
కాని కొనే నాధుడే లేడు,,మొన్నటివరకు బోలెడు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం మిల్లర్లు కొనలేదు ..శుబ్రంగా ఉన్న దాన్యం ఎండకి ఎండిపోయి,వర్షానికి తడిసి రంగు మారి రేటు పడిపోయింది..ఇక కొనేవాళ్ళు లేక నెల్లూరు బాతులవాళ్ళు ఏదో ఒక రేటు ఇచ్చి కొనుకుంటున్నారు..గత రెండు పంట ధాన్యం నిల్వచేయ్యలేక,వర్షం నుంచి కాపాడలేక రైతులు నలిగిపోతున్నారు..అన్ని సవ్యంగా జరిగి పంట చేతికొస్తే పెట్టుబడి సొమ్ము రావచ్చు లేదా నష్టం రావచ్చు కాని ఎట్టి పరిస్దితిలోను నాల్గు డబ్బులు చూసే స్ధితి మాత్రం లేదు..అందరికి ఆదాయం పెరిగింది ఒక్క రైతుకి తప్ప!!!
పంటవిరామం గురించి మన వ్యవసాయ శాఖా మంత్రిగారు స్పందిస్తూ మన రాష్ట్రంలో ఉన్నది పదమూడు మండలాలు మాత్రమె కాదని అన్నారు..ముఖ్యమంత్రిగారు టైం కి నీళ్ళు ఇస్తే ఏమి ఉండదు వాళ్ళే వేస్తారు అన్నారట!!ఈ మాటలు రైతులలో మరింత పట్టుదల పెంచినట్లు ఉన్నాయి..కులవర్గాలకు అతీతంగా ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు...మాపార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయన అయితే రైతుల్ని పరామర్శ అటుంచితే కనీసం ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు...జిల్లా మంత్రి నిద్రవదిలి ఆలస్యం వచ్చి తెగ హడావిడి చేసారు..రైతుల్ని అయిందేదో అయ్యింది వేసేయ్యండి పంట అని ఉచిత సలహా ఇస్తే ఇప్పటివరకు ఎక్కడ అమాత్యావార్య అని నిలదీసీస్తే పిచ్చి చూపులు చూస్తూ గుటకలు వేసారట!!
ఓట్ల కోసం ఒక్క ఇల్లు కుడా వదలకుండా తిరిగే రాజకీయనాయకులు ఇప్పుడు రైతు పక్షం వహి౦చలేకపోతున్నారు..ప్రతిపక్షాలు పర్యటనలు తప్ప చేసి౦దేమిలేదు..ప్రజలాలో పూర్తీగా నమ్మక పోగొట్టుకుంటున్న రాజకీయ వ్యవస్ధ..చర్చలకి పిలుపు అంటూ కొందరి రైతు నాయకుల్ని మభ్యచూస్తుంది..మాకు చ ర్చలు వద్దు సచ్చుబండలు వద్దు స్వామినాధాన్ కమీషన్ రిపోర్టు అమలు పరచండి బాబోయ్ అని రైతులు మొత్తుకుంటున్నారు..చర్చలకి అక్కడ రకరకాల డిమాండ్స్ లేవు మద్దతుధర ఇవ్వండి అంటే వీళ్ళకి ఎక్కటం లేదు..ప్రతిప్రజా ఉద్యమం మార్పుకి నాంది అవుతుంది..ఇప్పుడు ఆ పదమూడు మండలాలబాటలోనే తక్కిన నాలుగు
మండలాలు చేరాయి..పొరుగునున్న పచ్చిమగోదావరి,నెల్లూరు,ప్రకాసం,కడప పోరుకి సై అంటున్నాయి...పదమూడే కదా అనుకున్న ప్రభుత్వానికి ఇంతింతై వటుడింతై అన్నట్లు రైతులు తమ విశ్వరుపాన్ని చూపుతున్నారు..రైతే దేశానికి వెన్నుముక,రైతే మన దేశానికి రాజు అని నమ్ముతూ రైతులు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్ది సాదించాలని కోరుకుంటూ,,నాలా రాబోయే కాలం లో రైతులు కావాలనుకునే వాళ్లకి నిరాశ చెందకుండా వ్యవసాయానికి మంచి రోజులు రావాలని ఆకాంక్షీస్తూన్నాను...





మాకు ఎండలు ముదురుతున్నాయి...అంతా సమ్మర్ వెకేషన్ మూడ్ లోకి వచ్చేసాం....దోస్త్ లు అంతా ఇండియా కి షాపింగ్,ప్యాకింగ్ అంటుంటే నేను మాత్రం వెళ్లిరండి వెళ్ళిరండి అని వేర్రినవ్వుతో హ్యాపీ జర్నీ చెపుతున్నా....నా దోస్త్ లు

అయ్యో ఇక్కడ ఉంటారా???అమ్మో రెండు నెలలు "ఎలా ఉంటారు?? అని సానుభూతి చూపిస్తుంటే ఇట్ట్టే అయిపోతాయి అని డాభికంగా చెప్పిన లోపల మాత్రం ;( :( :(...




పెద్దోడ్ని సమ్మర్ క్యాంప్ కి ఓ నెల పంపుదాం,ఇంకొం నెలా ఎలాగో గడిచి పోతుంది లే అనుకుంటున్నా..చిన్నోడి
వయస్సు పిల్లల్ని నల్గుర్ని చూసుకున్నాను నేనే కాస్తా డ్రాయింగ్ అవి నేర్పుదాం అనుకుంటున్నాను.(మొన్నే మా పెద్దోడికి డ్రాయింగ్ లో ప్రైజ్ వచ్చింది ఆ కాన్పిడేన్స్ తో)..ఈ ఏడు ఎలాగు అరబిక్ హిందీ మొదలైయ్యాయి!!!మా పెద్దోడికి నేర్పిన అనుభవం తో ఈ రెండు నెలలు పిల్లలకి కాస్తా నేర్పుదాం వాళ్లకి కొంచం సులువుగా అనుకుంటున్నాను...డబ్బులకి కాదండోయ్ ఏదో మా చిన్నోడికి క్లాస్ ఫీల్ కోసం ప్రతి రోజు నేను సెలవులమూడ్ లో లేట్ నైట్ చెయ్యకుండా సిస్టమేటిగ్ గా ఉండటం కోసం అంతే!!పని లో పెద్దపిల్లలకి మా పెద్దవాడు తోటిపిల్లలకి తెలుగు పాఠాలు కూడా నేర్పితేనో????? తెలుగు పిల్లలు సగంమంది వెళ్ళిపోతారు...సగం మంది ఓనెల వెళ్లి వచ్చేస్తారు...ఇది ఓ కొల్కిరాని నా మనసుమధనం...




మా అత్తగారు మనవలకి తెలుగు రాదనీ చాలా బాధపడుతూ ఉంటారు....మా పిల్లల తెలుగు అలా ఉంటుంది మరి !!!ఏం చేస్తున్నావ్ రా అంటే "చారు చేస్తున్నా"జారబడ్డాను అని చెప్పడం ముచ్చటికి...వాటర్ డ్రింక్ చేస్తున్న...మా అమ్మని పెద్దోడు పిలిస్తే ఒక నిమిషం రా పక్క వేసి వస్తా అంటే కొంచం సేపు తరువాత వచ్చి అమ్మమ్మ ఆ "పక్క పెట్టండి టేస్ట్ చూస్తా అన్నాడట>>>>>>>అంటే చేస్తా,వేస్తా,వస్తా లాంటివి వాడికి అంతా బాగా అర్ధం అవుతాయి...మరి తెలుగులో ఎక్కువ చెపితే ప్లీజ్ రిపీట్ స్లోలి అంటాడు...అదో కాస్తా ఈ సెలవలో మాట్లాడటం,కొద్దిగా చదవటం అది నేర్పిస్తే కాస్తా బోర్డు లు,బస్సు పేర్లు అయినా చదవటాని పనికి వస్తుంది కదా!!!ముఖ్యంగా వాడితో మాఅత్తగారికి,ఉత్తరాలు రాయించి వందకి వెయ్యి మార్కులు కొట్టేయ్యాలి..హీన పక్షం వాడికి మాట్లాడటం నేర్పాలి...ఏమో ఎంతవరకు జరుగుతుందో తెలియదు...ప్రయత్నం చేయ్యాలి అనుకుంటున్నాను....




ఎందుకొచ్చిన తిప్పలు ఎంచక్కా ఇండియా వెళ్ళు అంటారా??ఏం చెప్పను సీత కష్టాలు సీతవి నాలాంటి పీత కష్టాలు పీతవి.....మొన్న సంక్రాంతి కి వెళ్లాను,మార్చ్ లో వెళ్లాను...అదికాక మేము ఇండియా జూన్ వెళితే అంతా స్కూల్స్ బిజీ ;మార్చ్ లో వెళ్ళినప్పుడు ఊర్లో అంతా నీ పనే బాగుంది....ప్రతి రెండు మూడు నెలలకి వస్తున్నావ్ అని ఒకరంటే,,,హైదరాబాద్ ఉన్నోళ్ళు సంత్సరానికి ఒక్కసారి వస్తున్నారు నువ్వు ఇలా వెళ్ళు తున్నావ్ అలా వస్తున్నావ్ అని మరోకరంటే,,,,టిక్కెట్ సొంతమా లేక కంపెనీ ఆఆఆ అని ఆరాలు తీస్తున్నారు...మా నాన్న అయితే "బాబు ఇష్టం గానే పంపుతున్నారా??? లేక నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలి అని వచ్చేస్తున్నవా???అని పెద్ద అనుమానం వ్యక్తపరిస్తే నాకు ఏం చెప్పాలో తెలియక నాపని అమ్యోమయం అద్వానం అయ్యింది....నా ఫ్రెండ్ అయితే"" సుమ నిజం చెప్పవే నువ్వు నిజంగానే దుబాయ్ నుంచి వస్తున్నావా??లేక ఏ శంషాబాద్ నుంచి వస్తున్నావా??మా ఆయన పిల్లలు పల్లెటూర్ లో కరెంట్ అది లేక పాడైపోతారని అసలు వారం పది రోజుకంటే ఉంచారు"""అని అంది..ఓరి నాయనో అయితే ఇప్పట్లో రాకుండా నేను దుబాయ్ వాసినే అని ప్రూవ్ చేసుకోవాలా అని అడిగా ....



నా ప్రెండ్స్ ద్దిష్టే తగిలినట్లు ఉంది నాకు ( ఇరుగు దిష్టి పురుగు దిష్టి ..............)ఏది ఏమైనా ఈ సారి వేసవి ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నాను...ఇంకో పదిహేను రోజులు లలో శెలవలు పిల్లలకి...చిన్నపుడు ఎప్పుడో(పది ఏళ్ల లోపు వయసు ఉండగా)మా ఇంట్లో మొక్కలనిటికి బెత్తం పుచ్చుకుని పాఠాలు చెపుతూ టీచర్ పోజ్ కొడుతూ దండెం మీద తువ్వాలు చీర కట్టేసుకుని, పెద్దైక నేను టీచర్ అవ్వాలి అనుకునేదాన్ని....మా మేడం గారు(మా స్కూల్ ప్రిన్సిపాల్ గారి భార్య) ఆవిడ్ని తెగ ఇమిటేట్ చేస్తూ ఆవిడలా ఫీల్ అయిపోయ్యి అబ్బో అందరి మీద చాలా(మొక్కలు కదా నా స్టూడెంట్స్)పెత్తనం చేసేదాన్ని...మా సుజాత మేడం గార్ని మాత్రంచాలా సూపర్..భలే చెప్పేవారు లెస్సన్స్,యమా స్రిక్టు,ఆవిడ పేరు చెపితే స్కూల్ అంతా దడదడలాడేది...ఆవిడ రెడ్ ఇంక్ పాళీ పెన్ వాడేవారు....నేను ఆవిడలా టీచర్ అయ్యాక అదేమాదిరి హీరోపాళి పెన్ వాడాలి అనుకునేదాన్ని.....ఇండియా వెల్లినప్పుడు అంతా వెళ్లి ఒకసారి మా మేడంగార్ని చూసివస్తాను...ఆ మద్య మా సాబ్ ని తీసుకెళితే నా వీరగాధలు అన్ని మా సాబ్ కి చెప్పేశారు ..మరి అంతగా పొగిడేస్తు౦టే పిల్లల్ని తీసుకు వెళ్ళనందుకు భలే సంతోషించా!!!మరి మామూలు స్టోరీల మనవి మేష్టర్లని (మా పెతాతయ్యతో వార్నింగ్ లు పెద్ద లిస్టు ఉంది లెండి),అందరిమీద (క్లాస్ మేట్స్ మీద )జులుం చెయ్యటం...నేను,వల్లి,పద్మజ భయపెడితే పాపం ఓ మేష్టారు స్కూల్ మానేసిన వైనం అబ్బో చాలా చెప్పా రు.. అవి విని ఇంటికోస్తున్నప్పుడు మా సాబ్ అమ్మో రాక్షసి ఇప్పుడు నా పిల్లల్ని డిసిప్లిన్ డిసిప్లిన్ అని ఎన్ని నీతులు చేపుతావే అన్నారు...అందుకే కదా చెప్పేది తల్లి పోలిక రాకుడదని పళ్ళు ఇకిలించాను...





అదండి విషయం ఇలా నేను ఓ రెండు నెలలకి టీచర్ ని కాబోతున్నాను.....ఉపయోగకరమైన సైట్స్ చెపుతూ ప్లీజ్ విష్ మీ అల్ ది బెస్ట్....