వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఈ ఫోటో ఉన్నది మా జేజి,ఆమె కూతురు,ఆమె కూతురు, ఆమె కూతురు,ఆమె కొడుకు.
ఎ౦టి చాలా గజిబిజి గా ఉందా!సరే వివరంగా చెపుతా చూడండి.
పోటో ఉన్నా బుడతడి నుంచి చెప్పనా,వాడు పేరు సూర్య వాడి కుడి ప్రక్క వాడి అమ్మ సుభద్ర(నేను).
ఇంక నిలుచున్న వారిలో కుడి నుంచి సుభద్ర అమ్మ అలివేలు,ఆమె ప్రక్క వాళ్ల శ్రీ రాజా వత్సవాయి చిట్టి కొండమ్మ గారు,ఆఖరున వారి కూతురు లక్షిగారు(అలివేలు అమ్మ).
మెత్తం గా చెప్పాలంటే ఐదు తరాలు.చాలా అరుదుగా ,కొంతమందికే దొరికే ఈ ఆనందం నాకు దక్కింది.
మా జేజమ్మగారు మూడు రోజుల క్రితం కాలం చేశారు.అందుకే ఆమె గురించి రాయాలని ఈ ప్రయత్నం .తను ఏమి చదువు కోలేదు.కాని భారతం ,రామాయణం ,పల్నాటియుద్దం అన్ని గ్రందాలు పద్య తర్పర్యాల తో సహా చెప్పేవారు.రాముడు ని క్షణ కాలం కుడా తలవకుండా ఉండేవారు కాదు .ఇంక పద్దతులు,సాంప్రదాయాలు పూజావిధానాలు ఎప్పుడు అడిగినా ఆలోచించకుండా ఆనర్గలం చెప్పెసేవారు.ఇంక వంటలకి వస్తే ఆ రుచి వర్ణించటానికి మాటలు లేవు.ఎన్ని వేలమందికి అయినా వండేవారు.పెళ్లిళ్లకు ఎ కర్యలేకైనా జేజమ్మ లేకుండా ఊర్లో ఎవరు చేసేవారు కాదట!ఇందిరా గాంధీగారు జేజమ్మ చేసిన పాకం గారిలు తిని జేజిని చుడాలనుకున్నారట!! ఆ రోజులలో ఉండే కట్టుబాట్ల వల్లనా జేజమ్మ వేల్లలేదట!!!..ఇంక అన్ని పురాణ ఘట్టాలు పాటలుగా రాగయుక్తంగా పాడేవారు.మా పెద్దవాడు పుట్టినప్పుడు తనకి చూపించడానికి వెళ్లి వారం ఆమె తో ఉన్నాము.తను పాడే జోలకి నేను నిద్ర పోయేదాన్ని.లెక్క లేనన్ని పాటలు,కధలు అందులో చాలా కొన్ని మాత్రం అమ్మ,అమ్మమ్మ వాళ్లు నేర్చుకున్నారు.కొన్ని సరదాగావాళ్లు వీళ్ళు రాసుకున్నవి ఉన్నాయి.అమ్మమ్మ ఆనారోగ్యం వల్ల అమ్మమ్మ నల్గురి సంతానాన్ని తానె అమ్మ అయ్యి పెంచారు.అమ్మ వాళ్లు జేజినే అమ్మ అనే పిలిచేవారు.చాలా ఆత్మాభిమానం ఎక్కువ,తనకి ఓపిక ఉన్నన్ని రోజులు ఎవరిమీద ఆధార పడకుండా తన వంటా తో సహా తనే చేసుకునేవారు.జేజి భాష కొంచం గ్రాంధికం గా ఉండేది. మేము తనతో గడిపింది తక్కువ కాని మా అమ్మ తన చిన్నతనం గురించి జేజి గురించి చెప్పేవారు.ముఖ్యంగా అమ్మ అంటే జేజికి ,మా ముత్తతాతయ్య గార్కి చాలా ఇష్టం నేమ్మదస్తురాలని.నాకు ఉహ తెలిశాక అమ్మ తో వెళ్ళినప్పుడు వాళ్లు అమ్మ మీద వాళ్లు చూపిన ప్రేమ ని చూసి మా అమ్మ వీళ్ళ పాపకదా అనుకున్నా. పెంచిన ప్రేమ గొప్పది అంటారుగా బహుశా అందుకేనేమో అమ్మ పెద్దమ్మ, మావయ్యలు అమ్మమ్మ కంటే జేజిమ్మనే అన్నింటికి తలుచుకుంటారు.ఎంతా సాంప్రదాయ వాదో అంతాగా మార్పును కుడా ఒప్పుకునేవారు.మంచి హాస్య చతురత కుడా ఉండేది.ఎవరికైనా మాటకీ సమాదానం చెపితే మల్లి తిరిగి మాట్లాడే అవసరం ఉండేది కాదట! తనకున్న లేకున్నా సాయం అని వచ్చినావారికి కష్టం తీర్చి పంపేవారట.ముత్తతాతగారు వెనక ముందు చూడక మాట ఇవ్వదని అనేవారట! రెండేళ్ళ గా ఆనారోగ్యం తో భాధ పడుతున్నారు.గత సంవత్సర కాలంగా పూర్తిగా మంచం మీదే ఉన్నారు.మా అత్తయ్యలు (మేనమావ భార్యలు)అన్ని ఒక చంటి పాపని చూసి నట్లు గా అన్ని సపర్యలు చేసి వాళ్ల ఋణం తీర్చుక్కున్నారు.సొంత బిడ్డలే చూడని ఈ రోజులలో భర్త అమ్మమ్మ కి అన్ని చేసి అత్తయ్యలు అభినందనీయులు .జేజి గత నెల గా చాలా తీవ్ర అనారోగ్యం తో భాధ పడుతున్నారు.ఇంక కష్టం అని తెలిసినా ఆఖరు వరకు అన్ని ప్రయత్నాలు చేసారు.నేను అమ్మni జేజి యొగక్షెమాలు అడిగిన ప్రతిసారి అమ్మ నరకం అనుభవిస్తున్నారని కన్నీళ్ళ పెట్టుకునేవారు.పదిహేను రోజుల క్రితం కాలు కుడా తీసేశారు.నేను రాముడ్ని చాలా వేడుకున్నా ఇంకా జేజిని క్షొభ పెట్ట వద్దని.జేజమ్మ తన తోభైముడవ ఏటా రాముడి సన్నిధి చేరుకున్నారు. నాకు తెలిసి జేజమ్మ కబుర్లు కధలు ,పాటలు బ్లాగ్ లో పెట్టాలను కుంటున్నా.జేజి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ శ్రీ రామాచంద్రాముర్తిని ప్రార్దిస్తూ....
ప్రేమ తో ,
మీ అలివేలు కూతురు

21 comments:

sorry

very touching!

Sad she passed away but glad she finally got relieved from suffering.

సుభద్ర గారూ,
మీ జేజి గురించి చెప్పిన కబుర్లు చాలా ఆత్మీయంగా అనిపించాయి. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ముందు ముందు ఆవిడ కథలు, పాటలు మరిన్ని చెప్పాలి మీరు. ఐదు తరాలు ఒక చోట చేరిన అపురూప దృశ్యాన్ని చూపించినందుకు ధన్యవాదాలు.
అన్నట్టూ.. మీ సూర్య అచ్చం మీకు జిరాక్స్ కాపీలా ఉన్నాడండోయ్ :)

Very Touching!!

అయ్యో పాపం.
ఐతే వత్సవాయి వారి వారసులా మీరు, చాలా సంతోషం. మళ్ళొక్కసారి శ్రీపాద వారి వడ్లగింజలు చదవాలి

ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

May her soul rest in peace

may her soul rest in peace

@చిన్నిగారు,



@చిన్నిగారు,
@భాస్కరరాజుగారు,
@సునీతగారు,
@లక్షిగారు,
@లలితగారు,
నాకు ఎమి రాయలొ తెలియట౦ లెద౦డీ!కాని ఎవరికైనా తప్పదు కదా జేజి చెరుకున్న ఆఖరు మజిలి.నేను తను పడుతున్న భాధలు విని ప్రతిసారి రాముడ్ని తన దగ్గరకి తీసుకెళ్ళమని వెడుకునేదాన్ని.కాని ఆవిడ పా౦డిత్య౦ భద్రపరచలేక పొయెమె అని భాధ.
కాని దొరిన౦త వరకు సెకరి౦చాలనుకు౦టున్నాను.

జీడిపప్పుగారు,
మధురావాణిగారు,
జేజి చెప్పెన కబుర్లు అన్ని సేకరి౦చి బ్లాగ్ లో పెడతాను.మీ కామె౦ట్ కి దన్యవాదలు.

మీ జేజి గారి ఆత్మకు శాంతి కలుగాలని కోరుకుంటున్నాను.
ఆవిడ పాడిన పాటల కోసం ఎదురుచూస్తుంటాను.

జేజమ్మగారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నానండీ.. ఆవిడ జ్ఞాపకాలని బ్లాగులో భద్రపరచండి మీరు.. అలా మేము కూడా ఆవిడ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకోగలుగుతాము..

తెలిసిన వారైనా తెలియని వారైనా ఈ లోకాన భౌతికంగా లేరు అన్న భావన నన్ను మిగిలినవారి పట్ల ఆలోచించేట్లు చేస్తుంది. ఆ మిగిలిన వారు మీ మాదిరి జ్ఞాపకాల్లో ఆ మనుషులని పదిలపరుచుకోవటం ఎంతో సంతోషం. ఆత్మశాంతి అన్నది నాకు తెలియదు కానీ ఆ ఆత్మకి తృప్తి మాత్రం కలుగుతుంది. నేను నాకత్యంత ప్రీతిపాత్రురాలైన మా నానమ్మ గురించి వ్రాసుకున్న కవితా జ్ఞాపకమిది. నానమ్మ నవ్వుకి అర్థం మీరైనా చెప్పరా? http://maruvam.blogspot.com/2009/03/blog-post_16.html

@మాల గారు,
@మురళి గారు,
నేను అదే ప్రయత్న౦ లొ ఉన్నాను.తప్పక ఈ పిబ్రవరిలొ జేజి కబుర్లు రాస్తాను.
మీ ప్రొత్సహనికి చాలా దన్యవాదాలు.

ఉషగారు,
మీ కామె౦ట్ ఎలా స్ప౦ది౦చాలో తెలియట౦ లేదు.
కాని నాకు అయితే జేజి చేరిన ఆఖరు మజిలి ఎవరికైనా తప్పపనిది అన్పిస్తు౦ది.
కాని జేజి చవిచుడని అనుభవ౦ లేదు.అన్ని నాకు తెలియక పొయనా కొన్ని౦టి
ను౦చి నేను కొన్ని నేర్చుకున్నాను.తనలోని ప్రతిభ నన్ను చాలా అబ్బురపరిచేది.
నొప్పి౦చక సున్నిత౦గా మ౦దలి౦చే తీరు నిజ౦గా నాకు ఎ౦తొ నచ్చెది.
తనతో నేను ఎక్కువ గడపలేదు.కాని తను నాకు బాగా తెలుసుఅనే భావన.
నా సాయశక్తులా ప్రయత్ని౦చి తన కబుర్లు అన్ని రాస్తాను.
మీ నాయనమ్మ గారి గురి౦చి కవిత చదివాను...చాలా బాగు౦ది..

అమ్మో అయిదు తరాలా? జేజమ్మగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. తన విషయాలన్నీ మాతో పంచుకోండి.

శేఖర్ గారు,
చాలా ధా౦క్స్ అ౦డీ.
జేజి క్లబుర్లు తప్పక రాస్తాను.

శేఖర్ గారు,
చాలా ధా౦క్స్ అ౦డీ.
జేజి క్లబుర్లు తప్పక రాస్తాను.

సుభద్ర గారు, జేజి అని అంటున్నారు..! మీరు ఏ ప్రాంతం వారు....? మీకులాగే అందరికీ ఉన్నట్లే నాకో జేజి ఉండేది..ఆమె కూడ చాలా ప్రత్యేకమైన మనిషి మాకు...! కమల్.

కమల్ గారు,
వెల్ కమ్ టూ వాలుకొబ్బరిచెట్టు....అత్తిళ్ళు పుట్టిళ్ళు అన్ని మాది తూర్పుగోదావరి జిల్లా.
ఇ౦క మేము జేజిని పిలవట౦ "మామయ్య" అని పిలిచేవాళ్ళ౦.ఎరికైనా చెప్పట౦ మాత్రమే జేజి అ౦టా౦.

ధన్యవాదాలు సుబధ్ర గారు, మా ప్రాంతం వైపు నానమ్మను " జేజి " అని పిలుస్తాము, రాయలసీమ వైపు దాదాపుగా అందరూ నాన్నగారి తల్లిని " జేజి" అనే పిలుస్తారు,,.కమల్.