నాకు నిన్న అటులుల పులిహోరా చేస్తుంటే...చిన్నప్పటి ఒక స్నాక్ గుర్తు వచ్చింది.మాకు స్కూల్ నాల్గు గంటలకి అయ్యేది.ఇంటికి వచ్చేసరికి నాల్గునర లేదా పావుతక్కువ అయిదు అయ్యేది.బాగ్ గేటు దగ్గరే పడేసి తాతమ్మ దగ్గరకి వెళ్ళేదాన్ని.తాతమ్మ వచ్చావా పెద్దదానా!రా అని తన గదిలో కి తీసుకెళ్ళి రక రకల తాయిలాలు పెట్టేవారు.అందులో నాకు చాలా నచ్చే తాయిలం.
దాలిలో ఎర్రగా కాసినా గోరువెచ్చని పాలలో బెల్లం అటుకులు వేసి పావుగంట నాననిచ్చి రెడీ గా పెట్టేవారు.నేను పాలు తాగేదాన్ని కాదు చిన్నపుడు సో నేను పొట్టిగా ఉంటానేమోమా నాన్నమ్మ లా అని తాతమ్మ భయం,అందుకే నాకు ఎలా అయినా పాలు ఇవ్వాలని వారానికి మూడు నాల్గు సార్లు అదే పెట్టేవారు.ఎంతా బాగుండేదో !పాలు అంటే తక్కువేమీ కాదు పావు లీటర్ కి ఎక్కువే.అంటే రెండు రోజుల కి ఓకసారి రెండు రోజులా కోటా నాతొ తాగించేవారన్న మాటా!! !!
మరి పాలుతాగాక పొతే ఏమి తాగేదానివి అంటారా!పెద్ద లోటా గ్లాస్ తో లోట్టేడు కాఫీ....
కాని మా తాతమ్మ భయమే నిజమయింది ,నేను నాన్నమ్మ అంతే అయ్యాను.మా చెల్లి లేచేసరికి కాఫీ రెడీ గా లేకపోతె నానా గోలా చేసేది.బ్యాడ్ గర్ల్ బెడ్ కాఫీ తాగేది.తను లేచేసరికి రెడీ గా లేక పొతే కాపే కాపీ కకాపీ ........అని ఉరంతా వినేలా ఆరునోక్క రాగం అందుకునేది.సో మా అమ్మ పిన్నికి ముందు ఎవరు లేస్తే వారికి రమ్య సౌండ్ పొల్యుషన్ తట్టుకోలేక ముందుగా కాఫీ పనే చూసేవారు.పిన్ని కి అమ్మ లేకుండా ఉండాలంటే రమ్య తో రమ్య కచేరి పెడుతుందేమో అని టేషన్ గా ఉండేదట!పిన్నె తనతో కాఫీ కోసం ఏడ్చే అలవాటు మాన్పించారు.
నేను కాఫీ మంతెన సత్య నారాయణ రాజుగారి పుణ్యమా ,మా నాన్న కుడా మానేసి నాతో ముందు లో బలవంతంగానే మాన్పించారు.కానీ ఇంట్లో ఉండే మా అమ్మతో ,మా చెల్లి తో మాత్రం మాన్పించటం మా నాన్న వల్లనా కాలేదు.బ్రూక్ బాండ్ కంపెనీ ని మా ఫ్యామిలీ పెంచి పోషిస్తుందని మా నాన్న ప్రగడ విశ్వాసం .ఇంక కాఫీ అంటే మా అత్తా(మేనత్త) పేరు చెప్పాలి ,తని నిద్దట్లో లేపి కాఫీ తాగుదామా అంటే ఓకే అంటారు.తిండి లేక పోయినా పరవాలేదు అత్తకి కాఫీ తో నడిపెస్తారు.
మీరు పిల్లలకి స్నాక్స్ టైం లో ఫ్రైడ్ వి కాకుండా అన్ని విధాలా ఎనర్జీ ఫుడ్ పాలు అటుకులు బెల్లం ట్రై చేయండి.మా వాడు ఒకసారి పెడితే ఏమిటమ్మ ఇది అన్నాడు,మా చిన్నపుడు మేము తిన్న రైస్ ఫ్లేక్స్ రా అని చెప్పా.సో హేల్తి అని చెప్పి కాల్షియం ,ఐరన్ అని చెప్పా ఇంక వాడు హ్యాపీ గా తినేస్తాడు ఈప్పుడు .ఇంకో రహస్య ఏంటంటే మనకి పెద్దగ పని ఉండదు.గోరువెచ్చని పాలలో బెల్లం వేయాలి లేక పొతే పాలు విరిగే ప్రమాదం ఉంది.మరి ఎక్కువగా నానిన బాగోదు .
స్వాగతం.. సుస్వాగతం
నాగురించి
వర్గాలు
- కథ (1)
- జేజి కబుర్లు (1)
- ట న్యూస్ ...(అట అ౦ట అ౦టూ విన్న) (2)
- నా మొదటి పోస్ట్ ఒచ్చ్ (1)
- నా సాహసాలు (11)
- నాకు తెలియదు ఇది ఏమిటో??? (2)
- నాస్పందన . (3)
- నేను నా గోల (8)
- నేను నా గోలా (15)
- పుల్ల పుల్ల గా కారం కారం గా అబ్బబ్బా (1)
- ప్రమదావనం (4)
- బొమ్మలు. (3)
- వాలుకోబ్బరిచెట్టు (4)
- శుభాకా౦క్షలు (6)
మిత్రులు
అప్పుడెప్పడో రాసినవి
కొత్త వాఖ్యలు
తెలుగు వెలుగులు
Subscribe to:
Post Comments (Atom)
12 comments:
చిన్నప్పుడు మాక్కూడా బడినుంచి ఇంటికి రాగానే అటుకులు-బెల్లం-పాలు టిఫినేనండీ.. పొద్దున్న గుమ్మపాలు, మద్యాహ్నం వేడిపాలు తాగేవాళ్ళం అనుకోండి :-) ఇంక కాఫీ విషయానికొస్తే నేనూ మీ కుటుంబ సభ్యుడినే.. మంతెనవారు కూడా నన్నేమీ చేయలేక పోయారు :-)
సేం టూ సేం. ఇప్పటికీ నా స్నాక్ లిస్ట్లో వుంది. మంచి జ్ఞాపకాలు తవ్వుకునే వీలిచ్చారు. థాంక్స్.
ఇప్పుడు అటుకులు బెల్లం తింటూ మీకు వ్యాఖ్య పెడుతున్నాను...భలేగా వున్నాయి:)
అటుకులు, బెల్లం, పాలు... ఆ పేరు వింటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి. హెల్దీ స్నేక్. మళ్ళీ చిన్నప్పటిరోజులు గుర్తు వచ్చాయి. చాలాబాగుంది.
కొత్త ధాన్యం రాగానే మా ఇంటికి అమ్మమ్మ ఊరినుండో,నాయనమ్మ నుంచో అటుకులు వచ్చేసేవండి ,బెల్లం తో కాదుకాని పంచదారతో తినేవాళ్ళం ....కొత్తావకాయలా కొన్నాళ్ళే :)
అటుకులూ బెల్లంపాలు అబ్బ నోరూరే స్నాక్స్ గురించి చెప్పారండీ... నాకూ చాలా ఇష్టం. కాఫీ విషయం లోనూ నాది మీస్కూలే.. ఎవరైనా మానేయమంటే.. ఆ ఒక్కటి దక్క.. అని అడ్డం పడిపోతాను వాళ్ల మాటలకి :-)
@muraligaaru,
చాలా ధ్యా౦క్స్ అ౦డి ,మీరు మా ఫ్యామిలి వారెనా?
నన్ను మా నాన్న ఎమెశనల్ బ్లాక్ చేసి మాన్పి౦చెసారు.
@usha,
మీరు బాగా తవ్వి ,మ౦చి కవితా రాసేయ౦డి మరి...
@padamarpita,
@lalitha,
లో ఫేట్ ఫూడ్ ఎ౦జాయ్......దన్యవాదాలు.
@chinni,
అవున౦డి,
కొత్త ధాన్య౦ అప్పుడే,కొత్త అవకయాలానే!
@venu srikanth,
మీరు మా స్కూలే నా!కాని నేను ఇప్పుడు స్కూలు మారా!
చాలా ద్యా౦క్స్.
చిన్నప్పుడు మా బాబు పాలు తాగకపోతే అటుకులు వేసి పెట్టేదాన్ని ..ఇప్పటికీ వాడికి అటుకులు పాలు పంచదార కలిపిస్తే మహా ఇష్టం .
Post a Comment