వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

అనగనగా ఒకరాజు ,అ రాజు కి నల్గురు కొడుకులు.ఆ కొడుకులు అందరి కి ఒక ఉమ్మడి బండి బాటా ,ఆ బాటా కి చేర్చి ఒక వాలు గా ఉన్నా కొబ్బరి చెట్టు.అది మా ఆటలా అడ్డా చిన్నపుడు .ఆ నలుగురు మా ముత్త తాతలు అన్నదమ్ము లు. ఎవరి తోటకి ,ఇంటికి వెల్లలి అన్నా అదే దారి.ఎవరి ఇంటికి ఎటుచుసినా-100/150 గజాల దూరం .మా ఉరి లో ఎవరి ఇల్లు వారి పొలం లోనే ఉంటుంది .బహుశ ఇలా మరి ఎక్కడా ఉండదేమో. మా తాతల సంగతి తెలియదు కానీ మా నాన్న వాళ్లు అక్కడే ఆడుకునేవారట .తరువాతా మేము ,ఎప్పుడు గడ్డి అన్నది మొలిచేది కాదు అక్కడ -
యందు కంటే మేము అంతాగా ఆడి చదునుగా ఉంచేవాళ్ళం.ఈపుడు బండుళ్ళు లెవ్వు ,ఉరు లో ఆడుకునే పిల్లలు లేరు.మేము మొత్తం పదిహేను మంది పిల్లం ఉండే వాళ్ళం.అంతా ముత్తాలఅన్నదమ్ముల -మునిమనవళం అన్నామాటా.సాయంత్రం ౪:౩౦ కి వచ్చేవాళ్ళం స్కూల్ నుంచి .పుస్తకాల బాగ్ దొడ్డి గుమ్మం దగ్గరే పడేసి పరుగు ........
అమ్మ ఎక్కడి కీ అంటే వాలుకోబ్బరి చెట్టు దగ్గరి కి అని అరిచేదాన్ని.మొత్తం పిల్లం అంతా మూడు వేరువేరు స్కూల్ లో చదివేవాళ్ళం.పది /పదిహేను ని. తేడా లో అంతా చేరి ఆ రోజు వింతలు విశేషాలు చెప్పుకునేవాళ్ళం.ఇంటి నుంచి ఆరు ,ఏడు కబుర్లు వచ్చాకా తప్పక ఇల్లు చేరే వాళ్ళం.
నెమలి కన్నులకి ఫుడ్ కొబ్బరి పూతా తెచ్చుకునేదాని .
ఎవరి ఎవరి నెమలి కన్నుకి పిల్ల పుట్టిందో చుసుకునేవాళ్ళం .మర్నాడు స్కూల్ కి పెట్టు కోవటానికి పువ్వులు తెచ్చుకుని అంతా నీకు ఒకటి నాకు ఒకటి అని కనకాంబరాలు కుడా ఇలానే పంచుకునేవాళ్ళం .అన్ని ఎక్సేంజ్ చేసుకునేవాళ్ళం. స్కూల్ నుంచి వస్తూ కొనుకున్న పప్పు ఉండలు ,జిల్లు ,తాటి తాండ్ర జామకాయలు ఉప్పుకారం వేసినవి అన్ని పంచుకునేవాళ్ళం. నా ప్రొఫైల్ లో ఫోటో అక్కడ తీసిందే . ఎన్నో మధురా జ్ఞాపకాలు ఆ చోటా ........అందుకే నా బ్లాగ్ పేరు ఇంకేం అనుకున్నా అది నాకు తుత్తి (a.v.s) యివ్వలెదు .

5 comments:

ఓహ్.. మీరు కూడా నెమలి కన్నులు దాచుకున్నారా? బాగుంది మీ టపా..

స్వాగతం తెలుగు బ్లాగులోకానికి

స్వాగతం, సుస్వాగతం!

అన్నట్టు నా బ్లాగుకు ఏమి పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ కిచెన్‌లో షెల్ఫ్ నుండి ఏదో తీస్తుంటే జీడిపప్పు కనిపించింది :)

సుభద్ర గారూ ! మీ బ్లాగ్ పేరు ....కొబ్బరిచెట్టు కబుర్లూ బావున్నాయండీ ...అన్నట్టు నెమలీకలు నేనూ దాచుకొనే దాన్నండోయ్ కానీ ఎప్పుడూ పిల్లలు పెట్టాలా ... :)