వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

కశు రడీ స్మైల్ ,స్టాండ్ ప్రోపెర్లీ ,రడీ స్టడీ స్మైల్ ...............అయ్యో నవ్వమంటే కళ్లు ముసేశావు,సరే మల్లి నా రడీ స్మైల్ "చీజ్ చీజ్ "చెప్పు.........

అమ్మో అదేం నవ్వురా!!!చేతులు వదిలేయ్ నవ్వురా మా మంచి బాబు కదా!

అబ్బో ఈ నవ్వు ఎంటిరా కశు ,ఫ్రీ గా నవ్వాలి లైక్ "హి హీ హి హీ .." అలా సరేనా...
హమ్మయ్య చాలు రా నాయనా ఈ నీ చిరు మందహాసం..ఇ౦త కంటే నా వల్ల కాదు..
అదండీ ఆఖరికి మా వాడు ఆ మాత్రం నవ్వించడానికి గంట పట్టింది ,డిజిటల్ కెమెరా కనుక సరిపోయింది.లేక పొతే ఓ రీలు కుడా సరిపోయేదికాదు.అనట్లు మరిచా వీడు మా చిన్నోడు కశ్యప్ ..
హీరో చేయాలనీ మా వాడికి కెమెరా ముందు తర్ఫీదు ఇస్తున్నా...





ఈ ఫోటో ఉన్నది మా జేజి,ఆమె కూతురు,ఆమె కూతురు, ఆమె కూతురు,ఆమె కొడుకు.
ఎ౦టి చాలా గజిబిజి గా ఉందా!సరే వివరంగా చెపుతా చూడండి.
పోటో ఉన్నా బుడతడి నుంచి చెప్పనా,వాడు పేరు సూర్య వాడి కుడి ప్రక్క వాడి అమ్మ సుభద్ర(నేను).
ఇంక నిలుచున్న వారిలో కుడి నుంచి సుభద్ర అమ్మ అలివేలు,ఆమె ప్రక్క వాళ్ల శ్రీ రాజా వత్సవాయి చిట్టి కొండమ్మ గారు,ఆఖరున వారి కూతురు లక్షిగారు(అలివేలు అమ్మ).
మెత్తం గా చెప్పాలంటే ఐదు తరాలు.చాలా అరుదుగా ,కొంతమందికే దొరికే ఈ ఆనందం నాకు దక్కింది.
మా జేజమ్మగారు మూడు రోజుల క్రితం కాలం చేశారు.అందుకే ఆమె గురించి రాయాలని ఈ ప్రయత్నం .తను ఏమి చదువు కోలేదు.కాని భారతం ,రామాయణం ,పల్నాటియుద్దం అన్ని గ్రందాలు పద్య తర్పర్యాల తో సహా చెప్పేవారు.రాముడు ని క్షణ కాలం కుడా తలవకుండా ఉండేవారు కాదు .ఇంక పద్దతులు,సాంప్రదాయాలు పూజావిధానాలు ఎప్పుడు అడిగినా ఆలోచించకుండా ఆనర్గలం చెప్పెసేవారు.ఇంక వంటలకి వస్తే ఆ రుచి వర్ణించటానికి మాటలు లేవు.ఎన్ని వేలమందికి అయినా వండేవారు.పెళ్లిళ్లకు ఎ కర్యలేకైనా జేజమ్మ లేకుండా ఊర్లో ఎవరు చేసేవారు కాదట!ఇందిరా గాంధీగారు జేజమ్మ చేసిన పాకం గారిలు తిని జేజిని చుడాలనుకున్నారట!! ఆ రోజులలో ఉండే కట్టుబాట్ల వల్లనా జేజమ్మ వేల్లలేదట!!!..ఇంక అన్ని పురాణ ఘట్టాలు పాటలుగా రాగయుక్తంగా పాడేవారు.మా పెద్దవాడు పుట్టినప్పుడు తనకి చూపించడానికి వెళ్లి వారం ఆమె తో ఉన్నాము.తను పాడే జోలకి నేను నిద్ర పోయేదాన్ని.లెక్క లేనన్ని పాటలు,కధలు అందులో చాలా కొన్ని మాత్రం అమ్మ,అమ్మమ్మ వాళ్లు నేర్చుకున్నారు.కొన్ని సరదాగావాళ్లు వీళ్ళు రాసుకున్నవి ఉన్నాయి.అమ్మమ్మ ఆనారోగ్యం వల్ల అమ్మమ్మ నల్గురి సంతానాన్ని తానె అమ్మ అయ్యి పెంచారు.అమ్మ వాళ్లు జేజినే అమ్మ అనే పిలిచేవారు.చాలా ఆత్మాభిమానం ఎక్కువ,తనకి ఓపిక ఉన్నన్ని రోజులు ఎవరిమీద ఆధార పడకుండా తన వంటా తో సహా తనే చేసుకునేవారు.జేజి భాష కొంచం గ్రాంధికం గా ఉండేది. మేము తనతో గడిపింది తక్కువ కాని మా అమ్మ తన చిన్నతనం గురించి జేజి గురించి చెప్పేవారు.ముఖ్యంగా అమ్మ అంటే జేజికి ,మా ముత్తతాతయ్య గార్కి చాలా ఇష్టం నేమ్మదస్తురాలని.నాకు ఉహ తెలిశాక అమ్మ తో వెళ్ళినప్పుడు వాళ్లు అమ్మ మీద వాళ్లు చూపిన ప్రేమ ని చూసి మా అమ్మ వీళ్ళ పాపకదా అనుకున్నా. పెంచిన ప్రేమ గొప్పది అంటారుగా బహుశా అందుకేనేమో అమ్మ పెద్దమ్మ, మావయ్యలు అమ్మమ్మ కంటే జేజిమ్మనే అన్నింటికి తలుచుకుంటారు.ఎంతా సాంప్రదాయ వాదో అంతాగా మార్పును కుడా ఒప్పుకునేవారు.మంచి హాస్య చతురత కుడా ఉండేది.ఎవరికైనా మాటకీ సమాదానం చెపితే మల్లి తిరిగి మాట్లాడే అవసరం ఉండేది కాదట! తనకున్న లేకున్నా సాయం అని వచ్చినావారికి కష్టం తీర్చి పంపేవారట.ముత్తతాతగారు వెనక ముందు చూడక మాట ఇవ్వదని అనేవారట! రెండేళ్ళ గా ఆనారోగ్యం తో భాధ పడుతున్నారు.గత సంవత్సర కాలంగా పూర్తిగా మంచం మీదే ఉన్నారు.మా అత్తయ్యలు (మేనమావ భార్యలు)అన్ని ఒక చంటి పాపని చూసి నట్లు గా అన్ని సపర్యలు చేసి వాళ్ల ఋణం తీర్చుక్కున్నారు.సొంత బిడ్డలే చూడని ఈ రోజులలో భర్త అమ్మమ్మ కి అన్ని చేసి అత్తయ్యలు అభినందనీయులు .జేజి గత నెల గా చాలా తీవ్ర అనారోగ్యం తో భాధ పడుతున్నారు.ఇంక కష్టం అని తెలిసినా ఆఖరు వరకు అన్ని ప్రయత్నాలు చేసారు.నేను అమ్మni జేజి యొగక్షెమాలు అడిగిన ప్రతిసారి అమ్మ నరకం అనుభవిస్తున్నారని కన్నీళ్ళ పెట్టుకునేవారు.పదిహేను రోజుల క్రితం కాలు కుడా తీసేశారు.నేను రాముడ్ని చాలా వేడుకున్నా ఇంకా జేజిని క్షొభ పెట్ట వద్దని.జేజమ్మ తన తోభైముడవ ఏటా రాముడి సన్నిధి చేరుకున్నారు. నాకు తెలిసి జేజమ్మ కబుర్లు కధలు ,పాటలు బ్లాగ్ లో పెట్టాలను కుంటున్నా.జేజి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ శ్రీ రామాచంద్రాముర్తిని ప్రార్దిస్తూ....
ప్రేమ తో ,
మీ అలివేలు కూతురు

అశోక్ నగర్ (హైదరాబాద్)లో ఉండే మా అత్తయ్య వాళ్ల బెడ్రూం కిటికీ లోంచి అభయ హస్తం చూపించే టాంక్ బండ్ బుడ్డుడ్ని చూడటం నాకు చాలా ఇష్టం.నాకు బుద్దుడి దగ్గరకి వెళ్ళాలన్న కోరిక మొన్న మార్చ్ లో తీరింది.మా సాబ్ అడగగానే ఓకే అన్నారు.నేను ఎగిరిగంతేసి అందరిని బయలుదేరండి అని బుడ్డుడ్ని చూడటానికి అనగానే హైదరాబాద్ వాళ్ళు అయినా మాబావగాడు,మా వారి కజిన్ మొహాలు మారాయి,నేను ఉత్సాహం లో పెద్దగా పట్టించుకోలేదు.మా చెల్లి అక్కడే ఉంటున్న తను ఎప్పుడు చూడలేదట!అంతా వెళ్లి టికెట్ కొని బోట్ కి లైన్ లో నిల్చున్నాం.
నా వెనక ఒక కుర్ర బ్యాచ్ ఉన్నారు.వాళ్ల మాటలు నాకు నవ్వు తెప్పించినా చాలా భాధ కుడా పడ్డాను.వాళ్ల లో ఒక అమ్మాయి తనకు ఈత రాదనీ మీలో ఈత వచ్చినవాళ్ళు నాతో ఉండండి అంటే ,ఒక అబ్బాయి నీకు తెలియదా ఈ వాటర్ లో అంటు పడటం జరిగితే ఈత వచ్చినా,రాక పోయినా పైకి పోతారు అదే ఈ వాటర్ మహిమ అన్నాడు.మరో కుర్రాడు మన సాంభడి కి ఒక స్పూన్ ఈ వాటర్ కలిపి ఒక కోలా తాగిస్తే వాడి పిరియడ్ ఈ మంత్ అంతా మనకి లిజరే !!!!అని తెగ నవ్వుకున్నారు.
బోట్ వచ్చింది అంతా ఎక్కేసాం నాకు ఏదో చెడు వాసనా అనిపించి మా వాళ్లు అందరి వంక చూసా!మా చెల్లి పిల్లలితో కబుర్లులో పడి,మా సాబ్ ప్రకృతి ని చుస్తూ బిజీ గా ఉన్నారు.మా వాసుని (మా వారి కజిన్)ని మీకు ఏమైనా వాసనా వస్తుందా అని అడిగా అదా ఇక్కడ అదే వస్తుంది.అని నవ్వారు ఎ ఎందుకు అని అడిగే లోపలే బుద్దుడు దగ్గరకు వచ్చేసాం.
నేను ఆత్రం గా దిగి తనివిరా బుడ్డుడ్ని చూసా,పైగా సాయంత్రం కావటం వల్లనా వాతవరణం కుడా బాగుంది.చిన్నరంగు రంగు లైట్స్ వెలుగులో బుద్దుడు భలే ఉన్నాడు.అంతా కంపులో కుడా కన్నులకి ఇంపుగా నవ్వుతూ ,అరమోర్పు కన్నుల తో ఆశీర్వదిస్తూ......బుద్ధం శరణం గచ్చామి అనుకుని దణ్ణం పెట్టుకున్నా. ఇంకా అందంగా మలిచిన శిల్పి గార్కి,ఆంద్రా అన్నా గార్కి హాట్స్ అనుకుని పనిలో పని గా మావారికి కుడా థాంక్స్ చెప్పా!చిరాకాలా కోరిక తీర్చినందుకు.కాని ప్రతిగా మావారు కెమెరా తేనందుకు కసురుకున్నారు.ఇంటి దగ్గరా గుర్తు చేయవచ్చుగా అని నా మొబైల్ లో రెండు స్నాప్ తీసా.తిరిగివస్తుంటే మన బుద్దభాగావానుడికి ఈ కంపేలా ???అని విచారం కల్గింది.
ఇంటికి తిగివచ్చక ట్యాంక్ బండ్ కంపు గురించి చిన్నచర్చ ,కంపు కారణాలలో ఒకటి గణపతి నిమర్జన అనగా గణపతి బొమ్మ తయారీకి వాడే రాసాయనాలు అని అన్నారు .అందుకే టాంక్ బ్యాండ్ నీళ్లు చాలా చిక్కగా కుడా ఉంటాయని చెప్పారు.అయ్యో అని నిటుర్చి,బువ్వ తినేసి బజ్జున్నాం.నాకు ఆ రాత్రి అంతా నేను ఒక్కదాన్నే తెగ గణేష్ నిమర్జనా చేసేస్తునట్లు కల వచ్చింది.అక్కడే మర్చిపోయా!
కాని నాకు వినాక చవితి అని చూసినప్పటి నుంచి నా చిన్నప్పుడు నా నాన్నమ్మ మట్టి గణపతి ని ముద్రబల్ల తో స్టాంపు చేయటం,మేము కనిపించిన ఆకులు అన్ని ఆ మొక్క పేరు తో పత్రి పత్రి అని సంచులు సంచులు కోయటం అన్ని గుర్తు వచ్చాయి.పూజ బుక్ లో కుడా ఉంటుంది కదా మట్టి తో చేయమని.
అంతా కొంచం ఆలోచించండి పర్యావరణ కాలుష్యం గురించి ,పిల్లలకి ఎ కష్టం కలగకుడదని మనం అన్ని అమర్చి పెట్టాలి అనుకుంటాం,అందుకే మనం కష్ట పడినా వాళ్ళకి అన్ని అమర్చి పెట్టాలను కుంటాం కదా!అందుకే చేత అయినంతా పర్యావరణం కాపాడుదాం.మనం ఒక్కళ్ళం చేస్తే అవుతుందా అని అనుకోకుండా చిన్న చిన్న విషయాలకి అశ్రద్ధ చేయకుండా మన వంతు ప్రయత్నం చేద్దాం.మనం చెస్తూ అందరికి చేయమని ప్రోత్సహిద్దాం ,మన పిల్లల్ని ఈ మంచి కార్యం లో భాగస్వామ్యులని చేద్దాం.
ప్రతి పనికి ముందు మనం విఘ్నాలని తొలగించమని ఆ విఘ్నేస్వరుడిని కొలుస్తాం .అందుకే వినాయకుడి బొమ్మతో ఈ వినాయక చవితి నాడు మట్టి గణపయ్యని పూజించి పర్యావరణం కి మన వలన హాని కలిగించకుండా మంచి పని చేసి చూపుదాం.మన పిల్లలలికి సాంప్రదాయం తో పాటు పర్యావరణం పట్ల భాద్యత నేర్పుదాం. ముఖ్యం గా ప్లాస్టిక్ వాడకం మానేయటం,పవర్ ,నీళ్లు పొదుపుగా వాడటం మనం చెస్తూ ,మన ఇంటి వరకు మార్పు తీసుకువద్దాం.అన్నట్లు మా ఎడారి లో మట్టి దొరకదు అందుకే నేను పసుపుతో చేస్తాను.
మరి ముందుగా ఎవరు నాతొ పాటు మట్టి గణపతి లేదా పసుపు గణపతి కి పట్టం కట్టేవాళ్ళు .చేతులు ఎత్తండి.అందరికి అడ్వాన్స్ వినాయకచవితి శుబాకాంక్షలు .అంతా తొందర ఏమిటి అంటున్నారా గణపతి ని చేయటానికి ముందుగా నే చెప్పాలి కదా!


పాము అని ఎవరి బుడతలు అనుకుంటున్నారా !!మా పిల్లలే నల్ల సూరి గాడు(సూర్య),తెల్ల సత్తిగాడు నేను" పాముబాబోయి""అంటానికి కారణం నా పిల్ల లాంటి మా ఇన్ డోర్ ప్లాంట్స్ చూసారు గా!!సరే అయితే రండి తరువాత బొమ్మకి చెపుతా పాము స్టోరి .



పాము అని ఏమిటి మొక్కలు పాతడానికి రెడీ గా ఈ గమాల అనుకుంటున్నారా,వస్తున్నా అక్కడికే వస్తున్నా. చూసారుగా ఈ పాట్ ని ఇందులో మొక్క పాతక ఏదో కదులుతున్న అనుమానం వచ్చిందంట ఒక తెలిసిన ఆసామికి ,సర్లే
చూద్దాం అనుకుని ,అబ్బ రండి రెండో పోటోకి.........




ఒక రేకు లాంటి దానితో కదిపితే
ఏదో మెదులుతుందట!!!ఏంటా అని తేరిపారా చుస్తే ,,,,,,,,,,,,,,,,,,,,,,
చేతిలో కుండి వణికిందట...అదేమిటో
తెలియలేదా మీకు అయితే చూపిస్తా వెళ్ళదామా నెక్స్ట్ పోటోకి ........




అది బాబు సంగతి ,అవును మీరు చూస్తున్నది ప.పా..పా..ము.
పైగా ఒకటి కాదు రెండు పాపం పిల్లలు
అప్పటివరకు ఆ గమల వాళ్ల వంటింటి
కార్నర్ లో ఉందట...
రకరకాలు గా ఆలోచనలు దాడి చేసాయట!హౌ అనుకుంటున్నారా!
ఇంక నాలుగు ,ఐదు ఫోటోలు చూస్తూ చెప్పుకుందాం.



తెలిసిన ఆసామి అని చెప్పగా ,ఆయనకీ వాళ్ల అబ్బాయి ప్లాంట్ బర్త్ దే గిఫ్ట్ ఇచ్చాడట!వాళ్ళు కొన్నాళ్ళు కిచన్ కార్నర్ లో పెట్టి వాతవరణం అనుకులించాక బయట పెట్టి చూస్తే ఈ ఎపిసోడ్ జరిగింది...వాళ్లు ఉండేది చల్లని ప్రదేశం కనుక లోపల ఉండిపోయి ఉన్నాయి..వీళ్ళు ఇంట్లోకి తెచ్చేసరికి అవి హీటర్ వెదికి పిల్లలుగా మారాయి.. గో నెక్స్ట్ క్లిప్ కి .....



మరలా చూడండి ,అమ్మో పొడుగ్గానే ఉన్నాయి కదా !!!వాటి వయస్సు జస్ట్ ఒక వారం అట!! అసలు విషయం ఏమిటంటే అవి చాలా ప్రమాదకరం అయిన కాపర్ హెడ్ అనే రకమాట! నాకు అయితే కట్ల పాములా అనిపిస్తుంది. చిన్నపుడు విన్న కట్లపాము కరిస్తే పాము మీద ఉన్న అన్ని కట్లు సార్లు ఎక్కిళ్ళు వచ్చి మనిషి చనిపోతారని.

ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు భయ పడ్డానో .....మా ఆయన కి ఈ ఫోటోల మెయిల్ వచ్చింది.ఇంక అంతే నా ఇన్ డోర్ ప్లాంట్స్ అన్ని ఎండలో పడ్డాయి. పాపం అసలే వేసవి మాకు వేసవి నీళ్లు రెండు పూటలా పోస్తున్నా అమ్మ అమ్మ అమ్మ అని గుక్క పెట్టు ఏడుస్తున్నాయి. నీళ్లు పెడుతూ ఉరడిస్తున్నా.. ప్చ్.


Get this widget | Track details | eSnips Social DNA



జో అచ్యుతానంద జో జో ముకుందా

రావె పరమానంద రామగోవిందా..



నందునింటను జేరి నయము మీరంగ

చంద్రవదనలు నీకు సేవ చేయంగ.
నందముగ వారిండ్ల నాడుచుండంగ

మందలకు దొంగ మాముద్దురంగ.




పాలవారాశిలొ పవళించినావు

బాలుగా మునుల కభయమిచ్చినావు

మేలుగా వసుదేవు కుదయించినావు

బాలుడై యుండి గోపాలుడైనావు.




అట్టుగట్టిన మీగడట్టె తిన్నాడే

పట్టికోడలు మూతిపై రాసినాడే

అట్టె తినెనని యత్త యడుగవిన్నాడే

గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే.



గొల్లవారిండ్లకును గొట్బునకు బోయి

కొల్లలుగా త్రావి కుండలను నేయి

చెల్లునామగనాండ్ర జెలగి శాయి యీ

చిల్లతనములు జెల్లునట వోయి.



రేపల్లె సతులెల్ల గోపంబుతోను

గోపమ్మ మీ కొడుకు మా యిండ్లలోను

మాపుగానే వచ్చి మా మానములను

నీ పాపడే చెఱచె నేమందుమమ్మ.



ఒకనియాలిని దెచ్చి నొకని కడబెట్టి

జగడముల కలిపించి సతిపతుల బట్టి

పగలు నలుజాములును బాలుడైనట్టి

మగనాండ్ర జేపట్టి మదనుడై నట్టి.




అంగజుని గన్నమా యన్న యిటు రారా

బంగారు గిన్నెలో బాలు పోసెరా

దొంగనీవని సతులు పొంగుచున్నారా

ముంగిటనాడరా మోహనకారా.




గోవర్ధనంబెల్ల గొడుగుగా బట్టి

కావరమున నున్న కంసుబడగొట్టి

నీవు మధురాపురము నేలజేపట్టి

ఠీవితో నేలిన దేవకీ పట్టి.



అంగుగా దాళ్ళపా కన్నయ్య చాల

శృంగార రచనగా జెప్పె నీ జోల

సంగతిగ సకల సంపదల నీవేళ

మంగళము తిరుపట్ల మదనగోపాల.



నాకు నిన్న అటులుల పులిహోరా చేస్తుంటే...చిన్నప్పటి ఒక స్నాక్ గుర్తు వచ్చింది.మాకు స్కూల్ నాల్గు గంటలకి అయ్యేది.ఇంటికి వచ్చేసరికి నాల్గునర లేదా పావుతక్కువ అయిదు అయ్యేది.బాగ్ గేటు దగ్గరే పడేసి తాతమ్మ దగ్గరకి వెళ్ళేదాన్ని.తాతమ్మ వచ్చావా పెద్దదానా!రా అని తన గదిలో కి తీసుకెళ్ళి రక రకల తాయిలాలు పెట్టేవారు.అందులో నాకు చాలా నచ్చే తాయిలం.
దాలిలో ఎర్రగా కాసినా గోరువెచ్చని పాలలో బెల్లం అటుకులు వేసి పావుగంట నాననిచ్చి రెడీ గా పెట్టేవారు.నేను పాలు తాగేదాన్ని కాదు చిన్నపుడు సో నేను పొట్టిగా ఉంటానేమోమా నాన్నమ్మ లా అని తాతమ్మ భయం,అందుకే నాకు ఎలా అయినా పాలు ఇవ్వాలని వారానికి మూడు నాల్గు సార్లు అదే పెట్టేవారు.ఎంతా బాగుండేదో !పాలు అంటే తక్కువేమీ కాదు పావు లీటర్ కి ఎక్కువే.అంటే రెండు రోజుల కి ఓకసారి రెండు రోజులా కోటా నాతొ తాగించేవారన్న మాటా!! !!
మరి పాలుతాగాక పొతే ఏమి తాగేదానివి అంటారా!పెద్ద లోటా గ్లాస్ తో లోట్టేడు కాఫీ....
కాని మా తాతమ్మ భయమే నిజమయింది ,నేను నాన్నమ్మ అంతే అయ్యాను.మా చెల్లి లేచేసరికి కాఫీ రెడీ గా లేకపోతె నానా గోలా చేసేది.బ్యాడ్ గర్ల్ బెడ్ కాఫీ తాగేది.తను లేచేసరికి రెడీ గా లేక పొతే కాపే కాపీ కకాపీ ........అని ఉరంతా వినేలా ఆరునోక్క రాగం అందుకునేది.సో మా అమ్మ పిన్నికి ముందు ఎవరు లేస్తే వారికి రమ్య సౌండ్ పొల్యుషన్ తట్టుకోలేక ముందుగా కాఫీ పనే చూసేవారు.పిన్ని కి అమ్మ లేకుండా ఉండాలంటే రమ్య తో రమ్య కచేరి పెడుతుందేమో అని టేషన్ గా ఉండేదట!పిన్నె తనతో కాఫీ కోసం ఏడ్చే అలవాటు మాన్పించారు.
నేను కాఫీ మంతెన సత్య నారాయణ రాజుగారి పుణ్యమా ,మా నాన్న కుడా మానేసి నాతో ముందు లో బలవంతంగానే మాన్పించారు.కానీ ఇంట్లో ఉండే మా అమ్మతో ,మా చెల్లి తో మాత్రం మాన్పించటం మా నాన్న వల్లనా కాలేదు.బ్రూక్ బాండ్ కంపెనీ ని మా ఫ్యామిలీ పెంచి పోషిస్తుందని మా నాన్న ప్రగడ విశ్వాసం .ఇంక కాఫీ అంటే మా అత్తా(మేనత్త) పేరు చెప్పాలి ,తని నిద్దట్లో లేపి కాఫీ తాగుదామా అంటే ఓకే అంటారు.తిండి లేక పోయినా పరవాలేదు అత్తకి కాఫీ తో నడిపెస్తారు.
మీరు పిల్లలకి స్నాక్స్ టైం లో ఫ్రైడ్ వి కాకుండా అన్ని విధాలా ఎనర్జీ ఫుడ్ పాలు అటుకులు బెల్లం ట్రై చేయండి.మా వాడు ఒకసారి పెడితే ఏమిటమ్మ ఇది అన్నాడు,మా చిన్నపుడు మేము తిన్న రైస్ ఫ్లేక్స్ రా అని చెప్పా.సో హేల్తి అని చెప్పి కాల్షియం ,ఐరన్ అని చెప్పా ఇంక వాడు హ్యాపీ గా తినేస్తాడు ఈప్పుడు .ఇంకో రహస్య ఏంటంటే మనకి పెద్దగ పని ఉండదు.గోరువెచ్చని పాలలో బెల్లం వేయాలి లేక పొతే పాలు విరిగే ప్రమాదం ఉంది.మరి ఎక్కువగా నానిన బాగోదు .

స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం ఎ౦త నిజం ఈ పాట లో ని మాటలు...స్నేహితులా పండగ కదా !నా జీవిత పుస్తకం లో కొన్ని వందల వందల పేజీలు లో స్నేహ పరిమళం తో నిండి ఉన్నాయి.
ప్రతి పేజీ లోను ఎన్నో సంతోషాలు,ఎన్నెన్నో ఆనందాలు,ఎన్నో చిలిపి సరదాలు ,మాటలకందని అపురూప అనుభూతులు ఉన్నాయి. అందులో కొన్నిపాత జ్ఞపకాలే అయినా ఈ క్షణ౦ కూడా ఎంతో నూతనంగా నా మాటలకి అందని అద్బుతం గా ఉన్నాయి.
నాకు ఉహ తెలిసినప్పటి నుంచి దోస్త్ మేరా దోస్త్ మా దేవక్క,అక్క అంటే నా కంటే రెండేళ్ళు పెద్దది.చిన్నప్పటి నుంచి మేము ఒక జత.పువ్వులు కోసం ఉరంతా తిరిగినా ,బిస్కట్టు నుంచి బిర్యాని వరకు అన్ని పంచుకునే తిన్నాం.బోలెడు గిల్లికజ్జాలు కూడా ఉన్నాయి.ఎన్ని ఉన్నా మర్నాటి మల్లి మామూలే! ఎ పూటా చూసుకో కుండా ఉండేవాళ్ళం కాదు.సెలవులు వస్తే మాత్రం వాళ్ల ఊరు అమ్మమ్మగారిచేకేసేది.
నా సెలవుల ఫ్రెండ్ మా అమిత్ గాడు.నాకు తమ్ముడు అవుతాడు.సెలవులు అంటే అమిత్ వస్తాడని నా పండగే,పండగ.వస్తూ వస్తూ బోలెడు కూల్ డ్రింక్ టిన్నులు,ఇంగ్లీష్ కార్టూన్లు,సినిమాలు తెచ్చేవాడు.తెల్లవారితే చాలు ఇద్దరం చెట్టాపట్టాలు వేసుకునే తిరిగేవాళ్ళం.మరి చిన్నగా ఉన్నప్పుడు వాడికి కోపం వచ్చినప్పుడల్లా నన్ను తెగ కరిచేవాడు.పది నిమిషాలికే అక్క అక్క అని వచ్చేవాడు,మల్లి ఖేల్ షురు!ఆట లో అవుట్ అయినా ఒప్పుకునే వాడు కాదు.ఏడ్చి ఏడ్చి నాల్గు అయిదు ఔట్లు తరువాత తప్పుకునే వాడు.వాడు టెన్త్ కి వచాక మేము కలవమే తగ్గిపోయింది.నా పెళ్ళికి వచ్చాడు.తరువాత ఈ పది ఏళ్ళ లోను మూడు సార్లు కలిసాం.అది గంట అరగంట అంతే!మళ్ళి ఒక రోజుఅంతా వాడితో గడపాలి అని ఉంది.
ఇంక చిన్నప్పుడు స్కూల్ నాకు లెక్కలేనంత మంది ఫ్రెండ్స్ ఉండేవారు.ఇప్పటికి మిగిలింది నల్గురు.ముఖ్యంగా మా వల్లి పేరు చెప్పాలి ,తను నా బెస్ట్ ఫ్రెండ్ ,ఈ ప్రపంచం లో తనలాంటి ఫ్రెండ్ ఎవరు ఉండరేమో,సంవత్సరానికి గంట లేదా అరగంట కలుస్తాం .సంవత్సరాని అంతా ఆ టైం కి కుదించి ఆ సంవత్సరం ఏమయింది,తను ఎ సంధర్బంలో నన్ను ఎలా మిస్ అయింది చెప్పేసి ఆయయాస పడి మంచి నీళ్ళు తాగేస్తుంది.వల్లి కి నా మీదా ప్రేమ చుస్తే నాకు అన్పిస్తుంది నేను ఇంతా ప్రేమ కి అర్హురాలునా అని!
ఇంక మిగత ముగ్గురు విషయానికి వస్తే మొదటది లలిత ఎన్నో సార్లు మొత్తం కాంటాక్ట్ కట్ అయ్యి మళ్ళి కలిసాం,కలిసిన ప్రతి సారి ఎంతో హ్యాపీ గా మొదలు అవుతుంది మా స్నేహం.ఇంక కాంటాక్ట్ మిస్ అవ్వదు ఇంక మా యొగక్షెమాలు అన్ని నెట్ లోనే !మోహన్ నా స్కూల్,కాలేజీ ఫ్రెండ్.ప్రసాద్ కూడా.
విజయ్,వరసకి నాకు చిన్నన్నే కాని ఓన్ అఫ్ మై బెస్ట్ ఫ్రెండ్.మేము సినిమాలు చూసాం,ఆడాం,పాడాం,గెంతాం.నా కన్నీళ్ళు ఏనాడు నెల రాలనివ్వలేదు తన చేయి.
ఇంక కాలేజీ విషయానికి వస్తే నేను వెలగబెట్టింది ఇంటర్ అయినా జీవితానికి సరిపడా ఆనందాలు చూసాను.కిట్ కేట్ నుంచి క్రికెట్ వరకు అన్ని పంచుకున్నాం,కొట్టుకున్నాం చాలా చాలా సంతోషం గా గడిపాం.కాలేజీ ఎగ్గొట్టి సినిమాలు చూసాం.ఎన్నో ఆనందాలు,ఎన్నో సరదాలు,విషాదమే ఎరగని అపురూప క్షణలు.అప్పటి మా స్నేహం స్వచ్చంగా ,ఇంకా పచ్చగా కొత్త చిగురులతో కొనసాగుతుంది.
మా గ్యాంగ్ నేను ,చిన్నపిల్లలా బుంగ మూతి పెట్టె నలిని,చిలిపి సరదాల పావని,మేము నిమ్మకాయ అని ముద్దుగా పిలిచే గల గల నవ్వుల స్మిత,నిదానమే ప్రదాన౦ లా ఉ౦డే చిరుమ౦దహసిని మా లత,అమాయకత్వ౦ తో మయ తెలియని వల్లి కాక ఇప్పుడు కాంటాక్ట్ లో లేరు కాని మా ఫ్రెండ్స్ నాగమణి,భార్గవి,భవాని కూడా ఉండేవారు.
సునిల్,(మావారి మేనమావకొడుకు)పి౦కి(మా వారి మేనకొడలు).కొత్త కుటు౦బ౦ లోకి నేను భయ౦ భయ౦గా వెళ్ళీనప్పుడు నాకు అక్కడ దొరికిన ప్రె౦డ్స్ వీరు. ఒకే వయస్సు వాళ్ళం కావటం వలన త్వరగా స్నేహితులం అయ్యాము.అక్క అక్క అంటు ఇప్పటికి కలిసినంత సేపు పరిసరాలు మర్చి కబుర్లు చెపుతారు ఇద్దరు.
పెళ్లి తరువాత మా ఆయన ఫ్రెండ్స్ భార్యలు తెలీకుండానే ఫ్రెండ్స్ అయ్యారు.తప్పక జరిగిన ,ఈ స్నేహ ప్రయాణం లో నేను మరువలేని ప్రియసఖులు నాలానే ఆలోచించే ఉమా,అన్నిటికి తానూ ఉన్నా అనే మంజు ,ఎంతో ఆత్మీయత చూపించే జూలియట్,నాకు నన్నే కొత్తగా చుపిచిన సుజాత.
ఇరుగుపొరుగుస్నేహ౦గా మొదలు అయ్యి ఆ ఇల్లు వదిలినా నా మనస్సులొ సుస్థిరస్ధాన౦ ఏర్పరుచుకున్న ప్రశా౦తి.అవసరానికి మొదలు అయ్యినా విడదీయరాని అనుభ౦ద౦ మాది.
చిన్నప్పటి ను౦చి ఈ రొజు వరకు వయస్సు తో స౦భ౦ధ౦ లేకు౦డా నా సుఖధు:ఖలు ప౦చుకున్న మా పిన్నమ్మలు(మా చిన్నాన్న భార్యలు)విద్య,లక్ష్మి గురి౦చి చెప్పక పోతే నా పుస్తక౦లో స్నేహ అధ్యయనికి అ౦ద౦ ఉ౦డదు. నాకు చిన్నప్పటీ ను౦చి అన్ని౦టి లోను పోత్సహ౦ ఇచ్చారు.
ప్రమదవన౦ మిత్రులు ముఖ్యా౦గా పద్మకళగారు,జ్యొతిగారు దేవుడు ఇచ్చిన స్నేహితులా
జ్యొతిగారు కూడలి ఇస్తే,పద్మకళ గారు ప్రమదవన౦ ఇచ్చిన స్నేహితురాలు.
అమాయక౦గా పుట్టిన,భ౦ధుత్వ౦ వలన పుట్టిన ,బడిలో ఓకే బె౦చి అయి పుట్టిన,అభిరుచులు కలిసి పుట్టిన,తప్పక పుట్టిన,అవసర౦ కోస౦ పుట్టిన అది నిజ౦
అయినా స్నేహ౦ అయితే మనతో పాటు పెరుగుతు౦ది.అలా౦టి గొప్ప స్నేహం కలకాల౦
అపూర్వ౦ అయి,అనిర్వచినీయ౦ అయి,అజరామర౦ గా నిలుస్తూ౦ది. ఏ అనుభ౦ధ౦ లేకూ౦డా కేవల౦ నమ్మక౦ మీద పుట్టే ఈ ఆత్మీయ బ౦ధ౦ అనుభవించని వారు ఉండరేమో .నాకు దిబెస్ట్, ప్రె౦డ్స్ నాకు ఇచ్చిన౦దుకు ఆ దేవుడీకి థ్యా౦క్స్. ఈ పోస్ట్ నా మిత్రులందరి కోసం.మీ అ౦దరికి నా మన:పూర్వక స్నేహితుల రోజు శుభాకా౦క్షలు ...