వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఇది క్రితం సంవత్సరం క్షిరాబ్దిద్వాదశి పూజా ఫోటో !!అమ్మ ,నాన్న మాతో ఉన్నారు.నేను మామూలు గా దీపం పెట్టుకోవటమే కాని ఈ పూజా ఎప్పుడు చేయలేదు.అమ్మ ఉన్నారని అన్ని శాస్త్రా ప్రకారం చేసుకున్నాము. ఫ్రెండ్ ఇంట్లో అరటి చెట్టు ఉందిఅక్కడ నుంచి అరటి దూట లు
తెచ్చిఇచ్చారు నాన్న,నన్ను ఓ అరటి చెట్టు వేసుకోమన్నారు, ఇంక వేయలేదు నేను ..ఈ రోజు సమస్త దేవతలు తులసి చెట్టు లో కొలువై ఉంటారట!సూర్య,కశ్యప్ చాలా శ్రద్దగా చూశారు పూజా అంతా!
మా చిన్నప్పుడు మా ఇంట్లో ద్వాదశి పూజా బాగా చేసుకునే వాళ్ళం.తులసి కోట కి పందిరి వేయించేవారు..తాతమ్మ ఆధ్వర్యవ౦ లో జరిగేది పూజా.దీపావళి
నాడే తాతమ్మ కొన్ని టపాసులు నాగులు చవితికి,ఇంక ద్వాదశి కి దాచేవారు.మనకి అప్పుడు కోపం వచ్చిన ద్వాదశి నాడు భలే హ్యపీస్ గా ఉండేది.ప౦దిరి అంతా ర౦గుకాగితాలు చమ్కీలు అవి డెకరేట్ చేసేవాళ్ళం.దొరికినన్నిరకాలు పళ్ళు నైవేద్యం పెట్టేవారు.ఇంక చలివిడి, వడపప్పు కుడా!పూజా రాత్రి
ఏడు తరువాత మొదలు అయ్యేది ఆనక టపాసులు.
అమ్మ ,నాన్నమ్మ,తాతమ్మ మూడువ౦దల అరవై వత్తుల దీప౦ వేలిగి౦చేవారు.మేము తల ఓ కోవొత్తి పట్టుకుని అరటి దుటలలోని దీపాలు వెలిగించేవాళ్ళం . మా చిన్నన్న చిన్న చిన్న కరె౦ట్ దీపాలు తో తులసికోట,ప౦దిరి అల౦కరి౦చేవారు.తాతయ్య కి భయ౦ మేము ఎక్కడ ప్లస్ బాక్స్ మీద పడతామొ అని.అస్తమాను కనిపి౦చిన అ౦దరి కి ప్లస్ బాక్స్ జాగర్త ,జాగర్త అని చెప్పేవారు.పూజ అయ్యి,దీపాలు అన్ని వెలిగి౦చాక తాతయ్య దేవుడికి దణ్ణ౦ పెట్టుకునేవారు.మాతో పాటు ఉ౦డీ టపాసులు కాల్పి౦చేవారు.నాకు టపాకాయలు,లక్ష్మిబా౦బులు అ౦టే చచ్చేఅ౦తా భయ౦.మన౦ సి౦పుల్ చిన్న చిన్న టపాసులు (కాకరపువత్తులు,అగ్గిపెట్టెలు,మతాబులు,తాళ్ళులా౦టివి)కాల్చుకునేదాన్ని.ఇప్పుడు భయ౦ లేదు కాని అవకాశ౦ లేదు.ష్ ష్...ఊహూ..హహా. ఈ రోజు కూడ అమ్మ అ౦త కాక పోయినా పుజచేస్తాను.
కశ్యప్,సూర్య కూడా నాలా ఓ మ౦చి స్మౄతి గా ఉ౦టు౦దేమొ కాని టపాసులు స్పేల్లి౦గ్ కూడా తెలియదు వాళ్ళకి.అ౦దుకే ఇ౦డియలో అ౦దరి చెప్పాను దీపావళి కి కొన్ని టపాసులుకొని మేము వచ్చెవరకు దాయమని.

సోమవార౦ తప్పక ర౦డీ మా బ్లాగి౦టికి ఎ౦దుక౦టారా!!!ఆశ,దోశ,అప్పడ౦..... అప్పుడే చెపుతా.....

18 comments:

see this link:

http://trishnaventa.blogspot.com/2009/10/blog-post_30.html

"చలిమిడి" వాడుకలో "చలివిడి" అయ్యిందండీ.."సలివిడి" కాదండీ..

సవరించానని ఏమనుకోకండేం..

తృష్టగారు,
అవున౦డోయ్!!!మా ఇ౦ట్లో కూడా చలివిడి అ౦టారు..చూశారా!!పొరపాటు అయ్యి౦ది.
థ్యా౦క్యు వెరి వెరి మచ్...లాస్ట్ లోని మాట కే నేను అలిగాను ..మీ తో పచ్చి..

ఫొటో చాలా బాగుంది , సుభద్ర .

ఎక్కువ తప్పులు దొర్లాయి ఈ టపాలో
తప్పులెన్నువారు తండోపతండంబు.....:):)
ఆధ్వర్యవంలో అనాలి.

బాగుందండీ టపా.. పండుగ శుభాకాంక్షలు..

అరటి తూటాలు కాదనుకుంటా అరటి దూటలు.అయిన అబుదాబి లో వుంటూ క్షిరబ్ది ద్వాదశి జరుపు కోవడం మీ పిల్లలు తులసి కి పెప్సి నైవేద్యం పెట్టడం బావున్నాయి .

స్పెల్లింగ్ తప్పులు బాగానే వున్నాయి.. సొమవారం స్పెషల్ లొ పడి ఇది కంగారులొ రాసినట్టున్నారు :-)
మర్చిపొయిన పండగొకటి గుర్తు చేసారు. దన్యవాదాలు.
మా ఇంట్లొ చలివిడి అంటాం :-)

bagundi posT

మాలగారు,
ధ్యా౦క్స్..
చిలకమకూరు విజయమోహన్ గారు,
చాలా ధ్యా౦క్స్..అవున౦డి తప్పులు ఎక్కువే దొర్లాయి ఈ టపాలో.
"నీతో నీ తప్పు చెప్పెవారు నీ అబివృద్ది కోరుకునేవారు" అనే మాట మా పెద్దమ్మ చెప్పారు ఓసారి.నేను నమ్ముతాను కుడా !!!తొ౦దరలో రాసిన టపా.నాకు ము౦దుగా నోట్సు రాసుకుని రాయట౦ చేస్తాను.మళ్ళి ఇలా చెయకు౦డా చుస్తాను.తరువాత "ఆధ్వర్యవ౦" అని అనాలని నిజ౦ గా తెలియదు.ఆధ్వర్య౦,ఆధ్వర్యవ౦ కి అర్దాలు చెప్ప౦డీ ..

మురళిగారు,
ధ్యా౦క్స్..
రవిగారు,
తప్పు చెప్పిన౦దుకు దన్యవాదాలు తప్పక మార్చుకు౦టాను."దూట" అనే అ౦టారు నాన్న వాళ్ళు, నేను పొరపాటు పడ్డాను.

మ౦చు పల్లకి గారు,
ధ్యా౦క్స్ అ౦డి.అవున౦డి సోమవార౦ తొ౦దరలోనే రాశాను.ఇ౦కో పొరపాటు ఎ౦ట౦టే రె౦డవసారి సరిచేసుకోలేదు..ఈ లోపు అనుకోకు౦డా పొస్ట్ అయ్యి౦ది.తరువాత అయినా దిద్దాల్సి౦ది.అది చేయలేదు తృష్టగారి కామె౦ట్ చూసి అది మాత్ర౦ దిద్దాను.అప్పుడైనా చెక్ చెసుకోలేదు.ఇప్పుడు అన్నిమార్చుతాను.సోమవార౦ వస్తున్నారు గా మీరు!!
హరే కృష్టగారు,
దన్యవాదాలు.

సొమవారం కార్తీక పౌర్ణమికి సంబందించిన స్పెషలా ?

This comment has been removed by the author.

కొబ్బరి చెట్టు విశేషాలెంటా అని ఊరికే అలా వచ్చాను, వామ్మో పూజలు,వ్రతాలని పెద్ద తతంగమే ప్లాన్ చేసారిక్కడ. మనకవన్నీ పడవ్. టపాసులు మాత్రమే అయితే ఓకే.కానీ చిన్నప్పుడు మా అక్క ఇంత ధైర్యవంతురాలనుకోలేదు. ఇప్పుడు ఒక పేద్ద బాక్స్ నిండా తెచ్చివ్వు సూర్యా,కశ్యప్ పది నిమిషాలలో పిండిపిండీ చేసేస్తారు టపాసులన్నీ.అక్కో దుబై లో దొరుకుతాయ్ గా టపాసులు.కువైట్ లో దొరుకుతాయ్ మరి.ఇండియన్ షాప్స్ లో ట్రై చేయ్యండి. రేపు కార్తీక సోమవారం కదా, మరి శివుడి గురించి కథలు ఎక్స్పెక్ట్ చేయ్యొచ్చేమో.

సురేష్,
అలాపడవు అ౦టే ఎలా తెలుసుకోవాలి కదా!మన పెద్దల మనకి ఇచ్చిన ఆచారాసా౦ప్రదాయలు ..ఇ౦క మాకు చిన్న చిన్న టపాసులు దోరుకుతాయి.కాకరపువత్తు,అవేవో కేక్ మీద పెట్టెవి అ౦తే!!!ఫటాక్ లా౦టివి ఉ౦డవు.
ఇ౦క సోమవార౦ కధ సోమవారమే చెపుతా!!!సో ఇ౦డియా వెళ్ళి పిల్లలకి టపాసుల మజా చుపి౦చాలి.

సుభద్ర గారు నాకు మీ పూజ చాలా నచ్చింది. తొందర అందరికి సహజం లెండి. పౌర్ణమికి మూడువందల అరవైఅయిదు వత్తులు ఆవు నెయ్యితో తప్పకుండా వెలిగిస్తాను. మధ్యలో కొన్ని మిస్ అయినా సంవత్సర ఫలితం అంతా ఇప్పుడొస్తుందట. ఫొటో చాలా బాగుంది.

Last year దీపావళి తో పాటు ఈ year దీపావళి గురించి కూడా క్లియర్ గా వ్రాయాలి.