వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఇవి ఏమి పువ్వులో చెప్పగాలారా ??? గుత్తులు గుత్తులు గా అదురుపాటుగా చుస్తే మల్లెలు లా ఉన్నాయికదా!!!ఇవి మునగా పువ్వులు.ఏమిటి కాయలు కాకు౦డానే కోసేసాను అంటారా!మరి అదేగా అసలు స్టొరీ.

ఇది మా పెరట్లోని మునగ చెట్టు.ఫుల్లుగా పువ్వులతో చూడటానికి భలే ఉంది కదా!!అందుకే మీకు చూపించాలని కెమెరా పట్టాను.చెట్టు మరీ గుబురుగా అయ్యి క్రింద మొక్కలకి నీడ అయ్యి పాదులు రావటం లేదు సో ఈ బొమ్మ తీసిన తరువాత చెట్టుకు కొమ్మలు కొట్టేశాం.ఆ పువ్వులు అన్ని కోశాను ,మా సాబ్ అడిగారు ఎం చేస్తావ్ ఆపువ్వులు మాల కట్టి పెట్టుకుంటావా అని?? ఫ్లవర్ వస్ లో నీళ్లు పోసి పెడతాను అన్నాను.హీ హ్హీ హ్హ!!!!!నాకు ఎలా అయినా ఆ పువ్వులు వాడీ మా సాబ్ తో శభాష్ అని అనిపించాలని సుబ్బమ్మ శభదం మనసులోనే పళ్ళు నురుకుని మరి చేసుకున్నా.ఒకవెల్ల ప్లాప్ అయితే టేషన్ ఉండదుగా.అప్పుడు నానమ్మ గుర్తువచ్చారు.కారణం మా నాన్నమ్మ గడ్డి ఇచ్చిన పచ్చడి చేసి లొట్టలు వేయ్యి౦చగలరు.సాబ్ ని బయటకి వెళ్ళనిచ్చి నాన్నమ్మకి ఫోన్ కలిపా!!నానమ్మని మునగాపువ్వుతో ఏమైనా వండోచా అని అడగానే మునగ ఆకు,మునగాపువ్వుతో అరడను వెరైటీలు చెప్పారు.నాకు మతిపోయింది.
అందులో ఒకటి పకోడీ ,.అరకప్పు శెనగ పిండి ,రెండు స్పూన్లు బియ్యం పిండి,మునగాకు,మునగపువ్వు,ఉల్లితరుగు,కారం,గరంమసాలా,ఉప్పు,అల్లం మిర్చి దంచినది.అన్ని కలిపి మాములుగా పకోడీల వేసి వెయ్యి౦చాలీ.

మర్నాడు టీ తో మా సాబ్ కి సర్వ్ చేసి ఇవి ఏమి పకోడిలో చెప్పుకోండి చూద్దాం,మీరు చెపితే నేను వెయ్యి ఇస్తా లేకపోతె మీరు నాకు వంద ఇవ్వండి అన్నాను.సరే అని రుచి చూస్తూనే సగం లాగించేసేసారు.కాని ఉల్లి పాయ పకోడిలానే ఉంది అన్నారు."లానే ""లాగా" కుదరదు ఏంటో చెప్పమన్నాను.సరే అని ఓటమి అంగీకరించారు.నా వందా దిరామ్స్ నా చేతిలో పెడితే చెపుతా అని ముక్కుపిండి వసువులు చేశాను.అసలు గుట్టు విప్పాను.అరె నాకు అనుమానం వచ్చింది.ఓ రాయి విసరాల్సిందే అని నాల్కరుచుకున్నారు.నేను పందెం గెలిసా!!!!
ఆ వందా ఇక్కడి తెలుగు అసోషియేషన్ వారి ఫ్లడ్ రిలీఫ్ ఫ౦డ్ కి ఇచ్చాసేను.ఇది మెప్పుకోసం కాదు ,నేను గెలుచున్న సొమ్ము ఇవ్వటం చాలా సంతృప్తి ఇచ్చింది.

31 comments:

great madam !! మరి పకోడీలు నాకేవి..?అలా బొమ్మలో ఆశ చూపెట్టి పెట్టకపోతే మీకు అరుగుతాయనే...

ఇలా ఫొటొలు పెట్టి మరీ మమ్మల్ని ఊరించడం ఎమీ బాలేదండి.. అసలే 100 దిరామ్స్ కాస్ట్..అందుకే ఇంకా రుచిగా కనిపిస్తున్నాయ్.
మీ నానమ్మ గారి ఫొన్ నంబర్ ఒసారి ఇద్దురూ ?

తృష్టగారోయ్,
మ౦చుపల్లకి గారోయ్,
నాల్గు రోజుల నాటి పకోడిలు ఏ౦ బాగు౦టాయి..మీరు దుబాయ్ ఎయిర్ పోర్ట్ ను౦చి ఓ పోన్ కొట్ట౦డి.నేను మా ఇ౦టికి తీసుకోచ్చి మా మునగ చెట్టు నీడలో పకోడితో మొదలు పెట్టి వనభోజన౦ చేద్దా౦ వచ్చే కార్తికమాస౦ లో సరేనా!!!
నాన్నమ్మ న౦బర్ కావాల సరే ఇస్తా అయితే నాకే౦టి?????

దేవుడా, చచ్చిపోతున్నాను నోరూరి! నాకు మల్లే మీరు కూడా పచ్చి మిరపకాయలు ఎక్కువే తగిలిస్తారనుకుంటా! మన్లో మన మాట మీదీ గుంటూరేనా సుభద్ర గారూ!

ఇవాళ మధ్యాహ్నమే పకోడీలు చేసెయ్యాలన్నంత టెంప్టింగ్ ఆ ఉంది ఫొటో! పైగా మా మునగ చెట్టు కూడా పూల భారంతో వంగిపోతోంది.

నాక్కూడా పకోడిలు కావాలి,నన్ను మర్చిపోకండి,మీ తీపి ఆమ్లెట్ try చేసాను,భలే వెరైటీ గా ఉంది,మునగపువ్వు దొరకదు కదా!!

very tempting, I will also try, only onion pakodi, not munaga puvvu pakodi :)

సుభద్ర గారూ, మీకు పుణ్యం ఉంటుంది. ఆ అరడజను వంటకాల రిసీప్లు ఇవ్వండి. ప్లీజ్. ఇక్కడ మా రువాండాలో రొడ్డు పక్కన పెరిగిపోతాయి ములక్కాడ మొక్కలు. నాకు కాడలతో చేసే కూరలు, సాంబారు మాత్రమే తెలుసండీ. ఆకులు, పువ్వులతో ఏం చెయ్యాలో తెలీదు. దయచేసి చెప్పండి. నేను యెదురు చూస్తూ ఉంటాను.

సుభద్రా అర్జెంట్గా ములగాకుతో అరడజను వంటలు ఫొటొస్ తో సహా ప్రచురించక పోతే నేనే కొత్త రెసిపీ తయారు చేసి మీరే నాకు పంపారనీ చెప్పి నా బ్లాగ్ లో ప్రచురిస్తా :)

అమ్మ సుభద్రా,

మా అందరికీ అందంగా చూపించి, ఎంచక్కా ఆశ పెట్టి అందకుండా ఊరించడం ఏమైనా బాగుందా? ఈ రాత్రి నీ కల్లో కొచ్చి, మీ మునగ చెట్టెక్కి కూచుంటా. ..(పడిపోతే నీదే బాధ్యత)..

బావను ఓడించడంలో సరదా,చిలిపితనం ఒక వైపూ, దయార్దహృదయం తో వరద బాదితులను ఆదుకోవడం మరో వైపు.మా అక్క ఏది చేసినా వెరైటీనే.. కానీ నాకు మాత్రం పకోడీలు పంపలేదు :(

బాగున్నాయండి మీ మునగపువ్వు పకోడీలు.

సుజతగారు,
మీకు నా వ౦ట అ౦తగా నోరురి౦చిన౦దుకు ఆన౦ద౦ తో తబ్బిఉబ్బి అవుతూ మీకు ఎప్పుడైనా వెల్ కమ్ ర౦డీ మా ఊరు.వేడి వేడి పకోడీలు చేసి పెడతా!!!అన్నట్లు మాది తు"గో"జిల్లా అ౦డోయ్!!!!
నీహారిక,
మునగాకు,పువ్వు కావాల౦టే మరి ము౦దుగా చెప్పి ఉ౦డోచ్చుగా నేను ఎయిర్ మైల్ లో ప౦పేదాన్ని.పోస్ట్ ఖర్చులు అదన౦..లేదు మీరు మా ఇ౦టికి వస్తాన౦టే అన్ని ప్రీ..మరి ఆలోచి౦చుకో౦డి.

పకోడీలు నోరూరుతున్నాయ్ ......మా ఇంట్లో మునగ పువ్వుతో కూరచేస్తాం. ( వుల్లితరుగూ , ములగపువ్వూ, తాలింపూ, మసాలాపొడి , అంతే)
సుజాతగారూ ఇది అన్యాయమండీ ...పకోడీలు కావాలంటే పట్టుకుపొండికానీ , సుభద్రని గుంటూరు సంఘంలో కలిపేసుకుంటానంటే ఒప్పుకోం. తను నిఖార్సయిన తూ.గో.జి పిల్ల.

స్వర్ణగారు,
తప్పకు౦డా అన్ని వేరైటిలు రాస్తాను.నాన్నమ్మ కి మీర౦తా ఇలా అడిగారని చెపితే పొ౦గిపోతారు.
నేస్తమా,
అ౦త పని చెయ్యెద్దు..మా నేస్త౦ కదు!!!తప్పక అన్ని మళ్ళి టపాయిస్తా అని వాగ్దన౦ చెస్తూన్నా...

బాగున్నాయండి మీ పకోడీలు. పోన్లెండి తిన్నాననుకొని త్రుప్తి పడతాలెండి. ఒంటల పోటీల్లో మీ పకోడీలు ప్రధమ బహుమతి పొందటం మాత్రం తధ్యం. దిస్ఠి తగలకుండా తొందరగా అ గిన్నె లోపల దాచిపెట్టేసుకోండి.

అంతే .. అంతే.. మా Godavari girls rock :-)

మీ మునగ వంటకాలకు... అబ్బ ! ఏం ఫాలోయింగ్ !! కోనసీమ పరువు నిలబెట్టారు. అభినందనలు.

శ్రీలలిత గారు,
సరే అయితే ఎక్క౦డీ ఎక్కి ఓ కేక వేయ్య౦డీ!!!పైన ఉన్న నాల్గు మునకాడలు అ౦దక చస్తూన్నా.మరి పడట౦ అ౦టారా!!!మీరు ప్రాణానికి నా ప్రాణ౦ అడ్డు...మాలాగారు వి౦టున్నారా!!!!హిహ్హిహ్హిహ్హహ్హ....
సునీతగారు,
చాలా చాలా ధ్యా౦క్స్ అ౦డీ.

సురేష్,
కొ౦చ౦ నన్ను క్రి౦దకు ది౦చవా???భయ౦ వేస్తు౦ది..అసలే మునగచెట్టు అర్బక౦ అ౦టారు.ధ్యా౦క్స్..

@లలితక్క,
థ్యా౦క్స్..ఇ౦క చాలా రోజులకి మీ దర్శన౦ అయ్యి౦ది.అవును మీరు చెప్పిన కురా కూడా నాన్నమ్మ చెప్పారు.ఈ సారి మునగపువ్వు పకోడీ ట్రయ్ చెయ్య౦డీ!!నాది హామీ మీ అత్తగారు మిమ్మల్నే కుర్చోబెట్టి తినిపి౦చరు.ఎ౦దుక౦టే మునగపువ్వు పకోడీ హీట్ ఫార్ములానే..
@జయగారు,
మరి అలా ఉత్తుత్తిగా తృప్తి పడట౦ ఎ౦దుకు ర౦డీ చేసిపెడతా!!!నిజమే న౦డోయ్ మీ అన్న పోటి మాట ఆలోచి౦చదగ్గదే!!!గిన్నె కడిగేసి మరి దాచేశాను.

మ౦చుపల్లకి గారు,
రాక్స్.........అబ్బ బాగు౦ది.
యస్.ఆర్.రావుగారు,
స్వాగత౦ అ౦డీ వాలుకొబ్బరిచెట్టుకి..
ద్యన్యవాదాలు ,మీ కామె౦ట్ చదువుతు౦టే చిటికెడు గర్వ౦ గా ఉ౦ది.

మునగపువ్వు పకోడి సంగతి తరువాత మాట్లాడుతా !
నేను లేకుండా చూసి నా డైలాగ్ వాడేసుకొని , పైగా వింటున్నారా ? అని కవ్విస్తారా ? ఆయ్
టికెట్ , వీసా పంపించండి , వచ్చి ముందుగా మీకో జెల్లకాయ్ ఇచ్చి ఆపై మీరు పెట్టే మీ రుచికరమైన ,అద్బుతమైన ,మీ రకరకాల వంటలన్నీ లాగిస్తాం ,నేనూ , మావారు . అసలే ఎవరు పిలుస్తారా వెళుదామా అని ఎదురు చూస్తున్నాను !

subhadragaaru,
this is the link you wanted...

http://www.youtube.com/watch?v=CWnvNpyV7YQ

u can see more vedios in this utube page.

వంటకం, చివరి వాక్యం ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి.. తూగోజీ వాడిని ఐనందుకు మరోసారి గర్వపడుతున్నా...

అబ్బో మీ తూగోజీవాళ్ళు మంచోళ్ళే... బలే చేసేరు పకోడీలు,
మీ అందరిని చూస్తుంటే కుళ్ళొచ్చేస్తోందిరా దేవుడా, ఈ చలి దేశం లో అందులో ఈ చలి రాష్ట్రం లో, అందులోను ఈ చల్లటీ చలి టౌన్ లో నా బతుకు ఇలా మునగాకు, పువ్వు ఫోటో లు చూసుకోవటమే కదా మిగిలింది.. వా.. వా. వా.. ఎవరక్కడ మా గుంటూరోళ్ళున్నారా నాలు పచ్చిమిరపకాయలు ఎక్కువేసి కూసింత పకోడీలన్నా చేసి ఫొటో పెట్టమ్మా సునీత, సుజాత... వా.. వా...
పకడీలు నాకేవి అంటె ఈ సుభద్రమ్మ వనభోజనాలు దుబాయొచ్చెయ్యండీ అంటంది రా బాబోయ్... అందుకని ఇలా కళ్ళ నీళ్ళు కళ్ళలోనే దిగమింగుకుంటూ ఈ సారికి సుభద్ర పకోడీలకు మరియూ 100 దీనర్ ల డొనేషన్ కు చప్పట్లోయ్ చప్పట్లు అని ఆపేస్తున్నా...

మాలగారోయ్,
మీ జల్లాకయ్ కి నేను రడీ.జనవరిలొ దుబాయ్ పెస్టివల్ ఉ౦ది అప్పుడు ర౦డి పతిసమేత౦ గా సరేనా!
తృష్టగారు,
ధ్యా౦క్స్ ...మావాళ్ళు చాలా చాలా ఎ౦జాయ్ చేసారు.

తృష్టగారు,
ధ్యా౦క్స్ ...మావాళ్ళు చాలా చాలా ఎ౦జాయ్ చేసారు.
మురళిగారు,
చాలా థ్యా౦క్స్...

భావన,
మమ్మల్ని మ౦చోళ్ళు అ౦టూనే మీ మ౦చితన౦ చూపి౦చేశారు.సరే కాని నేను మీ గు౦టూరివాళ్ళూ లానే మిర్చి ద౦డిగా వాడతాను కాని కోన్ని సార్లు.కొన్ని వ౦టల్లొ..
సరే కాని అ౦దరిక౦టే మీకే వైయా రావట౦ సులువు కదా ఈ సారి ర౦డీ మీకు మిర్చిబజ్జిలు వేసిపెడతా!!!!

చివరగా వచ్చాను ఇక నాకేం మిగిలాయి ? ప్లేటు అడుగున రజను కూడా మిగిల్చినట్టులేరు మన మిత్రులు :)

పరిమళ౦ గారు,
మీకు అడుగుబడుగు ఎ౦దుకు ఫ్రేష్ గా వేసి పెడతాను.. అవున౦డి మన మిత్రులు అ౦దరు ఎ౦జాయ్ చేశారు..

మీ బజ్జీలు, మిగత వంటలు, ఇంకా మీ పూల చెట్లు చూడటానికైనా రావాలనిపిస్తుంది ఇంకెంత ఇంకో రెండేళ్ళు మా అబ్బాయి కాలేజ్ కు వెళతాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి యాపీ యాపీ.. అప్పటికి ఇంకా కొన్ని కొత్త వంటలు కూడా పెరుగుతాయేమో కదా.. అబ్బ తలుచుకుంటే నోరు వూరుతోంది...