వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

సాహితికి పుట్టినరోజు శుబాకాంక్షలు ...


సాహితిలో ముచ్చట్లు చెపుతూ... చల్తే చల్తే అ౦టూ తనతో పాటుగా మనల్ని తిప్పుతూ... అలసినప్పుడు కమ్మటికలలు లో పాటతో సేదతీర్చి ....ప్రభాతకమల౦ లో బొమ్మలు చూపిస్తూ అవి ఇవి చెపుతూ...మనందరినీ ఆనందపరుస్తున్న మాలగారికి అభిన౦దనలు...

నా మాటలు అన్ని ద౦డకట్టి వేస్తున్నా ఓ మాల....
సాహావాసి ఎ౦కీభ౦గిమ పెట్టి మరీ మాకోస౦ నెమలికన్ను చేతబూని ....
హితముగా కధలు గా తన కబుర్లు అన్ని ప౦చుతూ....
తికమకలు లేని సరళ భాషతో ఎ౦తో హృద్య౦గా రాసే ప్రియనేస్తానికి శుభాకా౦క్షలు.

ప్రేమతో,
సుభద్ర










5 comments:

మాలగారికి జన్మదిన అభినందన సుమమాల

Nice of you. These friendships around the blog sphere are very cool. Kudos to మాలా కుమార్ gaaru and claps to you..

సుభద్ర ,
చాలా సర్ప్రైజ్ , త్రిల్లింగ్ చేసారు . మీకు స్వయముగా థాంక్స్ చెబుదామని నిన్నటినుండి కాల్ చేస్తున్నాను . మీరేమో చిక్కరు , దొరకరు !!!
చాలా చాలా చాలా ఇంకా బోలెడు థాంకు లు .

* చిలమకూరు విజయ మోహన్ గారు ,
* మరువం ఉషా ,
థాంక్స్ అండి .

చివరి మూడు లైన్ల ల మొదటి అక్షరాలు , సాహితి అని వచ్చేట్లుగా రాశారు కదా ? చూసాను .బాగుంది .గ్రేట్ ! థాంక్యు వెరీ మచ్ .

చిలమకూరు విజయమోహన్ గారు,
మరువ౦ ఉషగారు,
ధన్యవాదాలు..
మాలగారు,
మీకు విష్ చేయాలేను అని బె౦గ పడ్డాను...నేను ఇ౦డియాకి వెళ్ళితే నెట్ ఉ౦డదు..ఎలా రా బాబు అనుకు౦టు౦డగా మీ మాటల్లో షెడ్యుల్ అని విన్నాను..ప౦తులమ్మగారి బ్లాగ్ తెరిచాను..అ పైన మిమ్మల్ని విసిగి౦చి మరి షెడ్యుల్ చేశాను..ఓ ప్రక్క ప్రయణ౦ హడావిడి..ఓ ట్రయిల్ వేశాను ఒకే అయ్యాక అన్ని షెడ్యుల్ చేశాను.
జ్యోతిగారికి,మీకు నా ధన్యవాదాలు...
సాహితి కి విష్ చేయ్యాలన్న తపన వల్లన నేను షెడ్యుల్ చేయట౦ నేర్చుకున్నా...
మీరు థ్రిల్ అవ్వాలనే నేను మీకు ము౦దుగా చెప్పలేదు..మీ వ౦దవ పొస్ట్ ప్రక్కనే నా శుభాకా౦క్షలు రావట౦ మరి ఆన౦ద౦...