పాము అని ఎవరి బుడతలు అనుకుంటున్నారా !!మా పిల్లలే నల్ల సూరి గాడు(సూర్య),తెల్ల సత్తిగాడు నేను" పాముబాబోయి""అంటానికి కారణం నా పిల్ల లాంటి మా ఇన్ డోర్ ప్లాంట్స్ చూసారు గా!!సరే అయితే రండి తరువాత బొమ్మకి చెపుతా పాము స్టోరి .
పాము అని ఏమిటి మొక్కలు పాతడానికి రెడీ గా ఈ గమాల అనుకుంటున్నారా,వస్తున్నా అక్కడికే వస్తున్నా. చూసారుగా ఈ పాట్ ని ఇందులో మొక్క పాతక ఏదో కదులుతున్న అనుమానం వచ్చిందంట ఒక తెలిసిన ఆసామికి ,సర్లే
చూద్దాం అనుకుని ,అబ్బ రండి రెండో పోటోకి.........
ఒక రేకు లాంటి దానితో కదిపితే
ఏదో మెదులుతుందట!!!ఏంటా అని తేరిపారా చుస్తే ,,,,,,,,,,,,,,,,,,,,,,
చేతిలో కుండి వణికిందట...అదేమిటో
తెలియలేదా మీకు అయితే చూపిస్తా వెళ్ళదామా నెక్స్ట్ పోటోకి ........
అది బాబు సంగతి ,అవును మీరు చూస్తున్నది ప.పా..పా..ము.
పైగా ఒకటి కాదు రెండు పాపం పిల్లలు
అప్పటివరకు ఆ గమల వాళ్ల వంటింటి
కార్నర్ లో ఉందట...
రకరకాలు గా ఆలోచనలు దాడి చేసాయట!హౌ అనుకుంటున్నారా!
ఇంక నాలుగు ,ఐదు ఫోటోలు చూస్తూ చెప్పుకుందాం.
తెలిసిన ఆసామి అని చెప్పగా ,ఆయనకీ వాళ్ల అబ్బాయి ప్లాంట్ బర్త్ దే గిఫ్ట్ ఇచ్చాడట!వాళ్ళు కొన్నాళ్ళు కిచన్ కార్నర్ లో పెట్టి వాతవరణం అనుకులించాక బయట పెట్టి చూస్తే ఈ ఎపిసోడ్ జరిగింది...వాళ్లు ఉండేది చల్లని ప్రదేశం కనుక లోపల ఉండిపోయి ఉన్నాయి..వీళ్ళు ఇంట్లోకి తెచ్చేసరికి అవి హీటర్ వెదికి పిల్లలుగా మారాయి.. గో నెక్స్ట్ క్లిప్ కి .....
మరలా చూడండి ,అమ్మో పొడుగ్గానే ఉన్నాయి కదా !!!వాటి వయస్సు జస్ట్ ఒక వారం అట!! అసలు విషయం ఏమిటంటే అవి చాలా ప్రమాదకరం అయిన కాపర్ హెడ్ అనే రకమాట! నాకు అయితే కట్ల పాములా అనిపిస్తుంది. చిన్నపుడు విన్న కట్లపాము కరిస్తే పాము మీద ఉన్న అన్ని కట్లు సార్లు ఎక్కిళ్ళు వచ్చి మనిషి చనిపోతారని.
ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు భయ పడ్డానో .....మా ఆయన కి ఈ ఫోటోల మెయిల్ వచ్చింది.ఇంక అంతే నా ఇన్ డోర్ ప్లాంట్స్ అన్ని ఎండలో పడ్డాయి. పాపం అసలే వేసవి మాకు వేసవి నీళ్లు రెండు పూటలా పోస్తున్నా అమ్మ అమ్మ అమ్మ అని గుక్క పెట్టు ఏడుస్తున్నాయి. నీళ్లు పెడుతూ ఉరడిస్తున్నా.. ప్చ్.
స్వాగతం.. సుస్వాగతం
నాగురించి
వర్గాలు
- కథ (1)
- జేజి కబుర్లు (1)
- ట న్యూస్ ...(అట అ౦ట అ౦టూ విన్న) (2)
- నా మొదటి పోస్ట్ ఒచ్చ్ (1)
- నా సాహసాలు (11)
- నాకు తెలియదు ఇది ఏమిటో??? (2)
- నాస్పందన . (3)
- నేను నా గోల (8)
- నేను నా గోలా (15)
- పుల్ల పుల్ల గా కారం కారం గా అబ్బబ్బా (1)
- ప్రమదావనం (4)
- బొమ్మలు. (3)
- వాలుకోబ్బరిచెట్టు (4)
- శుభాకా౦క్షలు (6)
మిత్రులు
అప్పుడెప్పడో రాసినవి
కొత్త వాఖ్యలు
తెలుగు వెలుగులు
Labels:
నా సాహసాలు
Subscribe to:
Post Comments (Atom)
20 comments:
సుభద్ర గారు,
ఆ పాము ఎంత సేఫ్ ప్లేస్ చూసుకుందండీ...
మీ పిల్లలఫోటో లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ చాలా చక్కగా ఉన్నాయండీ. ఇండోర్ ప్లాంట్స్ గురించి ఏమైనా విషయాలు చెబుతారా ....నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ వాటిని ఎలా ఉంచాలో, ఏవి తీసుకోవాలో తెలియదు. దయచేసి కాస్తా చెప్పండి.
అయ్య బాబోయ్ ! పొద్దున పొద్దున్నే ఎంత వణికించారండీ ! పైగా వాటికి ఫొటోలూ !
అసలే నాకు పాములంటే చచ్చేంత భయ్యం .ఇక ఇవి ఇప్పట్లో నన్ను వదలవ్ !
మీ పిల్లలు, మీ ఇల్లూ చాలా సూపర్. కోనసీమ ని అక్కడకే తీసుకెళ్ళినట్టున్నారు.
చాలా బాగా రాశారు.. చివరి వరకూ సస్పెన్స్ మైంటైన్ చేస్తూ..
ఇలా ఐతే ఎలాగండి. ఇంక ఇళ్ళల్లో మొక్కలు పెట్టుకోలేమా! భయం వేస్తోంది. మా ఫ్లాట్ లో మొక్కలు ఎక్కడ పెట్టాలండి బాబు. ఐనా సస్పెన్స్ అదిరింది.
నువ్వు చేపిన్న తీరూ చూస్తే ఎర్ర సత్తి గాడో నల్ల సూరి గాడో సాహసం చేసి అమ్మ ఇదిగో పాము అని అన్నారేమో అని అనుకునా.
@శేఖర్ గారు,
థ్యా౦క్స్ అ౦డి.పాప౦ అవి మాత్ర౦ ఎక్కదికి పొతాయి.మనమా చుస్తే వదల౦.
@maalaagaaru,
అవున౦డి నాకు మొక్కల౦టే ప్రాణ౦...మీకు కొనసీమా ని తలపిస్తే నేను చాలా హ్యపి.
మీకు పాములు భయమా,అయ్యొ నాకు తెలియదె సరే మరి మొక్కలోకి వెళ్ళినడు జాగ్రర్త..
@ muraligaaru,
చాలా థ్యా౦క్స్...ఒకలా చుస్తే మీరు రాసిన పొస్ట్ చుసి నేను ట్రై చెయలనుకున్న ,అది ఇప్పటికి అయ్యి౦ది.ఆ పొస్త్ పేరు గుర్తులెదు కాని అ౦దులో హిరొ డాక్టర్.
@జయ ,
నాకు ఒకసారి భయ౦ వెసి౦ది.
కాని నో ప్రొబ్ల౦,ఆ మొక్క ని వాళ్ళు బయట ను౦చి తెచ్చరు.
మీరు బయట ను౦చి తేచ్చెటప్పుడు జాగర్తగా ఉ౦డ౦డి.
థ్యా౦క్స్
@sunny,వాళ్ళు ఆ ఫొటొ చుసి మని౦టికి వస్తే నేను పట్టెసుకు౦టా౦ అ౦టున్నారు.టీ.వీ లో లా
సురిగాడు కబుర్లు వరకే కాని సత్తి గాడు పత్తు కున్న పట్టుకు౦టాడు.
సుభద్రగారూ,
నాకు ఇండోర్ ప్లేంట్స్ అంటే చాలా ఇష్టం. కాని మీ పోస్ట్ చూసాక ఇష్టం పోయి భయం మొదలైంది. అంతా కళ్ళకు కట్టినట్లు రాసారు, చూపించారు. హాట్సాఫ్..
థ్యా౦క్స్ లలిత,
కాని భయపడక౦డి.వాళ్ళు అ౦టే బయట ను౦చి మొక్క తెఛ్చి పెట్టుకున్నారు.
అక్కడ వాతవరణ౦ వల్ల అలా అయ్యి౦ది.కొ౦చ౦ జగ్రత్త తిసుకు౦టె మన౦
పె౦చిన మొక్క చెప్పలేని ఆన౦ద౦ ఇస్తు౦ది.
బాబోయ్ నాకు పాములంటే చాలాభయం టైటిల్ చూసి రాకూడదనుకుంటూనే వచ్చాను ...ఒళ్ళు జలదరించిందండీ బాబూ !
అబ్బ సుభద్ర ఎంత భయ పెట్టేరు అ ఫోటో లేమిటి అండి బాబు. నాకు మొన్నీ మధ్య పుట్టిన రోజు గిఫ్ట్ గా నా ఫ్రెండ్ బోన్సాయ్ మొక్క ఇచ్చింది ఇప్పుడు భయం వేస్తోంది అది ఇంట్లో వుంచాలి అంటే.. నాకు అసలే పాములంటే చాలా భయం... వోరి దేవుడా అనవసరం గా చదివేనే ఈ సుభద్ర పోస్ట్.. వా ..వా .. వా.. మా వూరి వైపు విషపు పాములుండవంటారు మరి ఈ చలికి...... అదొక్కటే కుంచం ధైర్యం...
మీ పోస్ట్ లు అన్నీ ఇప్పుడే చదివాను ..చాలా బాగా రాస్తున్నారు హూం నేను నా పోస్ట్లు తగ్గించుకోవాలి లేకపోతే మంచి మంచి పోస్ట్లను చదవడం మిస్ అయిపోతున్నాను :) అన్నట్లు చెప్పడం మర్చిపోయా నాకు పాములంటే చాలా..లా ..లా భయం
@పరిమళ౦ గారు,
చాలా థ్యా౦క్స్ అ౦డోయ్!రాకుడదనుకు౦టూనే వచ్చిన౦దుకు.....
కాని పాములు మన౦ ఎమి చెయకపొతె వాటి దారిన అవి వెళ్ళిపొతాయి.
మన ఎనిమల్ ప్లానెట్ వాళ్ళు చుపిస్తారు గా!
అయినా మీరు ఎలా స్ప౦దిచినా నాకు భావన౦దమే భయయని ఒక రుపు ఇవ్వ౦డి.
హి హి హ్హి హ్హి హి హ్హి ........
భవనా,
అబ్బ బొనిసాయ........ఉహు ఉహు..నీకు చాలా ప్యార్ అద౦టే.
కాని మాకు చాలా రెటు ఇక్కడ,ఇ౦డియ లో ఆ సరద తిర్చుకు౦దా౦ అని వాయిదా వెసాను.అది ఎదో అలా జరిగి౦దీ అస్తమాను జరుగుతు౦దె౦టి!
ఒకసారి ఎక్స్ రె కళ్ళ తో చెక్ చెసి ,ఎ౦జాయ్....మొక్కల తో అనుభ౦ధ౦ లో ఉన్న ఆన౦ద౦
అనుభవిస్తేనే తెలిసేది.మీ బొనసాయ్ కి నా హయ్ చెప్పరు ప్లీజ్.....
నేస్త౦ గారు,
చాలా థ్యా౦క్స్.....కాని మీరు పొస్ట్ లు తగ్గి౦చక౦డి,
నాకు పాముల౦టె భయ౦ లేదు,మన౦ ఎమి చేయక వెళ్ళి పొయేదారి ఇస్తే వాటి దారిన అవి వెల్లి పొతాయి.నేను చాలా సార్లు చుసా.నా చిన్నప్పుడు పాము వస్తే మా ఇ౦ట్లో చ౦పేసేవాళ్ళు.టి.వీ ల పుణ్యమా అని కొ౦త ఎవెరినేస్ వచ్చి౦దీ.
నిజమో కాదో తెలియదు కాని ఎవరో నా చెయ్యి చూసి నాచెతి లో గరుడరేఖ ఉ౦దని
చెప్పారు.
అక్కోయ్ గరుడ రేఖ ఉందన్న విషయం మనకు తెలుసు, కాని పాములకు తెలియదు కదా?
@suresh,
నేను నమ్మను అనుకో౦డీ...అవును పాప౦ పాము కదా! తనేకే౦ తెలుసు మన చేతిలో ఎ౦ ఉ౦దో..
Post a Comment