వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..


మన దేశానికి మంచిరోజులు రావటానికి ఉన్న విఘ్నాలు తొలగించటానికి పూజలు అందుకోవటానికి వినాయకుడు ఊరురా వాడవాడా ప్రతిలోగిలికి వచ్చేస్తున్నాడు కమ్మని మట్టి వాసనతో...నాకు వీలుయినంతలో అందరికి మట్టి బొమ్మకి పూజలు చెయ్యండి చెప్పటం http://vaalukobbarichettu9.blogspot.com/2009/08/blog-post_20.htmlఅలవాటు!!నేను ఇప్పటిఎవరికీ చెప్పలేదు ఎందుకంటే నాకే బోలెడు మంది చెప్పారు..ఎవరు చెప్పిన సరే తప్పకుండా అని చెపుతున్నా!!భలే మార్పు గతనాల్గు ఏళ్ల నుంచి చుస్తే ఈ సారి నా పరిధిలో వందకి వంద మంది మట్టి గణపాయ్ లకే పట్టం కడుతున్నారు..మాటలలో చెప్పలేని ఆనందం ఇది నాకు..
మాకు ఇక్కడ మట్టిదోరకదు కనుక నేను ఎప్పుడు పసుపు విఘ్నేశ్వరుడికే కే పూజ చేస్తాను..కొంతమంది ఇక్కడ మిత్రులు ప్లే డోవ్ తో చేస్తారు..అది ఎంతవరకు శ్రేయస్కరమో నాకు తెలియదు..ఏది ఏమైనా చాలా మటుకు మార్పు వచ్చింది..ఈ సారి చాలామటుకు పందిళ్ళలో కుడా మట్టి ప్రతిమలే పెడుతున్నారట!!కొంతమంది పందిళ్ళ నిర్వాహకులు పందిళ్ళలో ప్లాస్టిక్ కవర్స్ నిషేదించి తమ వంతు సామాజిక బాధ్యతని నేరవేర్చుతూ ఆదర్శం గా నిల్చుతున్నారు.. అన్ని చానల్స్ వారు ఈ విజయానికి భాగస్వాములే!!!!
పాస్టర్ ఆఫ్ పారిస్ వద్దో అని కాలుష్యనివారణ మండలి మట్టివినాయకుల్ని పంచటం,స్కూల్ పిల్లలకి అవగాహన కల్పించటం,వారి మట్టి ఇచ్చి బొమ్మలతయరి ని ప్రోత్సహించటం బహుమతులు ఇవ్వటం లాంటి పోటీలు పెట్టి మట్టి లంభోధరుడిని పూజకి చాలా కృషి చేస్తుంది..ఒక్క గణపతి నిమర్జనం వల్లనే కాలుష్యం జరగటం లేదు>> ఇలాగే ఇతర కాలుష్యకారకాలమీద కుడా ప్రజలలో అవగాహ కల్పిస్తే బాగుంటుంది..మొత్తానికి దేశం మొత్తంగా మనప్రభుత్వమే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ని (గణపతి బొమ్మలకి)నిషేధం విధించవచ్చు కదా!!ఏమో ఇందులో సాధ్యసాధ్యాలు నాకు తెలియవు..ఏది ఏమైనా ఈ సారి మాత్రం సర్వత్రా శుభప్రదం గా మట్టి బొమ్మల కే పూజ అంటున్నారు....ఇప్పుడు టి.వి వాళ్ళు ఇంత పెద్ద బొమ్మ అంత పెద్ద బొమ్మ అని జనాన్ని తప్పు దోవ పట్టించకుండా ఎకో ప్రెండ్లీ గణేష లే చూపించి ప్రోత్సహిస్తే బాగుంటుంది...
మన పార్వతితనయునికి అన్ని ఆవిరి మీద వండిన పదార్ధాలే ఇష్టం కదా!!తయారీ చాలా ఈజీ!!డైజేషన్ ఈజీ..నునె మాటే ఉండదు..పత్రీ,ఫలాలు చాలా ప్రీతి ఈశ్వరమానస పుత్రునికి!!!చిన్నప్పుడు కనిపించిన ఆకులు అన్ని పత్రీపత్రీ అని కోసేవాళ్ళం!!ఇప్పుడు మాకు దొరికే ఓన్లీ తులసీపత్రం తోనే పూజ!!!పుస్తకాలకి బోట్లు పెట్టేసి దేవుడ్ని కనిపించకుండా పూవులు,పత్రీ తో కప్పేసి మర్నాడు పాలవెల్లికి ఉన్న ఒక్కొక్కో పండు తినేసేదాన్ని!!!అందుకే గజముఖధారి పాలవెల్లి పెట్టి ఇప్పటికి పూజ చేసేచాన్స్ ఇవ్వలేదు...ఇప్పుడు పెడదామా అంటే ఇన్నాళ్ళు లెంది ఎందుకు అని అనిపిస్తుంది...పూజ కబోడ్ లో ఉండే పొడుగాటి రాడ్ కి అన్ని పళ్ళు,మామిడాకులు కట్టేసేస్తాను..పిల్లలపుస్తకాలు,మా సాబ్ సొంతఖర్చులపద్దులు పెట్టి నాకు విఘ్నరాజుకి మాత్రమే తెలిసేలా బ్లాగ్ చిత్తూ కుడా పెట్టుకుంటున్నా!!!! నాకు ఉన్న పుస్తకం అదే మరి ఏం చెయ్యను..లాపి లో బ్లాగ్ ని తెరచి పెట్టి పూజ చేద్దాం అని ఉన్న మా సాబ్ ఛలోక్తులు సహించే ఓపిక లేక ఊరుకున్నా!!!
వారం చూసుకుని దేవుడి మండపం కదిపేసి తరువాతి వచ్చే శుక్రవారం నిమర్జనం చేస్తాం!!శుక్రవరమా???అనకండి అదే వీకెండ్ మాకు ఇక్కడ!!!అంతా కలిపి ఎంచక్కా తలోరకం వండుకుని వెళ్లి దేవుడికి నిమర్జనం చేసేసి వస్తాం!!ఇక్కడ అందరికి విధిగా చెపుతాను అమ్మలారాఅంతా న్యూస్ పేపర్స్ లో చుట్టి తెండి అని!!అంతా అలా గత ఆరు ఏళ్ల నుంచి నియమంగా పాటిస్తున్నాం...అంతా ఇంట్లో ప్రధమపుజ్యడ్ని ఇంటిదగ్గర ఉన్న మండపాలలో కవర్స్ లో పెట్టి ఇస్తారు.. అలా కాకుండా న్యూస్ పేపర్ లో పొట్లం చుట్టి ఇస్తే మరింత పర్యావరణానికి మేలు జరుగుతుంది..మట్టితో చేసిన గణనాయకుడికి పూజ చేసేసాం ,కాగితం లో చుట్టి నిమర్జనం చేసేసాం మేము పర్యావరణానికి తెగ సెల్ప్ చేసేస్తున్నాం అనుకోకుండా వీలు అయినంతలో ప్లాస్టిక్ వాడకం తగ్గించటం!!మన పిల్లలకి కాస్తా అవగాహన కల్పి౦చాలీ..రోజుకి ఒక కవరు వాడకం మన వాళ్ళ తగ్గినా చాలా మేలు జరుగుతుంది...మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే రేపుటి తరాలకి మార్గదర్శకాలు!!తద్వారా జరిగే మేలు ఎవరికీ చెప్పనవసరంలేదు...
అందరికి వరసిద్ధి వినాయకుడుసకల శుభాలు కల్గాజేయాలని,
అవినీతిరహిత,కాలుష్యరహిత దేశం గా ప్రపంచ లో అగ్రగామి కావాలని కోరుకుంటూ......
మీ,
సుభద్ర

6 comments:

మాకైతే చిన్నప్పటి నుంచి వినాయకుని మట్టితో ఇంట్లో చేయటమే అలవాటండి . ఇప్పుడు మా పీలలు చేస్తున్నారు .
మీకు వినాయక చవితి శుభాకాంక్షలు .

ఇప్పుడు టి.వి వాళ్ళు ఇంత పెద్ద బొమ్మ అంత పెద్ద బొమ్మ అని జనాన్ని తప్పు దోవ పట్టించకుండా ఎకో ప్రెండ్లీ గణేష లే చూపించి ప్రోత్సహిస్తే బాగుంటుంది...

నిజం చెప్పారు..

ఇప్పుడు టి.వి వాళ్ళు ఇంత పెద్ద బొమ్మ అంత పెద్ద బొమ్మ అని జనాన్ని తప్పు దోవ పట్టించకుండా ఎకో ప్రెండ్లీ గణేష లే చూపించి ప్రోత్సహిస్తే బాగుంటుంది...

నిజం చెప్పారు..

"మా ఇంట్లో పసుపువిఘ్నేశ్వరుడు మరి మీ ఇంట్లోనో"...చదివాక నా మనసు పులకరింత చెప్పలేను..ఎందుకంటే:
మట్టి దొరకదు...అందుకని పసుపు. స్వామికి ఆసనం శ్రీవారు వ్రాసుకునే పద్దు పుస్తకాలు . పత్రి దొరకదు అందుకని...పవిత్రాతి పవిత్రమైన తులసీ దళాలతో పత్రిపూజ...నిమజ్జనానికి స్వామి అధిరోహించినది ట్రక్కులూ ట్రాక్టర్లూ కాదు న్యూస్ పేపర్లూ,,ఖాళీ కవర్లు...శ్రీ శంకరులు చెప్పినట్టు "మార్గావర్తిత పాదుకా పశుపతే రంగశ్య కూర్చాయతే.....భక్తిం కింనకరోత్యహో వనచరో భక్తావతంశాయతే" .. భక్తితో మీరు చేస్తున్న పూజ చాలా విలువైనది. శుభంభూయాత్...మీరు చెప్పినట్టు ప్రజలలో అవగాహన పెరుగుతున్నది.,,శుభపరిణామం
స్వాగతిద్దాం....సర్వశుభాలు కలిగించే గణనాథుడు ఇతోధిక సిరిసంపదలతో మిమ్మనుగ్రహించుగావుత.

సుభద్ర గారూ !
మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు
శిరాకదంబం వెబ్ పత్రిక

సుభద్ర గారూ !
మీకు విజయదశమి శుభాకాంక్షలు

శిరాకదంబం వెబ్ పత్రిక