వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఈఏడు దేసవిదేసల ఇత్తనాలు వాడాం ఎగసాయానికి!!!అన్ని మా దొడ్డకాపు, మా చెడ్డరుసి...ఇలా కోసి అలా తాలింపు ఎయ్యగానే ఓ యమ్మ ఇక ఓటే ఘుమఘుమలు...ఈ నాల్గు నెలలు మా ఇంట్లో చేప,మా౦సమ్ ఊసే లేదు!!రోజు మా అమ్మవి,అత్తమ్మవి,నా సిన్నప్పటి నాన్నమ్మ రుసులే!!పప్పుటమాట అదీ కాక దేసవాలి టమాట ఎం చెప్పను మరి...
ఏ కూర వండి సుర్రుమనే మిరపకాయ రుసే కూరకే గుభాలి౦పుకదా!!వ౦కాయపచ్చడి,వంకాయవేపుడు,
వంకాయకోత్తిమీరకారం ఓ దేవుడో వంకాయ మీనా పుస్తకమే రాయచ్చు>>> అది మన తోట వ౦కాయ అయితే ఇక సెప్పేది ఏముంది అయ్!!!!!
మా వాడ్ని చూశారా??కాకరకయల్ని పట్టుకుని ముర్సిపోతూన్నాడు....ఈ ఏడు ఎగసాయం పుల్ కలిసొచ్చింది..
ఇరసాకాశాయ్ అన్ని అయ్!!ఓపాలి కింద లుక్కెయ్యండి..


ఇలా౦టి కాకరకయల్నిగుట్టికాకరకాయని వండితే ఆ ఘుమఘుమకి పక్కి౦టి ఈజిప్తోళ్ళు కుడా ఎం కూరఅని అడిగేవోళ్ళు!!కాస్తా ముదరనిచ్చాక చక్రాలు కోసి పులుసులో ఉడకేసి బెల్లపొడి జల్లి దింపిత్తే కాకరకాయ చెదు అన్న మాట గోదాట్లో కొట్టుకుపోద్ది!!!ఆనక మరింక ముదిరాక గింజపలంగా సన్నగా తరిగి సౌరు,వర్ర బాగా వేసి కరకర ఎపితే వన్నం అంతా చివరాకిరి దాక ఎపుడే తింటారు అయ్!!


టమాలకి వచేకాడికి పెద్ద కధే జరిగింది.నేనేమోఏవైనా దేసవాలి ఎయ్యాలని!!మా మాలి(కుకు౦) ఆ దేసవాలి ఎత్తే సెమ దండగా అని!!!మొత్తాని ఉర్ని౦చి (మా వీరవెంకట ఫెర్తిలైజర్స్) కొనికోచ్చిన ఇత్తనాల నారుపోసాను..,,,,వారం అయినా ఉలుకు పలుకు లేదు>>>సరేలే అని మల్లి గోప్పుతవ్వి మల్లి నారేశాను�ఈసురో వాసుదేవా అంటూ ఏదో వచ్చాయి కలకాంతి లేదు..ఇక మనకి దేసవాలి అచ్చిరాలేదులే అనుకుంటుండగా కుకు౦,పాకిస్తానీ వోల్లంటిని౦చి దేసవాలి నారు తెచ్చి వంగానారు అడిగాడు ఆళ్ళకి(పాకిస్తానీ వాళ్ళకి)....భారత్ కి పాకిస్తాన్ కి మద్య బంగ్లాదేశ్ ఒప్పందంఅన్నమాట!!(మా కుకు౦ బంగ్లాదేసి )..అలా దేసవాలి పని అయింది!!మరే అయినా దేసవాలి రుసి ఎం ఎసిపెంచిన హైబ్రీడు కి వత్తదా???



భలే ఆనపకాయ కదా!!eఈ ఇత్తనాలు మా కుకుం వాళ్ళ అమ్మ బంగ్లాదేశ్ నుంచి పంపింది..ఆళ్ళపొలం ఇత్తనంఅంటా!!!మా గొప్పరుసిలెండి...తోక్కపలంగా తుట్లుపోడిసి,చిన్న ఉల్లితరుగు వేయించి,రుబ్బి,మసాలదట్టించ్చి పులుసు పెడితే అదే నండి బాబు లంకబోచ్చు పులుసు ఆయ్!!!అమోఘం అనే మాట ఈ పులుసుకోసమే పుట్టు౦టది!! అన్నిబాగానే ఉన్నాయి కాని ఆనపకాయ పాదు కాస్తాపైకి పాకిదా౦ అని అనుకున్నాం!!తీరా చుస్తే "అబ్బ తరువాత పోటోకి రండి"..............................................................................................................................................................


.....................................................................................................................................................................


.....................................................................................................................................................................


అలా పై పైకి ఎదిగిపోనాది..మా సాబ్ కి ఇలా సాహసంకి చాన్స్ వచ్చింది... ఇంకో మాట సేప్పనా ఆయన నో అంటే నేనే కోతికొమ్మచ్చిఅనుభవం తో కొద్దారి అనుకుని ఆ మాటే మా ఇంటాయన చేవినేశా ఆమటి గుబులైపోయి "చేట్టులేక్కగాలనే.............టైపులో ఎక్క్కేశారు అయ్!!!!మా మిద్ది మీకి మేట్లులేవు...సాహసం చేయకపోతే బొచ్చు పులుసు బువ్వ లోకి వచ్చేది ఎలా???ఆనక కాసిన కాయలు కుకుం సాహసం టూకొస్తే నా కత్తికి బలేసాను!!మొదటికాయ కోసేసరికి మా ఇంటాయన కి ముచ్చట తీరిపోయింది..పై ఫోటోలో కుడేపుమూలకి ఉన్నవి మిరప మొక్కలు..మిరపలేకుండా ఎప్పుడు లేదు మా ఎగసాయం..ఈ సారి ఎంత ఎదికినా ఊర్నించి తెచ్చి మిరప ఇత్తనాల పొట్లం కనిపించలేదు..ఇంతలో ఐవిడియా వచ్చింది..తాలిపులకి తు౦పిన మిరపకాయల అడుగున గింజలు నారు పోశాము..మా భలేగా ఏపుగా వచ్చాయి మొక్కలు..మాకు సరిపడా ఉంచుకుని పాకీస్తానీవాళ్ళకి కుడా ప౦పాను..

మిరపకాయలు థాయిలాండ్ వి మా ఇస్మాయిల్ కొట్లోవి.వంగ విత్తనాలు మాత్రం ఇ౦ట్లో వే>>నిరుడి వ౦కాయలవి అయ్ ఓన్ ఇత్తనాలండి ఆయ్!!!ఆఖరిఫోటో ఎడమేపుకి వంగమొక్కలు,మువ్వోం కాయలు,పచ్చడివి,సన్న వంకాలు రకానికి నాల్గు చొప్పున ఎసాం..మేము తినగా తిని వంకాయలు,,టమాటాలు అందరికి ఇచ్చాం..ఈ పాలి ఏమైనా కిట్టుబాటు ఎగసాయం..

13 comments:

chala bagundhi mee yavasaayam sontham ga pandinchukutinte unde ruchi telusu kada andukenenmo ... mee ayanagari feets kuda bagunnayi gani konchem jagrathamma papam amayakudni chesi rechagotti chetlekkinchestunnaavu... kakarakayalu kuda chala bagunnyi chudatanike tinte ...

ఇక్కడికంటే అక్కడి వ్యవసాయమే బాగున్నట్లుంది. మంచి తాజా కూరలు ఏరోజుకారోజే తింటున్న మీకు అభినందనలు.

మీ టపా కూడా మీ వ్యవసాయమంత బాగుంది. మీరే నయం. ఎక్కడో ఉండి కూడా ఎగసాయం చేసేసుకుంటున్నారు. మేమూ ఉన్నాం.. ప్చ్.

అయ్ బాబయ్ అయ్ బాబయ్ బాబో.. ఏం ఎగసాయం..ఏం ఎగసాయం.. మీరు గొప్పోరండి బాబో.. మీరు గొప్పోరు.. :)) ఐనా, మన పుల్లోంకాయ్ నట్టుకుని టమాటా అంటారేటండీ, నాకు తెలకడుగుతాను???

నా బ్లాగు బాగుంది అన్నారు అన్నది ఎవరా అని చూస్తూ మీదేశం వచ్చా...
చాలా సంతోషం మన దేశ వంటలను విదేశాలవాళ్లకు తినిపిస్తున్నారు...
పాపం కాకరకాయ చేదు కలపడానికి ఆ ఈజిప్ట్ వారికి మా ఊరు గోదావరి
చూపించారు...మిగతా పోస్ట్ లు చూసి స్పందన తెలియజేస్తా....

nuvu keka pinni.... naku mummy chese kakarakaya fri antey chala istam. normal curry ithe cheduga untundi kada anduke tinanu... kani nuvu chepina tip ni mumy ki chepthanu...and ma nana jagratta circus feets cheyinchaku ma nanna tho.:-)))

మీ ఎగసాయం సూపర్ . మరి మాకు వంకాయలు పంపలెదు ?

మీ తోటకి దిష్టి పెట్టేస్తున్నా! ముఖ్యంగా కాకరకాయలు, అబ్బా, నోరూరిపోతోంది!

మీరే నయం మంచి తాజా కూరలు ఏరోజుకారోజే తింటున్నట్టున్నారు.

మోహన్,
థాంక్స్...పోస్ట్ చెయ్యనా కాకరకాయలు...చిన్నప్పుడు కోతికొమ్మచ్చి ఆడలేదట!!ఇలా సరదా తీర్చుకుంటున్నారు..

జయ,
ఏదో సొంతం అని సరదా కాని లాభం ఏమిలేదు!!అయినా అదో ఆనందం..కాని ఓ నాలుగు ఐదు నెలలే!!తరువాత ఈ ఎండకి మాడి మసైపోతాయి
శిశిర,
ఏదో అభిమానం అంతా!!ట్రై చెయ్యండి చాలా సంతోశాకరమైనా ,ఉపమోగాకరమైన వ్యాపకం..

మురళి గారు,

అమ్మో ఏంటండి???మరి ములగాచెట్టు ఎక్కిన్స్తున్నారు..
టమాట ని " పుల్లవంకాయ్" అంటారా??నాకు తెలియదండి..

హనుమంతరావుగారు,
స్వాగతం అండి వాలుకోబ్బరిచెట్టు కి...
నచ్చిన పోస్ట్ కి స్పందన రాయకపోవటం మహా పతకం అండి..నచ్చింది మీ పోస్ట్ రాసాను..
మీ స్పందన కోసం ఎదురుచూస్తూ ఉంటాను..

సన్నీ,
థాంక్స్ రా...
మీ నాన్నకి ఓ ప్యారాషుట్ కొన్ని ఇవ్వు అది కట్టి ఎక్కిస్తా మల్లి ఏడు..ఈ ఏడుకి ఫినిష్ లే ఎగ సాయం సరేనా?

మాలగారు,
ఈ సారి పోస్ట్ చేస్తాను లెండి..ప్రస్తుతానికి ములకాడలు ఉన్నాయి అంతే!!!

సుజాత,
మా తోటకి దిష్టి విమోచన ఎంత్రం పెట్టించం గా.......నో ప్రాబ్లం ..:):)మల్లిసారి మీకు పోస్ట్ చేస్తాను సరేనా!!

రాత్నమాలగారు,
ఏదో మీ అభిమానం అంతా!!మీరు ఓ ట్రయల్ వెయ్యండి ..మాంచి హాబీ తెలుసా!!

వా ...నా కామెంటు ఏది? పబ్లిష్ చెయ్యలేదెందుకని....వా....