వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..





మాకు ఎండలు ముదురుతున్నాయి...అంతా సమ్మర్ వెకేషన్ మూడ్ లోకి వచ్చేసాం....దోస్త్ లు అంతా ఇండియా కి షాపింగ్,ప్యాకింగ్ అంటుంటే నేను మాత్రం వెళ్లిరండి వెళ్ళిరండి అని వేర్రినవ్వుతో హ్యాపీ జర్నీ చెపుతున్నా....నా దోస్త్ లు

అయ్యో ఇక్కడ ఉంటారా???అమ్మో రెండు నెలలు "ఎలా ఉంటారు?? అని సానుభూతి చూపిస్తుంటే ఇట్ట్టే అయిపోతాయి అని డాభికంగా చెప్పిన లోపల మాత్రం ;( :( :(...




పెద్దోడ్ని సమ్మర్ క్యాంప్ కి ఓ నెల పంపుదాం,ఇంకొం నెలా ఎలాగో గడిచి పోతుంది లే అనుకుంటున్నా..చిన్నోడి
వయస్సు పిల్లల్ని నల్గుర్ని చూసుకున్నాను నేనే కాస్తా డ్రాయింగ్ అవి నేర్పుదాం అనుకుంటున్నాను.(మొన్నే మా పెద్దోడికి డ్రాయింగ్ లో ప్రైజ్ వచ్చింది ఆ కాన్పిడేన్స్ తో)..ఈ ఏడు ఎలాగు అరబిక్ హిందీ మొదలైయ్యాయి!!!మా పెద్దోడికి నేర్పిన అనుభవం తో ఈ రెండు నెలలు పిల్లలకి కాస్తా నేర్పుదాం వాళ్లకి కొంచం సులువుగా అనుకుంటున్నాను...డబ్బులకి కాదండోయ్ ఏదో మా చిన్నోడికి క్లాస్ ఫీల్ కోసం ప్రతి రోజు నేను సెలవులమూడ్ లో లేట్ నైట్ చెయ్యకుండా సిస్టమేటిగ్ గా ఉండటం కోసం అంతే!!పని లో పెద్దపిల్లలకి మా పెద్దవాడు తోటిపిల్లలకి తెలుగు పాఠాలు కూడా నేర్పితేనో????? తెలుగు పిల్లలు సగంమంది వెళ్ళిపోతారు...సగం మంది ఓనెల వెళ్లి వచ్చేస్తారు...ఇది ఓ కొల్కిరాని నా మనసుమధనం...




మా అత్తగారు మనవలకి తెలుగు రాదనీ చాలా బాధపడుతూ ఉంటారు....మా పిల్లల తెలుగు అలా ఉంటుంది మరి !!!ఏం చేస్తున్నావ్ రా అంటే "చారు చేస్తున్నా"జారబడ్డాను అని చెప్పడం ముచ్చటికి...వాటర్ డ్రింక్ చేస్తున్న...మా అమ్మని పెద్దోడు పిలిస్తే ఒక నిమిషం రా పక్క వేసి వస్తా అంటే కొంచం సేపు తరువాత వచ్చి అమ్మమ్మ ఆ "పక్క పెట్టండి టేస్ట్ చూస్తా అన్నాడట>>>>>>>అంటే చేస్తా,వేస్తా,వస్తా లాంటివి వాడికి అంతా బాగా అర్ధం అవుతాయి...మరి తెలుగులో ఎక్కువ చెపితే ప్లీజ్ రిపీట్ స్లోలి అంటాడు...అదో కాస్తా ఈ సెలవలో మాట్లాడటం,కొద్దిగా చదవటం అది నేర్పిస్తే కాస్తా బోర్డు లు,బస్సు పేర్లు అయినా చదవటాని పనికి వస్తుంది కదా!!!ముఖ్యంగా వాడితో మాఅత్తగారికి,ఉత్తరాలు రాయించి వందకి వెయ్యి మార్కులు కొట్టేయ్యాలి..హీన పక్షం వాడికి మాట్లాడటం నేర్పాలి...ఏమో ఎంతవరకు జరుగుతుందో తెలియదు...ప్రయత్నం చేయ్యాలి అనుకుంటున్నాను....




ఎందుకొచ్చిన తిప్పలు ఎంచక్కా ఇండియా వెళ్ళు అంటారా??ఏం చెప్పను సీత కష్టాలు సీతవి నాలాంటి పీత కష్టాలు పీతవి.....మొన్న సంక్రాంతి కి వెళ్లాను,మార్చ్ లో వెళ్లాను...అదికాక మేము ఇండియా జూన్ వెళితే అంతా స్కూల్స్ బిజీ ;మార్చ్ లో వెళ్ళినప్పుడు ఊర్లో అంతా నీ పనే బాగుంది....ప్రతి రెండు మూడు నెలలకి వస్తున్నావ్ అని ఒకరంటే,,,హైదరాబాద్ ఉన్నోళ్ళు సంత్సరానికి ఒక్కసారి వస్తున్నారు నువ్వు ఇలా వెళ్ళు తున్నావ్ అలా వస్తున్నావ్ అని మరోకరంటే,,,,టిక్కెట్ సొంతమా లేక కంపెనీ ఆఆఆ అని ఆరాలు తీస్తున్నారు...మా నాన్న అయితే "బాబు ఇష్టం గానే పంపుతున్నారా??? లేక నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలి అని వచ్చేస్తున్నవా???అని పెద్ద అనుమానం వ్యక్తపరిస్తే నాకు ఏం చెప్పాలో తెలియక నాపని అమ్యోమయం అద్వానం అయ్యింది....నా ఫ్రెండ్ అయితే"" సుమ నిజం చెప్పవే నువ్వు నిజంగానే దుబాయ్ నుంచి వస్తున్నావా??లేక ఏ శంషాబాద్ నుంచి వస్తున్నావా??మా ఆయన పిల్లలు పల్లెటూర్ లో కరెంట్ అది లేక పాడైపోతారని అసలు వారం పది రోజుకంటే ఉంచారు"""అని అంది..ఓరి నాయనో అయితే ఇప్పట్లో రాకుండా నేను దుబాయ్ వాసినే అని ప్రూవ్ చేసుకోవాలా అని అడిగా ....



నా ప్రెండ్స్ ద్దిష్టే తగిలినట్లు ఉంది నాకు ( ఇరుగు దిష్టి పురుగు దిష్టి ..............)ఏది ఏమైనా ఈ సారి వేసవి ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నాను...ఇంకో పదిహేను రోజులు లలో శెలవలు పిల్లలకి...చిన్నపుడు ఎప్పుడో(పది ఏళ్ల లోపు వయసు ఉండగా)మా ఇంట్లో మొక్కలనిటికి బెత్తం పుచ్చుకుని పాఠాలు చెపుతూ టీచర్ పోజ్ కొడుతూ దండెం మీద తువ్వాలు చీర కట్టేసుకుని, పెద్దైక నేను టీచర్ అవ్వాలి అనుకునేదాన్ని....మా మేడం గారు(మా స్కూల్ ప్రిన్సిపాల్ గారి భార్య) ఆవిడ్ని తెగ ఇమిటేట్ చేస్తూ ఆవిడలా ఫీల్ అయిపోయ్యి అబ్బో అందరి మీద చాలా(మొక్కలు కదా నా స్టూడెంట్స్)పెత్తనం చేసేదాన్ని...మా సుజాత మేడం గార్ని మాత్రంచాలా సూపర్..భలే చెప్పేవారు లెస్సన్స్,యమా స్రిక్టు,ఆవిడ పేరు చెపితే స్కూల్ అంతా దడదడలాడేది...ఆవిడ రెడ్ ఇంక్ పాళీ పెన్ వాడేవారు....నేను ఆవిడలా టీచర్ అయ్యాక అదేమాదిరి హీరోపాళి పెన్ వాడాలి అనుకునేదాన్ని.....ఇండియా వెల్లినప్పుడు అంతా వెళ్లి ఒకసారి మా మేడంగార్ని చూసివస్తాను...ఆ మద్య మా సాబ్ ని తీసుకెళితే నా వీరగాధలు అన్ని మా సాబ్ కి చెప్పేశారు ..మరి అంతగా పొగిడేస్తు౦టే పిల్లల్ని తీసుకు వెళ్ళనందుకు భలే సంతోషించా!!!మరి మామూలు స్టోరీల మనవి మేష్టర్లని (మా పెతాతయ్యతో వార్నింగ్ లు పెద్ద లిస్టు ఉంది లెండి),అందరిమీద (క్లాస్ మేట్స్ మీద )జులుం చెయ్యటం...నేను,వల్లి,పద్మజ భయపెడితే పాపం ఓ మేష్టారు స్కూల్ మానేసిన వైనం అబ్బో చాలా చెప్పా రు.. అవి విని ఇంటికోస్తున్నప్పుడు మా సాబ్ అమ్మో రాక్షసి ఇప్పుడు నా పిల్లల్ని డిసిప్లిన్ డిసిప్లిన్ అని ఎన్ని నీతులు చేపుతావే అన్నారు...అందుకే కదా చెప్పేది తల్లి పోలిక రాకుడదని పళ్ళు ఇకిలించాను...





అదండి విషయం ఇలా నేను ఓ రెండు నెలలకి టీచర్ ని కాబోతున్నాను.....ఉపయోగకరమైన సైట్స్ చెపుతూ ప్లీజ్ విష్ మీ అల్ ది బెస్ట్....

12 comments:

టీచర్ గారికి,
ఆల్ ది బెస్ట్.

good morning teacher.

best of luck

విజయీభవ....

సుమా, చాలా మంచి ఆలోచన. చిన్నప్పుడు ఆ బెత్తం పట్టుకొని మొక్కలని గద్దించినట్టే, ఈ వయస్సులోనే పిల్లలకి తెలుగు నేర్పిస్తే పుస్తకాల మీద ఆసక్తి కనుక ఉన్నవాళ్ళైతె వాళ్ళంతట వాళ్ళే తెలుగు చదవడం మొదలుపెడతారు. నేను నేర్చుకున్నదీ అలాగే. చిన్నతనంలో వేసవి సెలవుల్లో మా నాన్నగారు నేర్పిన తెలుగే ఇది. కాబట్టి టీచర్ పాత్రని ఇంక పోషించడం ప్రారంభించండి. డ్రాయింగ్‌తో సహా అఆఇఈ లని కూడా మొదలుపెట్టండి. క్రిష్ణవేణి.

హలో టీచర్ పాటలు సరిగా చెప్తున్నారా.

SRRao గారు,
థాంక్స్..పోస్టింగ్ లో ఏదో ప్రాబ్లం వచ్చి సరిగ్గా పోస్ట్ కాలేదు సరిగ్గా సరిదిద్దాను మీకు టైం ఉన్నపు ఒక్కసారి చుడండి ప్లీజ్..

మాలాగారు,
ఆయ్ 7:54 PM కి మార్నింగ్ ఆ ఆ ఆ : >
శ్రిలలితగారు,
ధన్యవాదాలు..మీ దీవేనతోనే నాకు సగం విజయ౦ వరిమ్చేసినట్లు ఉంది..

క్రిష్టవేణిగారు,
స్వాగతం వాలుకోబ్బరిచేట్టుకి..
చాలా థాంక్స్ బలం వస్తుంది మీ కామెంట్ చూస్తుంటే!!డ్రాయింగ్ పక్క కాని తెలుగు మాట ఇంకా తెలియదు..చెయ్యాలనే ఉంది చూస్తాను\

రత్నమాలగారు,
చెప్పగాలననే అనుకుంటున్నాను..తెలుగు కంప్యూటర్ లో తప్పులు వస్తాయి కాని పేపర్ మీద బాగానే రాస్తాను..

SRRao గారు,
థాంక్స్..పోస్టింగ్ లో ఏదో ప్రాబ్లం వచ్చి సరిగ్గా పోస్ట్ కాలేదు సరిగ్గా సరిదిద్దాను మీకు టైం ఉన్నపు ఒక్కసారి చుడండి ప్లీజ్..

మాలాగారు,
ఆయ్ 7:54 PM కి మార్నింగ్ ఆ ఆ ఆ : >
శ్రిలలితగారు,
ధన్యవాదాలు..మీ దీవేనతోనే నాకు సగం విజయ౦ వరిమ్చేసినట్లు ఉంది..

క్రిష్టవేణిగారు,
స్వాగతం వాలుకోబ్బరిచేట్టుకి..
చాలా థాంక్స్ బలం వస్తుంది మీ కామెంట్ చూస్తుంటే!!డ్రాయింగ్ పక్క కాని తెలుగు మాట ఇంకా తెలియదు..చెయ్యాలనే ఉంది చూస్తాను\

రత్నమాలగారు,
చెప్పగాలననే అనుకుంటున్నాను..తెలుగు కంప్యూటర్ లో తప్పులు వస్తాయి కాని పేపర్ మీద బాగానే రాస్తాను..

all the best anDee

అభినందనలు మేడం.. ఆ అల్లా మీ పిల్లలని (పక్క పిల్లల్ని కూడా) రక్షించు గాక :)))

పాపం నిన్ను అంత మాట అనేస్తుందా నీ ఫ్రెండు. అంతేనమ్మా దూరపు కొండలు నునుపు అని దూరంగా వున్నంతవరకే ప్రేమ అభిమానం వంకాయ్ తోటకూర అన్నీనూ .....

వేసవికి పాఠాలు చెప్పడం బాగుంది..అనుభవం ఏమిటయ్యా అంటే .. ఇది వరలో చెట్లకు పాఠాలు చెప్పడం...గుడ్...మరి ఇప్పుడు ఈ వేసవి చెట్లు కూడా అలా తలలూగిస్తూ మలయమారుతాలు వీస్తూ ఆహ్లాదం కలిగిస్తాయని ఆశిద్దాం. (లేటుగా శుభాకాంక్షించానేమో? అయితే సారీ )

Subbu nuvvu inko subbalakshmi teacher kavali ani asisthu
Lalitha