వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఇది నేను చదివి కధ నాకు నచ్చిన కధ,రామకృష్ణ పరమహంస చెప్పిన కధ.

అనగనగా ఒక చెరువు ఉంది.దానికి నాల్గు ఘట్టాలు ఉన్నాయి.ఒక ఘట్టం నుంచి హిందువులు నిరు తీసుకుపోతారు.వారిని ఆ బిందె లో ఏముంది అంటే "జలము "అని చెపుతారు.ఇంకొక ఘట్టం నుంచి ముస్లిములు నిరు తీసుకుపోతారు. వారి ని నివు ఏమి మోస్తున్నావ్ అంటే "పానీ"అంటారు.ఇంకో ఘట్టం నుంచి క్రిస్తవులు నిరు తీసుకుపోతారు .వారిని అది ఏమిటి అని అడిగితె వాటర్ అంటారు.

ఎ పేరు తో పిలిచినా అంతా మోస్తున్నది నీరే ,అందరి దాని అవసరం ఒకటే .రాముడు,అల్లా ,జీసస్
అంతా ఒకటే పేర్లు వేరు.ఏక్ రామ్ హజర్ నాం .సత్యం ఒకటే పేర్లు వేరు .ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు.అలవాట్లు,ఆచారాలు,సంప్రదాయాలు వేరు. అందుకే మతాలలో భిన్నత్వం కనిపిస్తుంది.తమ మతమే సరి అయినదని ,ఇతరులది కదాని అనుకోవటం ఎంతమాత్రం మంచింది కాదు. అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు.

నాకు చాలా నచ్చింది ఈ కధ . మతం పేరు తో ఘర్షణలు ,చంపుకోవటం,రక్తపాతం సమంజసమినది కాదు.ఏదేవుడు రక్త అభిషేకం కోరుకోడు.అన్నింటి లోను మంచి చెడ్డులు ఉంటాయి.మనవ జన్మ కి
వచ్చాక దేవుడు ఇచ్చిన వివేకం మారిపోకూడదు కదా .మేమే గొప్ప అన్నా అహంకారం తోనే గొడవలు
అన్ని.ఏకామేవాద్వితియం బ్రహ్మ .

పేపర్ లో ఒక వార్తా చూసి ఈ కధ గుర్తు వచ్చి రాసాను.చాలా రోజుల క్రితం చదివాను.ఏమి అయినా తప్పులు ఉంటే మన్నించండి.

2 comments:

సుభద్ర గారు చాలా బావుంది.. వివేకం అనే అంతరార్ధాన్ని తెలియ చెప్పిన మీకు అభినందనలు

చిన్న కధలో పెద్ద నీతి.చాలా బావుంది.