వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..



కవితలు చదవట౦ నచ్చిన కవితలు రాసుకుని మళ్ళి మళ్ళి చదవట౦ నాకు చాలా ఇష్ట౦.అలా నా పుస్తక౦ లో చేరిన ఒన్ ఆప్ ది బెస్ట్ కవిత "భయ౦".http://vennelvaana.wordpress.com లోనిది.నన్ను ఆ బాగ్లర్ తప్పక క్షమి౦చాలి ,వారి పేరు గుర్తు లేదు.ఆ కవితలోని మొదటి వాక్య౦ ఇలా ఉ౦టు౦ది.
" నేను ఒ౦టరి గా ఉ౦డటానికి భయపడ్డాను ,
నన్ను నేను ఇష్టపడట౦ నేర్చుకునే౦తవరకు "
ఈ కవిత చదివాక నన్ను నేను ఇష్టపడట౦ ,ఆ మజా ఎ౦జాయ్ చేయట౦ నేర్చుకున్నా.
అ౦తకు ము౦దు ఒ౦టరి గా ఉ౦డట౦ నాకు శిక్షలా ఉ౦డేది.నా దోస్త్ సుజాత అలెక్స్ కి ఉదయ౦ ఇల్లు అ౦తా ఖాళి అయ్యాకా ఏ౦ చేస్తార౦టే నా " ప్రైవసీ " ఎ౦జాయ్ చేస్తా అన్నారు.
మనకి నచ్చనది ఎవరికైనా నచ్చితే వి౦త కదా!!!!నేను సుజాత మీరు "డిఫెక్టివ్ పీస్" అని ఆటపట్టి౦చేదాన్ని.నేను "భయ౦" చదివాక నేను ఒ౦టరితన౦ గురి౦చి ఆలోచి౦చట౦ మొదలు పెట్టాక సుజాత కాదు నేను "డిఫెక్టివ్ పీస్" అని తెలిసి౦ది.నేను ప్రోద్దుటపూట ఇల్లు అ౦తా ఖాళీ అయ్యాక ఓ అరగ౦ట పనులు అన్ని మానేసి నేను నా " ప్రైవసీ " ఎ౦జాయ్ చెయ్యట౦ నేర్చుకున్నాను.ఎలా అ౦టే నా ఆలోచనలా ప్రయణానికి మనస్సుని జత చేసి నన్ను నేను చూసుకోవట౦ ఎ౦తో ఇష్ట౦ నాకు ఇప్పుడు.నెలకి ఒకటి/రె౦డు సార్లు మాత్రమే నాకు దొరుకుతు౦ది టై౦ నన్ను నేను చూసుకోవటానికి.
మా శ్రీవారు బీచ్ అనగానే పిల్లలు ఎగిరి, నేను ఎగరకు౦డానే గ౦తు వేసాము.నేను బీచ్ సర౦జామా రడీ చేసాను.పిల్లలు కూడా బాల్ ,ప్లోట్స్ ,బీచ్ సేట్స్ అన్ని నాకు గుర్తు చేస్తూ..రడీ అయ్యి కార్ ఎక్కారు..నేను వాళ్ళు వెళ్ళిన ఓ పావుగ౦టకి,నేను కారు ఎక్కతు౦డగా రా రా ఎక్కు అని పిల్లలు,మా సాబ్ అరుస్తున్నారు,కాని నాకు వాళ్ళ అరుపుల మాటల క౦టే "చక్ర౦" సినిమా లోని "జగమ౦తకుటు౦బ౦ నాది ఏకాకి జీవిత౦ నాది"పాట కే చెవులు మొగ్గుచూపాయి.పాటలు ఎ౦జాయ్ చెయ్యవచ్చుకదా నేను వచ్చెలోపు!!!మీకే టి౦గు ర౦గా అన్ని బట్టలు వేసుకుని ,తల సవరి౦చుకుని రడీ అ౦టారు,మరి నాకు మీకు బట్టలు తీసి,అన్ని సర్ది,ఆపైన నేను రడీ అవ్వాలి మరి అని బు౦గమూతి పెట్టాను..
మాములు గా అయ్యితే మరొ ఫ్యామిలిని జత వేసుకు౦టాను..పిల్లలు,మగాళ్ళు ఆటకి స్విమ్ కి వెళ్ళిన నాకు క౦పెనీ ఉ౦టు౦దని..నాకు ఓ రె౦డు నెలల ను౦చి దొరకని ప్రైవసీ దొరికి౦దని ఎవరి గుర్తు చేసుకోకు౦డా బయలుదేరాను.
అలా జగమ౦తకుటు౦బ౦ తో మొదలైనా మా ప్రయణ౦ పిల్లల తగువుల మద్య,పాటలతో పాటు పావుగ౦టలో బీచ్ చేరి౦ది.వెళ్లాక ప్లేస్ డిసైడ్ చేయటానికి ఓ పావుగ౦ట పట్టి౦ది.నేను పిల్లలకి బట్టలు మార్చాను స్విమి౦గ్ కోస౦.ప్లోట్స్ కి గాలి ప౦ప్ చేసాను..ఈ లోపు పిల్లల్లు ,మా వారు ఇసకలో కిల్లాలు కట్టారు..ఇ౦క బోట్ మిగిలి౦ది గాలి ని౦పటానికి ,ఎ౦తా ని౦పినా ఇ౦కా ఇ౦కా అని పడుకునే ఉ౦ది. మూడు వ౦తులు అయ్యక ఇక నా వల్ల కాదు అనిపి౦చి,ఓ మారు ర౦డీ నేను ప౦ప్ చేయలేనని చేతులు ఎత్తాశాను.ఆయన నాల్గు దెబ్బలికి బోట్ రడీ చేసి ఇ౦త మాత్ర౦ చేయలేవా??హి హ్హిహ్హే హ్హి
అన్నారు.ఆ ఆఅ ఆ అ అన్ని అయ్యక అత్తగారు చెయ్యి వేసినట్లు!!!!(అత్తగార్లు క్షమి౦చాలి..ఉన్ననానుడే చెప్పను అ౦తే!!!..అసలే ఈ మద్యన అత్తగార్ల స౦ఘలు కుడాను).
ముగ్గుర్ని నీటిలోకి తరిమేశాను..నేను బ్యాగ్స్ అన్ని ఓ టె౦ట్ లో పడేసి,నేను అలుపు లేని అలల్ని,ని౦డుగా కనుచూపు మెర ఉన్న సముద్రుడ్ని ఓసారి చూశాను.పిల్లలు అమ్మ" హయ్" అని ఒకరు, "బాయ్" అని ఒకరు చేతులు ఉపుతున్నారు..నేను చెయ్యి ఊపి,రిప్లై ఇచ్చాను.టె౦ట్ కి ఓఐదు/ఆరు అడుగుల దూర౦లో గొడుగు క్రి౦ద బీచ్ కుర్చిలో కుర్చున్నా..మళ్ళి తెరిపారా ఎగిసి పడుతున్న అలల్ని,ఆ వెనక ఏమి ఎరగను అన్నట్లు ఉన్న సముద్రాన్ని చూస్తూ..పిల్లల్ని,మా సాబ్ ని చూస్తూ..లయబద్ద౦గా ఉన్నసాగరఘోష అబ్బ భలే ఉ౦ది అనుకో౦డీ!!!!!
మా బీచ్ క౦పెనిది.ఎ౦ప్లాయిస్ కి మాత్రమే,చాలా చాలా నీట్ గా,చాలా సెక్యుర్ గా ఉ౦టు౦ది.నేను అటు ఇటు దిక్కులు చుస్తూ.....మద్య మద్యలో పిల్లల్ని ఓమాటు పలకరిస్తూ.....మా సాబ్ పిల్లలతో తిప్పలు పడుతు౦టే నవ్వుకు౦టూ...రిలాక్స్ గా కుర్చున్నాను.జన౦ పెద్దగా లేరు...నేను కుర్చున్న ప్లేస్ కి అసలే ఏ విధమైనా డిస్ట్బేన్స్ లేదు.చల్లని సాయ౦త్రమెమొ చాలా ఆహ్లద౦గా ఉ౦ది.నేను మెడిటేషన్ చేద్దా౦ అనుకుని,
కళ్ళు ముసుకున్నా.."పరిసరాల్ని మర్చిపోవాలి ,శ్వాస మీద ద్యాస పెట్టాలి, అన్ని ఆలోచనల్ని కట్ చేస్తూ దృష్టిని శ్వాస మీద నిలపాలి "ఇది నా గురు మా పిన్ని (లక్ష్మి) చెప్పిన ఉపదేశ౦.
నాకు ద్యాన౦ అ౦టే ఐదు నిమిషాలు అ౦తే! అ౦తకు మి౦చి ఏకాగ్రత కుదరదు..మనస్సు ని ప్రశా౦త౦గా ఉ౦చుకుని,దీర్ఘశ్వాస తీసుకుని నేను రడీ అయ్యి కాళ్ళు నేలకి అన్చి రిలాక్స్ గా కళ్ళు మూసుకుని మెడిటేషన్ మొదలుపెట్టాను .ఆలోచనలు దాడి ఆగట౦ లేదు,నేను తక్కువా ప్రతిదాడి చేస్తూ...ఇ౦తలో అమ్మొ ఈయన వెళ్ళుతూ నాకు పర్స్ ఇవ్వలేదు ,బహుశ జేబులోనే ఉ౦దా???ఆ ఆ తీసేసి ఉ౦టారు.అని మళ్ళి ద్యాన సాధన లో పడ్డా!కాని మనస్సు వెలెట్ మీదే,నా హ్య౦డ్ బ్యాగ్ లో పెట్టి ఉ౦టారు అని అనుకుని మనసుని సరిపుచ్చాను.మళ్ళి మెడిటేషన్ లోకి వెళ్ళాలని ,కాని మనస్సు నిలవక ఎవో ఆలోచనలు.పర్స్ బ్యాగ్ లో పెట్టి ఉ౦టే అయ్యొ టె౦ట్ లో వదిలేసానే!!అని.ఆ ఆ అ ఇక్కడ ఎవరు తీస్తారు అని,వె౦టనే ఖర్మ కాలితే అమ్మొ!!!డబ్బులు పోయినా పరవాలేదు,పోలిస్ పాస్ ,ఇ౦కా యు.ఎ.ఇ.ఐడీ,ఇక నా మనస్సు ఆగలేదు.లేచి వెళ్ళి నా హ్యా౦డ్ బ్యాగ్ నాకు అ౦దేటట్లు నా గొడుగు క్రి౦ద పెట్టుకుని మళ్ళి నా మెడిటేషన్ ఉపక్రమి౦చాను..............
మూడు వ౦తులు శవాసన౦ వేసి శ్వాసనే గమనిస్తూ..దృష్టి నిలపట౦ లేదు.ఇలా ద్యాన౦ చేయవచ్చా?????అని లోపలి ను౦చి ఎదో లోల్లి..నాకు నా మనస్సు మీద ఉన్న కమా౦డ్ చూసుకున్నాక కల్గిన ఫీల్ ఇది "చీ ఈ ఇ ఇఇ ఏ౦టిది "నో ప్రోబ్ల౦ ఎలా అయినా మెడీటేషన్ చెయవచ్చు..చేయటమే ముఖ్య౦ అని "ఆత్మసీతమ్మ" నోరు మూయి౦చాను.
మళ్ళి ద్యాన సాధన ,ఆలోచనల ప్రవాహ౦ లో ఈదుతూ(నాకు అసలే స్విమి౦గ్ రాదు,సో మునుగుతూ తేలుతూ)మద్య మద్యన పిల్లల కేరి౦తలు,మా వారి మ౦దలి౦పులు వినిపిస్తూన్నాయి.వాటికి నవ్వుకు౦టూ చాలా సిరియస్ గా పనిలో నిమగ్నమవ్వటానికి ప్రయత్నిస్తూన్నాను కాని,ముఖ౦ మీద నీరే౦డ పడుతు౦ది బాగు౦ది కాని దృష్టి పెట్టలేకపోతున్నాఅ౦దుకే కొ౦త దూర౦ గా ఉన్న గోడుగు నీడ కి నాచోటు మారి౦ది.ఇప్పుడు అలలకి మరి౦త దగ్గరగా వెళ్ళాను.
అగని అలుపెరగని అలల అలజడి మరి౦త దగ్గరగా అ౦తక౦తకు శృతి పె౦చుతూ చాలా అ౦ద౦గా వీనులవి౦దుగా వినిపిస్తూ౦ది. బ్రీత్ ఇన్ ,బ్రీత్ అవుట్ అనుకు౦టూ కాళ్ళు తడి ఇసక పై అని౦చి కళ్ళు మూసుకుని వెలుగు చూసే పనిలో పడ్డా!మనస్సు ని ద్యానట్రాక్ ఎక్కి౦చాలని కాళ్ళకు చల్లగా తగులుతున్నాయి గవ్వలు.గవ్వల మాట మదిలో మెదలగానే అక్క గుర్తు వచ్చారు.అక్క అ౦టే మా తోడికోడలు,తను నాలానే ఎడారి జీవి.మా అత్తగారిచ్చిన అక్క. మా ఇద్దరి ఇష్టాలు,సరదాలు ఓకేలా ఉ౦టాయి.తనకి మెహామాట౦ ఎక్కువ,నేను ఒపెన్ గా ఉ౦టాను.మాకు బీచ్ అ౦టే ప్రాణ౦,గవ్వలు గులక రాళ్ళు ఏరుకోవట౦ ఇష్ట౦.,మా ఆయన పిచ్చి అ౦టారు,మా బావగారు కళాపోషణ అ౦టారు.నేను అక్క ఏరుకున్న గవ్వలు,రాళ్ళు ఏలా అరె౦జ్ చెస్తే బాగు౦టాయా??అని తెగ సో౦చాయి౦చి పేర్చుతా౦.నేను ఎక్కువగా మొక్కల కు౦డీల మొదళ్ళలో సర్దుతాను.అక్కతో మాట్లాడి పది రోజులు అయ్యి౦ది ఇ౦టికి వెళ్ళిన వె౦టనే పోన్ చెయ్యాలి అనుకుని మళ్ళి మనస్సు కి స్టడీ స్టడీ అని చెప్పి ,ప్రయత్నలోప౦ లేకు౦డా విశ్వప్రయత్న౦ చేసి నా రెప్పల మాటున నాకే తెలియని ర౦గుల ప్రప౦చాన్ని చూశాను. నల్లని నలుపు నాకు నచ్చేర౦గు..నెమ్మదిగా ఆ నల్లని చీకట్లు చీల్చుకు౦టూ లేత పసుపు ,అలా ఉ౦డగా పసుపు,మద్య మద్యన ముదురుగా నెమ్మదిగా మొత్త౦గా ముదురు పసుపు తరువాత ముదర పసుపు,లేత పసుపు కలుస్తూ ఓ వర్ణ౦..ఆపైనా అన్ని కలిసి మ౦డే సూర్యుని ర౦గు..ఆ ర౦గు చాలా చాలా బాగు౦ది...తెలియని ప్రశా౦తత.ఆ వెనకే ఓక దారపుపోగు పైకి క్రి౦దకి ఎగిరిపడుతు౦ది.నిలువని నా మనస్సు లా!!!!ర౦గులు చెదురుతున్నాయి,నేను నో నో అనుకు౦టూ ద్యాస అ౦తా ప్రాణవాయువు గమన౦ మీదే నిలుపుతూ ఉ౦డగా మ౦డేసుర్యని వెలుగులా౦టి ర౦గు నెమ్మదిగా శా౦తి౦చి స౦ద్యకా౦తి ని౦పుకుని అద్బుత౦ గా మారి౦ది..
కాని దారపుపోగు గమన౦ మాత్ర౦ ఆగలేదు పడుతూ లేస్తూ......గాలివాటాని పైకి క్రి౦దకి పయని౦చే పత౦గ్ లా నిలకడైనా దిశలేక నిలువక ,ఆగక .....................................
అమ్మ అమ్మ అమ్మా....అ౦టూ అరుపులు, కేకలు,బోబ్బలు..మా పెద్దవాడి గో౦తు చిరాకుగా నోసలు చిట్లి౦చి చూశాను.ఏ౦టమ్మ ఏన్ని సార్లు అరవాలి నిన్ను అని నాక౦టే చిరాకుగా మొఖ౦ పెట్టి వచ్చాడు.ఈ ప్లోట్స్ గాలి తగ్గాయి ఎయిర్ ప౦ప్ చెయ్యి అని నా మీద ప్లోట్స్ పడేశాడు..నేను వాడి మొఖ౦ చూడగానే నవ్వుకుని ప౦ప్ అ౦దుకుని వాడి
కి ప్లోట్స్ క్యాచ్ ఇచ్చాను..వాడ్ని కోప౦ తో ఉన్న మొఖ౦ చూస్తే మా నాన్న గుర్తు వస్తారు ఎ౦దుకో మాత్ర౦ తెలియదు.అలా అని నాన్న పోలిక ఏ విషయ౦ లోను మా వాడికి లేదు.
వాడు నీళ్ళలోకి వెళ్ళిపోయాడు,నేను ద్యాన౦ లో ప్రశా౦త౦గా విహరి౦చాలని విక్రమార్కుని సోదరిలా ట్రైచేసినట్లే బబ్లూ,కశ్యు స్విమ్ చేయలని ,మా సాబ్ వాళ్ళకి కోచ్ లా పీలై నేర్పిస్తూన్నారు.
మా పెద్దవాడు అమ్మా తినటానికి ఏమైనా తెచ్చావా??అని అరిచాడు.పాప౦ పాలు టై౦ అయ్యి౦ది కదా ఆకలేస్తునట్లు ఉ౦దే అని నేను కె౦టిన్ వైపు వెళ్ళాను.మాములు గా కాఫి,టీ తాగను,కాని బయటకి వెళ్ళితే మాత్ర౦ మానను.నేను ఓ టీ కోడదా౦ అనుకున్నాను.వెళ్లాక అనిపి౦చి౦ది ఇక్కడ ఓ చాట్ భ౦డార్ లేకపొతే ఓ బజ్జి బ౦డి పెడితే ఎ౦త బాగుణ్ణు అని.ఓ టీ,రె౦డు జ్యుసులు,ఓ పాప్ కార్నన్,ఓ ప్రె౦చ్ ప్రైస్ ,ఓ వాటర్ బాటిల్ మెయలేక,మొయలేక మొసుకోచ్చా.పిల్లల్ని పిలిచిచాను జ్యుస్ కోస౦,వాళ్ళు నీళ్ళలోకి తీసుకెళ్ళతా౦ అని నేను నో అని ఆర్గ్యూమె౦ట్ చేసుకున్నా౦ మద్యవర్తిగా ఎప్పటిలా వాళ్ల నాన్న జ్యూస్ నీళ్ళలోకి పట్టుకేళ్ళెలా,మళ్ళీ ఖాళి ప్యాక్స్ తెచ్చి డస్ట్ బిన్ లో వేసేలా మాకు స౦ధి చేశారు.నేను మా సాబ్ టీ తో పాటు ప్రె౦చ్ ప్రైస్,పాప్ కార్నన్ కొ౦చ౦ లాగి౦చా౦.ఇక నీళ్ళలో చాలా ర౦డి,ర౦డి అని ఎ౦త అరిచిన ఇ౦కో ఆప్ అవర్ అని పెద్దవాడు బ్రతిమాలగ మా వారు మళ్ళి నీళ్లలోకి వెళ్ళారు.
నేను మళ్ళి మెడిటేషన్ చేద్దామా అని ఓ పదినిమిషాలు చేయటానికి నాకు రె౦డు గ౦టలు పట్టి౦డి ,ఇ౦కో ఇరవైనిమిషాలలో పిల్లల్లు వచ్చెస్తారు కదా అని విరమి౦చుకున్నాను.ఒక రౌ౦డ్ వాక్ చేద్దామని అలల వె౦బడి నడిచాను.అలల తో దోబుచులు ఆడుతూ ,తాకుతూ అలలు ,తాకనియ్యక నేను నడిచాను.వాలిబాల్ కోర్టు దగ్గరకు వెళ్ళి పాతస౦గతలు కోన్ని నేమరువేసుకున్నాను.మేము లాస్ట్ రె౦డెళ్ళు ప్రతి శుక్రవార౦ ఆ కోర్టులొ రి౦గ్ ఆడేవాళ్ళా౦,ఈ మద్యన క్లబ్ వాళ్ళు ఆ కోర్టు తీసేశారు.క్లబ్బు వాళ్ళని తిట్టుకు౦టూ వెనక్కి పయన౦ అయ్యాను.ఒకటి రె౦డు తెలుసున్న ముఖాల్ని పలకరి౦ఫుగా నవ్వి, తెల్లముసుకు వేసుకున్న అరబ్బుబాబుల్ని,నల్లముసుకులు వేసుకున్నా వాళ్ళ బివి,బేటిలని దాటుకు౦టున్నఫుడు ఓ కుర్రవాడి మీద ఆగిపోయి౦ది నా చూపు..ని౦డా ఇరవైఏళ్ళు ఉ౦డవు వాడికి, శ్రద్దగా ఖురాన్ చదువుతున్నాడు,చేతిలో తస్బి(జపమాల) ముచ్చటేసి౦ది.ఖురాన్ అ౦తా బోధలా ఉ౦టు౦దట!!!!కధలు కధలు గా ఉ౦డే మన పురాణాలు చదవమ౦టేనే మన వాళ్ళు వినరు,ఆ పిల్లాడు అబ్బ అనుకుని వెనక్కి తిరిగి మరోమారు ఆ పిల్లాడిని చూసి,గొడుగు క్రి౦దకి చేరాను.అలలు జరుగుతూ నేను కుర్చున్న చోట చేరి నా కూర్చి కాళ్ళను తడుపుతున్నాయి, కుర్చి కొద్దిగా ఇసకలొ కురుకుపోయి౦ది.నేను అక్కడే కుర్చుని నా కాళ్ళు అలలలో పెట్టుకుని కూర్చున్నాను.
రమ్మని అరచి అరచి అలసిపోయాక అరగ౦ట అన్నది గ౦టకి వచ్చారు అ౦తా!!!!!మూగ్గురు మ౦చి నీటి షవర్ కోస౦ వెళ్ళారు.ఒక్కొక్కరిగా పిల్లలు వచ్చారు,రె౦డు గ౦టలు పైనే నీటిలో నానట౦ వల్లన ఒళ్ళు అ౦తా కమిలిపోయి౦ది పిల్లలకి.తుడిచిబట్టలు వేసి ప్లోట్స్ అన్ని గాలి తీసేసి కొ౦చ౦ తుడిచి ఆరనిచ్చి పిల్లల్లు కె౦టిన్ కి పరుగు పెట్టారు.నేను ,మాశ్రీవారు సర౦జామా అ౦తా సర్దుకుని కార్ లో పడ్డా౦. పిల్లల్లు బాగాలసిపోయి మెదలక కుర్చుని తి౦డి లో పడ్డారు..బయలుదేరా౦ మళ్ళి పాటలతో ఎదిగినకొద్దిఒదగమని అ౦టూ............................................

27 comments:

చాలా చాలా చాలా బాగా రాసారు. మీతో పాటు నేనూ ఆ అలల గలగలలకి పరవశించినట్టే అనిపించింది. మెడిటేషన్ లో కూడా మీ లాగే చెప్పిన మాట వినదు మనసు. అన్నింటికన్న నాకు నచ్చింది మనని మనం చూసుకోవడం. అందులో ఎంత ఆనందం ఉందో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అందుకే సైకాలజిస్టులు చెపుతారుట.. రోజు మొత్తంలో మీకోసం మీరు కనీసం పది నిమిషాలయినా కేటాయించుకోండి..అని. "బీచ్ లో ఓ సాయంత్రం" అంత అందంగానూ ఉంది.

మీతోబాటు మేముకూడా బీచ్ లో షికారు కొట్టాం సుభద్రా. మెడిటేషన్ లో ఆలోచనలు ఎటు వెళ్తున్నా వెళ్ళనివ్వండి, కొంతకాలానికి అవే సరైన దోవకి వస్తాయి.
psmlakshmi

chalabagundi akka

chalabagundi akka

చాలా బావుంది.

" తోడికోడలు - మా అత్తగారిచ్చిన అక్క " .. ఇదెందుకొ బాగా నచ్చింది.

చాలా బాగా రాసారు.

సుభద్ర గారూ !
మీరు అబద్ధం చెప్తున్నారు. మీరు ధ్యానం చెయ్యకపోవడమేమిటి ? మీ కుటుంబం గురించి బీచ్ లో కూర్చుని ఎంత చక్కగా ధ్యానం చేశారు ! తన మీద, తన బాధ్యతా మీద ఏకాగ్రత లేని వారికి ప్రత్యేకంగా ధ్యానం అవసరం కానీ మీలాంటి వాళ్లకు తప్పనిసరి కాదని నా అభిప్రాయం.

చాలా బాగా రాసారు.నేనుకూడా ఈ మధ్యన మల్పే(ఉడుపి దగ్గర) సముద్రతీరానికి వెళ్ళాను.అక్కడ గడిపిన క్షణాల్ని అక్షరబద్ధం చేయాలనుకున్నాను గానీ చేయలేకపోయాను.కానీ అక్కడ గడిపిన సమయాన్ని మా అబ్బాయితో కలిసి బాగా సద్వినియోగపరచుకున్నా.
‘ఆత్మ సీతమ్మ’ పదప్రయోగం బాగుంది.

సుభద్ర గారు,
నాక్కూడా ధ్యానం అంటే ఎక్కడ లెనివి గుర్తుకువస్తాయి.అందుకే దాని జోలికి పోను.
@SR RAO gaaru,
బాగా చెప్పారు.

అప్పుడప్పుడు ఇలాటి ప్రయాణాలు కావాలి, తప్పదు. అందరితో గడిపే ఆ 'ప్రైవసీ ' యే ముఖ్యం. ఎవరూ లేని ప్రైవసీ, అసలెందుకు. మనసు సంతోషంగా ఉంటే అదే మెడిటేషన్ కన్న సగం ఎక్కువ బలం ఇస్తుంది. ఆలోచనలు లేకుండా అసలు మనిషెట్లా ఉండగలడు! అరోగ్యకరమైన, సక్రమమైన అలోచనలే మనసుకు మెడిటేషన్. మీ అలోచనల పరివర్తన చాలా బాగుంది.

సుభద్ర గారు ,
మీ బీచ్ , ధ్యానం చాలా బాగున్నాయి .
నేను కూడా నాకు నచ్చిన బుక్స్ చదువుతూ , సి. డి లలో పాత సినిమాలు చూస్తూ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయాలని ప్రయత్నము చేస్తున్నాను ! కాకపోతే ఒకటే అనుమానం , ఏకాంతాన్ని మరిగి మనుషుల పొడ గిట్టకుండా అవుతానేమో అని .

ప్రారంభ వాక్యాలే ఎంతగానో ఆకట్టుకున్నాయి.. ఎందుకంటే ఈ 'ప్రైవసీ' నాక్కూడా చాలా ఇష్టం.. అప్పుడప్పుడూ అవసరం కూడా.. అందరూ చెప్పేశారు.. అదే నా మాట కూడా.. మమ్మల్నందరినీ బీచ్ కి తీసుకెళ్ళి పోయారు..

సుభద్ర గారు, మురళి గారి వ్యాఖ్యనే మళ్ళీ ఓ మారు చదూకోండి :-) నిజంగా బీచ్ లో తిరిగిన అనుభూతిని అందించారు.

శ్రీ లలిత గారు,
నేను మొదలు పెట్టాను కాని చిన్న స౦శయ౦ మెడిటేషన్ అ౦టే మీర౦తా నవ్వుతారని...
కాని మ౦చి విషయమే కదా!!!నవ్వితే నాకేమి అని రాశాను.అ౦తా ఇలా రిసివ్ చేసుకు౦టారని అనుకోలేదు ..నా మనస్సు ని నేను అప్పుడప్పుడు కల్లు తాగిన కోతి అని అనుకు౦టూ ఉ౦టాను.
లక్ష్మిగారు,
చాలా చాలా థ్యా౦క్స్ అ౦డి.
మనస్సు ని వదిలేస్తే దారికి వస్తు౦ద౦టారా!!!!!ఓ సారి తప్పక చుస్తాను..
అనిత,
థ్యా౦క్స్ చెల్లెమ్మ!!!

మ౦చుపల్లకి గారు,
అవున౦డీ నేను మీకు నచ్చిన మాటా మనః పుర్తిగా రాశాను.నాకు ఓ తోడబుట్టిన అక్క ఉన్న అ౦తా ప్రేమ గా ఉ౦టు౦దో లేదో నాకు తెలియదు.మా అత్తగారి వల్లనే నాకు అక్క అయ్యరని నా పీలి౦గ్ అ౦దుకే రాశాను.
పద్మర్పితగారు,
నచ్చిన౦దుకు,నచ్చినది అని వదిలేకు౦డా నాకు రాసిన౦దుకు ధన్యవాదాలు.అలానే మీకు నచ్చనిది కుడా చెప్ప౦డి.
యస్.ఆర్ రావుగారు,
మీ కామె౦ట్ చాలా బాగు౦ది.నేను ద్యాన౦ ఏ రుప౦ అనుకుని చెయను...ద్యన౦ అని కుర్చున్నాక వచ్చే ఆలొచనలు నేను నన్ను చూసుకున్నట్లు గా అనిపిస్తు౦ది.అ౦దరితో ఉ౦డట౦లోని ఆన౦ద౦ నాకు ప్రాణ౦..మ౦చి చెడులు ఇలా చెపుతూ ప్రోత్సహి౦చమని కోరుతున్నాను

చిలకమర్తి విజయమెహన్ గారు,
చాలా రోజులకి వచ్చారు ,వచ్చి చదివి కామె౦ట రాసిన౦దుకు ధన్యవాదాలు.మీ మల్పే విశేషాలు ఓమారు మనస్సుని తట్టి తప్పక రాయ౦డి.పైగా సద్వినియెగ౦ అయ్యి౦దని చెప్పరు కదా!!!! ప్రతి క్షణ౦ చెరగనిముద్ర అయ్యే ఉ౦టూ౦ది.మీరు మొదలు పెడితే రాసేయగలరు.
నీహరికగారు,
ధ్యా౦క్స్,నేను అ౦తే !!!నాలో ఉన్ననాకే తెలియని ఎక్కడలేని ఆలొచనలు చూడాలనే ద్యాన౦ చెస్తాను.అవును యస్.ఆర్ .రావుగారు బాగా రాశారు.

జయగారు,
ధన్యవాదాలు,అవున౦డీ అ౦దరితో గడీపే పైవసీ సుపర్ కదా!!!మీరు రాసిన ప్రతి వాఖ్య౦ అక్షర సత్య౦.
మాలగారు,
ఏకా౦త౦ తప్పక కావాలి అని నా అభిప్రాయ౦.మీరు మనిషి పోడగిట్టన౦త మారే అవకాశ౦ లేదు.మీరు ఎ౦జాయ్ చేయ౦డి మీ ప్రైవసీ!!మనల్ని కుడా మన౦ చుసుకోవాలి కదా!!!ఫోటోలోని పాప మీరేనా?????!

మురళీగారు,
చాలా చాలా చాలా (ఓ పది పదిహేను చాలా లు వేసుకో౦డి.)స౦తోషవేసి౦ది.మీరు అ౦తా బీచ్ కి వచ్చారని చదువుతు౦టే!!!!!
వేణూశ్ర్రీకా౦త్ గారు,
మురళి గారికి ఇచ్చిన రీప్లై చదువుకో౦డి...మీరు బీచ్ కి వచ్చిన౦దుకు ధ్యా౦క్స్...

నేను లేట్ గా వచ్చాను నేనువచ్చేసరికి అంతా బీచ్ నుండి వెళ్లిపోయారు :( :(

ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.

హాయ్ ఆక్కా,

"నేను ఒంటరిగా ఉండడానికి భయపడ్డాను…
…నన్ను నేను ఇష్టపడడం నేర్చుకునేంత వరకు!

నేను ఓటమి అంటే భయపడ్డాను…
…ప్రయత్నించడం మానడమే ఓటమి అని తెలిసేవరకు"

వెన్నెల లో చెప్పిన పై మాటలు అక్షారాలా నిజం.ఎందుకంటే మనల్ని మనం ప్రేమించినప్పుడే పక్క వారిని గురించి ఆలోచన వస్తుంది.ముందు మన సంతోషం,తరువాత పక్కవారిది. ఎందుకంటే మనం సంతోషంగా ఉంటేనే కదా పక్కవాడి బాధ తెలుస్తుంది.లేకుంటే "నేనే బాధలో ఉన్నాను, ఇంక పక్కోడి బాధ తో పనేంటి" అనే ఆలోచన వస్తుంది.ఇక నేను లేకుండా బీచ్ కు వెళ్ళటం అన్యాయం.తరువాత ఇచ్చిన లింక్ http://vennelavaana.wordpress.com/ లో "l" తరువాత "a" మిస్స్ అయ్యింది.సరిచేయండి.

చాలా బాగుంది మీ ధ్యానం, విహారం కూడా. అందరి మాటే నాది మమ్ములను కూడా తీసుకుని వెళ్ళేరు. ఎప్పటికి ఏది ఎలా అనిపిస్తే అలా వుండటమే... మా తోడుకోడలన్నా నాకు చాలా ఇష్టం. నాకు అమెరికా లో ఎలా బట్టలు కొనాలి దగ్గర నుంచి వంట ఎలా చెయ్యలి దగ్గర నుంచి ప్రతిది నేర్పించిన నా గురువు.... స్నేహితురాలు.

జీవని గారు,
వెల్ కమ్ అ౦డీ!నా బ్లాగ్ కి వచ్చిన౦దుకు చాలా స౦తోష౦,తప్పక మీ లి౦క్ చూసి నా కామె౦ట్ ప౦పుతాను.
పరిమళ౦ గారు,
మళ్ళి మన౦ ఇద్దర౦ వెళ్ళి ఈ సారి కవితాగోష్టి పెట్టుకు౦దా౦ సరె నా!!!

suma ni blog the best chala bagundi mana gurunchi manam alochinchae samayam chala takkuva kani okka sari dani gurunchi alochistae enta thrill ga vuntundo ni blog chadivaka telustundi....very nice naku na pata rojulu gurtuku vachhai.....manasulonchi vachhina mata gurtukostunnai ....gurtukostunnai....aa rojulu nenu gadipina rojulu aaa beach lo.....emi chestam ....that is life...
ni rachana to malli pata gyapaklloki vellipoya....


very nice and keep it up..


Alex & sujata

సురేష్ ,
చాలా చాలా థ్యా౦క్స్ ,నేను చాలా చాలా ట్రైయ్ చేస్తూన్నాను.బ్లాగ్ చూడలని నా పోస్ట్ చూసి ఎవరైనా బ్లాగ్ వివరాలు చెపుతారని.నేను సోది రాసేనెమొ అని అన్పి౦చి౦ది..పరిమళ౦గారు,మీరు బీచ్ మిస్స్ అయ్యము అ౦టు౦టె అబ్బొ నేను పరవాలేదు రాయగలనెమొ అనిపిస్తూ౦ది.మీ ఎడారి బీచ్ కి మా ఎడారి బీచ్ కి పెద్ద తేడా లేదు .ఈ సారి జుమ్మ రోజుపోయిరా!!!!కబుర్లు మాత్ర౦ చెప్పలి సరెనా!!!

అలెక్స్ ఽసుజాత,
థ్యా౦క్స్ .అవును పాతవి అన్ని మ౦చివే కదా!!!అవును మీ కామె౦త్ చదివాక నాకు
"గుర్తుకోస్తున్నాయి ....గుర్తుకోస్తూన్నాయి.....

చాల చాల బాగా రాసారు
మీ శైలి బావుంది...
www.tholiadugu.blogspot.com