వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..నేర్చుకున్నా ఇలా ఎలాగంటే ................
నేను నా మొదటి పొస్ట్ లో నాకు హెల్ప్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నా , కాని ఒకరి గురించి రాయలేక పోయా అది మా శ్రీవారు.......ఆ విధంబెట్టిదనినా. ...మనకి 2005 మార్చి వరకు కంప్యూటర్ అంటే మూడు విషయలు తెలుసు. అవి మానిటెర్, కిబోర్డ్ , ఎలక. మా వారు చూడు నేర్చుకో అని అంటూనే ఉన్నారు .మన చర్మం కొంచం దళసరి కదా ఏది త్వరగా ఎక్కదు , నాకు 2005 కి నేర్చుకోవాలని అనిపించింది. మా సాబ్ సాయం తో మెయిల్స్ చూడటం మాత్రమే నేర్చుకున్నా. తరువాత ఒక విడత పౌరుషం తెచ్చుకుని మెయిల్స్ చేయటం నేర్చుకున్నా , కాని చాలా స్లోలో .అంతా అయ్యకా మా చిన్నోడు స్విచ్ నోక్కేయటం చేసేవాడు. దేవుడా అని మళ్లీ మొదలు ..

నెట్ లో రోజు ఈనాడు చదవటం , వంటల వెబ్-సైట్స్ చూడటం, బ్లాగ్స్ పరిచయం. నాకు ఆశ కల్గింది నేను రాయాలి అని. ఇంకో స్వార్ధం కూడా ఉంది. ఇక్కడైతే నా రాతలు బౌన్స్ అయ్యి తిరిగి రావు కదా, తిరిగి వస్తే పొస్ట్ మేన్ డబ్బు అడుగుతాడనే టెక్షన్ లేదుగా. ఎందుకంటే ఇంతకు ముందు నాకు అలాగే జరిగింది 3సార్లు అందరికి తెలిసే ఉంటుంది. స్వాతి లో ఈ శిర్షిక మీదే. దానికి మన ప్రతిభ అంతా రుబ్బి , పిండి రసం తీసి ముచ్చటగా ముడు సార్లు పంపాను, అవి కూడా ముచ్చటగా తిరిగి వచ్చాయి.నాకు కారణం కూడా తెలియదు .చిన్న పిల్లని ఆయె మరి. అలాంటి వాటిని రాయటానికి వేరే కార్డులు ఉంటాయని తెలియదు పాపం నాకు. సో పిటి కదా . మాములు 15 పైసల కార్డు మీద రాసి పంపితే, అవి గోడకి కొట్టిన బంతుల్లా తిరిగే వచ్చాయి. మనకి ముదర తెలివి కి లోటు లేదులెండి.డాటరప్ అని రాస్తే నాన్న కోప్పడతారని కేరాఫ్ అని తాతయ్య పెరు మిదా వ్రాసెదాన్ని.తాతయ్య ఏమి అనరని దైర్యం అన్నమాట. పొస్ట్ మ్యాన్ తాతయ్య ఎక్కడ ఉన్నా వెదికి మరీ పొలం లోఉన్నా, ఫ్రెండ్స్ తో పేకాటలో ఉన్నా డబ్బు వసూలు చేసేవాడు. తాతయ్య ఫ్రెండ్స్ కి తెలిసి ,నేను కనిపించి నప్పుడల్లా నన్ను ఏడిపించేవాళ్లు. మొగుడు కొట్టి నందుకు కాదు తోడికోడలు నవ్వి నందుకు అన్నట్లు ఉండేది నా పని.

రెండు సార్లు తిరిగి ఇస్తూ నవ్వారు తాతయ్య కాని మూడవసారి తిరిగి రావటానికి సరిపడా స్టాంప్స్ అంటించు అని సలహా ఇచ్చారు. మనకి పౌరుషం పొడుచుకొచ్చింది. అయినా నన్ను ఎవ్వరు ఆపలేరు , ఆప తరమా?

అని ఒక బుక్ లో నాకు నచ్చి నట్లు ఎడా పెడా రాయటం మొదలు పెట్టా. ఆ రాతలకి మా చెల్లి ,చిన్న పిన్ని బాధితులు , ఆ తదుపరి బాదుతుల లిస్టు పెరిగింది అనుకోండి.

అలా నాలోని కళా నాలోనే అణగ త్రోక్కబడింది. ఇపుడు మీకందరికి ఓ బంపర్ ఆఫర్!!! నా ఆవేశం కట్టలు తెంచుకుని రకరకాలుగా మీముందుకు రాబోతుంది.. నా బాధితుల లిస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరగబోతుంది. నేను మాత్రం మీకు దొరకనుగా...


కాచుకోంఢి మరి.... 

గెట్ రెడీ .....................................

నాకు నేను గా వచ్చి ఆవిడా ఎప్పుడు కుర్చోమనే చోటు లో ఉండటం చూసి ?పేస్ తో చుస్తూ ఉన్నారు .టీచర్ మొఖం చూడటానికి భయపడే నేను ఆవిడని చూసి నవ్వతాని కి ట్రై చేసాయా,నవ్వటం కుడా కష్టం అని ఫస్ట్ టైం తెలిసింది.టీచర్ ని చూస్తున్నా టీచర్ ఏదో అడుగుతున్నారు వినిపిస్తుంది కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు .చుక్కలు మెరుస్తూ
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అల్ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ ,అల్ ఆర్ బ్రయిట్ అండ్ అల్ ఆర్ డార్క్.......
అన్ని తెలుస్తున్నాయి .ఎమితెలియటం లేదు కొంత సేపుకి అంతా బ్లాంక్ కళ్లు తెరిచేసరి అంతా నాకుసేవలు చేస్తున్నారు.నేను టీచర్ ఒల్లో ఉన్నాను.నా ఫ్రెండ్స్ పెట్టి ఆటో ఎక్కించారు.రెండు రోజులు రెస్ట్ తరువాత మల్లి స్కూల్ కానీ భయం లేదు చిన్నగా టెన్షన్ ఉంది కాని మునుపు అంతా కాదు .ఫ్రెండ్స్ హెల్ప్ తో ఓకే, నాట్ బాడ్ అన్పిం చేది.ఎప్పటి అప్పుడు చదివేదాన్నిమిగిలినసబ్జక్ట్స్ , కాని లెక్కలు ఎక్షమ్ ముందు మాత్రమే చదివేదాన్ని.అదికూడా ఒక కారణం అన్పించింది నాకు తక్కువ మార్కులు రావటానికి.దుష్టి గా వినటానికి ట్రై చేశాను.
ఎ రోజు లెస్సొన్ ఆ రోజే ప్రాక్టీసు చేయటం, బండగా ఒక్కొక లెక్క బట్టి కొట్టే దాన్ని .
ఆ ప్రాక్టీసు వల్లనా ప్రశ్న చూడగానే ఆన్సర్ ఇది అని గుర్తు వచ్చేది .అన్ని వచ్చినట్లే ఉండేవి సాల్వ్ చేద్దాం అంటే వచేవి కాదు.బట్టి మొదలు పెట్టాక కొంచం మారింది పరిస్తితి .
ఎక్షమ్ లో లెక్క మొదలు పెట్టేదాన్ని 4 స్టెప్స్ అయ్యాక పెన్ కదిలేది కాదు సరే అని క్రింద నుంచి
జవాబు అని రాసి అండర్ లైన్ చేసి క్రింద నుంచి ఫై కి చేసుకోచేదాన్ని .ఎలాగో క్రింద నుంచి 2 or 3 స్టెప్స్ వచ్చేవి మద్య లో ఫైనది ,క్రింద స్టెప్స్ మ్యాచ్ అయ్యేవి కావు.ఎక్షమ్ రూం లో జుట్టు పికునేదాన్ని ఏడ్చేదాన్ని.నా బెస్ట్ మార్క్స్ ఇన్ యూనిట్ టెస్ట్ 20 /25 .హాఫ్ ఇయర్లి లో 62 or 64 వచ్చాయి .10 th పబ్లిక్ లో 86 వచ్చాయి .మా బాగ్యలక్ష్మి టీచర్ వల్లనే ఆ మాత్రం చదివా.థాంక్స్ మా బాగ్యలక్ష్మి టీచర్ కి.నా ఫ్రెండ్స్ కి . కొసమెరుపు నేను ఇంటర్ లో M .P . C.
కాని పూర్తి అయ్యిందా అని మాత్రం అడగకండి.

ఇంక మనకి గుడ్డిలో మెల్ల స్ధాయి అప్పటి నా రికార్డు ని16/25 నేను బ్రేక్ చేసి అత్యదిక స్కోర్ 18/25

నమోదు చేసుకున్న.పాపం టీచర్ కి తెలియదు కదా మన ప్రతిభ . రెండు నెలలు కష్టబడి నా వెంట బడినా ఆమె సబ్జెక్టు కి న్యాయం చేయలేదని తన ఫీలింగ్ .అయినా పట్టువదలని విక్రమార్కుని లా నన్ను వదలలేదు .క్లాసు కి రాగానే సుభద్ర రా అని ముందు కూర్చో బెట్టుకుని బాగు చేయతాని కి ట్రై చేస్తున్నారు .పరిక్షలు అవుతూనే ఉన్నాయి నా మార్కులో ను పెద్దగా మార్పూ లేదు.
నన్ను బాగ్య లక్ష్మిటీచర్ వదలలేదు .నాకు రోజు రోజు కి లెక్కల మీదా కోపం ,అసహ్యం పెరిగి పోయాయి .
నాకు మిగతా సబ్జక్ట్స్ లోను మార్కు తగ్గటం తో ఇంట్లో గోల .థర్డ్ యూనిట్ లో అన్ని20లోపే వచ్చాయి .రిపోర్ట్ కార్డు ఇస్తూ సుభద్ర చదవ ని వాళ్ళని ,సరేలే బుర్ర తక్కువ అని వదిలేయ వచ్చు కాని అన్ని సబ్జెక్టు లో ను మంచి మార్క్స్ తెచ్చు కుంటు లెక్కలు మాత్రమే తక్కువ తెచ్చుకుం తున్నవని నిన్నులెక్కలలో ఇంప్రూవ్ చేయాలనుకున్న కాని మొదలికే మోసం తెచ్చావు .
ఇంకా వదిలేయి అన్ని చాలా ఎమోషన్ గా చెప్పి నిజం చెప్పవద్దు రెండు మొట్టికాయలు కుడా వేసి క్లాసు తీసుకోకుండా వెళ్ళిపోయారు.దానితో క్లాసు లో చాలా అవమానం అని పించిది .ఆవిడా మొట్టికాయలులతో తల లో తప్పుకున్న నరం ఏదో గాడి లో పడింది అనుకుంటా.ఇంటికి వచ్చాక చాలా డిస్ట్రబ్ అయ్యాను .స్కూల్ డుమ్మా ఏవో కుంటిసాకులు చెప్పి.నేను ట్రై చేద్దాం అని డి సైడ్ అయ్యాను .అప్పటి రాక పొతే వదిలేడం ఈ సంవత్సరం కాస్త పడితే ఇంక లెక్కలు లేని చదువు చదువు కోవచ్చు అని స్కూల్ కి వెళ్ళాను .అంతా ఓదార్పులు,పరమ్సలు ఒక్క క్లాసు అవ్వుతుంది లంచ్ బ్రేఅక్ తరువాత లెక్కల క్లాసు వచ్చింది.
టెన్షన్ కి అన్నం వికార పెట్టి తినలేక పోయా .నాకు వణుకు జీసస్ ,ఆమెన్ అనుకుంటూనే ఉన్నాను.మాది మిషనరీ స్కూల్ ఆ ప్రభావం చాల ఎక్కువగ ఉండేది .
ఇంగ్లీష్ అయింది,నెక్స్ట్ లే..క .క .క్క లు .గట్టిగా ఉపిరి పేల్చి కళ్లు మూసుకుని చాలా దైర్యం అరువు తెచ్చుకుని నాకు నేను గా మొదటిసారి నన్ను రోజు బాగ్యలక్ష్మి టీచర్ కూర్చో మనే చోటా బోర్డు కి ఎదురు గా కూర్చున్నా .క్లాసు లో అంతా నన్నే చూస్తున్నారు.విపరీతం గా చమటలు ఆ కంగారు కి నాకు గొంతు ఎండి పోతుంది.నా పెదవులు తిమ్మిరిగా ఏదోలా నా మూతి ప్రక్కకు వెళ్లి పోట్టున్న ఫీల్.

మా అమ్మ ఆవకాయ పడుతున్నారట .ఈపుడే ఫోన్ మాట్లాడాను నాకు వెంటనే వెళ్లి కొత్త ఆవకాయ తినేయాలని పిస్తుంది .ఇంక నిమ్మకాయ మధ్యకి కోసి పైనా కొత్త ఆవకాయ పెట్టుకుని పచ్చి కొబ్బరి పుల్ల తో ఆవకాయ పిండి మీదనుంచి నిమ్మ చెక్క లో గుచ్చి ఆ పుల్ల చికితే ......................
అబ్బబ్బ కొత్తా ఆవకాయ ఘాటు ముక్కు లో కి వస్తూ ఆ పై నా కారం కారం గా పుల్ల పుల్లగా సుపరో సూపర్ మాకు మా నాన్నమ్మ కొత్త ఆవకాయ అప్పుడు తప్పకుండా ఊ తా తా త ఇచ్చేవారు .

మా వాడికి రేపు లెక్కల పరిక్ష ,వాడి చదువు అయ్యింది .నేను ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళా.......
టి యం తియం తీయం టి యం ......... అర్ధం కాలేదా ఫ్లాష్ బ్యాక్ కి పాత సినిమాల చక్రం తిరిగిందన్నమాటా. నాకు లెక్కలు అంటే చచ్చేఅంతా భయం ఇంకా సబ్జెక్టు అయినా నో ప్రాబ్లం .
మిగతా అన్ని సబ్జెక్టు లో ను బాగానే మార్కు లు వచ్చేవి .కాని లెక్కలో మాత్రమూ పదిహేను దాటేవి కాదు పాతికి .ఇలా కష్ట కాలం దినాతి దినంగా వెల్లదిస్తూన్న నాకుములిగీ నక్క మీదా తాటికాయాలాటెన్త్ సి కి క్లాసు బాగ్యలక్ష్మి టీచర్ క్లాసు టీచర్ గా వచ్చారు.నేను అన్ని క్లాసు లోను నా ప్లేస్ లో ధర్డ్ బెంచ్ లో కుర్చునేదాన్ని కాని లెక్కల కి చివరాకరునా మానవమాత్రునికి కనిపించని చోటులో కుర్చునీదాన్ని.అసలే పొట్టి దాన్ని ఏమో బోర్డు మాట దేవుడు ఎరుక అటుఇటు ముందు అమ్మాయి ముందు ఏమి కనిపించేది కాదు.అయినా అక్కడే మకాం .వినేది రాసేది ఉంటేగా బోర్డు మీదా ఏమి అయినా కాపీ చేయమంటే ప్రక్కవాళ్ళ నోట్స్ చూసి మక్కి కి మక్కి దిన్చేదాన్ని .నీకు ఎందుకేసుబ్బు పాట్లు అని ఫ్రెండ్స్ నవ్వేవాళ్ళు .మరి ఎక్కువచేస్తుందని మన ఎనిమీస్ చెవులు కోరుకునేవాళ్ళు .మనం కి ఎవరి మాటా పట్టేది కాదు .ఇంకా మన కి మొదటి యూనిట్ అయింది క్లాసు టీచర్ హోదా లో రిపోర్ట్ ఇస్తూ మార్క్స్ చూసి నేనేం పాపం చేసానని నాకు ఇంతా మర్యాదా ఇచ్చావు తల్లి అన్నారు .నేను షాక్ అదేంటి అన్ని నార్మల్ కదా అనుకున్నా.ఒకరోజు సుభద్ర ఎవరు అని వచ్చారు ........మనకి దడ ,వణుకు అన్ని ఏంటి మనతో లెక్కల టీచర్ కి పని అని ఒహ్ నువ్వా స్టాఫ్ రూం లో అంతా సుభద్ర ఇలా అలా అంటుంటే నా క్లాసు లో నాకు తెలియని వి. .ఫై ఎవరా అని మరకలు మరకలు మరకలురా స్టేజి అన్ని అన్ని కూర్చో అన్ని నుంచి నా క్లాసు లో అని హుకుం జారిచేశారు.నాకు ముచ్చమటలు పట్టాయి . జిడ్డుకి పెన్ కదిలేదు కాదు .పైగా లెస్సన్ చెపుతూ మద్య లో ఆగి ,ఎందుకు ఏమిటి ఎలా అన్ని బంపర్ ఆఫర్ లా నన్నే అడిగీవారు. భయం తో వినటం తప్పేది కాదు .ఇంతా విన్నా అరబిక్ ,ఫ్రెంచ్ ,లాటిన్ తదితర భాషలు మొదటి సారి వింటున్న ఫీలింగ్ what to do?god must be crazy అని తలా బాదు కుంటూ వినటానికే ట్రై చేసేదాన్ని .గుడ్డి లో మెల్ల లా సెకండ్ యూనిట్ లో పదేనిమిది టీచర్ మిగిలినా anni

అనగనగా ఒకరాజు ,అ రాజు కి నల్గురు కొడుకులు.ఆ కొడుకులు అందరి కి ఒక ఉమ్మడి బండి బాటా ,ఆ బాటా కి చేర్చి ఒక వాలు గా ఉన్నా కొబ్బరి చెట్టు.అది మా ఆటలా అడ్డా చిన్నపుడు .ఆ నలుగురు మా ముత్త తాతలు అన్నదమ్ము లు. ఎవరి తోటకి ,ఇంటికి వెల్లలి అన్నా అదే దారి.ఎవరి ఇంటికి ఎటుచుసినా-100/150 గజాల దూరం .మా ఉరి లో ఎవరి ఇల్లు వారి పొలం లోనే ఉంటుంది .బహుశ ఇలా మరి ఎక్కడా ఉండదేమో. మా తాతల సంగతి తెలియదు కానీ మా నాన్న వాళ్లు అక్కడే ఆడుకునేవారట .తరువాతా మేము ,ఎప్పుడు గడ్డి అన్నది మొలిచేది కాదు అక్కడ -
యందు కంటే మేము అంతాగా ఆడి చదునుగా ఉంచేవాళ్ళం.ఈపుడు బండుళ్ళు లెవ్వు ,ఉరు లో ఆడుకునే పిల్లలు లేరు.మేము మొత్తం పదిహేను మంది పిల్లం ఉండే వాళ్ళం.అంతా ముత్తాలఅన్నదమ్ముల -మునిమనవళం అన్నామాటా.సాయంత్రం ౪:౩౦ కి వచ్చేవాళ్ళం స్కూల్ నుంచి .పుస్తకాల బాగ్ దొడ్డి గుమ్మం దగ్గరే పడేసి పరుగు ........
అమ్మ ఎక్కడి కీ అంటే వాలుకోబ్బరి చెట్టు దగ్గరి కి అని అరిచేదాన్ని.మొత్తం పిల్లం అంతా మూడు వేరువేరు స్కూల్ లో చదివేవాళ్ళం.పది /పదిహేను ని. తేడా లో అంతా చేరి ఆ రోజు వింతలు విశేషాలు చెప్పుకునేవాళ్ళం.ఇంటి నుంచి ఆరు ,ఏడు కబుర్లు వచ్చాకా తప్పక ఇల్లు చేరే వాళ్ళం.
నెమలి కన్నులకి ఫుడ్ కొబ్బరి పూతా తెచ్చుకునేదాని .
ఎవరి ఎవరి నెమలి కన్నుకి పిల్ల పుట్టిందో చుసుకునేవాళ్ళం .మర్నాడు స్కూల్ కి పెట్టు కోవటానికి పువ్వులు తెచ్చుకుని అంతా నీకు ఒకటి నాకు ఒకటి అని కనకాంబరాలు కుడా ఇలానే పంచుకునేవాళ్ళం .అన్ని ఎక్సేంజ్ చేసుకునేవాళ్ళం. స్కూల్ నుంచి వస్తూ కొనుకున్న పప్పు ఉండలు ,జిల్లు ,తాటి తాండ్ర జామకాయలు ఉప్పుకారం వేసినవి అన్ని పంచుకునేవాళ్ళం. నా ప్రొఫైల్ లో ఫోటో అక్కడ తీసిందే . ఎన్నో మధురా జ్ఞాపకాలు ఆ చోటా ........అందుకే నా బ్లాగ్ పేరు ఇంకేం అనుకున్నా అది నాకు తుత్తి (a.v.s) యివ్వలెదు .

నాగురించి చెప్పాలంటే ........
నా పేరు సుభద్ర.
మాది తూర్పుగోదావరి జిల్లా మీట్టినిల్లు,పుట్టినిల్లు అన్ని .
పెద్దగా చదువుకోలేదు కారణం ఏంటంటే పెసరపప్పుకి మినపప్పుకి ,
తేడా తెలియనప్పుడే పెళ్లి అయ్యింది.
నా దినచర్య పిల్లలు,ఇంటి పని ,మొక్కలు ఇలా ఉండేది .
పని అయ్యాక కాలి టైం లో నెట్ లో ఈనాడు చదవటం....
ఇంక టైం ఉంటే అమ్మకి,అత్తగారికి ఉత్తరాలు రాయటం .
అలా నాకు ఈనాడు లో పరిచయం అయ్యింది కూడలి.
రోజు చదివేదాన్ని.
జ్యోతిగారు పరిచయం అవ్వటం ,ప్రమదావనం లో _
జాయిన్ కావటం ,పద్మ కళా గారి పరిచయం .....
నాకు బ్లాగ్ రాయమని జ్యోతి గారు ప్రోత్సహం తోలిఅడుగులు _
మొదలుపెడుతున్న......
నాకు తెలియని చిన్న చిన్న విశయలు కుడా ఓపిగ్గా
చెపుతూ నేను బ్లాగ్ రాయటానికి కారణం అయినా_
జ్యోతిగారికి ,పద్మకళాగారికి ,నా స్నేహితురాలు నలినికి
నా ధన్యవాదాలు.
నా ప్రపంచం చిన్నది .నా పరిదిలో తెలిసింది రాయలనుకుంటున్నా.
మంచి చెడులు చెప్పి ఆదరించమని ..............
సుభద్ర..