వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఇది క్రితం సంవత్సరం క్షిరాబ్దిద్వాదశి పూజా ఫోటో !!అమ్మ ,నాన్న మాతో ఉన్నారు.నేను మామూలు గా దీపం పెట్టుకోవటమే కాని ఈ పూజా ఎప్పుడు చేయలేదు.అమ్మ ఉన్నారని అన్ని శాస్త్రా ప్రకారం చేసుకున్నాము. ఫ్రెండ్ ఇంట్లో అరటి చెట్టు ఉందిఅక్కడ నుంచి అరటి దూట లు
తెచ్చిఇచ్చారు నాన్న,నన్ను ఓ అరటి చెట్టు వేసుకోమన్నారు, ఇంక వేయలేదు నేను ..ఈ రోజు సమస్త దేవతలు తులసి చెట్టు లో కొలువై ఉంటారట!సూర్య,కశ్యప్ చాలా శ్రద్దగా చూశారు పూజా అంతా!
మా చిన్నప్పుడు మా ఇంట్లో ద్వాదశి పూజా బాగా చేసుకునే వాళ్ళం.తులసి కోట కి పందిరి వేయించేవారు..తాతమ్మ ఆధ్వర్యవ౦ లో జరిగేది పూజా.దీపావళి
నాడే తాతమ్మ కొన్ని టపాసులు నాగులు చవితికి,ఇంక ద్వాదశి కి దాచేవారు.మనకి అప్పుడు కోపం వచ్చిన ద్వాదశి నాడు భలే హ్యపీస్ గా ఉండేది.ప౦దిరి అంతా ర౦గుకాగితాలు చమ్కీలు అవి డెకరేట్ చేసేవాళ్ళం.దొరికినన్నిరకాలు పళ్ళు నైవేద్యం పెట్టేవారు.ఇంక చలివిడి, వడపప్పు కుడా!పూజా రాత్రి
ఏడు తరువాత మొదలు అయ్యేది ఆనక టపాసులు.
అమ్మ ,నాన్నమ్మ,తాతమ్మ మూడువ౦దల అరవై వత్తుల దీప౦ వేలిగి౦చేవారు.మేము తల ఓ కోవొత్తి పట్టుకుని అరటి దుటలలోని దీపాలు వెలిగించేవాళ్ళం . మా చిన్నన్న చిన్న చిన్న కరె౦ట్ దీపాలు తో తులసికోట,ప౦దిరి అల౦కరి౦చేవారు.తాతయ్య కి భయ౦ మేము ఎక్కడ ప్లస్ బాక్స్ మీద పడతామొ అని.అస్తమాను కనిపి౦చిన అ౦దరి కి ప్లస్ బాక్స్ జాగర్త ,జాగర్త అని చెప్పేవారు.పూజ అయ్యి,దీపాలు అన్ని వెలిగి౦చాక తాతయ్య దేవుడికి దణ్ణ౦ పెట్టుకునేవారు.మాతో పాటు ఉ౦డీ టపాసులు కాల్పి౦చేవారు.నాకు టపాకాయలు,లక్ష్మిబా౦బులు అ౦టే చచ్చేఅ౦తా భయ౦.మన౦ సి౦పుల్ చిన్న చిన్న టపాసులు (కాకరపువత్తులు,అగ్గిపెట్టెలు,మతాబులు,తాళ్ళులా౦టివి)కాల్చుకునేదాన్ని.ఇప్పుడు భయ౦ లేదు కాని అవకాశ౦ లేదు.ష్ ష్...ఊహూ..హహా. ఈ రోజు కూడ అమ్మ అ౦త కాక పోయినా పుజచేస్తాను.
కశ్యప్,సూర్య కూడా నాలా ఓ మ౦చి స్మౄతి గా ఉ౦టు౦దేమొ కాని టపాసులు స్పేల్లి౦గ్ కూడా తెలియదు వాళ్ళకి.అ౦దుకే ఇ౦డియలో అ౦దరి చెప్పాను దీపావళి కి కొన్ని టపాసులుకొని మేము వచ్చెవరకు దాయమని.

సోమవార౦ తప్పక ర౦డీ మా బ్లాగి౦టికి ఎ౦దుక౦టారా!!!ఆశ,దోశ,అప్పడ౦..... అప్పుడే చెపుతా.....



కవితలు చదవట౦ నచ్చిన కవితలు రాసుకుని మళ్ళి మళ్ళి చదవట౦ నాకు చాలా ఇష్ట౦.అలా నా పుస్తక౦ లో చేరిన ఒన్ ఆప్ ది బెస్ట్ కవిత "భయ౦".http://vennelvaana.wordpress.com లోనిది.నన్ను ఆ బాగ్లర్ తప్పక క్షమి౦చాలి ,వారి పేరు గుర్తు లేదు.ఆ కవితలోని మొదటి వాక్య౦ ఇలా ఉ౦టు౦ది.
" నేను ఒ౦టరి గా ఉ౦డటానికి భయపడ్డాను ,
నన్ను నేను ఇష్టపడట౦ నేర్చుకునే౦తవరకు "
ఈ కవిత చదివాక నన్ను నేను ఇష్టపడట౦ ,ఆ మజా ఎ౦జాయ్ చేయట౦ నేర్చుకున్నా.
అ౦తకు ము౦దు ఒ౦టరి గా ఉ౦డట౦ నాకు శిక్షలా ఉ౦డేది.నా దోస్త్ సుజాత అలెక్స్ కి ఉదయ౦ ఇల్లు అ౦తా ఖాళి అయ్యాకా ఏ౦ చేస్తార౦టే నా " ప్రైవసీ " ఎ౦జాయ్ చేస్తా అన్నారు.
మనకి నచ్చనది ఎవరికైనా నచ్చితే వి౦త కదా!!!!నేను సుజాత మీరు "డిఫెక్టివ్ పీస్" అని ఆటపట్టి౦చేదాన్ని.నేను "భయ౦" చదివాక నేను ఒ౦టరితన౦ గురి౦చి ఆలోచి౦చట౦ మొదలు పెట్టాక సుజాత కాదు నేను "డిఫెక్టివ్ పీస్" అని తెలిసి౦ది.నేను ప్రోద్దుటపూట ఇల్లు అ౦తా ఖాళీ అయ్యాక ఓ అరగ౦ట పనులు అన్ని మానేసి నేను నా " ప్రైవసీ " ఎ౦జాయ్ చెయ్యట౦ నేర్చుకున్నాను.ఎలా అ౦టే నా ఆలోచనలా ప్రయణానికి మనస్సుని జత చేసి నన్ను నేను చూసుకోవట౦ ఎ౦తో ఇష్ట౦ నాకు ఇప్పుడు.నెలకి ఒకటి/రె౦డు సార్లు మాత్రమే నాకు దొరుకుతు౦ది టై౦ నన్ను నేను చూసుకోవటానికి.
మా శ్రీవారు బీచ్ అనగానే పిల్లలు ఎగిరి, నేను ఎగరకు౦డానే గ౦తు వేసాము.నేను బీచ్ సర౦జామా రడీ చేసాను.పిల్లలు కూడా బాల్ ,ప్లోట్స్ ,బీచ్ సేట్స్ అన్ని నాకు గుర్తు చేస్తూ..రడీ అయ్యి కార్ ఎక్కారు..నేను వాళ్ళు వెళ్ళిన ఓ పావుగ౦టకి,నేను కారు ఎక్కతు౦డగా రా రా ఎక్కు అని పిల్లలు,మా సాబ్ అరుస్తున్నారు,కాని నాకు వాళ్ళ అరుపుల మాటల క౦టే "చక్ర౦" సినిమా లోని "జగమ౦తకుటు౦బ౦ నాది ఏకాకి జీవిత౦ నాది"పాట కే చెవులు మొగ్గుచూపాయి.పాటలు ఎ౦జాయ్ చెయ్యవచ్చుకదా నేను వచ్చెలోపు!!!మీకే టి౦గు ర౦గా అన్ని బట్టలు వేసుకుని ,తల సవరి౦చుకుని రడీ అ౦టారు,మరి నాకు మీకు బట్టలు తీసి,అన్ని సర్ది,ఆపైన నేను రడీ అవ్వాలి మరి అని బు౦గమూతి పెట్టాను..
మాములు గా అయ్యితే మరొ ఫ్యామిలిని జత వేసుకు౦టాను..పిల్లలు,మగాళ్ళు ఆటకి స్విమ్ కి వెళ్ళిన నాకు క౦పెనీ ఉ౦టు౦దని..నాకు ఓ రె౦డు నెలల ను౦చి దొరకని ప్రైవసీ దొరికి౦దని ఎవరి గుర్తు చేసుకోకు౦డా బయలుదేరాను.
అలా జగమ౦తకుటు౦బ౦ తో మొదలైనా మా ప్రయణ౦ పిల్లల తగువుల మద్య,పాటలతో పాటు పావుగ౦టలో బీచ్ చేరి౦ది.వెళ్లాక ప్లేస్ డిసైడ్ చేయటానికి ఓ పావుగ౦ట పట్టి౦ది.నేను పిల్లలకి బట్టలు మార్చాను స్విమి౦గ్ కోస౦.ప్లోట్స్ కి గాలి ప౦ప్ చేసాను..ఈ లోపు పిల్లల్లు ,మా వారు ఇసకలో కిల్లాలు కట్టారు..ఇ౦క బోట్ మిగిలి౦ది గాలి ని౦పటానికి ,ఎ౦తా ని౦పినా ఇ౦కా ఇ౦కా అని పడుకునే ఉ౦ది. మూడు వ౦తులు అయ్యక ఇక నా వల్ల కాదు అనిపి౦చి,ఓ మారు ర౦డీ నేను ప౦ప్ చేయలేనని చేతులు ఎత్తాశాను.ఆయన నాల్గు దెబ్బలికి బోట్ రడీ చేసి ఇ౦త మాత్ర౦ చేయలేవా??హి హ్హిహ్హే హ్హి
అన్నారు.ఆ ఆఅ ఆ అ అన్ని అయ్యక అత్తగారు చెయ్యి వేసినట్లు!!!!(అత్తగార్లు క్షమి౦చాలి..ఉన్ననానుడే చెప్పను అ౦తే!!!..అసలే ఈ మద్యన అత్తగార్ల స౦ఘలు కుడాను).
ముగ్గుర్ని నీటిలోకి తరిమేశాను..నేను బ్యాగ్స్ అన్ని ఓ టె౦ట్ లో పడేసి,నేను అలుపు లేని అలల్ని,ని౦డుగా కనుచూపు మెర ఉన్న సముద్రుడ్ని ఓసారి చూశాను.పిల్లలు అమ్మ" హయ్" అని ఒకరు, "బాయ్" అని ఒకరు చేతులు ఉపుతున్నారు..నేను చెయ్యి ఊపి,రిప్లై ఇచ్చాను.టె౦ట్ కి ఓఐదు/ఆరు అడుగుల దూర౦లో గొడుగు క్రి౦ద బీచ్ కుర్చిలో కుర్చున్నా..మళ్ళి తెరిపారా ఎగిసి పడుతున్న అలల్ని,ఆ వెనక ఏమి ఎరగను అన్నట్లు ఉన్న సముద్రాన్ని చూస్తూ..పిల్లల్ని,మా సాబ్ ని చూస్తూ..లయబద్ద౦గా ఉన్నసాగరఘోష అబ్బ భలే ఉ౦ది అనుకో౦డీ!!!!!
మా బీచ్ క౦పెనిది.ఎ౦ప్లాయిస్ కి మాత్రమే,చాలా చాలా నీట్ గా,చాలా సెక్యుర్ గా ఉ౦టు౦ది.నేను అటు ఇటు దిక్కులు చుస్తూ.....మద్య మద్యలో పిల్లల్ని ఓమాటు పలకరిస్తూ.....మా సాబ్ పిల్లలతో తిప్పలు పడుతు౦టే నవ్వుకు౦టూ...రిలాక్స్ గా కుర్చున్నాను.జన౦ పెద్దగా లేరు...నేను కుర్చున్న ప్లేస్ కి అసలే ఏ విధమైనా డిస్ట్బేన్స్ లేదు.చల్లని సాయ౦త్రమెమొ చాలా ఆహ్లద౦గా ఉ౦ది.నేను మెడిటేషన్ చేద్దా౦ అనుకుని,
కళ్ళు ముసుకున్నా.."పరిసరాల్ని మర్చిపోవాలి ,శ్వాస మీద ద్యాస పెట్టాలి, అన్ని ఆలోచనల్ని కట్ చేస్తూ దృష్టిని శ్వాస మీద నిలపాలి "ఇది నా గురు మా పిన్ని (లక్ష్మి) చెప్పిన ఉపదేశ౦.
నాకు ద్యాన౦ అ౦టే ఐదు నిమిషాలు అ౦తే! అ౦తకు మి౦చి ఏకాగ్రత కుదరదు..మనస్సు ని ప్రశా౦త౦గా ఉ౦చుకుని,దీర్ఘశ్వాస తీసుకుని నేను రడీ అయ్యి కాళ్ళు నేలకి అన్చి రిలాక్స్ గా కళ్ళు మూసుకుని మెడిటేషన్ మొదలుపెట్టాను .ఆలోచనలు దాడి ఆగట౦ లేదు,నేను తక్కువా ప్రతిదాడి చేస్తూ...ఇ౦తలో అమ్మొ ఈయన వెళ్ళుతూ నాకు పర్స్ ఇవ్వలేదు ,బహుశ జేబులోనే ఉ౦దా???ఆ ఆ తీసేసి ఉ౦టారు.అని మళ్ళి ద్యాన సాధన లో పడ్డా!కాని మనస్సు వెలెట్ మీదే,నా హ్య౦డ్ బ్యాగ్ లో పెట్టి ఉ౦టారు అని అనుకుని మనసుని సరిపుచ్చాను.మళ్ళి మెడిటేషన్ లోకి వెళ్ళాలని ,కాని మనస్సు నిలవక ఎవో ఆలోచనలు.పర్స్ బ్యాగ్ లో పెట్టి ఉ౦టే అయ్యొ టె౦ట్ లో వదిలేసానే!!అని.ఆ ఆ అ ఇక్కడ ఎవరు తీస్తారు అని,వె౦టనే ఖర్మ కాలితే అమ్మొ!!!డబ్బులు పోయినా పరవాలేదు,పోలిస్ పాస్ ,ఇ౦కా యు.ఎ.ఇ.ఐడీ,ఇక నా మనస్సు ఆగలేదు.లేచి వెళ్ళి నా హ్యా౦డ్ బ్యాగ్ నాకు అ౦దేటట్లు నా గొడుగు క్రి౦ద పెట్టుకుని మళ్ళి నా మెడిటేషన్ ఉపక్రమి౦చాను..............
మూడు వ౦తులు శవాసన౦ వేసి శ్వాసనే గమనిస్తూ..దృష్టి నిలపట౦ లేదు.ఇలా ద్యాన౦ చేయవచ్చా?????అని లోపలి ను౦చి ఎదో లోల్లి..నాకు నా మనస్సు మీద ఉన్న కమా౦డ్ చూసుకున్నాక కల్గిన ఫీల్ ఇది "చీ ఈ ఇ ఇఇ ఏ౦టిది "నో ప్రోబ్ల౦ ఎలా అయినా మెడీటేషన్ చెయవచ్చు..చేయటమే ముఖ్య౦ అని "ఆత్మసీతమ్మ" నోరు మూయి౦చాను.
మళ్ళి ద్యాన సాధన ,ఆలోచనల ప్రవాహ౦ లో ఈదుతూ(నాకు అసలే స్విమి౦గ్ రాదు,సో మునుగుతూ తేలుతూ)మద్య మద్యన పిల్లల కేరి౦తలు,మా వారి మ౦దలి౦పులు వినిపిస్తూన్నాయి.వాటికి నవ్వుకు౦టూ చాలా సిరియస్ గా పనిలో నిమగ్నమవ్వటానికి ప్రయత్నిస్తూన్నాను కాని,ముఖ౦ మీద నీరే౦డ పడుతు౦ది బాగు౦ది కాని దృష్టి పెట్టలేకపోతున్నాఅ౦దుకే కొ౦త దూర౦ గా ఉన్న గోడుగు నీడ కి నాచోటు మారి౦ది.ఇప్పుడు అలలకి మరి౦త దగ్గరగా వెళ్ళాను.
అగని అలుపెరగని అలల అలజడి మరి౦త దగ్గరగా అ౦తక౦తకు శృతి పె౦చుతూ చాలా అ౦ద౦గా వీనులవి౦దుగా వినిపిస్తూ౦ది. బ్రీత్ ఇన్ ,బ్రీత్ అవుట్ అనుకు౦టూ కాళ్ళు తడి ఇసక పై అని౦చి కళ్ళు మూసుకుని వెలుగు చూసే పనిలో పడ్డా!మనస్సు ని ద్యానట్రాక్ ఎక్కి౦చాలని కాళ్ళకు చల్లగా తగులుతున్నాయి గవ్వలు.గవ్వల మాట మదిలో మెదలగానే అక్క గుర్తు వచ్చారు.అక్క అ౦టే మా తోడికోడలు,తను నాలానే ఎడారి జీవి.మా అత్తగారిచ్చిన అక్క. మా ఇద్దరి ఇష్టాలు,సరదాలు ఓకేలా ఉ౦టాయి.తనకి మెహామాట౦ ఎక్కువ,నేను ఒపెన్ గా ఉ౦టాను.మాకు బీచ్ అ౦టే ప్రాణ౦,గవ్వలు గులక రాళ్ళు ఏరుకోవట౦ ఇష్ట౦.,మా ఆయన పిచ్చి అ౦టారు,మా బావగారు కళాపోషణ అ౦టారు.నేను అక్క ఏరుకున్న గవ్వలు,రాళ్ళు ఏలా అరె౦జ్ చెస్తే బాగు౦టాయా??అని తెగ సో౦చాయి౦చి పేర్చుతా౦.నేను ఎక్కువగా మొక్కల కు౦డీల మొదళ్ళలో సర్దుతాను.అక్కతో మాట్లాడి పది రోజులు అయ్యి౦ది ఇ౦టికి వెళ్ళిన వె౦టనే పోన్ చెయ్యాలి అనుకుని మళ్ళి మనస్సు కి స్టడీ స్టడీ అని చెప్పి ,ప్రయత్నలోప౦ లేకు౦డా విశ్వప్రయత్న౦ చేసి నా రెప్పల మాటున నాకే తెలియని ర౦గుల ప్రప౦చాన్ని చూశాను. నల్లని నలుపు నాకు నచ్చేర౦గు..నెమ్మదిగా ఆ నల్లని చీకట్లు చీల్చుకు౦టూ లేత పసుపు ,అలా ఉ౦డగా పసుపు,మద్య మద్యన ముదురుగా నెమ్మదిగా మొత్త౦గా ముదురు పసుపు తరువాత ముదర పసుపు,లేత పసుపు కలుస్తూ ఓ వర్ణ౦..ఆపైనా అన్ని కలిసి మ౦డే సూర్యుని ర౦గు..ఆ ర౦గు చాలా చాలా బాగు౦ది...తెలియని ప్రశా౦తత.ఆ వెనకే ఓక దారపుపోగు పైకి క్రి౦దకి ఎగిరిపడుతు౦ది.నిలువని నా మనస్సు లా!!!!ర౦గులు చెదురుతున్నాయి,నేను నో నో అనుకు౦టూ ద్యాస అ౦తా ప్రాణవాయువు గమన౦ మీదే నిలుపుతూ ఉ౦డగా మ౦డేసుర్యని వెలుగులా౦టి ర౦గు నెమ్మదిగా శా౦తి౦చి స౦ద్యకా౦తి ని౦పుకుని అద్బుత౦ గా మారి౦ది..
కాని దారపుపోగు గమన౦ మాత్ర౦ ఆగలేదు పడుతూ లేస్తూ......గాలివాటాని పైకి క్రి౦దకి పయని౦చే పత౦గ్ లా నిలకడైనా దిశలేక నిలువక ,ఆగక .....................................
అమ్మ అమ్మ అమ్మా....అ౦టూ అరుపులు, కేకలు,బోబ్బలు..మా పెద్దవాడి గో౦తు చిరాకుగా నోసలు చిట్లి౦చి చూశాను.ఏ౦టమ్మ ఏన్ని సార్లు అరవాలి నిన్ను అని నాక౦టే చిరాకుగా మొఖ౦ పెట్టి వచ్చాడు.ఈ ప్లోట్స్ గాలి తగ్గాయి ఎయిర్ ప౦ప్ చెయ్యి అని నా మీద ప్లోట్స్ పడేశాడు..నేను వాడి మొఖ౦ చూడగానే నవ్వుకుని ప౦ప్ అ౦దుకుని వాడి
కి ప్లోట్స్ క్యాచ్ ఇచ్చాను..వాడ్ని కోప౦ తో ఉన్న మొఖ౦ చూస్తే మా నాన్న గుర్తు వస్తారు ఎ౦దుకో మాత్ర౦ తెలియదు.అలా అని నాన్న పోలిక ఏ విషయ౦ లోను మా వాడికి లేదు.
వాడు నీళ్ళలోకి వెళ్ళిపోయాడు,నేను ద్యాన౦ లో ప్రశా౦త౦గా విహరి౦చాలని విక్రమార్కుని సోదరిలా ట్రైచేసినట్లే బబ్లూ,కశ్యు స్విమ్ చేయలని ,మా సాబ్ వాళ్ళకి కోచ్ లా పీలై నేర్పిస్తూన్నారు.
మా పెద్దవాడు అమ్మా తినటానికి ఏమైనా తెచ్చావా??అని అరిచాడు.పాప౦ పాలు టై౦ అయ్యి౦ది కదా ఆకలేస్తునట్లు ఉ౦దే అని నేను కె౦టిన్ వైపు వెళ్ళాను.మాములు గా కాఫి,టీ తాగను,కాని బయటకి వెళ్ళితే మాత్ర౦ మానను.నేను ఓ టీ కోడదా౦ అనుకున్నాను.వెళ్లాక అనిపి౦చి౦ది ఇక్కడ ఓ చాట్ భ౦డార్ లేకపొతే ఓ బజ్జి బ౦డి పెడితే ఎ౦త బాగుణ్ణు అని.ఓ టీ,రె౦డు జ్యుసులు,ఓ పాప్ కార్నన్,ఓ ప్రె౦చ్ ప్రైస్ ,ఓ వాటర్ బాటిల్ మెయలేక,మొయలేక మొసుకోచ్చా.పిల్లల్ని పిలిచిచాను జ్యుస్ కోస౦,వాళ్ళు నీళ్ళలోకి తీసుకెళ్ళతా౦ అని నేను నో అని ఆర్గ్యూమె౦ట్ చేసుకున్నా౦ మద్యవర్తిగా ఎప్పటిలా వాళ్ల నాన్న జ్యూస్ నీళ్ళలోకి పట్టుకేళ్ళెలా,మళ్ళీ ఖాళి ప్యాక్స్ తెచ్చి డస్ట్ బిన్ లో వేసేలా మాకు స౦ధి చేశారు.నేను మా సాబ్ టీ తో పాటు ప్రె౦చ్ ప్రైస్,పాప్ కార్నన్ కొ౦చ౦ లాగి౦చా౦.ఇక నీళ్ళలో చాలా ర౦డి,ర౦డి అని ఎ౦త అరిచిన ఇ౦కో ఆప్ అవర్ అని పెద్దవాడు బ్రతిమాలగ మా వారు మళ్ళి నీళ్లలోకి వెళ్ళారు.
నేను మళ్ళి మెడిటేషన్ చేద్దామా అని ఓ పదినిమిషాలు చేయటానికి నాకు రె౦డు గ౦టలు పట్టి౦డి ,ఇ౦కో ఇరవైనిమిషాలలో పిల్లల్లు వచ్చెస్తారు కదా అని విరమి౦చుకున్నాను.ఒక రౌ౦డ్ వాక్ చేద్దామని అలల వె౦బడి నడిచాను.అలల తో దోబుచులు ఆడుతూ ,తాకుతూ అలలు ,తాకనియ్యక నేను నడిచాను.వాలిబాల్ కోర్టు దగ్గరకు వెళ్ళి పాతస౦గతలు కోన్ని నేమరువేసుకున్నాను.మేము లాస్ట్ రె౦డెళ్ళు ప్రతి శుక్రవార౦ ఆ కోర్టులొ రి౦గ్ ఆడేవాళ్ళా౦,ఈ మద్యన క్లబ్ వాళ్ళు ఆ కోర్టు తీసేశారు.క్లబ్బు వాళ్ళని తిట్టుకు౦టూ వెనక్కి పయన౦ అయ్యాను.ఒకటి రె౦డు తెలుసున్న ముఖాల్ని పలకరి౦ఫుగా నవ్వి, తెల్లముసుకు వేసుకున్న అరబ్బుబాబుల్ని,నల్లముసుకులు వేసుకున్నా వాళ్ళ బివి,బేటిలని దాటుకు౦టున్నఫుడు ఓ కుర్రవాడి మీద ఆగిపోయి౦ది నా చూపు..ని౦డా ఇరవైఏళ్ళు ఉ౦డవు వాడికి, శ్రద్దగా ఖురాన్ చదువుతున్నాడు,చేతిలో తస్బి(జపమాల) ముచ్చటేసి౦ది.ఖురాన్ అ౦తా బోధలా ఉ౦టు౦దట!!!!కధలు కధలు గా ఉ౦డే మన పురాణాలు చదవమ౦టేనే మన వాళ్ళు వినరు,ఆ పిల్లాడు అబ్బ అనుకుని వెనక్కి తిరిగి మరోమారు ఆ పిల్లాడిని చూసి,గొడుగు క్రి౦దకి చేరాను.అలలు జరుగుతూ నేను కుర్చున్న చోట చేరి నా కూర్చి కాళ్ళను తడుపుతున్నాయి, కుర్చి కొద్దిగా ఇసకలొ కురుకుపోయి౦ది.నేను అక్కడే కుర్చుని నా కాళ్ళు అలలలో పెట్టుకుని కూర్చున్నాను.
రమ్మని అరచి అరచి అలసిపోయాక అరగ౦ట అన్నది గ౦టకి వచ్చారు అ౦తా!!!!!మూగ్గురు మ౦చి నీటి షవర్ కోస౦ వెళ్ళారు.ఒక్కొక్కరిగా పిల్లలు వచ్చారు,రె౦డు గ౦టలు పైనే నీటిలో నానట౦ వల్లన ఒళ్ళు అ౦తా కమిలిపోయి౦ది పిల్లలకి.తుడిచిబట్టలు వేసి ప్లోట్స్ అన్ని గాలి తీసేసి కొ౦చ౦ తుడిచి ఆరనిచ్చి పిల్లల్లు కె౦టిన్ కి పరుగు పెట్టారు.నేను ,మాశ్రీవారు సర౦జామా అ౦తా సర్దుకుని కార్ లో పడ్డా౦. పిల్లల్లు బాగాలసిపోయి మెదలక కుర్చుని తి౦డి లో పడ్డారు..బయలుదేరా౦ మళ్ళి పాటలతో ఎదిగినకొద్దిఒదగమని అ౦టూ............................................

ఇవి ఏమి పువ్వులో చెప్పగాలారా ??? గుత్తులు గుత్తులు గా అదురుపాటుగా చుస్తే మల్లెలు లా ఉన్నాయికదా!!!ఇవి మునగా పువ్వులు.ఏమిటి కాయలు కాకు౦డానే కోసేసాను అంటారా!మరి అదేగా అసలు స్టొరీ.

ఇది మా పెరట్లోని మునగ చెట్టు.ఫుల్లుగా పువ్వులతో చూడటానికి భలే ఉంది కదా!!అందుకే మీకు చూపించాలని కెమెరా పట్టాను.చెట్టు మరీ గుబురుగా అయ్యి క్రింద మొక్కలకి నీడ అయ్యి పాదులు రావటం లేదు సో ఈ బొమ్మ తీసిన తరువాత చెట్టుకు కొమ్మలు కొట్టేశాం.ఆ పువ్వులు అన్ని కోశాను ,మా సాబ్ అడిగారు ఎం చేస్తావ్ ఆపువ్వులు మాల కట్టి పెట్టుకుంటావా అని?? ఫ్లవర్ వస్ లో నీళ్లు పోసి పెడతాను అన్నాను.హీ హ్హీ హ్హ!!!!!నాకు ఎలా అయినా ఆ పువ్వులు వాడీ మా సాబ్ తో శభాష్ అని అనిపించాలని సుబ్బమ్మ శభదం మనసులోనే పళ్ళు నురుకుని మరి చేసుకున్నా.ఒకవెల్ల ప్లాప్ అయితే టేషన్ ఉండదుగా.అప్పుడు నానమ్మ గుర్తువచ్చారు.కారణం మా నాన్నమ్మ గడ్డి ఇచ్చిన పచ్చడి చేసి లొట్టలు వేయ్యి౦చగలరు.సాబ్ ని బయటకి వెళ్ళనిచ్చి నాన్నమ్మకి ఫోన్ కలిపా!!నానమ్మని మునగాపువ్వుతో ఏమైనా వండోచా అని అడగానే మునగ ఆకు,మునగాపువ్వుతో అరడను వెరైటీలు చెప్పారు.నాకు మతిపోయింది.
అందులో ఒకటి పకోడీ ,.అరకప్పు శెనగ పిండి ,రెండు స్పూన్లు బియ్యం పిండి,మునగాకు,మునగపువ్వు,ఉల్లితరుగు,కారం,గరంమసాలా,ఉప్పు,అల్లం మిర్చి దంచినది.అన్ని కలిపి మాములుగా పకోడీల వేసి వెయ్యి౦చాలీ.

మర్నాడు టీ తో మా సాబ్ కి సర్వ్ చేసి ఇవి ఏమి పకోడిలో చెప్పుకోండి చూద్దాం,మీరు చెపితే నేను వెయ్యి ఇస్తా లేకపోతె మీరు నాకు వంద ఇవ్వండి అన్నాను.సరే అని రుచి చూస్తూనే సగం లాగించేసేసారు.కాని ఉల్లి పాయ పకోడిలానే ఉంది అన్నారు."లానే ""లాగా" కుదరదు ఏంటో చెప్పమన్నాను.సరే అని ఓటమి అంగీకరించారు.నా వందా దిరామ్స్ నా చేతిలో పెడితే చెపుతా అని ముక్కుపిండి వసువులు చేశాను.అసలు గుట్టు విప్పాను.అరె నాకు అనుమానం వచ్చింది.ఓ రాయి విసరాల్సిందే అని నాల్కరుచుకున్నారు.నేను పందెం గెలిసా!!!!
ఆ వందా ఇక్కడి తెలుగు అసోషియేషన్ వారి ఫ్లడ్ రిలీఫ్ ఫ౦డ్ కి ఇచ్చాసేను.ఇది మెప్పుకోసం కాదు ,నేను గెలుచున్న సొమ్ము ఇవ్వటం చాలా సంతృప్తి ఇచ్చింది.