వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..


ఓ మూడునెలల క్రితం పొద్దుటే నాన్న పోన్, ,,,కట్  చేశా మళ్ళి చేద్దామని,, ,నేనే రెండు,మూడు రోజులకి ఒక్కసారి పోన్ చేస్తూ ఉంటాను..మా నాన్ననుంచి  పోన్ అంటే మీ పొలానికి చేర్చి ఓ ముక్క అమ్మకానికి వచ్చింది కొనాలి అని పీకల మీద కూర్చుంటారు..మేము వద్దు అన్న అది ఇది చెప్పి తానూ బజానా ఇచ్చేస్తా అనో అయినంత పంపితే అవేజు మీద అలా మీకు భారం లేకుండా నేను చూసుకుంటా కదా అంటూ,మీరు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తారు..ఇక ఆఖరిఅస్త్రం గా మా అత్తగారికి,మావగార్నిబాగా బ్రెయిన్ వాష్ చేసి మా మీద ప్రయోగిస్తారు...ఈ ఆలోచనతో నాన్నకి పోన్ చేసాను..నాన్న ఫోన్ కలిపాను..నాన్న చాలా డల్ గా కాకినాడ సైట్ అమ్మకం పెట్టారట కదా తల్లి???సొమ్ము అవసరం అయితే పొలాలు అమ్మేయండి అన్నారు..మా నాన్న తో నే నేను మాట్లాడుతున్నది అని అనుమాన౦ వచ్చింది..ఇప్పటి ఆ మాట మా నాన్న అన్నారంటే నమ్మలేకపోతున్నా ..నాన్న అవి ఇవి మాట్లాడి వ్యవసాయం ఇక చెయ్యలేన్నని,తన కష్టాలు అన్ని చెప్పికోచ్చారు...ఇది 1996 తుఫాన్ అప్పటి నుంచి వింటున్నా కాని ఈ సారి నాన్న గొంతు లో వణుకు ఓ క్షణం నాన్న కన్నీళ్లు పెట్టి నట్లు అన్పించింది..ఏమో నాకు ఉహ తెలిసినప్పటి నుంచి పోల౦ తప్ప ఇకేమి తెలియదు,,అన్నిఇ అనుకులి౦చిన ఈ సారి పొలం బీడు లా వదిలేలంతే చాలా కష్టం గా ఉంది అన్నారు...అదేం నాన్న అంటే ఈ పంటల విరామం గురించి చెప్పారు..నాకు నోట మాట రాలేదు...అప్రయత్నం గానే చేమ్మగిలాయి నా కళ్ళు..పంట వెయ్యక పొతే అన్న ఉహకే నా పరిస్ధితి ఇలా ఉంటే పోలామే లోకం గా బ్రతికే మా నాన్న లాంటి వాళ్ళ బాధ ఎలా ఉండి ఉంటుందో కదా!!!!!నాన్న కి తోచినట్లు ఏదో సర్ది చెప్పేసి పోన్ పెట్టేశాను ...
నాన్న కి ఎంతవరకు స్వాంతన దొరికిందో తెలియదు కాని స్ధిరం పొయ్యింది...ఆలోచనల కుమ్మరి పురుగులు ఒకటికి పది అయి నా మెదడు అంతా దోలిసేశాయి...ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు మండలాలో వేయ్యరట!!నాన్న మా ట ప్రకారం లక్ష ఎకరాలు పైమాటే...తద్వారా పాలపరిశ్రమ గ్రాసం దొరక దెబ్బతింటుంది...ఈ విధంగా పాలబ్బాయిలు,చిన్న చిన్న వ్యాపారులు,ఎరువులషాపువాళ్ళు,కూలీలు అందరికి కష్టమే!!!అసలు కోనసీమ పంట పచ్చదనం లేకుండా ఉహించటం ఎలా???????మూడునెలల ముందు గానే చెప్పిన ఇప్పటికాని ప్రభుత్వం కళ్ళు తెరలేదు... కొన్ని చోట్ల అధికారులు బెదిరింపులకి దిగుతున్నారట!!రైతుల మీద కేసులు పెట్టారు అయినా మొక్కవోలని దైర్యంతో ఉద్యమిస్తున్నారు రైతులు...మనకి పులావ్ కి బాసుమతి బియ్యం,అన్నానికి సన్నబియ్యంపండిస్తూ తాముమాత్రం సర్కారోడి ముతకబియ్యం తింటున్న సన్న చిన్నకారు రైతులు ఇంతకన్నా ఏం చేస్తారు తన కడుపు పూర్తిగా నిండక పోయినా అందరి ఆకలి తీర్చే రైతుకి ఆక్రోశం కట్టలు తెంచుకున్నది... కన్నతల్లికి తిండి పెట్టకుండా మాడ్చితే ఎంతో పొలాన్నిబీడు పెట్టడం అంతే..కూలీలకు వరి లేకపోతే మరోపని కాని కౌలు రైతుల కి మరీ కష్టం..అన్ని విధాలా భామినే నమ్ముకుని రాత్రి పగలు ఆ పొలం గట్టునే గడుపుతూ గడుపుతారు..ఎవరోపొలాన్ని తమది భావించి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి తొలకరి ,దాలవా,అపరాలు ఏదో ఒకటి రాకపోతుందా ఇంతకు ఇంతా కొందాం అనుకుంటూ ఉన్న కాస్తా బంగారం కూదవపెట్టి నిండా ములిగిపోతున్నారు..ఇల్లు కట్టుకోవాలని నా చిన్నప్పటినుంచి కలకంటున్న మా వెంకన్న ముసలివాడు అయిపోయాడు... కూతుళ్ళ పెళ్లి తాపత్రయంలో,పంట మీద పంట నష్టపోయి నలభై ఏళ్లకే ఆరవై ఏళ్లు వాడిలా మారిన వెంకటరమణ,అదే కొల్లాయి కట్టు అదే వ్యవసాయం ఏ మాత్రం మారలేదు మా భూషణం పరిస్ధితి..ఇంకా ఎందఱో ఎన్ని కధలో!
రైతు అంటేనే చిన్నచూపు మన సమాజం లో ,రైతుకి గౌరవమే లేదు...వ్యవసాయాన్ని చేద్దామనుకునే వాళ్ళు లేరు..
దేశం అంతా అన్నం పెడుతూ,దేశాభివృద్ధికి కీలక పాత్ర ఉన్న గుర్తి౦పులేదు..పంజాట్,హర్యానా లాంటి రాష్ట్రంలో అన్ని విధాల రైతులు ముదంజలో మన రాష్ట్రంలో మాత్రం రైతు పరిస్ధితి చాలా దైనీయ్యం గా ఉంది..మిల్లర్లు,వ్యాపారులు రైతుని దోసేసుకుంటున్నారు...ప్రభుత్వం సరియిన నిల్వ సౌకర్యాలు కల్పింనందుకు అయినకాడికి పంట అమ్ముకునే దుస్ధితి...పంట కాల్వలు రీపేర్లు నిమిత్త మూసేసి అదికారులు ఇష్టరాజ్యం గా నీరు వదులుతుంటు౦టే నీరు సకాలం లో అందక ఎండిపంటకి ఎవరు బాధ్యలు???? ప్రతిసారి కంటి తుడుపు చర్యలే కాని శాశ్వత పరిష్కారం అన్న మాటే లేదు!!!ఎప్పుడో విన్నట్లు గుర్తు పంట వెయ్యకపోతే పొలాలు ఉప్పు తెరుతాయని,ఈ ప్రభావం కనీసం ఐదు ఆరేళ్ళు భూసారం మీద పంట మీద ఉంటుంది..ఈ నష్టం నుంచి సన్న,చిన్నకారురైతులు ఆర్ధిక౦గా కోలుకోవటానికి పదేళ్లు సమయం పడుతుంది..ఓ పంట వెయ్యలంటే ఉన్న కొద్ది పాటి అవగాహన బట్టి ఎకరానికి 40 కూలిపనులు కావాలి ఒక్కో 200-250రు/ ఉంటుంది..ఎరువులు బస్తాకి 280-300ఉంటుంది ఎకరానికి 3 బస్తాలు వాడతారు..తరువాత గులికలు,ఎలుకలబుట్టలు,దుక్కి, దమ్ము,దేవుడు దయ కలిపి పంట చేతికి రావాలంటే 22-25 వేలు ఖర్చు అవుతుంది..ప్రస్తుతంధాన్యం ఏడు వందలు ఉంది,తడిసిన ధాన్యం అయితే మూడు వందలు రేటు పలుకుతుంది..
కాని కొనే నాధుడే లేడు,,మొన్నటివరకు బోలెడు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం మిల్లర్లు కొనలేదు ..శుబ్రంగా ఉన్న దాన్యం ఎండకి ఎండిపోయి,వర్షానికి తడిసి రంగు మారి రేటు పడిపోయింది..ఇక కొనేవాళ్ళు లేక నెల్లూరు బాతులవాళ్ళు ఏదో ఒక రేటు ఇచ్చి కొనుకుంటున్నారు..గత రెండు పంట ధాన్యం నిల్వచేయ్యలేక,వర్షం నుంచి కాపాడలేక రైతులు నలిగిపోతున్నారు..అన్ని సవ్యంగా జరిగి పంట చేతికొస్తే పెట్టుబడి సొమ్ము రావచ్చు లేదా నష్టం రావచ్చు కాని ఎట్టి పరిస్దితిలోను నాల్గు డబ్బులు చూసే స్ధితి మాత్రం లేదు..అందరికి ఆదాయం పెరిగింది ఒక్క రైతుకి తప్ప!!!
పంటవిరామం గురించి మన వ్యవసాయ శాఖా మంత్రిగారు స్పందిస్తూ మన రాష్ట్రంలో ఉన్నది పదమూడు మండలాలు మాత్రమె కాదని అన్నారు..ముఖ్యమంత్రిగారు టైం కి నీళ్ళు ఇస్తే ఏమి ఉండదు వాళ్ళే వేస్తారు అన్నారట!!ఈ మాటలు రైతులలో మరింత పట్టుదల పెంచినట్లు ఉన్నాయి..కులవర్గాలకు అతీతంగా ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు...మాపార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయన అయితే రైతుల్ని పరామర్శ అటుంచితే కనీసం ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు...జిల్లా మంత్రి నిద్రవదిలి ఆలస్యం వచ్చి తెగ హడావిడి చేసారు..రైతుల్ని అయిందేదో అయ్యింది వేసేయ్యండి పంట అని ఉచిత సలహా ఇస్తే ఇప్పటివరకు ఎక్కడ అమాత్యావార్య అని నిలదీసీస్తే పిచ్చి చూపులు చూస్తూ గుటకలు వేసారట!!
ఓట్ల కోసం ఒక్క ఇల్లు కుడా వదలకుండా తిరిగే రాజకీయనాయకులు ఇప్పుడు రైతు పక్షం వహి౦చలేకపోతున్నారు..ప్రతిపక్షాలు పర్యటనలు తప్ప చేసి౦దేమిలేదు..ప్రజలాలో పూర్తీగా నమ్మక పోగొట్టుకుంటున్న రాజకీయ వ్యవస్ధ..చర్చలకి పిలుపు అంటూ కొందరి రైతు నాయకుల్ని మభ్యచూస్తుంది..మాకు చ ర్చలు వద్దు సచ్చుబండలు వద్దు స్వామినాధాన్ కమీషన్ రిపోర్టు అమలు పరచండి బాబోయ్ అని రైతులు మొత్తుకుంటున్నారు..చర్చలకి అక్కడ రకరకాల డిమాండ్స్ లేవు మద్దతుధర ఇవ్వండి అంటే వీళ్ళకి ఎక్కటం లేదు..ప్రతిప్రజా ఉద్యమం మార్పుకి నాంది అవుతుంది..ఇప్పుడు ఆ పదమూడు మండలాలబాటలోనే తక్కిన నాలుగు
మండలాలు చేరాయి..పొరుగునున్న పచ్చిమగోదావరి,నెల్లూరు,ప్రకాసం,కడప పోరుకి సై అంటున్నాయి...పదమూడే కదా అనుకున్న ప్రభుత్వానికి ఇంతింతై వటుడింతై అన్నట్లు రైతులు తమ విశ్వరుపాన్ని చూపుతున్నారు..రైతే దేశానికి వెన్నుముక,రైతే మన దేశానికి రాజు అని నమ్ముతూ రైతులు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్ది సాదించాలని కోరుకుంటూ,,నాలా రాబోయే కాలం లో రైతులు కావాలనుకునే వాళ్లకి నిరాశ చెందకుండా వ్యవసాయానికి మంచి రోజులు రావాలని ఆకాంక్షీస్తూన్నాను...

17 comments:

మీ పెయిన్ చాలా కనిపించిందండి పోస్టులో.... బాధేసింది.

నా మనసులో ఉన్నది మీరు రాశారా అనిపించింది. మీ మనసు పడుతున్న వేదన కనిపించింది ఈ టపాలో. ఎక్కడో దూరంగా ఉన్నా మీ మనసు కంటితో ఇక్కడి పరిస్థితిని చూశారు.
పుట్టి బుద్ధెరిగాక ఇలా ఉన్న (పొలాల్లో కలుపు మొక్కలు తప్ప మరేమీ కనిపించని) కోనసీమని నేను చూడలేదు. మనసు మెలిపెట్టినట్టు బాధ. పగలూ, రాత్రీ పొలం ధ్యాస తప్ప మరొక ధ్యాస లేని రైతులు అన్నపూర్ణని అలా వదిలేసి పడుతున్న బాధ వర్ణనాతీతం. కానీ వారికిది తప్పనిసరి పరిస్థితి. ఎన్నాళ్ళ నుండో మొత్తుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. ఆర్ధిక ఇబ్బందులు పడలేక పచ్చని కోనసీమలో రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు.
>>>మనకి పులావ్ కి బాసుమతి బియ్యం,అన్నానికి సన్నబియ్యం పండిస్తూ తాముమాత్రం సర్కారోడి ముతకబియ్యం తింటున్న సన్న చిన్నకారు రైతులు ఇంతకన్నా ఏం చేస్తారు<<<
చాలా బాగా చెప్పారు. కోనసీమ రైతులందరి ఆవేదనా మీ టపాలో కనిపిస్తూంది.

హ్మ్ ! చాల బాదేస్తుందండి చదువుతుంటే .
Very well written post !

అన్నదాతను మర్చిపోయిన నాయకులను ఎన్నుకున్న మనందరం సిగ్గుపడాలి. పంటవిరామంతో బాటు ప్రజా ప్రతినిథులందరికీ బియ్యం, పప్పులు లాంటివి ఎవరూ అమ్మకుండా, ఇవ్వకుండా వెలివేసి ఆకలంటే ఏమిటో తెలియజేస్తే అన్నదాత అవసరమేమిటో అర్థమవుతుందేమో ! పచ్చటి కోనసీమని తల్చుకున్నా, బంగారు బాతులాంటి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చెయ్యడాన్ని తల్చుకున్నా చాలా బాధగా వుంది సుభద్ర గారూ !

కామెంట్ పెట్టటానికి కూడా బాధగా ఉంది. ఎంత మందికో నోటిదగ్గర కూడు పోతూంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుంటోంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని మళ్ళా మళ్ళా తెలియ చెప్పుకోవాల్సి వస్తుంది. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

మూడు సార్లు కళ్ళు నులుముకోవలసి వచ్చింది, కళ్ళల్లో నీళ్ళునిండి చదవటానికి కనపడక.
జిల్లా వేరయినా మా కధ కూడ ఇదేనండి.

రైతుల ఆవేదన మీ అక్షరం..అక్షరం లో ప్రతిబింబించారు. కంట తడి పెట్టించారు. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. పొలమే ప్రాణంగా బ్రతికే రైతు..తల తాకట్టు పెట్టయినా పొలం మీద పెట్టుబడి పెట్టే రైతు పంట విరామం ప్రకటించాడంటే ఎంత ఆవేదనతో ఆ పని చేసి ఉంటాడో ఈ పాలకులకి అర్థం అవుతున్నట్టు లేదు..పైగా విరామం విరమించండంటూ బెదిరింపులు.

పెరిగిన ధరలకు తగ్గట్టు ధాన్యం ధర లేదు. ఉపాధి హామీ పథకం అని ఓ పథకం పెట్టి రైతుల కష్టాలకి ఆజ్యం పోసారు. ఓ గంటా రెండు గంటలు పని చేస్తే రెండు వందలు కూలీ..అది చూసుకుని రేట్లు పెంచేసిన కూలీలు..పెరిగిన ఎరువుల ధరలు...సరయిన ధర లేక..అమ్ముడు పోక..కొట్టాములలో మగ్గుతున్న ధాన్యం..ఏం పెట్టి పంట వేస్తాడు రైతు?

ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరుస్తాయో లేదో! పొద్దున లేచిన దగ్గరనుండి టి.వి చానళ్లో అవసరం లేని విషయాల మీద చర్చలు..రాద్దాంతాలు చేసే రాజకీయ నాయకులకి..మేధావులమనుకునే విశ్లేషకులకి రైతు కష్టాలు కనపడవనుకుంటా!

మీ ఆవేదన అక్షరాల్లో కనిపిస్తోందండీ...ప్చ్...very sad ! తెలియనివాళ్ళకు కూడా విషయం అర్ధమయ్యేలా బాగా రాసారు..

పిల్లలకి అన్నం పెట్టలేని కన్నతల్లి పడే బాధ కనిపించింది మీ మాటల్లో.
ఇది ఒట్టి వేదన కాదు..
కడుపు తరుక్కుపోయే కడుపు కోత..
ఏమీ చెయ్యలేని నిస్సహాయత..
గుండె రగులుతున్న కఠిన సత్యం..
ఏమి చేయలేని ఉడుకుమోత్తనం..
అధికారుల అలసత్వం..
అందలాలెక్కిన నాయకుల పొగరుమోత్తనం..
ఇంకా.. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో..
కాని బాధపడేది మాత్రం అన్నదాతే..
నలుగురికీ అన్నం పెట్టే ఆ చెయ్యి..
ఖాళీగా వేలాడుతుంటే..
ఎంత బాధ..
ఎంత నరకయాతన..

మీరు రాసింది చదువుతుంటే చాలా బాధగా వుందండి .

మళ్ళీ బాధపడ్డానండీ మీ టపా చదివి.. రెండు నెలలుగా రోజూ ఆలోచిస్తున్న విషయం ఇది.. నాయకులు, అధికారులు ఎవరికీ ఇప్పటివరకూ పట్టలేదు.. ఇప్పుడైనా, మీడియా హడావిడి అది కూడా జాతీయ స్థాయిలో జరిగింది కాబట్టి చర్చలనీ, కమిటీలనీ మొదలు పెట్టారు.. జరిగింది దురదృష్టకరమైన విషయమైనా ఇక నుంచైనా రైతులకి మంచి రోజులు వస్తాయని ఏమూలో చిన్న ఆశ.. రావాలని పెద్ద కోరిక....

నిజానికి నేను రైతును కాను..కాని మీరు వ్రాసింది చూస్తే చాలా బాధనిపించింది..కోనసీమ వెళ్తూ ఉంటాను..ఆ పచ్చదనాలు చాలా ఆనందంగా చూస్తాను...ఇదంతా నా జిల్లా కదా అని గర్వంగా చూస్తాను..ఇప్పుడు మీరు చెప్తుంటే రాబోయే పరిస్థితిని ఊహించడానికే చాలా భయంగా ఉంది..నేతలకు సామాన్యుడి గోడు పట్టదు. మీరు చెప్పినట్టు ప్రతిపక్షాలు వచ్చి ప్రసంగాలు చేస్తారు.ఫోటోలు తీయించుకుని పేపర్లలో వేయించుకుంటారు...ప్రభుత్వం కమిటీలు వేస్తుంది...నివేదికలు...అంతే ....అందరూ ఒకటే..సమస్యను ముందుగా చూసి పరిష్కారాలు చేయలేని మేధావుల రాజ్యమిది.....మంచి రోజులు వస్తాయి..వస్తాయి అని ఎదురుచూడ్డమే!

కుమార్ ఎన్,
ఇది నిజం!!! నేను ఎన్నో వేలమైళ్ళు దూరం ఉన్న ఇవి నా ఫీలింగ్స్ ..మరి అన్ని అక్కడే అనుకున్న రైతులు ఎలాంటి పరిస్ధితులలో ఉన్నారో కదా!!
శిశిర,
థ్యాంక్స్ ,,ఎప్పుడు ఇలాంటి కర్మ వస్తుందని అనుకోలేదు...ఇంకా ఎక్కడ ఏ కొలిక్కిరాలేదు..
శావ్య,
నేను రాసేసాను అంతే కాని ఆ కోత అనుభవిస్తున్నది అన్ని విధాలా రైతులే!!న్యాయం జరగాలని పోరాతున్న రైతులకి ఓ మంచి రోజురావాలి..

యస్.ఆర్ .రావుగారు,

ఏం చేస్తాము ..కాని మళ్ళి మళ్ళి ఇదే ప్రహాసనం..ఓ మంచి రోజు కోసం ఎదురుచుస్తునాను..

రావు.యస్.లక్కరాజు గారు,
ఓ ఆసామి ఏంటో ఈ రైతులు వీళ్ళు ఉద్యమాలే ఆన్నాడు..ఇలా అనుకేనేవాల్లుకు తెలియాలని రాసినపోస్ట్...కనిసం ఒక్కరుయినా అర్ధం చేసుకుంటే అదే పదివేలు..ఏం చేస్తాం మట్టివాసన కమ్మదనం తెలియనివాళ్ళురాజ్యమేలుతున్నారు..మీ

రాజ మల్లిశ్వర్ కొల్లి గారు,

జిల్లాలు మారిన ఇదే పరిస్ధితి అన్నారు..ఏం చేస్తాం మన అందరి నెత్తిన ఉన్నది ఒక్కరే కదా!!అనంతపురం,చిత్తూరు ,ఆదిలాబాద్ లాంటి జిల్లాలో రైతులు ఉద్యమాలు చేశారంటే వర్శాదారితం పాపం అనుకోవచ్చు..అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అనట్లు గోదావరిజిల్లా వాళ్ళు పంటలు కలిసిరావటంటే ఏమి చెప్తాం చెప్పండి..
సిరిసిరిమువ్వగారు,
నేతలకి ముందు చూపు లేదు..పిచ్చి పధకాలతో కులిలని చెడగొట్టారు...ఇప్పుడు పంట వెయ్యండి మీరు పంట వెయ్యనందుకు పరిహారం ఇస్తాం అంటున్నారు..రైతులు కోరిన మద్దతుధర ఉసే లేదు..
తృష్ణ గారు,
మీకు అర్ధం అయ్యేలా రాశానా!!థ్యాంక్స్...చాలా చాలా ఇబ్బందిగా ఉండండి అక్కడ పరిస్ధితి..

శ్రిలలితగారు,
మాటలు నిజం ముఖ్యంగా ఏమి చెయ్యలేక పోతున్నమే అనే ఉడుకుమోతనం..
మాలగారు,
అక్కడ పరిస్ధితి చాలా దారురణంగా ఉంది..ఈ పంట కాకపొతే తరువాత పంట వేస్తారు లే లేకపోటీ వాళ్ళెం తింటారు అన్న చందంగా ఉంది ప్రభుత్వం..వాల్లమటుకే పండిచే దిశగా రైతులు ఆలోచిస్తున్నారు..
మురళిగారు,
అవునండి దొంగలు పడ్డ ఆరునెలలకి......
మీడియా హడావిడితో అధికార,ప్రతిపక్షాలు నిద్రలేచాయి..మీలా గే మంచిజరగాలని వెయ్యికన్నుల ఎదురుచూస్తున్నా..
హనుమంతరావుగారు,,
అన్ని ఉన్న కోనసీమ పరిసస్దితే ఇలా ఉంటే,,నీటివసతి లేని చోట్ల ఎలా చేస్తున్నారో కదా వ్యవసాయం..ఇంకో పంట వెయ్యకపోటీ కోనసీమ పచ్చదనానికి ముప్పు..పుప్పుతెరుతాయి పొలాలు ప్రభుత్వ వైఖరి ఆశాజనకం గా లేదు..అయినా ఉద్యమం ఆగేలా లేదు..రైతులకి మంచి రోజు రావాలని కోరుకుంటున్నాను..

:( :(