చుట్టూ కొబ్బరి అడవి మద్యలో మా ఇల్లు..
లేని రకం చెట్టు లేదు,పనస,మామిడి,కమ్మచ్చి (స్టార్ ఫ్రూట్)జామా,ఉసిరి ,నేరేడు అన్ని ఇంటి చుట్టూ ఉన్నాయి.ఇంట్లో ఒక గంగా బొండం చెట్టు,కొన్ని కొబ్బరి చెట్లు,పెరటిలో శ్రీ శ్రీ శ్రీ కృష్ణమధురం మావిడి చెట్టు. ఈ చెట్టు అంటే మా చిన్నపుడు తాతామ్మకి ,ఇప్పుడు నా పిల్లల తాతామ్మ అంటే మా నాన్నమ్మకి ప్రాణం .అన్ని మావిడి చెట్లు పూత పుసాక దిగుబడి అంచనా వేసి అమ్మేస్తారు కాని మా నానమ్మ ముందే ఆ చెట్టు కాయలన్నీ కోసి మాకే ఇవ్వాలని మావిడికాయల షావుకారుతో ఒప్పందం చేసేసుకుంటారు.ఆ చెట్టు కాయలు అంతా రుచి మరి కొంచం అటు ఇటుగా నిలంకాయ లా చిన్న గా ఉంటుంది కాని రుచి పోల్చాడని నా అమృతం తెలియదు భహుశా మా క్రిష్ణమధురం రుచి లానే ఉంటుందేమో .ఆ చెట్టు కాపు కుడా ఎక్కువ ,మేము తిన్నని తినగా అందరికి తాతామ్మ ఇచ్చేవారు .ఈప్పటికే అదే ఆచారం నడుస్తుంది.ఆ చెట్టు కాయ దిగిన దగ్గరన్నుంచి మా నాన్నమ్మ అటు ఇటు ఉంచి మా గ్యాంగ్ అంతా ఉప్పుకారం పెట్టుకుని తినేవాళ్ళం.ఇంకా కొంచం టెంక కట్టక మా అమ్మ చిలకడ దుంప వేసి మావిడికాయ పులుసు పెట్టె వారు.ఆ రోజు మాచెల్లి అరడజను సార్లు అన్నం తినేది.నేను అడిగిమరి అమ్మ టెంక వేయండి అని వేయించికుని వీరా చీకుడే..........
మా ఇల్లు మరమత్తులు చేసినప్పుడు ఆ చెట్టు తీసేద్దాం అనుకున్నారు.కాని వాస్తు కంటే మా ఇంట్లో అందరికి ఆచెట్టు తో ఉన్న అనుభందం గెలిచింది.ఖర్చు పెరిగినా ఆ చెట్టు చుట్టూ ఎత్తు చేసి కొమ్మలు కొట్టేసి వదిలేసారు.ఆ చెట్టు క్రిందే మా పాతా వంటిల్లు ఉండేది.మేము ఆచెట్టు నీడనే బోజనాలు చేసేవాళ్ళం .అట్లా తద్దికి ఆ చెట్టు కొమ్మకి పెద్ద పగ్గం ఊయ్యల కట్టించేవారు. వంటింటి కప్పు మీదకి ఉగేవాళ్ళం.
ఆ చెట్టు క్రిందా కొబ్బరిడోక్కల పొయ్య మీదా పండగలకి రకరకాల పిండి వంటలు చేసేవారు, వేడి వేడి తిన్నపుడు చెయ్యి కాలుతుంటే చటుకున మా చిన్నన్న మావిడాకు కోసి కాలకుండా ఆసారకి ఇచ్చేవారు.మా ఇంట్లో ఎ కార్యం జరిగినా పెద్ద పెద్ద వంటలకి ఆ చెట్టు క్రిందే వంటా ఈప్పటికీ.మా ఇల్లు పరిచయం ఉన్న అందరికి తనరుచి అపుర్వమే.ఇంట్లో కి వస్తూనే ఆ చెట్టు చూస్తూనే అడుగు లోపలి పడుతుంది ........
మా నాన్నమ్మ అన్నం ముద్దలు చేసి నాకు మా చెల్లి కి ముద్దలు పెడుతూ ముద్దా-ముద్దకి ఒక్కొక్క
పక్షి గుడ్డు పేరు చెపుతుంటే యెంత అన్నం తిన్నామో తెలిసేది కాదు ఆ చెట్టు నీడన.వడ్రంగి పిట్ట గుడ్డు ,తితువి పిట్ట గుడ్డు, చల్లంగి పిట్ట గుడ్డు,కోకిల గుడ్డు .కాకి గుడ్డు,కోడి గుడ్డు,గిన్ని కోడి గుడ్డు,
బాతు గుడ్డు,గెద్ద గుడ్డు,నెమలి గుడ్డు,పావురంగుడ్డు, చెవిటి కాకి గుడ్డు,పాలా పిట్ట గుడ్డు, గుడ్లగూబ గుడ్డు,కొంగ గుడ్డు,చిలక గుడ్డు,పిచ్చుక గుడ్డు,టర్కీ కోడి గుడ్డు, గిరిరాజ్ కోడి గుడ్డు,గోరింక గుడ్డు ,పందెం కోడి గుడ్డు,మినా పిట్ట గుడ్డు,కవుజుపిట్ట గుడ్డు,పారంకోడి గుడ్డు,ఇంక ఎన్నో ఎన్నెన్నో కొన్ని పిట్టలు అసలు గుడ్డు లే పెట్టావు,అయినా వాటి తో కుడా మా కోసం గుడ్డు లు పెట్టించే వారు మా నాన్నమ్మ.ఇప్పుడు నవ్వు వస్తుంది పందెం కోడి గుడ్డు తిన్నందుకు.
మా నాన్నమ్మ కాపరానికి వచ్చేసరికే ఉందట ఆ చెట్టు మా నాన్నమ్మ మొన్న ఏప్రిల్ 15న ఎభయ్యి రెండొవ పెళ్లి రోజు జరుపుకున్నారు మరి ఈ మధురఫలలా చెట్టు చెట్టుకి ఎ వయస్సు ఉంటుందో ....ఎన్ని తరాలు అయినా ఆ చెట్టు అలానే ఉండి తన మాధుర్యం అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ........................
ప్రేమ తో ఈ పోస్ట్ మా తాతామ్మ కి అంకితం ఇస్తూ .........
ప్రేమ తో ,
మీ పెద్దది.(నన్ను మా తాతామ్మ పిలిచే పేరు)
నా అసలు పేరు తనదే లెండి .
సుభద్ర..........
8 comments:
apaatha madhuralu touch chasavu
.మీ తోటల కబుర్లు చెప్పి ఏం వూరిస్తారండి .
కానీ ఒక్కసారీ రమ్మనరు.
ఈ మాటు మీ కృష్ణ మధురం మామిడికాయలకోసం మేమూ క్యూలో వున్నామోచ్.
psmlakshmi
మావిడి పళ్ళు అయిపోవస్తూంటే ..ఇప్పుడు ఊరిస్తారా ....
అధరం మధురం,వదనం మధురం,హసితం మధురం,మధురాధిపతే అఖిలం మధురం కదా ! మరి ఆయనపేరుతో ఉన్న మామిడి అంత మధురంగానూ ఉండవద్దా !
సుభద్రా, మీ పెరటిచెట్టు అనుబంధం చక్కగా వుంది.
నాకూ మామిడితోటలతో పరిచయం ఎక్కువే అయినా "కృష్ణ మధురం" పేరు నేనెప్పుడూ వినలేదు. దీనికి వాడుకలో మరోపేరేదైనా వుందా?
good style of writing...
Post a Comment