వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

వంటల తంటాలు రాయాలని ప్రమదావనం లో తీర్మానం అయ్యింది.
సో నేను సై సై అన్నా........ఇంకా నేను చేసినా వంట అయితే హిట్ లేదా ఫట్ కానీ ఎవరేజ్ గా ఆడటం తక్కువనే అనే చెప్పాలి నేను వంటా లో,ఒంటరి గా బుడి బుడి అడుగులు వేస్తున్నపుడు.
నా మొదటి వంటా ఆమ్లెట్ అప్పుడు నా వయసు ఏడు లేదా ఎనిమిది ఏళ్ళు ఉండొచ్చు.కబురు కాకరకాయ లేకుండా మా చిన్న మేనమావ మా అమ్మ ని చూడటానికి ఉరు నుంచి వచ్చారు.
మా అమ్మ,నాన్నమ్మ ఎప్పుడు లేంది ఆ రోజు ప్రొద్దుటే మాకు ఆ రోజు కి సరిపడా అన్ని అమర్చిసాయంత్రం అన్నం ఒకటే వండుకునేలా పెట్టి వెళ్లారు.మర్నాడు తెల్లవారే వస్తారు అన్నా మాటా...ఈ లోపు విషయం తెలియక (మా అమ్మని)అక్కని చూడటానికి మా మావయ్య వచ్చారు.
అది ఏడు గంటలకి అప్పటికి మా నిద్రకి పక్కలు వెన్నెల వాకిట్లో సర్దుకునే టైం.ఇంకేముంది వంట వండాల్సి వచ్చింది.ఇంట్లో మా నాన్న,తాతయ్య వాళ్లు తినటానికి తప్ప వంటిల్లు వైపు చూడరు అనుకోండి.ఇంక ఆడ జట్టు నేను ,మా చెల్లి( నాల్గు లేదా అయిదు),మా తాతమ్మ(మా నాన్నమ్మ అత్తగారు)పనిపాప లు ఉన్నాము.తాతమ్మ అన్నం వండారు వార్చారు (ఈ వార్చటం నాకు ఈప్పటికీ రాదు అనుకోండి అది వేరే విషయం),నేను ఆమ్లెట్ రెడీ చేశాను.మా ఇంట్లో అప్పట్లో చాల ఆచారం అవి ఉండేవి .పని వాళ్ళని వంట ఇంట్లో కి రానిచేవారు కాదు .సో నాకు వచ్చి రానట్లు గా రెండు అంగులాలికి తగ్గకుండా ఉల్లి తరుగు తరిగి తాతమ్మ చెప్పినట్లు ఉప్పు,కారం,గరం మసాల పొడి,ఇంక పసుపు వేసి కలిపి చేసేసాను.తాతమ్మ అన్ని అర చెంచా అర చెంచా అని చెపితే నేను విశాలా హృదయం తో కొంచం ఎక్కువే వేసి కలిపాను .తాతమ్మే ఆమ్లెట్ వేసారు అనుకోండి.మావయ్యకి వడ్డన చేసాం.ఆవకాయ,అమ్మ పెట్టి వెళ్ళిన చారు,ఆవకాయ,ఉదయం చేసిన ఫ్రెష్ వెన్నపూస .మావయ్య తో సుత్తి కొడుతూ పక్కనే ఉన్నాను.ఆవకాయ అయ్యింది,ఆమ్లెట్ కి వచ్చారు కలుపుకుని మొఖం చిత్ర విచిత్రం గా పెట్టి నోట్లో ముద్దా తీసేసేరు.తరువాత చారు,మజ్జిగ తో ఫినిష్ చేసారు.నేను నేనే చేశాను ఆమ్లెట్ అనిగొప్ప చెప్పే లోపే మావయ్య ఫీల్ చూసి చెప్పలేదు.మావయ్య వెళ్ళాక నేను తిని చుస్తీ మావయ్య తెచ్చినా నేను ఆబగా తినేసిన బిస్కట్లు వాంతీ అయ్యే అంటా పని అయ్యింది.గొడ్డు కారం,పసుపు ముద్దా గా తియ్యగా ఉంది,తీరా చుస్తే ఉప్పు బదులు పంచదారా వేసాను.ఆమ్లెట్ కి ఫ్రై లకి కళ్లు ఉప్పు (రాళ్ళ ఉప్పు)పోటు(దంపించి)వేయించి ఉంచేవారు.మనం ఆ ఫైన్ సాల్ట్ అనుకుని పంచదారా వేసేసనన్న మాటా.
తరువాత ఈ భయంకర నిజం ఎవరికీ చెప్పకుండా నాలో సమాది చేశాను.చిన్ననాటి అలవాట్లు చిరకాలం ఉండును అంటారు గా అలా మొదలు పెట్టినా వంట లో ప్రయోగాలు ఇంకా గత ఇరవై సంవత్సరాలు గా పట్టువదలక సాగిస్తూనే ఉన్నా.పెళ్ళయి కొత్తలో మా ఆయనకి మినపప్పు (పెసరపప్పు)అనుకుని వండి పెట్టా.పప్పు బద్ద చెదరలేదు కాని సూపర్ గా జిగురు జిగురు పాకం లా వచ్చింది.మా ఆయనని వేరేకాపారం పెట్టిన కొత్తలో శెలవు కదా అని మర్నాడు టిఫిన్ పురమా యించ మంటే సింపుల్ గా గారెలు అంటే ఆ రాత్రి జాగారమే చేశాను.నానమ్మని హౌ ,అని ఫోన్ లో అడిగి అన్ని చెప్పినట్లే చేశా కాని గోడ టపాకాయలా ( అష్ట వకారాలు అకారాల తో నూనె లో వేయగానే )పేలాయి కారణం ఏవిరా అంటే నీళ్లు ఎక్కువ వేయకుండా రుబ్బాలి అంటే నేను మరి ఒక స్పూన్ వేసి రుబ్బను.అవి పేలి నూనె పడి బొబ్బలు కుడా వచ్చాయి.
అలా ఫోన్ ని నమ్ముకుని,పుస్తకాలు నమ్ముకుని,ఈ మద్య టి.వి నమ్ముకుని ఇంక ప్రయోగాలు చెస్తునే ఉన్నాను.ఇంక ప్రూవ్ కాని ఫార్ములాలు చాలా నే ఉన్నాయి.హిట్ అయితే టేబుల్ మీదకి లేదా ముకంటి కి కుడా తెలియకుండా డస్ట్ బిన్ లోకి ...పాపం నా వంటా మా ఆయనకంటే డస్ట్ బిన్ ఎక్కువ తింటుంది.నౌ ఓకే లెండి.కొంచం ఇంప్రూవ్ అయ్యాను.నాకు వంటా బాగా వండటం కంటే చెత్త వంటకి తినబుల్ గా చేయటం చాలా ఇష్టం .
ఇది అమ్మ లారా ,అయ్యలారా నా వంటా గోలా....

9 comments:

పాపం నిజంగా ఆయనలు ఎన్ని బాధలు పడతారో కదా సుభద్ర.. నేర్చుకో మరి...

వంట చెయ్యడం అనే బ్రహ్మ విద్యని ఇపుడు యూట్యూబ్ లో చూసి నేర్చుకోండి. తెలుగు వీడియోల సంగతి తెలియదు కానీ, తెలుగు వంటలు, వడలూ - దోశె లూ vahchef చానెల్ కి వెళ్ళి నేర్చుకోండి ! చదువుతూ చెయ్యడం కన్నా, బొత్తిగా రాని వాళ్ళకి చూస్తూ నేర్చుకోవడం వల్ల డౌట్లు ఉండకండా, నాలుగయిదు సార్లు డస్ట్ బిన్ పాలయినా, ఆరోసారి వంట అదురుతుంది. అసలు ఏ పదార్ధాన్ని ఏమంటారో (మెంతులూ, ధనియాలూ, గసగసాలూ..వగైరా) అయినా తెలుస్తుంది. Good Luck అన్నయ్య గారికి !

@jyothi&sujata
thank q,
kaani maari antaa bad cook ni kadandi.
just navvukovatani rasanante..

"subhadra", generalley iam not ready to comment on your cooking but when i saw your name as SUBHADRA . say to some more this name belong to my mother and also my angel on earth ie my daughter. what ever it may be i am away to the bad cooking. my mom and wife both are experts in A to Z items. I had also some experiance on my studying time. many of my friends visited to my room particularley for only taste my cook.

సుభద్ర గారు,
అసలు పంచదార తో ఆమ్లెట్ చేస్తే ఎలావుంటుందో ఈ రోజు నేనే చేసుకుని నేనే తింటాను,వెరైటీగా. బాగోపోతే dustbin ఎలాగూ ఉందిగా!

పంచదార కూడా వేయొచ్చంటారా ? అయితే ఈ రొజే మావారికి చేసి తినిపిస్తా .నేనెలాగూ తినను కాబట్టి పరవాలేదు. లేక పోతే ఎప్పుడూ నేనే నీకు ఆంలెట్ చేయటము నేరిపించానంటారా !
http://sahiti-mala.blogspot.com/2009/07/blog-post_17.html

అమ్మా సుభద్ర , వెనకాల అత్తగారు లేరుకాబట్టి నీ ఇంట్లో డస్ట్బిన్ నోరు తెరుస్తుంది. లేకపోతే అవన్నీ చచ్చినట్టూ నువ్వే తినాల్సివచ్చేది. ఇది నా అనుభవం.

Sumalu...it's so funny..maaku kuda cheppakunda chalane daachavu annamata..ippudemo make boldannie vantalu cheppestunnav..I wish I too will become like you oned day..Keep blogging..

ente nee vantalalo inni viseshalu unnaya eppudu cheppaledu papam maa annaya inni rojulu ela thinnaro kada