వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..


Get this widget | Track details | eSnips Social DNA



జో అచ్యుతానంద జో జో ముకుందా

రావె పరమానంద రామగోవిందా..



నందునింటను జేరి నయము మీరంగ

చంద్రవదనలు నీకు సేవ చేయంగ.
నందముగ వారిండ్ల నాడుచుండంగ

మందలకు దొంగ మాముద్దురంగ.




పాలవారాశిలొ పవళించినావు

బాలుగా మునుల కభయమిచ్చినావు

మేలుగా వసుదేవు కుదయించినావు

బాలుడై యుండి గోపాలుడైనావు.




అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే

పట్టికోడలు మూతిపై రాసినాడే

అట్టె తినెనని యత్త యడుగవిన్నాడే

గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే.



గొల్లవారిండ్లకును గొట్బునకు బోయి

కొల్లలుగా త్రావి కుండలను నేయి

చెల్లునామగనాండ్ర జెలగి శాయి యీ

చిల్లతనములు జెల్లునట వోయి.



రేపల్లె సతులెల్ల గోపంబుతోను

గోపమ్మ మీ కొడుకు మా యిండ్లలోను

మాపుగానే వచ్చి మా మానములను

నీ పాపడే చెఱచె నేమందుమమ్మ.



ఒకనియాలిని దెచ్చి నొకని కడబెట్టి

జగడముల కలిపించి సతిపతుల బట్టి

పగలు నలుజాములును బాలుడైనట్టి

మగనాండ్ర జేపట్టి మదనుడై నట్టి.




అంగజుని గన్నమా యన్న యిటు రారా

బంగారు గిన్నెలో బాలు పోసెరా

దొంగనీవని సతులు పొంగుచున్నారా

ముంగిటనాడరా మోహనకారా.




గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి

కావరమున నున్న కంసుబడగొట్టి

నీవు మధురాపురము నేలజేపట్టి

ఠీవితో నేలిన దేవకీ పట్టి.



అంగుగా దాళ్ళపా కన్నయ్య చాల

శృంగార రచనగా జెప్పె నీ జోల

సంగతిగ సకల సంపదల నీవేళ

మంగళము తిరుపట్ల మదనగోపాల.



7 comments:

మంచిపాట..డౌన్లోడ్ కి ప్రయత్నిస్తున్నాను.. శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు..

పాట పూర్తిగా రాసారే... చిన్ని కన్నయ్య బజ్జున్నాడా....

మీక్కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు.!

బాగుంది సుభద్ర,
చూడండి మీరీ పాట పెట్టేరని క్రిష్ణయ్య కు సంతోషమేసినట్లు వుంది పైన మీ పిక్చర్ లో నవ్వుతున్నాడు. మీకు కూడా క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

మంచి పాట పెట్టారు.
కృష్ణాష్టమి శుభాకాంక్షలు .

@మురళిగారు,
@లలితగారు,
@మధురవాణిగారు,
@భవనాగారు,
@మాలాగారు,
చాలా చాలా థ్యా౦క్స్ అ౦డీ.
అ౦తా జ్యొతిగారి ఐడియా!సొ క్రెడిట్ అ౦తా వారికి హ్య౦డోవర్ చేస్తాను.

Nice.
But there is sufficient proof that this song was not by Annamayya. Not sure how and when it began to be circulated as Annamayya song.