వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

అశోక్ నగర్ (హైదరాబాద్)లో ఉండే మా అత్తయ్య వాళ్ల బెడ్రూం కిటికీ లోంచి అభయ హస్తం చూపించే టాంక్ బండ్ బుడ్డుడ్ని చూడటం నాకు చాలా ఇష్టం.నాకు బుద్దుడి దగ్గరకి వెళ్ళాలన్న కోరిక మొన్న మార్చ్ లో తీరింది.మా సాబ్ అడగగానే ఓకే అన్నారు.నేను ఎగిరిగంతేసి అందరిని బయలుదేరండి అని బుడ్డుడ్ని చూడటానికి అనగానే హైదరాబాద్ వాళ్ళు అయినా మాబావగాడు,మా వారి కజిన్ మొహాలు మారాయి,నేను ఉత్సాహం లో పెద్దగా పట్టించుకోలేదు.మా చెల్లి అక్కడే ఉంటున్న తను ఎప్పుడు చూడలేదట!అంతా వెళ్లి టికెట్ కొని బోట్ కి లైన్ లో నిల్చున్నాం.
నా వెనక ఒక కుర్ర బ్యాచ్ ఉన్నారు.వాళ్ల మాటలు నాకు నవ్వు తెప్పించినా చాలా భాధ కుడా పడ్డాను.వాళ్ల లో ఒక అమ్మాయి తనకు ఈత రాదనీ మీలో ఈత వచ్చినవాళ్ళు నాతో ఉండండి అంటే ,ఒక అబ్బాయి నీకు తెలియదా ఈ వాటర్ లో అంటు పడటం జరిగితే ఈత వచ్చినా,రాక పోయినా పైకి పోతారు అదే ఈ వాటర్ మహిమ అన్నాడు.మరో కుర్రాడు మన సాంభడి కి ఒక స్పూన్ ఈ వాటర్ కలిపి ఒక కోలా తాగిస్తే వాడి పిరియడ్ ఈ మంత్ అంతా మనకి లిజరే !!!!అని తెగ నవ్వుకున్నారు.
బోట్ వచ్చింది అంతా ఎక్కేసాం నాకు ఏదో చెడు వాసనా అనిపించి మా వాళ్లు అందరి వంక చూసా!మా చెల్లి పిల్లలితో కబుర్లులో పడి,మా సాబ్ ప్రకృతి ని చుస్తూ బిజీ గా ఉన్నారు.మా వాసుని (మా వారి కజిన్)ని మీకు ఏమైనా వాసనా వస్తుందా అని అడిగా అదా ఇక్కడ అదే వస్తుంది.అని నవ్వారు ఎ ఎందుకు అని అడిగే లోపలే బుద్దుడు దగ్గరకు వచ్చేసాం.
నేను ఆత్రం గా దిగి తనివిరా బుడ్డుడ్ని చూసా,పైగా సాయంత్రం కావటం వల్లనా వాతవరణం కుడా బాగుంది.చిన్నరంగు రంగు లైట్స్ వెలుగులో బుద్దుడు భలే ఉన్నాడు.అంతా కంపులో కుడా కన్నులకి ఇంపుగా నవ్వుతూ ,అరమోర్పు కన్నుల తో ఆశీర్వదిస్తూ......బుద్ధం శరణం గచ్చామి అనుకుని దణ్ణం పెట్టుకున్నా. ఇంకా అందంగా మలిచిన శిల్పి గార్కి,ఆంద్రా అన్నా గార్కి హాట్స్ అనుకుని పనిలో పని గా మావారికి కుడా థాంక్స్ చెప్పా!చిరాకాలా కోరిక తీర్చినందుకు.కాని ప్రతిగా మావారు కెమెరా తేనందుకు కసురుకున్నారు.ఇంటి దగ్గరా గుర్తు చేయవచ్చుగా అని నా మొబైల్ లో రెండు స్నాప్ తీసా.తిరిగివస్తుంటే మన బుద్దభాగావానుడికి ఈ కంపేలా ???అని విచారం కల్గింది.
ఇంటికి తిగివచ్చక ట్యాంక్ బండ్ కంపు గురించి చిన్నచర్చ ,కంపు కారణాలలో ఒకటి గణపతి నిమర్జన అనగా గణపతి బొమ్మ తయారీకి వాడే రాసాయనాలు అని అన్నారు .అందుకే టాంక్ బ్యాండ్ నీళ్లు చాలా చిక్కగా కుడా ఉంటాయని చెప్పారు.అయ్యో అని నిటుర్చి,బువ్వ తినేసి బజ్జున్నాం.నాకు ఆ రాత్రి అంతా నేను ఒక్కదాన్నే తెగ గణేష్ నిమర్జనా చేసేస్తునట్లు కల వచ్చింది.అక్కడే మర్చిపోయా!
కాని నాకు వినాక చవితి అని చూసినప్పటి నుంచి నా చిన్నప్పుడు నా నాన్నమ్మ మట్టి గణపతి ని ముద్రబల్ల తో స్టాంపు చేయటం,మేము కనిపించిన ఆకులు అన్ని ఆ మొక్క పేరు తో పత్రి పత్రి అని సంచులు సంచులు కోయటం అన్ని గుర్తు వచ్చాయి.పూజ బుక్ లో కుడా ఉంటుంది కదా మట్టి తో చేయమని.
అంతా కొంచం ఆలోచించండి పర్యావరణ కాలుష్యం గురించి ,పిల్లలకి ఎ కష్టం కలగకుడదని మనం అన్ని అమర్చి పెట్టాలి అనుకుంటాం,అందుకే మనం కష్ట పడినా వాళ్ళకి అన్ని అమర్చి పెట్టాలను కుంటాం కదా!అందుకే చేత అయినంతా పర్యావరణం కాపాడుదాం.మనం ఒక్కళ్ళం చేస్తే అవుతుందా అని అనుకోకుండా చిన్న చిన్న విషయాలకి అశ్రద్ధ చేయకుండా మన వంతు ప్రయత్నం చేద్దాం.మనం చెస్తూ అందరికి చేయమని ప్రోత్సహిద్దాం ,మన పిల్లల్ని ఈ మంచి కార్యం లో భాగస్వామ్యులని చేద్దాం.
ప్రతి పనికి ముందు మనం విఘ్నాలని తొలగించమని ఆ విఘ్నేస్వరుడిని కొలుస్తాం .అందుకే వినాయకుడి బొమ్మతో ఈ వినాయక చవితి నాడు మట్టి గణపయ్యని పూజించి పర్యావరణం కి మన వలన హాని కలిగించకుండా మంచి పని చేసి చూపుదాం.మన పిల్లలలికి సాంప్రదాయం తో పాటు పర్యావరణం పట్ల భాద్యత నేర్పుదాం. ముఖ్యం గా ప్లాస్టిక్ వాడకం మానేయటం,పవర్ ,నీళ్లు పొదుపుగా వాడటం మనం చెస్తూ ,మన ఇంటి వరకు మార్పు తీసుకువద్దాం.అన్నట్లు మా ఎడారి లో మట్టి దొరకదు అందుకే నేను పసుపుతో చేస్తాను.
మరి ముందుగా ఎవరు నాతొ పాటు మట్టి గణపతి లేదా పసుపు గణపతి కి పట్టం కట్టేవాళ్ళు .చేతులు ఎత్తండి.అందరికి అడ్వాన్స్ వినాయకచవితి శుబాకాంక్షలు .అంతా తొందర ఏమిటి అంటున్నారా గణపతి ని చేయటానికి ముందుగా నే చెప్పాలి కదా!

16 comments:

నేను చెయ్యెత్తేను.. కాని మాకు మంచి బంక మట్టి దొరకదు అందుకనే ఎంచక్క గా ప్లే డో వుంటుంది కదా.. దానితో చేస్తా.. అది కూడా కెమికల్ ఫ్రీ పిల్లలు ఆడుకునేది కదా.

మీరు కూడా so called పర్యావరణవేత్తల మాదిరి చెబితే ఎలాగండి. హుస్సేన్ సాగర్ కంపుకు సంవత్సరానికి ఒకరోజు జరిగే గణేష్ నిమజ్జనంవల్ల కాదండి మిగిలిన 364రోజులూ అందులో కలిసే డ్రైనేజీ,కర్మాగారాల విషజలాలే. మిగిలిన ఆ ఒక్కరోజు కూడా అవి కలుస్తూనే ఉంటాయి.so 365 రోజులూ అవి కలుస్తూనే ఉంటాయన్న మాట.నిమజ్జనం ఒకటి దొరికింది మనకు సాకు.

నేనూ చెయ్యెత్తేను నేనూ మునుపు అందమైన రంగుల బొమ్మనే కొనేదాన్ని ...కానీ నా ఫ్రెండ్ ప్రోత్సాహం తో గత నాలుగేళ్ళుగా మట్టి గణపతినే పూజిస్తున్నాం .....

మేము గత ఐదారు సంవత్సరాలుగా మట్టి వినాయకుడినే పెడుతున్నాం. మ అచిన్నప్పుడు మా అమ కూడా మట్టి వినాయుడినే పెట్టేది, ఇప్పటికి కూడా మట్టి వినాయకుడే!

అయినా కర్ణుడి చావుకి వేయి కారణాలులాగా హుస్సేన్‌సాగర్ కలుషితానికి ఇంకా చాలా కారణాలే ఉన్నాయి లేండి. వినాయక నిమజ్జనం మూలాన అన్నది ఓ సాకు అంతే! అది కూడా ఒక కారణమే కాని దాన్ని ఆపినంత మాత్రాన హుస్సేన్ సాగరు ఏం బాగుపడిపోదు! నెక్లెస్సు రోడ్డు వైపు వెళ్ళారా? ఎంత చెత్తా చెదారంతో నిండి ఉంటుందో!

మీ ఆలోచన కి నా జోహారు. కాని కేవలం గణేష్ నిమజ్జనం వల్లే కాలుష్యం పెరుగుతోందని కూడా చెప్పలేము. ఒక విషయం మటుకు నిజం. బుధ్ధుణ్ణి చూడ్డానికి చాలా మంది వస్తారుకదా.. కనీసం ఒక టూరింగ్ స్పాట్ గా నైనా దానిని బాగు చెయ్యొచ్చుకదా.. అసలే ఇక్కడ జనాలు వాతావరణ కాలుష్యం తో బాధపడుతూ కూడా ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకు కూర్చున్నారు. విజిట్ కోసం వచ్చే వాళ్ళ కి కూడా ఆ బాధ తప్పటం లేదు.. ఇక గణేష్ విషయానికొస్తే ఈ మధ్య చాలా మంది మట్టి వినాయకుడినే పెట్టి పూజ చెసుకుంటున్నారు. మీ ముందు చూపుకి జోహార్.

చివరి బెంచీలో కూర్చొని చెయ్యెత్తాను..మీకు కనిపించిందా?? చివరి బెంచిలో కూర్చొని ఏం చేస్తున్నారు అని అడొగొద్దు. ఫ్రెండ్స్ తో మన హైదరాబాద్ లో బంకమట్టి ఎక్కడ దొరుకుతుందో సీరియస్ డిస్కషన్. :)

@bhavana
మీరు నేను జట్టు అయితే సరె నా!మరి మీ ప్లే డో వినాయకుడిని మేము చుస్తా౦ మీ బ్లాగ్ లో పెట్టి ఒక మెసెజ్ పెట్ట౦డి.ఆ రోజు కనిస౦ తొమ్మిది వినాయకుల్ని చుడాలి గా!

విజయమోహన్ గారు,
బాగా చెప్పరు అ౦డి.మీరు అన్నది నిజమే కాని నన్ను ఆ సో కాల్డ్ లోకి చెర్చక౦డి ప్లిజ్.
నేను విన్న ఒక కారణ౦ అది మన వలన జరుగుతు౦ది అనే రాసాను.ఒక్కసారే కదా అని
అనుకోకుదదని నా అభిప్రాయ౦.
ఇ౦క డ్రనేజ్ మురుగు కలుస్తు౦దని కూడా అన్నారు,కాని ప్యాక్టరి వేస్ట్ స౦గతి నాకు తెలియదు.ఇది చాలా దారుణ౦ కదా!మళ్ళి క్లిని౦గ్ కా౦ట్రక్టట్ పేరుతో మళ్లి దొచుకు౦టారని అన్నారు.
డ్రనేజ్ వాటర్ కలవకు౦డా చెస్తామని అన్నారని అది వాయిదా వేస్తున్నారని విన్నా,మీ కామె౦ట్ చుసాక అది ఇ౦క ఇ౦ప్లిమె౦ట్ చేయలేదని అనుకు౦టున్నా

పరిమళ౦ గారు,
మీకు నాల్గుసార్లు అభిన౦దనలు.మీరు నేను జట్టు సరెనా..

సిరిసిరిమువ్వ గార్కి,
మీరు అన్నది నిజమేన౦డి.కాని ఈ తప్పు మనవలన జరుగుతు౦ది.తప్పు చిన్నదె అని అనుకోకుడదనే ఉద్దేశ౦ లో రాసాను.అది మన౦ పర్యవరణ కాపాడటానికి మొదటి అడుగు మట్టి గణపతి అన్న ఆలోచన తో రాసాను.అవున౦డి నక్లెస్ రోడ్ చాలా చెత్త!
హైద్రాబాద్ లోనే కాకు౦డా అన్ని చోట్ల అలానే ఉ౦ది.చాలా థ్యా౦క్స్ మీ కామె౦ట్ కి.

లలిత,
చాలా చాలా థ్యా౦క్స్...అవున౦డి ఆ రోజు మ౦చి కోస౦ ఎదురుచుద్దా౦.నాకు తెలిసి ఈజిప్ట్ వాళ్ళు(మా నైబర్) బాబుకి ట్రిట్ మె౦ట్ కోస౦ హైద్రబాద్ వచ్చారు.ఆవిడ ఒకసారి పార్టి లొ ఇ౦డియ ఇస్ వెరి వెరి డెవలప్ క౦ట్రీ ఇన్ అల్ గుడ్ అ౦డ్ బ్యాడ్ అ౦ది. మన వాళ్ళు
అ౦తా కోప౦ తో ఆవిడని అడగానుకున్నారు.కాని తను ని కదిపితే మన పరువు ఇ౦కా పొతు౦ది.తను ఇ౦డియ లో ఉన్న రె౦డు నెలలు ల౦చాలు,అవి చాలా చుసి౦దని నాకు తెలిసిన కబుర్లు చెప్పా.అ౦తా గమ్మున ఉన్నా౦.

శేఖర్ గారు,
అవునా!అయితే దోరికి౦దా మరి,లేక పొతే ఇఇప్పుడు అన్ని చోట్ల మట్టి గణపయ్యలు దోరుకుతున్నారటి.నేను గ్యార౦టి మార్కట్ లో చుడ౦డి.మన దేశ౦ లొ దొరకనిది లేదని నా బలమైనా నమ్మాక౦.అల్ ది బెస్ట్.

మేము ప్రతి సంవత్సరమూ మట్టి గణపతినే పూజించెదము.. బాగుందండీ టపా... బ్లాగుల్లో తొమ్మిది మంది వినాయకుల్ని చూడాలన్న మీ ఆలోచన భేష్...

హుసేన్ సాగర్లో బుద్దుడు కంపులో నిలబడటానికీ, ఈ కెమికల్ వినాయకుడికీ సంబంధం ఉందండి.ఇదే విషయం సాంకేతికంగా నిరూపణ అయింది కూడా. కానీ పక్కనే సచివాలయంలో కూర్చున్న మన ప్రజా ప్రతినిధులకు మాత్రం ఇంకా కంపు కొట్టలేదేమో. ఐనా మన పిచ్చి కానీ వాళ్ళు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడమే పనిగా పెట్టుకున్నప్పుడు, ఈ కంపొక లెక్కా??కానీ ప్రజలైనా పరిస్థితి అర్థం చేసుకుని సాద్యమైనంత కాలుష్యాన్ని తగ్గిస్తారని ఆశిద్దాం(ఈ ప్రజల లిస్టులో మన పేర్లు కూడా ఉన్నాయ్ సుమా...)

మురళిగార్కి,
మీకు చప్పని అట్లు ఎ౦దుక౦టారా మరి మీరు ప్రతి స౦వత్సర౦ మట్టి గణపతీ కి పట్ట౦ అ౦టున్నారు గా!!!!!!!ఇ౦క మీ బ్లాగ్ లో మీ వినాయకుడ్ని పెట్టి మాకు దర్శన బాగ్య౦ కలిగి౦చ౦డి.మన ఊరు లో ఉ౦టె పరవలేదు తోమ్మిది గణపాయ్ లను చుడొచ్చు కాని మా వలే దూర౦గా ఉన్నావాళ్ళు అ౦తే గా మరి.

ఆ ప్రజల లిస్ట్ లొ౦చి మన పేర్లూ కనీస౦ కొన్ని కెటగిరిలలో లెకు౦డా చుసుకు౦ద్దా౦ ..వీలు అయిన౦త,మన౦ చెయగల్గిన౦త వరకు అయినా పర్యవరణ౦ కాపాడనికి ప్రయత్నిద్దా౦.అ౦దుకే నేనూ ఈ పొస్ట్ రాసాను.
థ్యా౦క్స్ మీ కా౦మె౦ట్ కి .