వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..



నేర్చుకున్నా ఇలా ఎలాగంటే ................




నేను నా మొదటి పొస్ట్ లో నాకు హెల్ప్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నా , కాని ఒకరి గురించి రాయలేక పోయా అది మా శ్రీవారు.......



ఆ విధంబెట్టిదనినా. ...మనకి 2005 మార్చి వరకు కంప్యూటర్ అంటే మూడు విషయలు తెలుసు. అవి మానిటెర్, కిబోర్డ్ , ఎలక. మా వారు చూడు నేర్చుకో అని అంటూనే ఉన్నారు .మన చర్మం కొంచం దళసరి కదా ఏది త్వరగా ఎక్కదు , నాకు 2005 కి నేర్చుకోవాలని అనిపించింది. మా సాబ్ సాయం తో మెయిల్స్ చూడటం మాత్రమే నేర్చుకున్నా. తరువాత ఒక విడత పౌరుషం తెచ్చుకుని మెయిల్స్ చేయటం నేర్చుకున్నా , కాని చాలా స్లోలో .అంతా అయ్యకా మా చిన్నోడు స్విచ్ నోక్కేయటం చేసేవాడు. దేవుడా అని మళ్లీ మొదలు ..

నెట్ లో రోజు ఈనాడు చదవటం , వంటల వెబ్-సైట్స్ చూడటం, బ్లాగ్స్ పరిచయం. నాకు ఆశ కల్గింది నేను రాయాలి అని. ఇంకో స్వార్ధం కూడా ఉంది. ఇక్కడైతే నా రాతలు బౌన్స్ అయ్యి తిరిగి రావు కదా, తిరిగి వస్తే పొస్ట్ మేన్ డబ్బు అడుగుతాడనే టెక్షన్ లేదుగా. ఎందుకంటే ఇంతకు ముందు నాకు అలాగే జరిగింది 3సార్లు అందరికి తెలిసే ఉంటుంది. స్వాతి లో ఈ శిర్షిక మీదే. దానికి మన ప్రతిభ అంతా రుబ్బి , పిండి రసం తీసి ముచ్చటగా ముడు సార్లు పంపాను, అవి కూడా ముచ్చటగా తిరిగి వచ్చాయి.నాకు కారణం కూడా తెలియదు .చిన్న పిల్లని ఆయె మరి. అలాంటి వాటిని రాయటానికి వేరే కార్డులు ఉంటాయని తెలియదు పాపం నాకు. సో పిటి కదా . మాములు 15 పైసల కార్డు మీద రాసి పంపితే, అవి గోడకి కొట్టిన బంతుల్లా తిరిగే వచ్చాయి. మనకి ముదర తెలివి కి లోటు లేదులెండి.



డాటరప్ అని రాస్తే నాన్న కోప్పడతారని కేరాఫ్ అని తాతయ్య పెరు మిదా వ్రాసెదాన్ని.తాతయ్య ఏమి అనరని దైర్యం అన్నమాట. పొస్ట్ మ్యాన్ తాతయ్య ఎక్కడ ఉన్నా వెదికి మరీ పొలం లోఉన్నా, ఫ్రెండ్స్ తో పేకాటలో ఉన్నా డబ్బు వసూలు చేసేవాడు. తాతయ్య ఫ్రెండ్స్ కి తెలిసి ,నేను కనిపించి నప్పుడల్లా నన్ను ఏడిపించేవాళ్లు. మొగుడు కొట్టి నందుకు కాదు తోడికోడలు నవ్వి నందుకు అన్నట్లు ఉండేది నా పని.

రెండు సార్లు తిరిగి ఇస్తూ నవ్వారు తాతయ్య కాని మూడవసారి తిరిగి రావటానికి సరిపడా స్టాంప్స్ అంటించు అని సలహా ఇచ్చారు. మనకి పౌరుషం పొడుచుకొచ్చింది. అయినా నన్ను ఎవ్వరు ఆపలేరు , ఆప తరమా?

అని ఒక బుక్ లో నాకు నచ్చి నట్లు ఎడా పెడా రాయటం మొదలు పెట్టా. ఆ రాతలకి మా చెల్లి ,చిన్న పిన్ని బాధితులు , ఆ తదుపరి బాదుతుల లిస్టు పెరిగింది అనుకోండి.

అలా నాలోని కళా నాలోనే అణగ త్రోక్కబడింది. ఇపుడు మీకందరికి ఓ బంపర్ ఆఫర్!!! నా ఆవేశం కట్టలు తెంచుకుని రకరకాలుగా మీముందుకు రాబోతుంది.. నా బాధితుల లిస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరగబోతుంది. నేను మాత్రం మీకు దొరకనుగా...


కాచుకోంఢి మరి.... 

గెట్ రెడీ .....................................

3 comments:

సుమా..!! బాగుందిరా నీ బ్లాగ్ అండ్ నీ సాహసాలు..నాకు గుర్తుందిలే మన ఇంటర్లో నీ కవితల పుస్తకం. అపుడు నువ్వెంత బాగా కతలు చెప్పెదనివో...
I wish you give all of us the same feel and fun as we once had in our life. keep blogging madam..I am eager to see the rest of your articles..

Cheers,
Nalini.

బాగుందండి.

కాకపోతే కంప్యూటర్ ది నాదీ అదే ప్రహసనం

బాగుంది సుమా మీ బ్లాగ్... మీ లెక్కల ఫాఠాల బయం.. మీ అబ్బయి కి ఎప్పుడు తిప్పకండి ఈ పాత రీలు వినేప్పుడు బాగానే వింటారు పిల్లలు తరువాత మన మీదికే వెనక్కి తిప్పి కొడతారు అత్యవసర సమయాలలో.. చెప్పి దొరికి పోయాము కాబట్టి ఏమి అన లేక వెర్రి మొహాలు వెయ్యవలసి వస్తుంది..