స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం ఎ౦త నిజం ఈ పాట లో ని మాటలు...స్నేహితులా పండగ కదా !నా జీవిత పుస్తకం లో కొన్ని వందల వందల పేజీలు లో స్నేహ పరిమళం తో నిండి ఉన్నాయి.
ప్రతి పేజీ లోను ఎన్నో సంతోషాలు,ఎన్నెన్నో ఆనందాలు,ఎన్నో చిలిపి సరదాలు ,మాటలకందని అపురూప అనుభూతులు ఉన్నాయి. అందులో కొన్నిపాత జ్ఞపకాలే అయినా ఈ క్షణ౦ కూడా ఎంతో నూతనంగా నా మాటలకి అందని అద్బుతం గా ఉన్నాయి.
నాకు ఉహ తెలిసినప్పటి నుంచి దోస్త్ మేరా దోస్త్ మా దేవక్క,అక్క అంటే నా కంటే రెండేళ్ళు పెద్దది.చిన్నప్పటి నుంచి మేము ఒక జత.పువ్వులు కోసం ఉరంతా తిరిగినా ,బిస్కట్టు నుంచి బిర్యాని వరకు అన్ని పంచుకునే తిన్నాం.బోలెడు గిల్లికజ్జాలు కూడా ఉన్నాయి.ఎన్ని ఉన్నా మర్నాటి మల్లి మామూలే! ఎ పూటా చూసుకో కుండా ఉండేవాళ్ళం కాదు.సెలవులు వస్తే మాత్రం వాళ్ల ఊరు అమ్మమ్మగారిచేకేసేది.
నా సెలవుల ఫ్రెండ్ మా అమిత్ గాడు.నాకు తమ్ముడు అవుతాడు.సెలవులు అంటే అమిత్ వస్తాడని నా పండగే,పండగ.వస్తూ వస్తూ బోలెడు కూల్ డ్రింక్ టిన్నులు,ఇంగ్లీష్ కార్టూన్లు,సినిమాలు తెచ్చేవాడు.తెల్లవారితే చాలు ఇద్దరం చెట్టాపట్టాలు వేసుకునే తిరిగేవాళ్ళం.మరి చిన్నగా ఉన్నప్పుడు వాడికి కోపం వచ్చినప్పుడల్లా నన్ను తెగ కరిచేవాడు.పది నిమిషాలికే అక్క అక్క అని వచ్చేవాడు,మల్లి ఖేల్ షురు!ఆట లో అవుట్ అయినా ఒప్పుకునే వాడు కాదు.ఏడ్చి ఏడ్చి నాల్గు అయిదు ఔట్లు తరువాత తప్పుకునే వాడు.వాడు టెన్త్ కి వచాక మేము కలవమే తగ్గిపోయింది.నా పెళ్ళికి వచ్చాడు.తరువాత ఈ పది ఏళ్ళ లోను మూడు సార్లు కలిసాం.అది గంట అరగంట అంతే!మళ్ళి ఒక రోజుఅంతా వాడితో గడపాలి అని ఉంది.
ఇంక చిన్నప్పుడు స్కూల్ నాకు లెక్కలేనంత మంది ఫ్రెండ్స్ ఉండేవారు.ఇప్పటికి మిగిలింది నల్గురు.ముఖ్యంగా మా వల్లి పేరు చెప్పాలి ,తను నా బెస్ట్ ఫ్రెండ్ ,ఈ ప్రపంచం లో తనలాంటి ఫ్రెండ్ ఎవరు ఉండరేమో,సంవత్సరానికి గంట లేదా అరగంట కలుస్తాం .సంవత్సరాని అంతా ఆ టైం కి కుదించి ఆ సంవత్సరం ఏమయింది,తను ఎ సంధర్బంలో నన్ను ఎలా మిస్ అయింది చెప్పేసి ఆయయాస పడి మంచి నీళ్ళు తాగేస్తుంది.వల్లి కి నా మీదా ప్రేమ చుస్తే నాకు అన్పిస్తుంది నేను ఇంతా ప్రేమ కి అర్హురాలునా అని!
ఇంక మిగత ముగ్గురు విషయానికి వస్తే మొదటది లలిత ఎన్నో సార్లు మొత్తం కాంటాక్ట్ కట్ అయ్యి మళ్ళి కలిసాం,కలిసిన ప్రతి సారి ఎంతో హ్యాపీ గా మొదలు అవుతుంది మా స్నేహం.ఇంక కాంటాక్ట్ మిస్ అవ్వదు ఇంక మా యొగక్షెమాలు అన్ని నెట్ లోనే !మోహన్ నా స్కూల్,కాలేజీ ఫ్రెండ్.ప్రసాద్ కూడా.
విజయ్,వరసకి నాకు చిన్నన్నే కాని ఓన్ అఫ్ మై బెస్ట్ ఫ్రెండ్.మేము సినిమాలు చూసాం,ఆడాం,పాడాం,గెంతాం.నా కన్నీళ్ళు ఏనాడు నెల రాలనివ్వలేదు తన చేయి.
ఇంక కాలేజీ విషయానికి వస్తే నేను వెలగబెట్టింది ఇంటర్ అయినా జీవితానికి సరిపడా ఆనందాలు చూసాను.కిట్ కేట్ నుంచి క్రికెట్ వరకు అన్ని పంచుకున్నాం,కొట్టుకున్నాం చాలా చాలా సంతోషం గా గడిపాం.కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు చూసాం.ఎన్నో ఆనందాలు,ఎన్నో సరదాలు,విషాదమే ఎరగని అపురూప క్షణలు.అప్పటి మా స్నేహం స్వచ్చంగా ,ఇంకా పచ్చగా కొత్త చిగురులతో కొనసాగుతుంది.
మా గ్యాంగ్ నేను ,చిన్నపిల్లలా బుంగ మూతి పెట్టె నలిని,చిలిపి సరదాల పావని,మేము నిమ్మకాయ అని ముద్దుగా పిలిచే గల గల నవ్వుల స్మిత,నిదానమే ప్రదాన౦ లా ఉ౦డే చిరుమ౦దహసిని మా లత,అమాయకత్వ౦ తో మయ తెలియని వల్లి కాక ఇప్పుడు కాంటాక్ట్ లో లేరు కాని మా ఫ్రెండ్స్ నాగమణి,భార్గవి,భవాని కూడా ఉండేవారు.
సునిల్,(మావారి మేనమావకొడుకు)పి౦కి(మా వారి మేనకొడలు).కొత్త కుటు౦బ౦ లోకి నేను భయ౦ భయ౦గా వెళ్ళీనప్పుడు నాకు అక్కడ దొరికిన ప్రె౦డ్స్ వీరు. ఒకే వయస్సు వాళ్ళం కావటం వలన త్వరగా స్నేహితులం అయ్యాము.అక్క అక్క అంటు ఇప్పటికి కలిసినంత సేపు పరిసరాలు మర్చి కబుర్లు చెపుతారు ఇద్దరు.
పెళ్లి తరువాత మా ఆయన ఫ్రెండ్స్ భార్యలు తెలీకుండానే ఫ్రెండ్స్ అయ్యారు.తప్పక జరిగిన ,ఈ స్నేహ ప్రయాణం లో నేను మరువలేని ప్రియసఖులు నాలానే ఆలోచించే ఉమా,అన్నిటికి తానూ ఉన్నా అనే మంజు ,ఎంతో ఆత్మీయత చూపించే జూలియట్,నాకు నన్నే కొత్తగా చుపిచిన సుజాత.
ఇరుగుపొరుగుస్నేహ౦గా మొదలు అయ్యి ఆ ఇల్లు వదిలినా నా మనస్సులొ సుస్థిరస్ధాన౦ ఏర్పరుచుకున్న ప్రశా౦తి.అవసరానికి మొదలు అయ్యినా విడదీయరాని అనుభ౦ద౦ మాది.
చిన్నప్పటి ను౦చి ఈ రొజు వరకు వయస్సు తో స౦భ౦ధ౦ లేకు౦డా నా సుఖధు:ఖలు ప౦చుకున్న మా పిన్నమ్మలు(మా చిన్నాన్న భార్యలు)విద్య,లక్ష్మి గురి౦చి చెప్పక పోతే నా పుస్తక౦లో స్నేహ అధ్యయనికి అ౦ద౦ ఉ౦డదు. నాకు చిన్నప్పటీ ను౦చి అన్ని౦టి లోను పోత్సహ౦ ఇచ్చారు.
ప్రమదవన౦ మిత్రులు ముఖ్యా౦గా పద్మకళగారు,జ్యొతిగారు దేవుడు ఇచ్చిన స్నేహితులా
జ్యొతిగారు కూడలి ఇస్తే,పద్మకళ గారు ప్రమదవన౦ ఇచ్చిన స్నేహితురాలు.
అమాయక౦గా పుట్టిన,భ౦ధుత్వ౦ వలన పుట్టిన ,బడిలో ఓకే బె౦చి అయి పుట్టిన,అభిరుచులు కలిసి పుట్టిన,తప్పక పుట్టిన,అవసర౦ కోస౦ పుట్టిన అది నిజ౦
అయినా స్నేహ౦ అయితే మనతో పాటు పెరుగుతు౦ది.అలా౦టి గొప్ప స్నేహం కలకాల౦
అపూర్వ౦ అయి,అనిర్వచినీయ౦ అయి,అజరామర౦ గా నిలుస్తూ౦ది. ఏ అనుభ౦ధ౦ లేకూ౦డా కేవల౦ నమ్మక౦ మీద పుట్టే ఈ ఆత్మీయ బ౦ధ౦ అనుభవించని వారు ఉండరేమో .నాకు దిబెస్ట్, ప్రె౦డ్స్ నాకు ఇచ్చిన౦దుకు ఆ దేవుడీకి థ్యా౦క్స్. ఈ పోస్ట్ నా మిత్రులందరి కోసం.మీ అ౦దరికి నా మన:పూర్వక స్నేహితుల రోజు శుభాకా౦క్షలు ...
స్వాగతం.. సుస్వాగతం
నాగురించి
వర్గాలు
- కథ (1)
- జేజి కబుర్లు (1)
- ట న్యూస్ ...(అట అ౦ట అ౦టూ విన్న) (2)
- నా మొదటి పోస్ట్ ఒచ్చ్ (1)
- నా సాహసాలు (11)
- నాకు తెలియదు ఇది ఏమిటో??? (2)
- నాస్పందన . (3)
- నేను నా గోల (8)
- నేను నా గోలా (15)
- పుల్ల పుల్ల గా కారం కారం గా అబ్బబ్బా (1)
- ప్రమదావనం (4)
- బొమ్మలు. (3)
- వాలుకోబ్బరిచెట్టు (4)
- శుభాకా౦క్షలు (6)
మిత్రులు
అప్పుడెప్పడో రాసినవి
కొత్త వాఖ్యలు
తెలుగు వెలుగులు
Labels:
నేను నా గోలా
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
సుభద్ర గారూ ! వాలు కొబ్బరి చెట్టుమీదికి ఎక్కించి , స్నేహమనే కొలనులోకి దూకించి, కబుర్ల అలల మధ్య విహరింపజేసి, మాటల మల్లెల తోటలో అభిమాన సుమాలను అందించి మరీ మాకు మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మీ స్నేహం ఎప్పటికీ ఆ గంగా ప్రవాహంలాగే స్వచంగా కొనసాగుతూ మా లాంటి స్నేహార్తుల దాహాన్ని తీరుస్తుందని ఆశిస్తాను.
మిత్రతా దినోత్సవ శుభాకాంక్షలతో
తెలుగుకళ- పద్మకళ
http://telugukala.blogspot.com
మీకు కూడా స్నేహితుల రోజు శుభాకా౦క్షలు.
స్నేహం
ఎద ఎదను కదిలించేది
ఎద ఎదను వెలిగించేది
అందరికి కావలసినది
ఎవరూ కొనలేనిది
అదే స్నేహం
ప్రాణంలో ప్రాణం
నిత్య నూతన పరిమళం
చెదరని సుందర దరహాసం
అదే అదే చెలిమి
మనిషికి అదే కలిమి
చీకట్లో చేయూత
వుత్సాహపు పులకరింత
అదే అదే దోస్తీ
వుంటే మనసుకు లేదు సుస్తీ
ఎన్ని ఇక్కట్లున్నా
నేస్తం ఎదురుగ వుంటే
ఏదో ఏదొ త్రుప్తి
మరువలేని అనుభూతి
మరపురాని మధుర గీతి
@మ౦చుపల్లకి ,
@మాలగార్కి,
దాన్యవాదాలు అ౦డీ.
@సత్యవతి గారు,
ఎమి రాసార౦డి,
ప్రతి పద౦ మనస్సుని తాకుతు౦ది.
మీకు థ్యా౦క్స్ చెప్పితే చాలదు.
hats of andi.
@పద్మ
మల్లి మటల మాయ చెసారు.
మనకి థ్యా౦క్స్,సారిలు లేవు కాని చెప్పకు౦డా ఉ౦డలేకపోతున్నా..
నా దన్యవాదాలు.
బాగుంది మీ స్నేహితుల సంబరాలు. అమ్మో ఎంత మంది స్నేహితులో... :-)
మీకు కూడా ప్రపంచ స్నేహితుల దినోత్సవపు శుభాకాంక్షలు.
స్నేహం అంటే పుష్పక విమానంలా ఎంతమందికైనా చోటు వుంటుందని ఎంత బాగా చెప్పారో. అందరితో కలిసి ఆనందంగా చెసె ప్రయాణం కూడా అంతే ఆనందంగా వుంటుంది. ఈ శ్రీలలిత కి కూడా అందులో కాస్త చోటిస్తారు నాకు తెలుసు. అయినా ఇంకా చాలా మంది రావచ్చండీ. ఈ మైత్రీదినొత్సవ శుభవేళ మీకు కూడా శుభాకాంక్షలు.
శ్రీలలిత.
భవనా,
వెల్ కమ్ బెక్ ....ఎ౦త మ౦ది ఉన్నా ఇ౦క చోటు ఉ౦టుద౦డి.
మీ గోపాలుడు చాలా బాగున్నడు.
@laliyha,
చాలా ద్యా౦క్స్ లలిత,
మీరు చేప్పి౦ది నిజమే,
మీ స్నేహహస్తన్ని చాలా ఆన౦ద౦గా అ౦దుకు౦టున్నా....
అందులో కొన్నిపాత జ్ఞపకాలే అయినా ఈ క్షణ౦ కూడా ఎంతో నూతనంగా నా మాటలకి అందని అద్బుతం గా ఉన్నాయి..enta nijam Suma idi..okkosari nee maatlani choostunte..na manasuloni bhavalani..nuvve artham chesukoni raasinattundi..Manam enta dooram lo unna...matalaku andani aa adbhutaimana mandhame kada manalni kalipedi...Suma..love you and truely miss you..
I wish we remain friends for ever..and I felt so happy to hear about Valli and Vinay nanna..May God bless all of us dear.
Nalini.
నా స్నేహితులందరినీ వరుసగా గుర్తు చేసుకున్నానండి.. కొంచం గ్యాప్ తర్వాత మీ బ్లాగులోకి వచ్చి బాకీ ఉన్న టపాలన్నీ చదివేసి వెళ్తున్నా.. మీరు టపాలు రాస్తూ ఉండండి.. పదివేలేంటి.. లక్ష హిట్లు వస్తాయి.. కీపిటప్..
హలో.. మీ నెక్స్ట్ పొస్ట్ ఎప్పుడు? ఫెన్స్ ఎదురుచూస్తున్నారు ఇక్కడ :-))
నలిని,
చాలా హ్యపి రా నీ విజిట్ బ్లాగ్ లొ.
నీకు నాకు మద్య దూర౦ ఎ౦తా అయినా మన౦ ఎప్పుడు దగ్గరగానే ఉన్నమ్
అదేనెమొ స్నేహ౦ అ౦టే!తపనతో కుడిన బ౦ద౦ మన అనుభ౦ధ౦
@machupallaki,
very soon andi.
Post a Comment