వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఈఏడు దేసవిదేసల ఇత్తనాలు వాడాం ఎగసాయానికి!!!అన్ని మా దొడ్డకాపు, మా చెడ్డరుసి...ఇలా కోసి అలా తాలింపు ఎయ్యగానే ఓ యమ్మ ఇక ఓటే ఘుమఘుమలు...ఈ నాల్గు నెలలు మా ఇంట్లో చేప,మా౦సమ్ ఊసే లేదు!!రోజు మా అమ్మవి,అత్తమ్మవి,నా సిన్నప్పటి నాన్నమ్మ రుసులే!!పప్పుటమాట అదీ కాక దేసవాలి టమాట ఎం చెప్పను మరి...
ఏ కూర వండి సుర్రుమనే మిరపకాయ రుసే కూరకే గుభాలి౦పుకదా!!వ౦కాయపచ్చడి,వంకాయవేపుడు,
వంకాయకోత్తిమీరకారం ఓ దేవుడో వంకాయ మీనా పుస్తకమే రాయచ్చు>>> అది మన తోట వ౦కాయ అయితే ఇక సెప్పేది ఏముంది అయ్!!!!!
మా వాడ్ని చూశారా??కాకరకయల్ని పట్టుకుని ముర్సిపోతూన్నాడు....ఈ ఏడు ఎగసాయం పుల్ కలిసొచ్చింది..
ఇరసాకాశాయ్ అన్ని అయ్!!ఓపాలి కింద లుక్కెయ్యండి..


ఇలా౦టి కాకరకయల్నిగుట్టికాకరకాయని వండితే ఆ ఘుమఘుమకి పక్కి౦టి ఈజిప్తోళ్ళు కుడా ఎం కూరఅని అడిగేవోళ్ళు!!కాస్తా ముదరనిచ్చాక చక్రాలు కోసి పులుసులో ఉడకేసి బెల్లపొడి జల్లి దింపిత్తే కాకరకాయ చెదు అన్న మాట గోదాట్లో కొట్టుకుపోద్ది!!!ఆనక మరింక ముదిరాక గింజపలంగా సన్నగా తరిగి సౌరు,వర్ర బాగా వేసి కరకర ఎపితే వన్నం అంతా చివరాకిరి దాక ఎపుడే తింటారు అయ్!!


టమాలకి వచేకాడికి పెద్ద కధే జరిగింది.నేనేమోఏవైనా దేసవాలి ఎయ్యాలని!!మా మాలి(కుకు౦) ఆ దేసవాలి ఎత్తే సెమ దండగా అని!!!మొత్తాని ఉర్ని౦చి (మా వీరవెంకట ఫెర్తిలైజర్స్) కొనికోచ్చిన ఇత్తనాల నారుపోసాను..,,,,వారం అయినా ఉలుకు పలుకు లేదు>>>సరేలే అని మల్లి గోప్పుతవ్వి మల్లి నారేశాను�ఈసురో వాసుదేవా అంటూ ఏదో వచ్చాయి కలకాంతి లేదు..ఇక మనకి దేసవాలి అచ్చిరాలేదులే అనుకుంటుండగా కుకు౦,పాకిస్తానీ వోల్లంటిని౦చి దేసవాలి నారు తెచ్చి వంగానారు అడిగాడు ఆళ్ళకి(పాకిస్తానీ వాళ్ళకి)....భారత్ కి పాకిస్తాన్ కి మద్య బంగ్లాదేశ్ ఒప్పందంఅన్నమాట!!(మా కుకు౦ బంగ్లాదేసి )..అలా దేసవాలి పని అయింది!!మరే అయినా దేసవాలి రుసి ఎం ఎసిపెంచిన హైబ్రీడు కి వత్తదా???భలే ఆనపకాయ కదా!!eఈ ఇత్తనాలు మా కుకుం వాళ్ళ అమ్మ బంగ్లాదేశ్ నుంచి పంపింది..ఆళ్ళపొలం ఇత్తనంఅంటా!!!మా గొప్పరుసిలెండి...తోక్కపలంగా తుట్లుపోడిసి,చిన్న ఉల్లితరుగు వేయించి,రుబ్బి,మసాలదట్టించ్చి పులుసు పెడితే అదే నండి బాబు లంకబోచ్చు పులుసు ఆయ్!!!అమోఘం అనే మాట ఈ పులుసుకోసమే పుట్టు౦టది!! అన్నిబాగానే ఉన్నాయి కాని ఆనపకాయ పాదు కాస్తాపైకి పాకిదా౦ అని అనుకున్నాం!!తీరా చుస్తే "అబ్బ తరువాత పోటోకి రండి"..............................................................................................................................................................


.....................................................................................................................................................................


.....................................................................................................................................................................


అలా పై పైకి ఎదిగిపోనాది..మా సాబ్ కి ఇలా సాహసంకి చాన్స్ వచ్చింది... ఇంకో మాట సేప్పనా ఆయన నో అంటే నేనే కోతికొమ్మచ్చిఅనుభవం తో కొద్దారి అనుకుని ఆ మాటే మా ఇంటాయన చేవినేశా ఆమటి గుబులైపోయి "చేట్టులేక్కగాలనే.............టైపులో ఎక్క్కేశారు అయ్!!!!మా మిద్ది మీకి మేట్లులేవు...సాహసం చేయకపోతే బొచ్చు పులుసు బువ్వ లోకి వచ్చేది ఎలా???ఆనక కాసిన కాయలు కుకుం సాహసం టూకొస్తే నా కత్తికి బలేసాను!!మొదటికాయ కోసేసరికి మా ఇంటాయన కి ముచ్చట తీరిపోయింది..పై ఫోటోలో కుడేపుమూలకి ఉన్నవి మిరప మొక్కలు..మిరపలేకుండా ఎప్పుడు లేదు మా ఎగసాయం..ఈ సారి ఎంత ఎదికినా ఊర్నించి తెచ్చి మిరప ఇత్తనాల పొట్లం కనిపించలేదు..ఇంతలో ఐవిడియా వచ్చింది..తాలిపులకి తు౦పిన మిరపకాయల అడుగున గింజలు నారు పోశాము..మా భలేగా ఏపుగా వచ్చాయి మొక్కలు..మాకు సరిపడా ఉంచుకుని పాకీస్తానీవాళ్ళకి కుడా ప౦పాను..

మిరపకాయలు థాయిలాండ్ వి మా ఇస్మాయిల్ కొట్లోవి.వంగ విత్తనాలు మాత్రం ఇ౦ట్లో వే>>నిరుడి వ౦కాయలవి అయ్ ఓన్ ఇత్తనాలండి ఆయ్!!!ఆఖరిఫోటో ఎడమేపుకి వంగమొక్కలు,మువ్వోం కాయలు,పచ్చడివి,సన్న వంకాలు రకానికి నాల్గు చొప్పున ఎసాం..మేము తినగా తిని వంకాయలు,,టమాటాలు అందరికి ఇచ్చాం..ఈ పాలి ఏమైనా కిట్టుబాటు ఎగసాయం..