వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..


చుట్టూ కొబ్బరి అడవి మద్యలో మా ఇల్లు..

లేని రకం చెట్టు లేదు,పనస,మామిడి,కమ్మచ్చి (స్టార్ ఫ్రూట్)జామా,ఉసిరి ,నేరేడు అన్ని ఇంటి చుట్టూ ఉన్నాయి.ఇంట్లో ఒక గంగా బొండం చెట్టు,కొన్ని కొబ్బరి చెట్లు,పెరటిలో శ్రీ శ్రీ శ్రీ కృష్ణమధురం మావిడి చెట్టు. ఈ చెట్టు అంటే మా చిన్నపుడు తాతామ్మకి ,ఇప్పుడు నా పిల్లల తాతామ్మ అంటే మా నాన్నమ్మకి ప్రాణం .అన్ని మావిడి చెట్లు పూత పుసాక దిగుబడి అంచనా వేసి అమ్మేస్తారు కాని మా నానమ్మ ముందే ఆ చెట్టు కాయలన్నీ కోసి మాకే ఇవ్వాలని మావిడికాయల షావుకారుతో ఒప్పందం చేసేసుకుంటారు.ఆ చెట్టు కాయలు అంతా రుచి మరి కొంచం అటు ఇటుగా నిలంకాయ లా చిన్న గా ఉంటుంది కాని రుచి పోల్చాడని నా అమృతం తెలియదు భహుశా మా క్రిష్ణమధురం రుచి లానే ఉంటుందేమో .ఆ చెట్టు కాపు కుడా ఎక్కువ ,మేము తిన్నని తినగా అందరికి తాతామ్మ ఇచ్చేవారు .ఈప్పటికే అదే ఆచారం నడుస్తుంది.ఆ చెట్టు కాయ దిగిన దగ్గరన్నుంచి మా నాన్నమ్మ అటు ఇటు ఉంచి మా గ్యాంగ్ అంతా ఉప్పుకారం పెట్టుకుని తినేవాళ్ళం.ఇంకా కొంచం టెంక కట్టక మా అమ్మ చిలకడ దుంప వేసి మావిడికాయ పులుసు పెట్టె వారు.ఆ రోజు మాచెల్లి అరడజను సార్లు అన్నం తినేది.నేను అడిగిమరి అమ్మ టెంక వేయండి అని వేయించికుని వీరా చీకుడే..........

మా ఇల్లు మరమత్తులు చేసినప్పుడు ఆ చెట్టు తీసేద్దాం అనుకున్నారు.కాని వాస్తు కంటే మా ఇంట్లో అందరికి ఆచెట్టు తో ఉన్న అనుభందం గెలిచింది.ఖర్చు పెరిగినా ఆ చెట్టు చుట్టూ ఎత్తు చేసి కొమ్మలు కొట్టేసి వదిలేసారు.ఆ చెట్టు క్రిందే మా పాతా వంటిల్లు ఉండేది.మేము ఆచెట్టు నీడనే బోజనాలు చేసేవాళ్ళం .అట్లా తద్దికి ఆ చెట్టు కొమ్మకి పెద్ద పగ్గం ఊయ్యల కట్టించేవారు. వంటింటి కప్పు మీదకి ఉగేవాళ్ళం.

ఆ చెట్టు క్రిందా కొబ్బరిడోక్కల పొయ్య మీదా పండగలకి రకరకాల పిండి వంటలు చేసేవారు, వేడి వేడి తిన్నపుడు చెయ్యి కాలుతుంటే చటుకున మా చిన్నన్న మావిడాకు కోసి కాలకుండా ఆసారకి ఇచ్చేవారు.మా ఇంట్లో ఎ కార్యం జరిగినా పెద్ద పెద్ద వంటలకి ఆ చెట్టు క్రిందే వంటా ఈప్పటికీ.మా ఇల్లు పరిచయం ఉన్న అందరికి తనరుచి అపుర్వమే.ఇంట్లో కి వస్తూనే ఆ చెట్టు చూస్తూనే అడుగు లోపలి పడుతుంది ........


మా నాన్నమ్మ అన్నం ముద్దలు చేసి నాకు మా చెల్లి కి ముద్దలు పెడుతూ ముద్దా-ముద్దకి ఒక్కొక్క
పక్షి గుడ్డు పేరు చెపుతుంటే యెంత అన్నం తిన్నామో తెలిసేది కాదు ఆ చెట్టు నీడన.వడ్రంగి పిట్ట గుడ్డు ,తితువి పిట్ట గుడ్డు, చల్లంగి పిట్ట గుడ్డు,కోకిల గుడ్డు .కాకి గుడ్డు,కోడి గుడ్డు,గిన్ని కోడి గుడ్డు,
బాతు గుడ్డు,గెద్ద గుడ్డు,నెమలి గుడ్డు,పావురంగుడ్డు, చెవిటి కాకి గుడ్డు,పాలా పిట్ట గుడ్డు, గుడ్లగూబ గుడ్డు,కొంగ గుడ్డు,చిలక గుడ్డు,పిచ్చుక గుడ్డు,టర్కీ కోడి గుడ్డు, గిరిరాజ్ కోడి గుడ్డు,గోరింక గుడ్డు ,పందెం కోడి గుడ్డు,మినా పిట్ట గుడ్డు,కవుజుపిట్ట గుడ్డు,పారంకోడి గుడ్డు,ఇంక ఎన్నో ఎన్నెన్నో కొన్ని పిట్టలు అసలు గుడ్డు లే పెట్టావు,అయినా వాటి తో కుడా మా కోసం గుడ్డు లు పెట్టించే వారు మా నాన్నమ్మ.ఇప్పుడు నవ్వు వస్తుంది పందెం కోడి గుడ్డు తిన్నందుకు.

మా నాన్నమ్మ కాపరానికి వచ్చేసరికే ఉందట ఆ చెట్టు మా నాన్నమ్మ మొన్న ఏప్రిల్ 15న ఎభయ్యి రెండొవ పెళ్లి రోజు జరుపుకున్నారు మరి ఈ మధురఫలలా చెట్టు చెట్టుకి ఎ వయస్సు ఉంటుందో ....ఎన్ని తరాలు అయినా ఆ చెట్టు అలానే ఉండి తన మాధుర్యం అందరికి ఇవ్వాలని కోరుకుంటూ ........................

ప్రేమ తో ఈ పోస్ట్ మా తాతామ్మ కి అంకితం ఇస్తూ .........

ప్రేమ తో ,

మీ పెద్దది.(నన్ను మా తాతామ్మ పిలిచే పేరు)

నా అసలు పేరు తనదే లెండి .

సుభద్ర..........

ఇది నేను చదివి కధ నాకు నచ్చిన కధ,రామకృష్ణ పరమహంస చెప్పిన కధ.

అనగనగా ఒక చెరువు ఉంది.దానికి నాల్గు ఘట్టాలు ఉన్నాయి.ఒక ఘట్టం నుంచి హిందువులు నిరు తీసుకుపోతారు.వారిని ఆ బిందె లో ఏముంది అంటే "జలము "అని చెపుతారు.ఇంకొక ఘట్టం నుంచి ముస్లిములు నిరు తీసుకుపోతారు. వారి ని నివు ఏమి మోస్తున్నావ్ అంటే "పానీ"అంటారు.ఇంకో ఘట్టం నుంచి క్రిస్తవులు నిరు తీసుకుపోతారు .వారిని అది ఏమిటి అని అడిగితె వాటర్ అంటారు.

ఎ పేరు తో పిలిచినా అంతా మోస్తున్నది నీరే ,అందరి దాని అవసరం ఒకటే .రాముడు,అల్లా ,జీసస్
అంతా ఒకటే పేర్లు వేరు.ఏక్ రామ్ హజర్ నాం .సత్యం ఒకటే పేర్లు వేరు .ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు.అలవాట్లు,ఆచారాలు,సంప్రదాయాలు వేరు. అందుకే మతాలలో భిన్నత్వం కనిపిస్తుంది.తమ మతమే సరి అయినదని ,ఇతరులది కదాని అనుకోవటం ఎంతమాత్రం మంచింది కాదు. అని శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పారు.

నాకు చాలా నచ్చింది ఈ కధ . మతం పేరు తో ఘర్షణలు ,చంపుకోవటం,రక్తపాతం సమంజసమినది కాదు.ఏదేవుడు రక్త అభిషేకం కోరుకోడు.అన్నింటి లోను మంచి చెడ్డులు ఉంటాయి.మనవ జన్మ కి
వచ్చాక దేవుడు ఇచ్చిన వివేకం మారిపోకూడదు కదా .మేమే గొప్ప అన్నా అహంకారం తోనే గొడవలు
అన్ని.ఏకామేవాద్వితియం బ్రహ్మ .

పేపర్ లో ఒక వార్తా చూసి ఈ కధ గుర్తు వచ్చి రాసాను.చాలా రోజుల క్రితం చదివాను.ఏమి అయినా తప్పులు ఉంటే మన్నించండి.



నేర్చుకున్నా ఇలా ఎలాగంటే ................




నేను నా మొదటి పొస్ట్ లో నాకు హెల్ప్ చేస్తున్న అందరికి కృతజ్ఞతలు చెప్పుకున్నా , కాని ఒకరి గురించి రాయలేక పోయా అది మా శ్రీవారు.......



ఆ విధంబెట్టిదనినా. ...మనకి 2005 మార్చి వరకు కంప్యూటర్ అంటే మూడు విషయలు తెలుసు. అవి మానిటెర్, కిబోర్డ్ , ఎలక. మా వారు చూడు నేర్చుకో అని అంటూనే ఉన్నారు .మన చర్మం కొంచం దళసరి కదా ఏది త్వరగా ఎక్కదు , నాకు 2005 కి నేర్చుకోవాలని అనిపించింది. మా సాబ్ సాయం తో మెయిల్స్ చూడటం మాత్రమే నేర్చుకున్నా. తరువాత ఒక విడత పౌరుషం తెచ్చుకుని మెయిల్స్ చేయటం నేర్చుకున్నా , కాని చాలా స్లోలో .అంతా అయ్యకా మా చిన్నోడు స్విచ్ నోక్కేయటం చేసేవాడు. దేవుడా అని మళ్లీ మొదలు ..

నెట్ లో రోజు ఈనాడు చదవటం , వంటల వెబ్-సైట్స్ చూడటం, బ్లాగ్స్ పరిచయం. నాకు ఆశ కల్గింది నేను రాయాలి అని. ఇంకో స్వార్ధం కూడా ఉంది. ఇక్కడైతే నా రాతలు బౌన్స్ అయ్యి తిరిగి రావు కదా, తిరిగి వస్తే పొస్ట్ మేన్ డబ్బు అడుగుతాడనే టెక్షన్ లేదుగా. ఎందుకంటే ఇంతకు ముందు నాకు అలాగే జరిగింది 3సార్లు అందరికి తెలిసే ఉంటుంది. స్వాతి లో ఈ శిర్షిక మీదే. దానికి మన ప్రతిభ అంతా రుబ్బి , పిండి రసం తీసి ముచ్చటగా ముడు సార్లు పంపాను, అవి కూడా ముచ్చటగా తిరిగి వచ్చాయి.నాకు కారణం కూడా తెలియదు .చిన్న పిల్లని ఆయె మరి. అలాంటి వాటిని రాయటానికి వేరే కార్డులు ఉంటాయని తెలియదు పాపం నాకు. సో పిటి కదా . మాములు 15 పైసల కార్డు మీద రాసి పంపితే, అవి గోడకి కొట్టిన బంతుల్లా తిరిగే వచ్చాయి. మనకి ముదర తెలివి కి లోటు లేదులెండి.



డాటరప్ అని రాస్తే నాన్న కోప్పడతారని కేరాఫ్ అని తాతయ్య పెరు మిదా వ్రాసెదాన్ని.తాతయ్య ఏమి అనరని దైర్యం అన్నమాట. పొస్ట్ మ్యాన్ తాతయ్య ఎక్కడ ఉన్నా వెదికి మరీ పొలం లోఉన్నా, ఫ్రెండ్స్ తో పేకాటలో ఉన్నా డబ్బు వసూలు చేసేవాడు. తాతయ్య ఫ్రెండ్స్ కి తెలిసి ,నేను కనిపించి నప్పుడల్లా నన్ను ఏడిపించేవాళ్లు. మొగుడు కొట్టి నందుకు కాదు తోడికోడలు నవ్వి నందుకు అన్నట్లు ఉండేది నా పని.

రెండు సార్లు తిరిగి ఇస్తూ నవ్వారు తాతయ్య కాని మూడవసారి తిరిగి రావటానికి సరిపడా స్టాంప్స్ అంటించు అని సలహా ఇచ్చారు. మనకి పౌరుషం పొడుచుకొచ్చింది. అయినా నన్ను ఎవ్వరు ఆపలేరు , ఆప తరమా?

అని ఒక బుక్ లో నాకు నచ్చి నట్లు ఎడా పెడా రాయటం మొదలు పెట్టా. ఆ రాతలకి మా చెల్లి ,చిన్న పిన్ని బాధితులు , ఆ తదుపరి బాదుతుల లిస్టు పెరిగింది అనుకోండి.

అలా నాలోని కళా నాలోనే అణగ త్రోక్కబడింది. ఇపుడు మీకందరికి ఓ బంపర్ ఆఫర్!!! నా ఆవేశం కట్టలు తెంచుకుని రకరకాలుగా మీముందుకు రాబోతుంది.. నా బాధితుల లిస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెరగబోతుంది. నేను మాత్రం మీకు దొరకనుగా...


కాచుకోంఢి మరి.... 

గెట్ రెడీ .....................................

నాకు నేను గా వచ్చి ఆవిడా ఎప్పుడు కుర్చోమనే చోటు లో ఉండటం చూసి ?పేస్ తో చుస్తూ ఉన్నారు .టీచర్ మొఖం చూడటానికి భయపడే నేను ఆవిడని చూసి నవ్వతాని కి ట్రై చేసాయా,నవ్వటం కుడా కష్టం అని ఫస్ట్ టైం తెలిసింది.టీచర్ ని చూస్తున్నా టీచర్ ఏదో అడుగుతున్నారు వినిపిస్తుంది కానీ ఎలా మాట్లాడాలో తెలియటం లేదు .చుక్కలు మెరుస్తూ
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అల్ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఐస్ ,అల్ ఆర్ బ్రయిట్ అండ్ అల్ ఆర్ డార్క్.......
అన్ని తెలుస్తున్నాయి .ఎమితెలియటం లేదు కొంత సేపుకి అంతా బ్లాంక్ కళ్లు తెరిచేసరి అంతా నాకుసేవలు చేస్తున్నారు.నేను టీచర్ ఒల్లో ఉన్నాను.నా ఫ్రెండ్స్ పెట్టి ఆటో ఎక్కించారు.రెండు రోజులు రెస్ట్ తరువాత మల్లి స్కూల్ కానీ భయం లేదు చిన్నగా టెన్షన్ ఉంది కాని మునుపు అంతా కాదు .ఫ్రెండ్స్ హెల్ప్ తో ఓకే, నాట్ బాడ్ అన్పిం చేది.ఎప్పటి అప్పుడు చదివేదాన్నిమిగిలినసబ్జక్ట్స్ , కాని లెక్కలు ఎక్షమ్ ముందు మాత్రమే చదివేదాన్ని.అదికూడా ఒక కారణం అన్పించింది నాకు తక్కువ మార్కులు రావటానికి.దుష్టి గా వినటానికి ట్రై చేశాను.
ఎ రోజు లెస్సొన్ ఆ రోజే ప్రాక్టీసు చేయటం, బండగా ఒక్కొక లెక్క బట్టి కొట్టే దాన్ని .
ఆ ప్రాక్టీసు వల్లనా ప్రశ్న చూడగానే ఆన్సర్ ఇది అని గుర్తు వచ్చేది .అన్ని వచ్చినట్లే ఉండేవి సాల్వ్ చేద్దాం అంటే వచేవి కాదు.బట్టి మొదలు పెట్టాక కొంచం మారింది పరిస్తితి .
ఎక్షమ్ లో లెక్క మొదలు పెట్టేదాన్ని 4 స్టెప్స్ అయ్యాక పెన్ కదిలేది కాదు సరే అని క్రింద నుంచి
జవాబు అని రాసి అండర్ లైన్ చేసి క్రింద నుంచి ఫై కి చేసుకోచేదాన్ని .ఎలాగో క్రింద నుంచి 2 or 3 స్టెప్స్ వచ్చేవి మద్య లో ఫైనది ,క్రింద స్టెప్స్ మ్యాచ్ అయ్యేవి కావు.ఎక్షమ్ రూం లో జుట్టు పికునేదాన్ని ఏడ్చేదాన్ని.నా బెస్ట్ మార్క్స్ ఇన్ యూనిట్ టెస్ట్ 20 /25 .హాఫ్ ఇయర్లి లో 62 or 64 వచ్చాయి .10 th పబ్లిక్ లో 86 వచ్చాయి .మా బాగ్యలక్ష్మి టీచర్ వల్లనే ఆ మాత్రం చదివా.థాంక్స్ మా బాగ్యలక్ష్మి టీచర్ కి.నా ఫ్రెండ్స్ కి . కొసమెరుపు నేను ఇంటర్ లో M .P . C.
కాని పూర్తి అయ్యిందా అని మాత్రం అడగకండి.

ఇంక మనకి గుడ్డిలో మెల్ల స్ధాయి అప్పటి నా రికార్డు ని16/25 నేను బ్రేక్ చేసి అత్యదిక స్కోర్ 18/25

నమోదు చేసుకున్న.పాపం టీచర్ కి తెలియదు కదా మన ప్రతిభ . రెండు నెలలు కష్టబడి నా వెంట బడినా ఆమె సబ్జెక్టు కి న్యాయం చేయలేదని తన ఫీలింగ్ .అయినా పట్టువదలని విక్రమార్కుని లా నన్ను వదలలేదు .క్లాసు కి రాగానే సుభద్ర రా అని ముందు కూర్చో బెట్టుకుని బాగు చేయతాని కి ట్రై చేస్తున్నారు .పరిక్షలు అవుతూనే ఉన్నాయి నా మార్కులో ను పెద్దగా మార్పూ లేదు.
నన్ను బాగ్య లక్ష్మిటీచర్ వదలలేదు .నాకు రోజు రోజు కి లెక్కల మీదా కోపం ,అసహ్యం పెరిగి పోయాయి .
నాకు మిగతా సబ్జక్ట్స్ లోను మార్కు తగ్గటం తో ఇంట్లో గోల .థర్డ్ యూనిట్ లో అన్ని20లోపే వచ్చాయి .రిపోర్ట్ కార్డు ఇస్తూ సుభద్ర చదవ ని వాళ్ళని ,సరేలే బుర్ర తక్కువ అని వదిలేయ వచ్చు కాని అన్ని సబ్జెక్టు లో ను మంచి మార్క్స్ తెచ్చు కుంటు లెక్కలు మాత్రమే తక్కువ తెచ్చుకుం తున్నవని నిన్నులెక్కలలో ఇంప్రూవ్ చేయాలనుకున్న కాని మొదలికే మోసం తెచ్చావు .
ఇంకా వదిలేయి అన్ని చాలా ఎమోషన్ గా చెప్పి నిజం చెప్పవద్దు రెండు మొట్టికాయలు కుడా వేసి క్లాసు తీసుకోకుండా వెళ్ళిపోయారు.దానితో క్లాసు లో చాలా అవమానం అని పించిది .ఆవిడా మొట్టికాయలులతో తల లో తప్పుకున్న నరం ఏదో గాడి లో పడింది అనుకుంటా.ఇంటికి వచ్చాక చాలా డిస్ట్రబ్ అయ్యాను .స్కూల్ డుమ్మా ఏవో కుంటిసాకులు చెప్పి.నేను ట్రై చేద్దాం అని డి సైడ్ అయ్యాను .అప్పటి రాక పొతే వదిలేడం ఈ సంవత్సరం కాస్త పడితే ఇంక లెక్కలు లేని చదువు చదువు కోవచ్చు అని స్కూల్ కి వెళ్ళాను .అంతా ఓదార్పులు,పరమ్సలు ఒక్క క్లాసు అవ్వుతుంది లంచ్ బ్రేఅక్ తరువాత లెక్కల క్లాసు వచ్చింది.
టెన్షన్ కి అన్నం వికార పెట్టి తినలేక పోయా .నాకు వణుకు జీసస్ ,ఆమెన్ అనుకుంటూనే ఉన్నాను.మాది మిషనరీ స్కూల్ ఆ ప్రభావం చాల ఎక్కువగ ఉండేది .
ఇంగ్లీష్ అయింది,నెక్స్ట్ లే..క .క .క్క లు .గట్టిగా ఉపిరి పేల్చి కళ్లు మూసుకుని చాలా దైర్యం అరువు తెచ్చుకుని నాకు నేను గా మొదటిసారి నన్ను రోజు బాగ్యలక్ష్మి టీచర్ కూర్చో మనే చోటా బోర్డు కి ఎదురు గా కూర్చున్నా .క్లాసు లో అంతా నన్నే చూస్తున్నారు.విపరీతం గా చమటలు ఆ కంగారు కి నాకు గొంతు ఎండి పోతుంది.నా పెదవులు తిమ్మిరిగా ఏదోలా నా మూతి ప్రక్కకు వెళ్లి పోట్టున్న ఫీల్.