వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..


వయస్సు పెరిగేకొద్ది పెరిగే యవ్వన౦ తో కొత్తస౦వత్సర౦ సిద్ద౦గా ఉ౦ది..క్షణకాల౦ తీరికలేకు౦డా ఏ భావ౦ కనిపి౦చనియ్యకు౦డా,నిత్య౦ మనల్ని ఆశ్చర్యపరుస్తూ,ఆన౦ద౦లో ము౦చటానికి అది మరువకమునుపే ఇది జీవిత౦ అని నేర్పి౦చే బ్రతుకుబడి ప౦తులమ్మ,, ఎప్పటికి అపరిచితనే తను మనకి..



ప్రతి ఏడు మనకి కొత్తే,ప్రతి ఏడు స౦భరాలు జరిపిమరి ఆహ్వస్తున్నాము..మర్నాడు రె౦డు,ఆ తరువాత మూడు,అటుపైన నాల్గు కెల౦డర్ లో రోజు దోర్లుతున్నాయి..మళ్ళి కొత్తకి ఆహ్వాన౦,కొత్త వాగ్దానాల లిస్ట్..మార్పేలేని మన౦..అన్ని మరిపి౦చేసి మళ్ళి ఏమి ఎరగనట్లు మనకి కొత్త ఆశలు చూపుతూ కొత్తగా మళ్ళీ మళ్ళీ వచ్చే అదే తాను..మన౦ మారితే తాను మారునేమో కాని మన౦ మార౦ కదా!!!



నా తెలిసిన ఆపాత స౦వత్సరాలానే ఈ ఏడు రె౦డు మూటలు భుజనా వేసుకుని గుమ్మ౦ దగ్గర కాచుకుని కుర్చు౦ది..రె౦డు ఒకేలా౦టి మూటలు,,కాని ఒకటి పెద్దది ఒకటి చిన్నది..చిన్నది చెడు కావాలని స్వార్ధ౦తో కోరుకున్నా!!గ౦భీర౦గా క్యార్యనిముఖి అయి కుర్చు౦ది పన్నె౦డు ఎప్పుడు కొడుతు౦దా అని!!



నేను ఆహ్వాన౦ పలికే సమయ౦ దగ్గరికి వచ్చేకొద్ది ఓలా౦టి భయ౦ నన్ను చుట్టేస్తు౦ది..చేతుజోడి౦చి మరి ప్రార్ధిస్తూన్నా ఓ కొత్త స౦వత్సరమా నిన్ను...రైతన్న నోటి దగ్గర కుడు నెలపాలు చెయ్యకు,మా అ౦దరి సిగ్గు కాపాడే నేతన్న జీవితాలు అర్ధా౦తర౦గా ముగి౦చనియ్యకు,ఆడకుతుళ్ళ చేత ఆర్తనాదలు చేయ్యి౦చకు,ముఖ్య౦గా భూమాతకి తాపాన్ని తగ్గి౦చేలా జనానికి బుద్దికల్గేలా చెయ్యి కళ్ళుగట్టి మూసుకుని మరి ఆహ్వన౦ పలుకుతున్నాను...

***అ౦దరికి నూతన స౦వత్సరశుభాకా౦క్షలు***

బ్లాగులో రాసేది ఒకే పోస్టు . ఒకే అంశం. లేదా ఒకే కథ.. కాని పది మంది కలిసి ఒకే కథను రాస్తే. అదే ఒక్కో పుష్పం కలిసి తయారు చేసే అందమైన కదంబమాలిక. అలాగే ఈ బ్లాగర్లు ప్రతి వారం ఒక్కొరుగా ఈ కథను అందిపుచ్చుకుని కొనసాగిస్తారు . కొత్తగా చేయాలనే కోరికతో ప్రమదావనం సభ్యులు కొందరు చేసే ఈ ప్రయోగాన్ని మీరు సహృదయంతో పరిశీలించి, సరిదిద్ది, ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.. నేను రాసిన కధ చదవాలంటే గత వారం దుర్గ రాసిన కధ చదివి రండి మరి..


నిన్న అనితని పోలీసులు తీసుకొచ్చి దించి వెళ్ళినప్పటినుంచీ సరోజినికి ఏమిటో మనసంతా దిగులుగా అయిపోయింది. దానికి తోడు ఈ రోజు పొద్దున్నే ఇదిగో ఈ పనిపిల్ల జానకి హాస్పిటల్ లో జేరిందని తెలిసి దుఃఖంతో గొంతు పూడుకుపోయినట్లయిపోయింది. ఈ సమయంలో సుమ తన పక్కనుంటే ఎంత బాగుండును అనుకుంది. సుమ అవడానికి ఆడబడుచయినా అంతకన్నాతనకెంతో ప్రియమైన స్నేహితురాలయిపోయింది. సుమ గురించి తల్చుకోగానే అప్రయత్నంగా సరోజిని పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది. అనుకోకుండా జరిగిన సుమ పెళ్ళి మళ్ళీ మరోసారి తలుచుకుంది.



ఆరోజు.. ఉదయం... తనకి బాగా గుర్తు...


కాలింగ్ బెల్ కొట్టడమే కాకుండా ఎవరో వీధితలుపుని దడదడా బాదేస్తున్నారు.


అబ్బా అబ్బా ఎవరు ? వచ్చే మా వారు దర్జాగా పేపర్ లో ములిగి ఉన్నారు?? ఉహూ అని ఓ మూలుగు పడేసి సగం కడిగిన పిండి చెయ్యి కొంగుకి తుడుస్తూ తలుపు తీస్తే టిప్ టాప్ గా తయారైన ఓ కుర్రోడు ఎదురుగా ఉన్నాడు.. నేను సేల్స్ మేన్ అని డిసైడ్ అయ్యి ఏమి వద్దు బాబు అనే లోపే మా వారు రా రోహిత్ రా అంటూ ఆహ్వనించారు.. నేను వచ్చిరాని తింగరి నవ్వు నవ్వుతూ దారిచ్చాను..అమ్మా నాన్న ఎవరు వచ్చారో చూడండి..అంటూ ఒకటే హడావిడి మొదలుపెట్టారు.. అత్తయ్య పూజలో ఉన్నారు అన్నాను. ఆ సరోజా ఇతను మా విశాల అత్తయ్య కొడుకు, అదే మేము రాజమండ్రిలో ఉండగా వీళ్ల ఇంట్లోనే ఉండేవాళ్ళం.. వీడు ఆరేళ్ళవాడు మేము అప్పుడు మేము ఇక్కడికి వచ్చేషాము.. రోహిత్ ఈమె నా భార్య సరోజ అని పరిచయం చేశారు..



వీడికి నేను ఇంకా గుర్తు ఉన్నాను తెలుసా అన్నారు ఒకింత గర్వంగా!!! ఎలా మర్చిపోతాను బావా!! నారాయణత్త చక్రపోంగలి వాసన ఇంకా చెయ్యినే ఉంది చూడు అన్నాడు.. నేను నవ్వేసి కాఫీ పట్టుకొద్దామని కదిలాను.. రోహిత్ అక్కా ముందు నాకో కాపీ అన్నాడు చాలా చొరవగా!! వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను..మావగారు స్నానం అయ్యి వస్తూ ఎవరువచ్చారు అని అడిగారు?? అది ఏవరో రాజమండ్రిలో ఉన్నప్పుడు తెలిసినవాళ్లు అట మావయ్యగారు అంటుండగా అత్తయ్యగారి పూజ గుర్తు వచ్చింది.. అమ్మొ! అత్తగారి నైవేద్యం చేసి ఇవ్వాలి అని వంటింట్లోకి పరిగెత్తాను.. నైవేద్యం కోసమే పొయ్యి మొదట వెలిగించేది.. అది ఇది అని లేదు ఎదో ఒకటి, ఏది అవ్వని రోజు కనీసం పప్పు బియ్యం అత్తిసెరు అయినా చెయ్యటం అలవాటు, గబగబ మొదట వేసి తొమ్మిదిగారెలు దేవుడి గిన్నెలో వేసి అత్తయ్యకి అందించివచ్చాను.. అల్లంచట్నీకి అన్ని సిద్దంగానే ఉన్నాయి.. రోటీలో రుబ్బుద్దాము అనుకున్నా కాని ఇప్పుడు అయ్యేట్లు లేదు అని మిక్సీ టుర్ర్..డుర్ర్ అనిపించి పిల్లలు పాలు, కాపీలకి పాలగిన్నె పెట్టాను..



అంతే మా సుమ వదినా వదినా వదినా అని ఒకటే కేకలు , మా వారు రోహిత్ ఉన్నాడనేమో మావారు సరోజ చూడు సుమ ఎందుకో పిలుస్తుంది అన్నారు నాకు మాత్రమే కనిపించేలా పళ్ళు కాస్తా బిగపట్టి నేను సరే అంటూ సుమగదిలోకి వెళ్ళాను.. తన వైట్ డ్రస్ మీద పింక్ బాందీని చున్నీ కనిపించటంలేదట. అందుకు ఆ అరుపులు.. షీఫాన్ చున్నీకి ఇస్ర్తీ ఎందుకని బీరువాలో పెట్టాను..ఈ డ్రస్ నిన్ననే సత్తమ్మ తెచ్చింది అనేసి, సుమ ఎవరో తెలిసినవాళ్లు వచ్చారు..నువ్వు అరిచావని మీ అన్నయ్య చిటపటలాడుతున్నారు,, సో అన్నాను.. అంతే సో ఏంటి నేను ఏమన్నాను ఇప్పుడు నిన్ను పిలిచాను అంతేగా!! దానికే మీ ఆయనకి చిటపటలా!! సరే త్వరగా రా పొయ్యి మీద ఉన్నాయి అని వంటింట్లోకి పరిగెత్తాను.. పాలు ఇప్పుడే పైకి వస్తున్నాయి.. సిమ్ లో పెట్టి హలోకి చూస్తే అత్తయ్య, మావయ్య, మా వారు కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.. నేను పదినిమిషాలలో అందరికి టిఫిన్ రడీ చేసి రండి టిఫిన్ కి అని పిలిచాను. రా రోహిత్ అంటూ అంతా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు.. మావయ్యగారు ఇడ్లీ తప్ప వేరే తినరు, అందుకు రోజు ఇడ్లీ ఉంటుంది.. నేను వేడి వేడిగా ఇడ్లీ, గారెలు అందిస్తుంటే అత్తయ్యగారు వడ్దించారు.. అత్తయ్య కొసరి కొసరి చాలా బాగా వడ్డిస్తారు..ఆ ప్రేమకి ఇంకా ఇంకా తినేయాలి అనిపిస్తుంది.. అందరికి కాఫీ కలుపుతుంటే సుమ వచ్చింది వైట్ అండ్ వైట్ మీద పింక్ చున్నీ చూడగనే నా దిష్టీ తగిలేలా ఉంది.. కాఫీ తనతోనే పంపిచేసి నేను మద్యాహ్నం వంటపనిలో పడ్డాను.. రోహిత్ అక్కా! నేను ఉంటాను,ఆఫీస్ కి వెళ్ళాలి మళ్లీ తీరిగ్గా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు..



పని అయ్యాక అత్తయ్య నేను ఆ మాట ఈ మాట చెప్పుకుంటుంగా ""అమ్మాయ్ ఆ రోహిత్ ఏలా ఉన్నాడు""మన సుమకోసం అడిగితే బాగుంటుదేమొనమ్మా!!అన్నారు.. వాళ్ళ గురించిన వివరాలు,ఆస్తులు, బంగారాలు అన్నీ చెపుతూ మావగార్ని "'ఏవండోయ్ ఓ మాటు ఇటు వస్తారా"'అని పిలిచి మనసులో మాట వెంటనే చెప్పారు..మావయ్య అప్పుడే సుమకి పెళ్ళి ఏంటీ?? అన్నారు.. అదేంమాట మన పెళ్ళినాటికి నా వయస్సు పద్నాలుగు, మీ వయస్సు పంతొమ్మిది అలా చూస్తే సుమకే వయస్సు తక్కువేంకాదు.. మీ కుతురు మీకు ఎప్పటికి చిన్నపిల్లగానే అనిపిస్తూంది!!అయినా పెళ్ళి అనగానే అయిపొతుందా ఏంటి?? సంబంధం కదపాలి, ఉభయులకి నచ్చి ముందుకు రావాలి, జాతకాలు, కట్నలు,కానుకలు అన్ని అయ్యిక కదా ఓ రాయి వేస్తే పోయ్యేది ఏముంది?? విశాలవాళ్ళు మంచోళ్ళు, మనకు తెలిసిన మనపిల్ల అలాంటి ఇంటికి వెళ్ళితే సుఖపడుతుందని ఏదో ఆశ కొద్ది ఆత్రంగా అన్నాను..సరే మీరు వద్దంటే వద్దు లెండి అనేసి, గుడికి టైమ్ అవుతుంది " రామరామ "' లేచి స్నానానికి వెళ్ళారు, మావయ్యగారు దీర్ఘాలోచనలో పడ్డారు..నేను ఈ మాట సుమ చెవిన వెయ్యాలని సుమకోసం ఎదురుచూస్తున్నాను.. పిల్లలు స్కుల్ నుంచి వచ్చి పుస్తకాలు పడేసి ఆటకి వెళ్ళిపోయారు..నాకు వాళ్ళకు పాలు ఇచ్చే ధ్యాస కూడా లేదు. విడ్డురమో ఏమో! మా వారు టైమ్ కి ఆఫీస్ నుంచి వచ్చారు.. నేను నా ఆత్రం కొద్ది అత్తయ్య,మావయ్యగారి సంభాషణ వివరించేసి, మావయ్యని ఆలొచించేలా చేసి అత్తయ్య చాకచక్యాన్ని మెచ్చేసుకుని, సుమ రియాక్షన్ కి మదనపడి మా వారికి ఉపిరిసలపనివ్వలేదు..అవును అన్నట్లు ఇన్నేళ్ళ తరువాత మీకు రోహిత్ ఎలా కలిశాడు??అని అడిగాను..తను ఆఫీస్ పని మీద బ్యాంక్ కి వెళ్తే అదే బ్యాంక్ లో రోహిత్ పని చేస్తున్నట్లు మాటలలో ఒకరినొకరు గుర్తు పట్టినట్లు చెప్పి, కాఫీ పురమాయించి టీవీలో వస్తున్న మాయదారి క్రీకెట్ కి అంకితం అయిపోయారు.. అయ్యో! నేను తన చెల్లి పెళ్ళి గురించి ఇంత మొత్తుకుంటుంటే ఈయనకి చీమైనా కుట్టినట్లు ఉందా?? ఇలాంటివాళ్ళు ఉన్నారు కనుకే ట్వంటి-ట్వంటిలు అంతా పెద్ద పిక్సింగ్ అని తెలిసినా మళ్ళీ మళ్ళీ ఆ సీరిస్ కి ఆ సీరిస్ అంతా హీట్ కొడుతుంది.. ఇలాంటప్పుడే నాకు కరణం మల్లీశ్వరిని గట్టి గట్టిగా తలుచ్చుకుని టి.వి ని ఎత్తికుదేయ్యాలి అనిపిస్తుంది...



నేను ఈసురోమంటూ కాపీ పెట్టుకుని వచ్చాను..సుమ కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు టి.వి చూస్తూంది.. వచ్చావా సుమా నీకోసమే చూస్తూన్నా అంటే మా వావారు కళ్ళతోనే వారి0చి, మా అమ్మ వచ్చి చూసుకుంటుంది లే!! నువ్వు టెన్షన్ పడి, దాన్ని టెన్షన్ పెట్టకు అన్నారు నాకు ఉక్రోషం వచ్చేసింది..నేనేందుకు అలా చేస్తాను.. ఇదే చేపుతున్నా సుమ ఇష్టానికి విరుద్దంగా జరిగితే ఎవర్ని సహించను అంటూ చివాలున లేచి అవతలికి వెళ్తూ గుడి నుండి ఇంట్లోకి వస్తూన్న అత్తయ్య కంట్లో కనీళ్ళతో పడ్డాను.. ఇక అత్తయ్య ని చూడలేక గదిలోకి వెళ్ళాను.. కొడుకు దగ్గర విషయం తెలుసుకున్నట్లు ఉన్నారు అత్తయ్య వచ్చి వాడి సంగతి తెలిసిందే కదా!! మగాళ్ళతో మనమే తెలివిగా మసులుకోవాలి..అయినా నువ్వు వచ్చాక సుమకి అమ్మని అనే మర్చిపోయాను..దానికి అన్నీ నువ్వే. మీ అనుబంధం నాకు తెలుసు తల్లి.. నువ్వే నా మనసులో మాట సుమకి చెప్పు.. అయినా ఇప్పుడు ఏ హెచ్చుతగ్గులున్నా సుమని నువ్వే ఒప్పించగలవు..అని ప్రేమగా తల నిమిరేసి వెళ్ళిపోయారు..



హమ్మా! అత్తయ్య సుమ నో అనకుండా నేను చూడాలి ఇప్పుడు.. నేను అత్తయ్యని పిలిచి చెప్పాను. అత్తయ్యా! సుమకి నచ్చకపోతే మాత్రం ఆరునూరైనా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అత్తయ్య అని మొదటిసారి చాలా దృడంగా అత్తయ్య కళ్ళలోకి చూస్తూ చెప్పి సుమ గదికి వెళ్ళాను..సుమ నేను వదినా మరదళ్ళు అనే కంటే స్నేహితులు అంటే బాగుంటుందేమో!! సుమ కాలేజీ కబుర్లు అవి చెపుతుంది, నేను వింటూన్నాను..సడన్ గా వదినా ఇందాక నీకోసమే చూస్తున్నాను అన్నావు "'ఏంటి సండేకి సినిమా ప్లాన్ వేసావా??అంది.. నేను మాట వచ్చింది కదా ఇక చెప్పేయ్యాలి అని విషయం చెప్పాను.. సుమ చూద్దాము నీకు నచ్చితేనే లేకపోతే నేను ఉన్నానుగా నీకు నచ్చనిది ఏది జరగదు అని చెప్పాను.. ఆనందమో, బాధో అప్రయత్నంగా ఇద్దరికి కళ్ళ నీళ్ళు తిరిగాయి... పిల్లలు వచ్చారు ఆట నుండి !!



నేను వడ్డన, వంటిల్లు సర్దుకోవటంలో పడ్డాను.. సుమ మాములుగానే ఉంది, నా వెనకే నాకు అన్నింటికి సాయం చేసింది.. ఇల్లంతా గంబీరగా ఉంది.. నేను సుమ గదిలోకి వెళ్ళాను,సుమ ఏమంటావ్ పెళ్ళి మాట అని సూటిగా అడిగాను..వ దినా నాకు ఏమీ తెలియడం లేదు. మా అమ్మ కంటే నాకోసం ఆలోచించే నీ మాటే నా మాట అనేసి, కాని వదినా అబ్బాయి నల్లగా ఉన్నాడు వదినా అంది అమాయకంగా.. నాకు నవ్వు ఆగలేదు.. నేను ఉదయం చూసి సేల్స్ మన్ అనుకున్న విషయం చెప్పాను..అదేంటి వదినా టైకట్టుకున్న వాళ్ళు అంతా సేల్స్ వాళ్లు అనుకుంటే ఎలా అంది.. మరి నల్లగాఉన్నవాళ్ళు అంతా అనాకారులు కాదు కదా బంగారు! అబ్బాయి ముఖ చాలా కళగా ఉంది ,చొరవ ఉన్నవాడు, మొహమాటం లేకపొతే ఏ విషయం అప్పుకప్పుడు తేలిపోతు0ది.. నాన్చీ సాగదీసేవాళ్లతో చాలా చిరాకు అన్నాను.. అయినా రంగుదేముంది సుమ షారుకే క్రీమ్ రాసుకుని తెల్లబడిపోయాడు అన్నాను.. నచ్చి కుదిరితే నెలకి సరిపడ క్రీములు నెల నెల పంపుతాంలే అన్నాను.. ఆ కబుర్లు,ఈ కబుర్లు అయ్యాకా సుమ నిద్ర పోయ్యింది. నా గదిలోకి వెళ్లాను కాని నాకూ నిద్ర పట్టలేదు..



తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. అందుకే ప్రొద్దెక్కాక కాని మెలుకువ రాలేదు..అత్తయ్య, సుమ వంటింట్లో తిప్పలు పడుతున్నారు..నేను వెళ్ళి అందుకున్నాను పని.. ఆదివారం కనుక సరిపోయింది అనుకున్నాను.. అత్తయ్య సుమకి చెప్పావా ఏంది అని అడిగారు?? అవును రాత్రి అడిగాను. మీ ఇష్టం అందని చెప్పాను..అత్తయ్య ఆనందంగా వెళ్ళి కొడుక్కి కర్తవ్య బోధ చేషారు.. ఇక అంతే అదే వారంలో పెళ్ళి చూపులు అయ్యాయి.. విశాల పిన్నిగారు మాట పద్దతి ఎంతో బాగుంది.. ఒక్కగానొక్క కొడుకు.. ఆవిడ వెళ్తూ, వెళ్తూ ,అత్తయ్యతో వదినా! మీ అమ్మాయి అంటే మేము చూడనక్కర్లేదు.. మాకు అన్ని విధాలుగా నచ్చింది..కట్నాలు అవి మాకు ఏమి వద్దు మీ అమ్మాయికి మీ ఇష్టం మీకు ముఖ్యం. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చితే పెళ్ళే. శూన్యం వచ్చేస్తుంది ఇరవై రొజులలో పెళ్ళి ముహుర్తాలు ఉన్నాయి.. మీ మాట కోసం ఎదురుచూస్తూంటాం అనేసి బయలుదేరారు..నాకు విశాల పిన్నిగారు అన్న "'ముఖ్యంగా మీ అమ్మాయికి నచ్చితే ''అన్నమాట ఎంతో నచ్చి0ది.. సుమని అడిగాను ఏం చెప్పమంటావ్?? మీ అమ్మగారు అడుగుతున్నారు అని. సిగ్గుతో నువ్వే చెప్పు అంది..నాకు అంతగా నచ్చలేదు అన్నాను ..ఏ! అంది జెట్ స్పీడ్ లో!! దొంగ దొరికింది అని ఓ మొట్టికాయ వేసి అత్తయ్య అడగక ముందే సుమకి ఇష్టమని చెప్పాను.. పెళ్లిపనులు వేగంగా మొదలై ఇరవై రోజులలో పెళ్ళి అయ్యి మా సుమ అత్తవారింటికి వెళ్ళిపోయింది..



ఈ రోజు ఆషాడం వస్తుందని సుమని తీసుకురావటానికి ఆయన వెళ్లారు.సుమ పెళ్ళి మాట తలుచుకుంటుంటే అంతా మాయగా ఉంది .. అనుకుంటూ తన జ్ఞపకాలనుండి బయటకు వచ్చింది. ఇంతలో అమ్మా అనితా అనితా అంటూ గట్టిగా కేకలు వినబడ్డాయి. ఆ అరుపుకి కాలు చేయ్యి ఆడలేదు ..ఏదో అయ్యిందని అనుకుంటూ గదినుండి బయటకు పరిగెత్తింది సరోజిని..

వచ్చేవారం రుక్మిణి కథతో కలుద్దాం..


వెలుగుల జ్యోతి ఇంకా దేదీప్యమానంగా ని౦డునూరేళ్ళు ఆనందంగా వెలగాలని కోరుకుంటూ.....




ప్రేమతో,
మీ,
సుభద్ర..



ఇవ్వన్ని మా తోట పూలు బాగున్నాయా??అలామాతోటలోకి షికారు కి వెళ్ళుతున్నా,మీరు వస్తారా??ము౦దు బయట ను౦చి గేట్ తీయ్యగానే చిన్నదారి ఆదారికి చేర్చి లాన్ ...ఇప్పుడే కదా చల్లపడి౦డి నెమ్మదిగా పెరుగుతున్నగడ్డి...గడ్డి చివర గోడకి చేర్చి మొక్కలు...మొక్కలకి పువ్వులోయమ్మ పువ్వులు ర౦గుర౦గులపువ్వులు...ఎరుపు, పసుపు, తెలుపు,గులాబిర౦గుల పువ్వులు...ఓస్ ఇవా అనేక౦డి మరి!!చాలాకష్టపడి చ౦టిపిల్లల్నిపె౦చిన౦త శ్రద్దగా,మట్టికొని,నీళ్ళుకొని శ్రమపడి పూయి౦చిన పువ్వులు...గాలికి నట్యమాడుతూ,తలలు ఊపుతూ,నవ్వులతో ఉసులాడుతూ,నిన్నపడిన చిరుజల్లుకి పరవసిస్తూ....చలికి స్వాగత౦ పలుకుతూ చిన్ని చిన్ని చిగురులు తొడుగుతూ భలే స౦దడి చేస్తూన్నాయి...చల్లగాలి తిరిగి౦ది కదా!!మా ఎడారిలో పచ్చదన౦ పరుచుకు౦టు౦ది...




అలా ఓ అడుగు వెనక్కి మా కురగాయల మడి దగ్గరకివెళ్ళితే......వ౦గ,బె౦డ,తోటకూర,పాలకూర,గో౦గుర,టమాట,మిరప తొలిఆకులు ముదిరి మలి లేతచిగురులు తొడుగుడుతున్నాయి.. ఆ పైన రానా వద్దా అ౦టూ చిక్కుడు,ఆనపాదులు...ఓ మూలకి మా తోటకే సూపర్ సీనియర్ ములగచెట్టు...మరోమూలకి కొత్తగా వేసిన కర్వేపాకు మొక్క..ఈమెని పె౦చడానికి ఎ౦త కష్టపడ్డనని,బియ్య౦ కడిగిన నీళ్ళు పోసి,పనిగట్టుకుని గ౦జి వార్చి అ తేటపోసి మొత్తానికి పనిజరిగి౦ది...అ౦తక౦టే అత్యవసరానికి కూడా ఓ చిన్న ఆకు కూడా గిచ్చకు౦డా ఉ౦చితే ఇప్పుడిప్పుడే ర౦గు,రుపు,వాసన స౦తరి౦చుకు౦టు౦ది...రోజు ఒక్కసారి అయినా అన్ని మొక్కల్ని చూడాలి లేదా స్ధిమిత౦ ఉ౦డదు...

ఇల్లు౦తా ఖాళీ అయ్యాక పెద్ద కాఫీమగ్ (అప్పుడప్పుడు మాత్రమే)పట్టుకుని తోట అ౦త అలా పది నిమిషాలు పచారీలు చేస్తూ మొక్కల మద్య గడిపితే పదిగ౦టలుకి సరిపడ్డ ఫుల్ చార్జీ అయ్యిపోతాను...ఇక మా మొక్కలు కాని పూసిన\కాసిన ఇక ఎ౦త ఆన౦దమో చెప్పలేను..మా తోటలో మునగకాయలతో ఆవకాయకాని,సా౦బర్,కూర ఏ౦ చేసిన అబ్బో బ్రహ్మ౦డ౦ అనుకో౦డి...వ౦కాయల రుచి చెప్పల౦టే "ఆహ ఏమి రుచి అనరా మయమరిచి రోజుతిన్నామరి " పాట అయితే సరిగ్గా సరిపోతు౦ది...మిర్చి కార౦ తక్కువ ప్లేవర్ ఎక్కువ...ఇలా నా చేతితో కోసి అలా ప్రెష్ గా వ౦డట౦ ఆ మజానే వేరు!!


మా తోట అన్ని దశలలోను పోటోలు తీసి మా నాన్నకి ప౦పి౦చట౦ ఇ౦కా ఇ౦కా ఇష్ట౦!!మా నాన్న నా పనితన౦ చూసి మురిసిపోయి ఊరిలో అ౦దరికి మా పెద్దది అ౦టూ చెప్పితే,,,,,,,నేను కన్పి౦చినప్పుడు వాళ్ళు చూశా౦ నీ వ్యవసాయ౦ అని వాళ్ళూ అ౦టు౦టే మా సుపర్ సీనియర్ ములగమొక్క చిటారుకొమ్మకి నాకు అ౦దక వదిలేసిన ముల్కడ పట్టుకుని వ్రేలాడూతూ.......అబ్బ అబ్బ ఏ౦ ఖుషో!!




నాల్గు/ఐదు నెలల వ్యవసాయనికి మహా ఆన౦ద౦ నాకు!!ఆ సీజన్ కోస౦ ఆశగా ఎదురుచూస్తాను..అలా సీజన్ లో స౦వత్సరానికి రె౦డు/మూడు సార్లు చిన్న గా "నువ్వురమ్మ౦టే నేను రాన్నానా అ౦టూ పలకరి౦చే చిన్ని జల్లు..ఓ రె౦డు-ఐదు నిమిషాలు వస్తు౦ది..నేను అబ్బ వర్ష౦ అని గబగబ పరిగేత్తేసరికి చప్పుమని గచ్చుమీద పడ్డ చినుకు ఆవిరి అయ్యిపోతు౦ది...అదే౦ మాయొ కాని ఈ స౦వత్సర౦ బీభత్సమైన వర్ష౦(ఓ అరగ౦ట ఆగకు౦డా జోరుగా)..పిల్లలు నేను తనివితీరా ఎ౦జాయ్ చేశాము..ప్రీజ్ లోని కెరెట్ హల్వాని ఓవెన్ వేడిచేసి వర్ష౦లో తడుస్తూ తి౦టు౦టే భలే మజా తెలుసా!!ఏ౦టి స్వీటా అనక౦డి...నేను ఏ పకోడిలో/బజ్జీలో ఆలోచి౦చేలోపు ఇక్కడ పుణ్యకాల౦ కాస్తా అయిపొతు౦ది..ఆ మద్య టి.వి లో చూశాను..నార్త్ లో కెరెట్ హల్వ్,బాగా కాచిన పాలు శీతకాల౦ చలి మ౦టదగ్గర తి౦టూ,తాగుతారని..సో నేను ఇలా ట్రయిల్ వేశాను..ఏమాటకామాటే చెప్పుకోవాలి "చిటపట చినుకు పడుతూ ఉ౦టే ,మిర్చిబజ్జీలు తి౦టూ ఉ౦టే స్నేహితులతో వర్ష౦లో పరిగెడుతు౦టే చెప్పలేని ఆ హాయి........"



వర్ష౦పడ్డ ప్రతిసారి కాగిత౦ పడవలే గుర్తువస్తాయి...నా చిన్నప్పటిలా మా పిల్లలతో మళ్ళి ఆడుకోవాలన్న ఓ కోరిక తీరి౦ది..ఒకే గొడుగులో తడుస్తూ(మాముగ్గురికి సరిపొదుగా మరి)<<<<వేడి వేడి హల్వ తి౦టూ<<<పడవలు వదులుతూ ఓ అ౦దమైన ఆహ్లాదమైనరోజుని అపురుప౦గా పిల్లలతోనేను,పసితనపు పసిడిగురుతుగా పిల్లలు పదిల౦గా పోటోలలో దాచుకున్నా౦...మా సాబ్ ఆఫీస్ ను౦డి వచ్చేసరికి ముగ్గుర౦ రగ్గులు కప్పుకుని ములుగుతు,తుమ్ముతూ,దగ్గుతూ....మా సాబ్ ఫుల్ గా నాకు క్లాస్ వేసుకున్నారు...పాప౦ మరి నేను పోటోలు అవి చూపి౦చి ఉరిస్తే ఆమాత్ర౦ కుళ్ళుకోరే౦టి !!!ఇ౦దులో పెద్ద చోద్య౦ ఏము౦దమ్మా!!