వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

ఇది సిల్లీ గా ఉండోచ్చు.కాని ఏమి చేయను నాకు చెప్పలేనంత సంతోషం గా ఉంది.
నా బ్లాగ్ మొదలు పెట్టాక వంద హిట్స్ కే తెగ సంబరపడిపోయాను.అప్పుడే ఒక పోస్ట్ వేయలనుకున్న.
మరి చిన్నతనపు అమాయక చేష్ట లా అనిపించింది.నిజం చెప్పాలంటే ఆ వందలోని మూడు వంతుల హిట్స్ నావే అయిఉంటాయి.కొత్త మోజు కదా!వద్దు అనుకుంటూనే ఒకసారి చూడటం.అలా నేనే ఎక్కు సార్లు చూసుకున్నాను.

నాకు ఇప్పుడు మహా సంబరంగా ఉంది..ఈ 1116 నంబర్ చూసాక,ఎంత సంబరం అంటే నేను చిన్నపిల్ల గా ఉన్నపుడు మా రాముతాతయ్య (మా తాతయ్య అన్నా)రాత్రులు ఇంటికి తిరిగివస్తూ నాకు పొట్లం తెచ్చేవారు.ఎంత రాత్రి అయినా తాతయ్య పొట్లం కోసం ఎదురుచూసి ,పొట్లం పట్టుకునే నిద్ర పోయేదాన్ని.ఎంత రాత్రి అయినా అంటే ఏడు లేదా ఎనిమిది,అప్పుడు మా ఇంట్లో తొమ్మిది తరువాత అంటే అర్దరాత్రి క్రింద లెక్క .ఏడునరకి దూరదర్శన్ లో వార్తలు అయ్యాక ఇంక నిద్రే .తాతయ్య పొట్లం చూడగానే ఎంత సంతోషమంటే మాటలలో చెప్పలేను.తాతయ్య ఊరు మలుపులో ఉండగానే నాకు తెలిసిపోయేది.ఎలా అంటే తాతయ్య మంచి స్ట్రాంగ్ సాయబుగారి అత్తరు వాడేవారు.రాముతాతయ్య వస్తున్నారు అని గుమ్మం కచేదాన్ని.తాతయ్యకి మరి లేట్ అయితే పొట్లం ఇంటికి తీసుకెళ్ళేవారు.నాకు పిచ్చ టెన్షన్ మా పెద్ద నాన్నమ్మ తినేస్తారని.లేచిలేవటమే వెళ్లి నాన్నమ్మ ని అడిగి పొట్లం తెచ్చుకునేదాన్ని.నాన్నమ్మ కొన్ని సార్లు తాతయ్య తేలేదు అని ఏడిపించేవారు,నేను తాతయ్యని అడుగుతా అనగానే వద్దులే అమ్మ అని నా పొట్లం నాకు ఇచ్చేవారు.తాతయ్య ఎక్కువగా నాకోసం మిక్సర్ ఇంక పసుపుకాగితం చుట్టిన ఆరంజ్ బిళ్ళలు (చాకిలేట్స్)తెచ్చేవారు.ఇంక చాల రకాలు తెచ్చేవారు.

అప్పటినా సంబరం లా ఈప్పుడు అంభారాన్నిఅంటినట్లు ఉంది.నేను బ్లాగ్ రాయటానికి ముందు మా ఆయనకి చెపితే హ హ్హ హ అన్నారు.భయం వేసింది వదిలేద్దాం ,హ్యాపీగా అందరి బ్లాగ్స్ చదువుతూ ఎంజాయ్ చేద్దాం లే !అనుకున్నా కాని చదువుతున్న కొద్ది నేను రాయాలి అనిపించి౦ది.తాతయ్య కోసం వెయిట్ చేసినట్లు మంచి టైం కోసం వెయిట్ చేశాను.నేను రాయగలను అని కాన్ఫిడెన్స్ వచ్చాక నా ఫేవరేట్ ప్లేస్ పేరు మీదా మీ ముందుకు వచ్చాను.నాకు రాయటం అలవాటు లేదు కాని డైరీ రాస్తాను.కొన్ని కొన్ని పేజీలు తరువాత చదువుతున్నపుడు నాకే ముచ్చటేస్తుంది.ఇంక నేను లెటర్ బాగా తరుచు రాసే అలవాటు ఉండేది. లెటర్ చదువుతుంటే నువ్వు ఎదురుగా ఉన్నట్లు ఉంది అనేవారు.అదే కొంచం గుర్తుచేసుకుని ,ఓకే లే మరి రాయలేక పొతే ఏముంది వదిలేద్దాం అని మొదలుపెట్టా.

కాని ఎంత టెన్షన్ అమ్మో ఎవరైనా కఠినం గా కామెంట్స్ రాస్తే అని అనిపించినప్పుడు ,నా ఈ పోస్ట్ వలన ఎవరైనా హార్ట్ అవుతారా !కొన్ని సార్లు అంతా రాసాక నాకే సిల్లీ గా అన్పించి డిలీట్ చేసి,అయ్యో అన్ని ఆయాస పడ్డాను.అన్ని టెన్షన్స్ మద్య ఈ రోజు వెయ్యి మైలురాయి దాటింది నా మనసు పుస్తకం.(నాన్నమ్మ ఉదయం ఇస్తారని తెలిసిన టెన్షన్ పడ్డటు).

నా బ్లాగ్ చూసి అముల్యమైన మీ అభిప్రాయాలూ పంపినా అందరికి పేరు పేరునా నా ధన్యవాదాలు.
మంచి చెడు అన్ని మనలోనే ఉంటాయి అని నమ్ముతా నేను.ఎందుకంటే అందరికి నచ్చేవారు ఎవరు ఉండరని నా ఫీలింగ్.కాని మనిషిగా పుట్టక విగ్జ్ఞాత తో మంచి చెడులు బేరీజు వేసుకుంటూ మంచి వైపే నడవాలి అనుకుంటాం ,కాని మనకి మంచి అనిపించింది అందరికి మంచి అనిపించాలని లేదు.నా ప్రపంచం చాలా చిన్నది.నా పరిది లో నా మనసులోని ఫీలింగ్స్ రాయాలని అనుకుంటున్నా.మంచి చెడులు చెప్పి ప్రోత్సహించండి.కాని విమర్శ సున్నితం గా చేయండి ప్లీజ్.

ఇంక మా తాతయ్య పొట్లం కోసం ఎదురుచుసినట్లు ఇప్పటినుంచి 10000 కోసం ఎదురుచూస్తున్నా.
హిట్స్ ప్రతిభకి కొలమానం కాదు కాని అదో తృప్తి.నా బ్లాగ్ కి వచ్చి టైం సుత్తి అని ఫీల్ అయినవారికి సారీ లు చెపుతూ...

30 comments:

సిల్లీగా ఏమిలేదు. అది చాలా సహజము. నాకైతే ఒక్కో పొస్ట్ చేసి చూసుకున్నప్పుడల్లా ఏదో ఘనకార్యం చేసేసిన ఫీలింగ్ వస్తుంది.ఎవరికి నచ్చినా నచ్చక పోయినా సరే !
మీరు చాలా బాగా రాస్తున్నారు. కీపిట్ అప్ . 1 1 1 6 పూర్తి చేసినందుకు .కంగ్రాట్యులేషన్స్ .
మీ టెంప్లెట్ కూడా చాలా బాగుంది.

suma its so nice.i saw nadivilanka nad ramu tattaya through ur blog.its so good.my dear sweet sister

and congrates for ur 1116

congratulations on reaching 1116 :)

ఒక్కో మైలురాయీ ఘనకార్యమే. బ్లాగులు రాసేది సాధించడానికి కాదు. సాధించుకోవడానికి. కానివ్వండి.

బ్లాగ్ చూసి చదివిన తరువాత కామెంట్ చేయకపొతే ఏలా అనిపించేలా రాసారు. బాగుంది. కీపిట్ అప్!!

Congrats!!

All of us know how sweet it feels :)

:-)

Soon waiting for a 10000 post.

మీ "వాలు కొబ్బరిచెట్టు" వాలినట్టు లేదు,ఇంతింతై వటుడింతై అన్నట్లు పై పైకి ఎదుగుతూ ఎప్పుడెప్పుడు ఆకాశాన్ని(10,000 వ హిట్ ని) చేరుదామా అని ఉరకలేస్తున్నట్లుంది. మీ టెంప్లెట్ సూపర్ మరియు మీరు వ్రాస్తున్న విధానం అద్భుతం.మీరు అనుకున్న లక్ష్యాన్ని వీలైనంత తొందరగా చేరుకోవాలని ఆశిస్తున్నాను...

""""""""కంగ్రాట్స్ మరియు ఆల్ ది బెస్ట్""""""""""

Congrats, its already 1200+ at the time of writing this comment!

ఇన్నాళ్ళు నేనొక్కడినే ఇలా ఫీల్ అవుతున్ననేమో అనుకొన్నాను, నల చాలామంది వున్నారన్నమాట. బాగుంది, బాగుంది..

సుభద్ర..

నీకు గుర్తుందా మనం మొదటిసారి కూడలి కబుర్లలో కలిసాం. నీకు కలిగిన అనుభూతి అందరికి ఉంటుంది. ఎందుకంటే పత్రికలల్లోలా కాకుండా మనం చదువరులతో ఇంటరాక్షన్ ఉంటుంది. నచ్చినా, నచ్చకున్నా చెప్తారు. దానివలన మనం రాతలు దిద్దుకోవచ్చు. మన అనుభవాలు, అనుభూతులు మరింత అందంగా భావయుక్తంగా పంచుకోవచ్చు. నీవు చాలా మెరుగు పడ్డావు కాని ఇంకా కొన్ని తప్పులు ఉప్మాలో ఇసుకలా తగులుతున్నాయి. అవి చూసుకుని రాస్తుండు. ఈ వెయ్యినూటపదార్లకు ఎడమ పక్కన ఒకటి చేరాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది అసాధ్యం కాదు. కీప్ గోయింగ్...

wow
suma akka. i falt like i am in nadimelanka. thats is soo sweet of u. waiting for a new one.....

congratulations Subhadra. All the best for future.
psmlakshmi

అభినందనలు సుభద్రగారూ,

మీ అనుభవాలు చదువుతుంటే ముచ్చటగా అనిపించింది. చిన్నప్పటి జ్ఞాపకాలు ఎంత మధురమోకదా.

మిమ్మల్ని చూస్తుంటే నాకూ వీరావేశం వచ్చేస్తోంది. నేను సైతం అనుకుంటూ బ్లాగ్ మొదలుపెట్టడానికి సిధ్ధమౌతున్నానండోయ్. మీలాగే సక్సెస్ అవాలని గ్రీట్ చేస్తారు కదూ..శ్రీలలిత.

Congrats subhadra gaaru...well, nenu ipude choostunna me blog ni...meeko vishyam telsa..na blog mee blog templates and design same ...may be we both chose the same template...anyway...keep blogging

మీ ఆనందం టపాలో కొట్టొచ్చిన్నట్టు కనపడుతుంది. ఇంకా మీరు ఇంతవరకే..నాకైతే మొదట్లో నేను టపాలు తెగ రాసేస్తున్నట్టు, బోల్డంత మంది కమెంట్స్ కూడా పెట్టేస్తున్నట్టు కలలు కూడా వచ్చేసేవి. మనసు మనసులో ఉండేది కాదు. మీరు మంచి మంచి టపాలు రాస్తూ ఉండాలనీ ఆకాంక్షిస్తూ...

@malagaaru,@shilpa,
@madhuravani gaaru chaalaa thanks.

జ్యొతి గారు నాకు అన్ని గుర్తు ఉన్నాయి.మీ ఇచ్చిన చేయుత తోనే నేను ఈ రొజు బ్లొగ్ రాయగల్గుతున్నా.మీ మొట్టీకాయలు,మీ ఫాఠాలు,నేను మీ సహనానికి పెట్టీన ఎగ్జామ్స్ అన్ని గుర్తున్నాయి.మీ తో ఫాటూ పద్మకళగారు కూడా ఒప్పిగా చాలా చేఫూతారు.
ఇ౦క ముఖ్య౦ గా చెప్పుకొవలసి౦ది,మన ప్రమదవన౦ మిత్రులు అ౦దరు ఇచ్చె ఉత్సహ౦,
ప్రొత్సహ౦ మాటలలొ చెప్పలేను.మీ సూచనలు అన్ని౦టి కి ,మీ సహయనికి దన్య వాదాలు జ్యొతిగారు.

@maheshgaaru,
@jeedipappugaaru,
@sujana
chaala thanks andi.

@suresh,
@malakpeta rowdy gaaru,
mee abhimaanaaniki danyavaadaalu.

c.narendra gaaru,
@laxmigaaru,
@srilalita,
chaalaa chaala thanks andi.

@kishan reddy gaaru,
@viswamitra gaaru,
thank you very very much.

@sekar gaaru,
@sharth gaaru,
chala chaala thanks andi.

suma ur posts wonderful...eppudu unna busy life lo.... evaru chinnapati kontti chestalu,atalu,saradalu...etc gurtuku techhukovadam ledu..kani evaru ayithe ne blog ni follow avutunnaro...sure..100% they are also remember his/her child memories. CONGRATS...KEEP IT UP..

@prasad,
thanks very much for ur comment.

కంగ్రాట్యులెషన్స్. ఈ రెండు మూడు రొజుల్లొనె దరిదాపు 250 హిట్స్ వచ్చాయ్ గమనించారా.
BTW .. మీ పొస్ట్లు బావుంటున్నాయి.
పాఠకులు త్వరలొనె మీకు పదివేల నూటపదహర్లు చదివిస్తారని ఆశిస్తూ...

@MANCHU PALLAKI,
థ్యా౦క్స్ అ౦డీ,ము౦దు ము౦దు వచ్చేచదివి౦పులలో మీరు చదివి౦చాలి సరేనా!

మాలగారు,
ఆహ ఓహో భలే భలే నా బ్లాగ్ 10,116 పూర్తి చేసుకు౦ది..1116 హిట్స్ కి మీరే ము౦దుగా కామె౦ట్ కోట్టారు..అ౦దుకే మీకే ము౦దు చెపుతున్నా..


శిల్పా,
1116 హిట్స్ అప్పుడు నువ్వు క౦గ్రాట్స్ చెప్పవు కదా !! నౌ 10116..


మదురవాణిగారు,
10,116 హిట్స్ న౦బర్ వచ్చి౦ది..


కత్తి మహేష్ కూమార్ గారు,
నా బ్లాగ్ లో మీ మొదట/చివర కామె౦ట్ కి నా రె౦డో రీప్లై..
"బ్లాగ్స్ సాధి౦చటానికి కాదు..సాధి౦చుకోవటానికి అని అన్నారు"..అవును వెలకట్టలేని తృప్తి సాధి౦చుకున్నా...థ్యా౦క్స్..


విశ్వమిత్రగారు,
అప్పుడేప్పుడో మీరు కామె౦ట్ వేశారు..మళ్ళి ఒకసారి థ్యా౦క్స్ చెప్పాలని నేను రిప్లై ఇస్తున్నా..


జీడిపప్పుగారు,
మీలానే నేను,మరో మెట్టు ఎక్కానని స౦బరపడుతూ...


సుజనా గారోయ్,
థ్యా౦క్స్..మీ దీవెన పలి౦చి౦ది.నా హీట్స్ 10116 ఓచ్చ్..


సురేష్,
నువ్వు అన్నట్లుగానే 10,000 దాటి౦ది..థ్యా౦క్స్..


మలక్ పేట్ రౌడీగారు,
అప్పుడేప్పుడో మొదటిసారిగా/చివరిసారిగా నా బ్లాగ్ లో కామె౦ట్ వేశారు..నేను 1116 హిట్స్ అ౦టే హత్తేరి..కాదు 1200 అని..ఇప్పుడు 10,116 మీకు రీప్లై ఇస్తున్నా..మళ్ళీ చూసి నేను చెప్పిన న౦బర్ లేకపొతే నా తప్పుకాదు..


నరే౦ద్రగారు,
చాలా స౦బర౦ గా ఉ౦ది
10116 హిట్స్ ఇప్పుడు..మీరు నాలానే అన్నారు కదా మీతో చెప్పాలని ..

జ్యొతిగారు,
మీ హెల్ప్ కి చాలా చాలా థ్యా౦క్స్..ఏ డౌట్ అడిగినా నేర్పి౦చారు..1116 హీట్స్ అ౦టే ఉప్మాలో రాళ్ళలా నా పోస్ట్ లలో అక్షరదోషలు దిద్దుకోమన్నారు..నా వ౦తుప్రయత్న౦ చేశాను..వెయ్యి నూటపదహర్లు కి ము౦దు ఒక్కోక్క అ౦కె చేరాలని దీవి౦చారు..అది ఇప్పుడు చేరి౦ది..మీ
కు నా బ్లాగ్ ముఖ౦ మరొక్కసారి దన్యవాదాలు..

యత్రాలక్ష్మిగారు,
థ్యా౦క్స్ అప్పుడెప్పుడొ మీరు దీవి౦చారు అ౦దుకు...

శ్రీలలితగారు,
మీరు అప్పుడెప్పుడో కామె౦త్ కొట్టారు..నేను మరోక్కసారి థ్యా౦క్స్ చెపుదామని వచ్చాను..థ్యా౦క్స్..

కిషన్ గారు,
అప్పుదేప్పుడో నేను 1116 హిట్స్ అని పోస్ట్ వేస్తే మీరు మొదటిసారి నాబ్లాగ్ చూసి మన templates సేమ్ అని అన్నారు..ఇప్పుడు
10,116హిట్స్ మీతో నా స౦తోష౦ చెప్పాలని వచ్చా..

శేఖర్ పెద్దగోపు గారు,
లా౦గ్ లా౦గ్ ఏగో మీరు 1116 హిట్స్ ఓచ్చ్ అ౦టే మీరు ఇ౦తవరకే నేనైతే తెగకలలు క౦టాను తెలుసా అ౦టూ మ౦చిటపాలు రాయమని అన్నారు..చేతనైన౦త గా ప్రయత్నిస్తూన్నా..ఇప్పుడు 10,116హిట్స్ మీతో ఆన౦ద౦ షేర్ చేసుకోవాలని చిన్న ప్రయత్న౦..

శరత్ గారు,
అప్పుడేప్పుడో మీరు కామె౦ట్ ప౦పారు అ౦దుకు ఇప్పుడు మరిక్కసారి థ్యా౦క్స్...

ప్రసాద్ ,
నా బ్లాగ్ పాలో అవుతున్నావా లేదా???థ్యా౦క్స్..

మ౦చుపల్లకిగారు,
నన్ను ఎ౦తగానో ప్రోత్సహిస్తూ 10,116 చది౦చార౦డి మీర౦తా కలిసి చాలా చాలా థ్యా౦క్స్..

మీరు 11116 హిట్స్ మీద పొస్ట్ వెస్తారెమో అనుకున్నా.. కామెంట్ తొ సరిపెట్టెసారా.. :( .. సర్లెండి అభినందనలు