వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

మొన్నదేశం కాని దేశం లో జ్యోతిర్మయి ......నిన్న ప్రణిత ,స్వాప్నిక ........నేడు లావణ్య .......
ఎటు పోతున్నాం మనం.మమ్మల్ని బ్రతకనివ్వండి.ఎన్నాళ్ళు ఇంక ఎన్నేళ్ళు గాంధీ గారు కలలు కన్నా స్వాతంత్ర్యం రాక పోయినా కనీసం పట్టపగలు అయినా బిక్కు మంటూ భయపడకుండా ఉండే రోజు వస్తుందా ??????

పసి పాపా నుంచి పండు ముసలి అవ్వని అయినా కనికరం లేని కామం తో కళ్లు ముసుకు పోయిన మృగాల చేత అకృత్యాలు బలి అయ్యి అల్లాడుతున్నారు. పక్కింటి ఆరేళ్ళ పాపా ని ఆటల పేరు తో అసహ్యం గా ప్రవర్తించే పశువులు.పదేళ్ళయినా లేని పసి మొగ్గ లాంటి పిల్లని బస్సులో తాకుతూ రాక్షస ఆనందం పొందే శాడిస్టుగాళ్ళు .వావివరసలు మర్చిపోయి రెచ్చిపోతున్నదుర్మార్గులు .సినిమా హల్లో కుర్చిలా సందులోంచి ముట్టుకుని వీరత్వం అనుకునే పిచ్చి కుక్కలు.
ప్రేమ పేరు తో ఒకడు,పెళ్లి పేరు తో ఒకడు ,అవసరాలని ఆసరా తీసుకుని ఒకడు,భయ పెట్టి ఒకడు,బలవంతం గా ఒకడు ,ఇంక ఎన్నో ఎన్నెన్నో ఎంతమందో.రక్షక బటులే భక్షకులు అవ్వుతుంటే ఎవరకి చెప్పాలి.ఏమని చెప్పాలి .ఎలా ఏడవాలి .....మరో మగాడు అయినా నాన్న, అన్నా తమ్ముడు ,మొగుడు తో నా ...ఎలా చెప్పగలం . అవమానించ బడ్డ ఆడకూతురు కి వీళ్ళు ఆ జాతి వారే అని గుర్తు వస్తే.???????.ఆమె మనసు ఆక్రందన ఈ పురుష ప్రపంచం ఉహ కి అందుతుందా ....

పరాయి ఆడవాళ్ళని ఆబగా చూసి చోంగా కార్చుకునే ఈ మగాళ్ళకి తెలియదా తనని ఓ తల్లి కన్నదని;ఆమె స్తన్యం తాగి ఇంతా అయ్యామని .రాఖి కట్టే తన చెల్లిలాగే మరో అన్నకి చెల్లెలు అని .
మాటాల తో చేతల తో అమ్మ లాంటి ఓ ఆంటీ అని ,తోబుట్టువు లాంటి ఆడపిల్లని వికారా చేష్టల తో హింసిస్తున్నమని.

పూర్వమే ఆడవాళ్లు మనఃశాంతి గా ఉండేవారేమో, ఇంటి గడప దాటకుండా .మనం అబివృద్ది చెందుతున్న దాని కంటే అధ పాతాళం వైపుకి ఎక్కువ పోతున్నాం.ఇలానే కొనసాగితే ఆడవాళ్లు అమ్మ అవడానికే భయపడే రోజు వస్తుందేమో.అవమానాలు,అకృత్యాలు,మాసిక క్షొభ అన్ని ఆడవాళ్ళ కే.తల్లిని,ఆవుని,జన్మభూమిని పూజించే భారతీయ సంసృతి మాయమయ్యింది.ప్రతి దేవుడి పేరుకి ముందు ఆయన భార్య పేరుతొ స్తుతించే మన దేశం లో స్త్రీ దక్కుతున్నా మర్యాదలు చూసి ప్రపంచం ముక్కున వేలేసుకుని ...ఛీ ఛీ ఛీ అంటుంటే మనం వార్తలో ఉన్నామని ఆనందిద్దాం.

పాపాలు చేసుకుంటే నరకానికి పోతారట.కాని నాకు ఈ క్షణం అనిపిస్తుంది .మహాపాపం కి శిక్ష ఆడజన్మేమో....................అని.

దయచేసి ఎవరు కామెంట్స్ రాయకండి..నా మనసు ఆక్రోశం రాసుకున్న....

2 comments:

సారీ,
రాయలేకుండా వుండలేకపోతున్నాను.
మీరు చదివి డెలీట్ చేసేయండి.

***

ఇంత జరిగుతూన్నా కూడా
ఇంకా భగవంతుడూ అని పాకులాడ్డం
నాకు మూర్ఖత్వం అనిపిస్తుంది.

అవును. ప్రతీదానికీ కర్మ అనీ పూర్వజన్మ కర్మఫలితమనీ మనల్ని మనం ఇంకెంతకాలం మోసపుచ్చుకుంటాం.

వేల సంవత్సరాలనుంచీ ఆడదే మాత్రమే బలవుతూ వస్తోంది.ప్రతీ కుట్రకీ, ప్రతీ పశువాంఛకీ ఆడదే కావాలి.

ఉరిశిక్షకంటే దారుణమైన, మరణయాతనని గుర్తుకు తెచ్చే శిక్ష యిలాంటి అత్యాచారాలకి వేసేట్టు చట్టం రావాలని యీ తరంలో కూడా ఉద్యమం వదీయకపోతే,

ఇంతకంటే
నీచమైన,
హేయమైన లోకం
యీ విశ్వంలో యింకేదీ లేదు.

ఎన్ని లోకాలు చూసారు ఇండియన్ గారూ..ఈ లోకం మంచిగానే ఉంది....చెడు వుంటేనే మంచేంటో తెలుస్తుంది...but మీ బాధ అర్ధమైంది లెండి.

మరో విషయం..ఈ మధ్య "గే"స్ గురించి తెలుసుకుంటున్నారు కదా! వాళ్ళేమి ఇవ్వాళ ఊడిపడలేదు. కానీ, వీళ్ళవల్ల మగాళ్ళు కూడా బాధ పడేవుంటారేమో కదా! ఒక్క "ఆడవాళ్ళే" కామవంచ వల్ల బాధ పడేవాళ్ళు అనే రోజులు పోయినాయి.

కళ్ళెం లేని కామవాంఛ ఎవ్వరికున్నా ఏకి పేరియేండి.ఇన్ని రోజులు ఆడవాళ్ళే కష్టాలు అనుభవించారు, ఇప్పుడు మేము "అనుభవిస్తాము" అని మాత్రం ఆలోచించకండే...ప్లీజ్