వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..





మాకు ఎండలు ముదురుతున్నాయి...అంతా సమ్మర్ వెకేషన్ మూడ్ లోకి వచ్చేసాం....దోస్త్ లు అంతా ఇండియా కి షాపింగ్,ప్యాకింగ్ అంటుంటే నేను మాత్రం వెళ్లిరండి వెళ్ళిరండి అని వేర్రినవ్వుతో హ్యాపీ జర్నీ చెపుతున్నా....నా దోస్త్ లు

అయ్యో ఇక్కడ ఉంటారా???అమ్మో రెండు నెలలు "ఎలా ఉంటారు?? అని సానుభూతి చూపిస్తుంటే ఇట్ట్టే అయిపోతాయి అని డాభికంగా చెప్పిన లోపల మాత్రం ;( :( :(...




పెద్దోడ్ని సమ్మర్ క్యాంప్ కి ఓ నెల పంపుదాం,ఇంకొం నెలా ఎలాగో గడిచి పోతుంది లే అనుకుంటున్నా..చిన్నోడి
వయస్సు పిల్లల్ని నల్గుర్ని చూసుకున్నాను నేనే కాస్తా డ్రాయింగ్ అవి నేర్పుదాం అనుకుంటున్నాను.(మొన్నే మా పెద్దోడికి డ్రాయింగ్ లో ప్రైజ్ వచ్చింది ఆ కాన్పిడేన్స్ తో)..ఈ ఏడు ఎలాగు అరబిక్ హిందీ మొదలైయ్యాయి!!!మా పెద్దోడికి నేర్పిన అనుభవం తో ఈ రెండు నెలలు పిల్లలకి కాస్తా నేర్పుదాం వాళ్లకి కొంచం సులువుగా అనుకుంటున్నాను...డబ్బులకి కాదండోయ్ ఏదో మా చిన్నోడికి క్లాస్ ఫీల్ కోసం ప్రతి రోజు నేను సెలవులమూడ్ లో లేట్ నైట్ చెయ్యకుండా సిస్టమేటిగ్ గా ఉండటం కోసం అంతే!!పని లో పెద్దపిల్లలకి మా పెద్దవాడు తోటిపిల్లలకి తెలుగు పాఠాలు కూడా నేర్పితేనో????? తెలుగు పిల్లలు సగంమంది వెళ్ళిపోతారు...సగం మంది ఓనెల వెళ్లి వచ్చేస్తారు...ఇది ఓ కొల్కిరాని నా మనసుమధనం...




మా అత్తగారు మనవలకి తెలుగు రాదనీ చాలా బాధపడుతూ ఉంటారు....మా పిల్లల తెలుగు అలా ఉంటుంది మరి !!!ఏం చేస్తున్నావ్ రా అంటే "చారు చేస్తున్నా"జారబడ్డాను అని చెప్పడం ముచ్చటికి...వాటర్ డ్రింక్ చేస్తున్న...మా అమ్మని పెద్దోడు పిలిస్తే ఒక నిమిషం రా పక్క వేసి వస్తా అంటే కొంచం సేపు తరువాత వచ్చి అమ్మమ్మ ఆ "పక్క పెట్టండి టేస్ట్ చూస్తా అన్నాడట>>>>>>>అంటే చేస్తా,వేస్తా,వస్తా లాంటివి వాడికి అంతా బాగా అర్ధం అవుతాయి...మరి తెలుగులో ఎక్కువ చెపితే ప్లీజ్ రిపీట్ స్లోలి అంటాడు...అదో కాస్తా ఈ సెలవలో మాట్లాడటం,కొద్దిగా చదవటం అది నేర్పిస్తే కాస్తా బోర్డు లు,బస్సు పేర్లు అయినా చదవటాని పనికి వస్తుంది కదా!!!ముఖ్యంగా వాడితో మాఅత్తగారికి,ఉత్తరాలు రాయించి వందకి వెయ్యి మార్కులు కొట్టేయ్యాలి..హీన పక్షం వాడికి మాట్లాడటం నేర్పాలి...ఏమో ఎంతవరకు జరుగుతుందో తెలియదు...ప్రయత్నం చేయ్యాలి అనుకుంటున్నాను....




ఎందుకొచ్చిన తిప్పలు ఎంచక్కా ఇండియా వెళ్ళు అంటారా??ఏం చెప్పను సీత కష్టాలు సీతవి నాలాంటి పీత కష్టాలు పీతవి.....మొన్న సంక్రాంతి కి వెళ్లాను,మార్చ్ లో వెళ్లాను...అదికాక మేము ఇండియా జూన్ వెళితే అంతా స్కూల్స్ బిజీ ;మార్చ్ లో వెళ్ళినప్పుడు ఊర్లో అంతా నీ పనే బాగుంది....ప్రతి రెండు మూడు నెలలకి వస్తున్నావ్ అని ఒకరంటే,,,హైదరాబాద్ ఉన్నోళ్ళు సంత్సరానికి ఒక్కసారి వస్తున్నారు నువ్వు ఇలా వెళ్ళు తున్నావ్ అలా వస్తున్నావ్ అని మరోకరంటే,,,,టిక్కెట్ సొంతమా లేక కంపెనీ ఆఆఆ అని ఆరాలు తీస్తున్నారు...మా నాన్న అయితే "బాబు ఇష్టం గానే పంపుతున్నారా??? లేక నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలి అని వచ్చేస్తున్నవా???అని పెద్ద అనుమానం వ్యక్తపరిస్తే నాకు ఏం చెప్పాలో తెలియక నాపని అమ్యోమయం అద్వానం అయ్యింది....నా ఫ్రెండ్ అయితే"" సుమ నిజం చెప్పవే నువ్వు నిజంగానే దుబాయ్ నుంచి వస్తున్నావా??లేక ఏ శంషాబాద్ నుంచి వస్తున్నావా??మా ఆయన పిల్లలు పల్లెటూర్ లో కరెంట్ అది లేక పాడైపోతారని అసలు వారం పది రోజుకంటే ఉంచారు"""అని అంది..ఓరి నాయనో అయితే ఇప్పట్లో రాకుండా నేను దుబాయ్ వాసినే అని ప్రూవ్ చేసుకోవాలా అని అడిగా ....



నా ప్రెండ్స్ ద్దిష్టే తగిలినట్లు ఉంది నాకు ( ఇరుగు దిష్టి పురుగు దిష్టి ..............)ఏది ఏమైనా ఈ సారి వేసవి ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నాను...ఇంకో పదిహేను రోజులు లలో శెలవలు పిల్లలకి...చిన్నపుడు ఎప్పుడో(పది ఏళ్ల లోపు వయసు ఉండగా)మా ఇంట్లో మొక్కలనిటికి బెత్తం పుచ్చుకుని పాఠాలు చెపుతూ టీచర్ పోజ్ కొడుతూ దండెం మీద తువ్వాలు చీర కట్టేసుకుని, పెద్దైక నేను టీచర్ అవ్వాలి అనుకునేదాన్ని....మా మేడం గారు(మా స్కూల్ ప్రిన్సిపాల్ గారి భార్య) ఆవిడ్ని తెగ ఇమిటేట్ చేస్తూ ఆవిడలా ఫీల్ అయిపోయ్యి అబ్బో అందరి మీద చాలా(మొక్కలు కదా నా స్టూడెంట్స్)పెత్తనం చేసేదాన్ని...మా సుజాత మేడం గార్ని మాత్రంచాలా సూపర్..భలే చెప్పేవారు లెస్సన్స్,యమా స్రిక్టు,ఆవిడ పేరు చెపితే స్కూల్ అంతా దడదడలాడేది...ఆవిడ రెడ్ ఇంక్ పాళీ పెన్ వాడేవారు....నేను ఆవిడలా టీచర్ అయ్యాక అదేమాదిరి హీరోపాళి పెన్ వాడాలి అనుకునేదాన్ని.....ఇండియా వెల్లినప్పుడు అంతా వెళ్లి ఒకసారి మా మేడంగార్ని చూసివస్తాను...ఆ మద్య మా సాబ్ ని తీసుకెళితే నా వీరగాధలు అన్ని మా సాబ్ కి చెప్పేశారు ..మరి అంతగా పొగిడేస్తు౦టే పిల్లల్ని తీసుకు వెళ్ళనందుకు భలే సంతోషించా!!!మరి మామూలు స్టోరీల మనవి మేష్టర్లని (మా పెతాతయ్యతో వార్నింగ్ లు పెద్ద లిస్టు ఉంది లెండి),అందరిమీద (క్లాస్ మేట్స్ మీద )జులుం చెయ్యటం...నేను,వల్లి,పద్మజ భయపెడితే పాపం ఓ మేష్టారు స్కూల్ మానేసిన వైనం అబ్బో చాలా చెప్పా రు.. అవి విని ఇంటికోస్తున్నప్పుడు మా సాబ్ అమ్మో రాక్షసి ఇప్పుడు నా పిల్లల్ని డిసిప్లిన్ డిసిప్లిన్ అని ఎన్ని నీతులు చేపుతావే అన్నారు...అందుకే కదా చెప్పేది తల్లి పోలిక రాకుడదని పళ్ళు ఇకిలించాను...





అదండి విషయం ఇలా నేను ఓ రెండు నెలలకి టీచర్ ని కాబోతున్నాను.....ఉపయోగకరమైన సైట్స్ చెపుతూ ప్లీజ్ విష్ మీ అల్ ది బెస్ట్....

ఈఏడు దేసవిదేసల ఇత్తనాలు వాడాం ఎగసాయానికి!!!అన్ని మా దొడ్డకాపు, మా చెడ్డరుసి...ఇలా కోసి అలా తాలింపు ఎయ్యగానే ఓ యమ్మ ఇక ఓటే ఘుమఘుమలు...ఈ నాల్గు నెలలు మా ఇంట్లో చేప,మా౦సమ్ ఊసే లేదు!!రోజు మా అమ్మవి,అత్తమ్మవి,నా సిన్నప్పటి నాన్నమ్మ రుసులే!!పప్పుటమాట అదీ కాక దేసవాలి టమాట ఎం చెప్పను మరి...
ఏ కూర వండి సుర్రుమనే మిరపకాయ రుసే కూరకే గుభాలి౦పుకదా!!వ౦కాయపచ్చడి,వంకాయవేపుడు,
వంకాయకోత్తిమీరకారం ఓ దేవుడో వంకాయ మీనా పుస్తకమే రాయచ్చు>>> అది మన తోట వ౦కాయ అయితే ఇక సెప్పేది ఏముంది అయ్!!!!!
మా వాడ్ని చూశారా??కాకరకయల్ని పట్టుకుని ముర్సిపోతూన్నాడు....ఈ ఏడు ఎగసాయం పుల్ కలిసొచ్చింది..
ఇరసాకాశాయ్ అన్ని అయ్!!ఓపాలి కింద లుక్కెయ్యండి..


ఇలా౦టి కాకరకయల్నిగుట్టికాకరకాయని వండితే ఆ ఘుమఘుమకి పక్కి౦టి ఈజిప్తోళ్ళు కుడా ఎం కూరఅని అడిగేవోళ్ళు!!కాస్తా ముదరనిచ్చాక చక్రాలు కోసి పులుసులో ఉడకేసి బెల్లపొడి జల్లి దింపిత్తే కాకరకాయ చెదు అన్న మాట గోదాట్లో కొట్టుకుపోద్ది!!!ఆనక మరింక ముదిరాక గింజపలంగా సన్నగా తరిగి సౌరు,వర్ర బాగా వేసి కరకర ఎపితే వన్నం అంతా చివరాకిరి దాక ఎపుడే తింటారు అయ్!!


టమాలకి వచేకాడికి పెద్ద కధే జరిగింది.నేనేమోఏవైనా దేసవాలి ఎయ్యాలని!!మా మాలి(కుకు౦) ఆ దేసవాలి ఎత్తే సెమ దండగా అని!!!మొత్తాని ఉర్ని౦చి (మా వీరవెంకట ఫెర్తిలైజర్స్) కొనికోచ్చిన ఇత్తనాల నారుపోసాను..,,,,వారం అయినా ఉలుకు పలుకు లేదు>>>సరేలే అని మల్లి గోప్పుతవ్వి మల్లి నారేశాను�ఈసురో వాసుదేవా అంటూ ఏదో వచ్చాయి కలకాంతి లేదు..ఇక మనకి దేసవాలి అచ్చిరాలేదులే అనుకుంటుండగా కుకు౦,పాకిస్తానీ వోల్లంటిని౦చి దేసవాలి నారు తెచ్చి వంగానారు అడిగాడు ఆళ్ళకి(పాకిస్తానీ వాళ్ళకి)....భారత్ కి పాకిస్తాన్ కి మద్య బంగ్లాదేశ్ ఒప్పందంఅన్నమాట!!(మా కుకు౦ బంగ్లాదేసి )..అలా దేసవాలి పని అయింది!!మరే అయినా దేసవాలి రుసి ఎం ఎసిపెంచిన హైబ్రీడు కి వత్తదా???



భలే ఆనపకాయ కదా!!eఈ ఇత్తనాలు మా కుకుం వాళ్ళ అమ్మ బంగ్లాదేశ్ నుంచి పంపింది..ఆళ్ళపొలం ఇత్తనంఅంటా!!!మా గొప్పరుసిలెండి...తోక్కపలంగా తుట్లుపోడిసి,చిన్న ఉల్లితరుగు వేయించి,రుబ్బి,మసాలదట్టించ్చి పులుసు పెడితే అదే నండి బాబు లంకబోచ్చు పులుసు ఆయ్!!!అమోఘం అనే మాట ఈ పులుసుకోసమే పుట్టు౦టది!! అన్నిబాగానే ఉన్నాయి కాని ఆనపకాయ పాదు కాస్తాపైకి పాకిదా౦ అని అనుకున్నాం!!తీరా చుస్తే "అబ్బ తరువాత పోటోకి రండి"..............................................................................................................................................................


.....................................................................................................................................................................


.....................................................................................................................................................................


అలా పై పైకి ఎదిగిపోనాది..మా సాబ్ కి ఇలా సాహసంకి చాన్స్ వచ్చింది... ఇంకో మాట సేప్పనా ఆయన నో అంటే నేనే కోతికొమ్మచ్చిఅనుభవం తో కొద్దారి అనుకుని ఆ మాటే మా ఇంటాయన చేవినేశా ఆమటి గుబులైపోయి "చేట్టులేక్కగాలనే.............టైపులో ఎక్క్కేశారు అయ్!!!!మా మిద్ది మీకి మేట్లులేవు...సాహసం చేయకపోతే బొచ్చు పులుసు బువ్వ లోకి వచ్చేది ఎలా???ఆనక కాసిన కాయలు కుకుం సాహసం టూకొస్తే నా కత్తికి బలేసాను!!మొదటికాయ కోసేసరికి మా ఇంటాయన కి ముచ్చట తీరిపోయింది..పై ఫోటోలో కుడేపుమూలకి ఉన్నవి మిరప మొక్కలు..మిరపలేకుండా ఎప్పుడు లేదు మా ఎగసాయం..ఈ సారి ఎంత ఎదికినా ఊర్నించి తెచ్చి మిరప ఇత్తనాల పొట్లం కనిపించలేదు..ఇంతలో ఐవిడియా వచ్చింది..తాలిపులకి తు౦పిన మిరపకాయల అడుగున గింజలు నారు పోశాము..మా భలేగా ఏపుగా వచ్చాయి మొక్కలు..మాకు సరిపడా ఉంచుకుని పాకీస్తానీవాళ్ళకి కుడా ప౦పాను..

మిరపకాయలు థాయిలాండ్ వి మా ఇస్మాయిల్ కొట్లోవి.వంగ విత్తనాలు మాత్రం ఇ౦ట్లో వే>>నిరుడి వ౦కాయలవి అయ్ ఓన్ ఇత్తనాలండి ఆయ్!!!ఆఖరిఫోటో ఎడమేపుకి వంగమొక్కలు,మువ్వోం కాయలు,పచ్చడివి,సన్న వంకాలు రకానికి నాల్గు చొప్పున ఎసాం..మేము తినగా తిని వంకాయలు,,టమాటాలు అందరికి ఇచ్చాం..ఈ పాలి ఏమైనా కిట్టుబాటు ఎగసాయం..





ఈ రోజు వాలుకొబ్బరిచెట్టు పుట్టినరోజు ...
చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతా పండగో చెప్పలేను>> ఆ రోజు ఇంటి దగ్గర అందరితో అక్షింతలు వేయించుకుని ఎన్ని ఏళ్ళు వచ్చాయి అంటే వచ్చిన వయస్సు చెప్పి తెగపొంగిపొయ్యేదాన్ని!!!!తరువాత తరువాత నిండిన వయస్సు చెప్పాలని తెలిసింది!!!!!మా పెద్దోడు నాలానే ఇప్పుడు,చెపితే వినడు ...నాకు ఓ అనుమానం వచ్చింది ఇప్పుడు.>>>>వచ్చిన వయస్సు చెప్పాలా ,నిండిన వయ్యసు చెప్పాలా అని???ఇంతకీ నా వాలుకోబ్బరిచెట్టు వయసు ఎంతా???

నా బ్లాగు నా చిన్నప్రపంచం లొని నా మనసు అలలు తాకుతూ నా కోపాన్ని,నా బాధని,నా సంతోషాన్ని,,నా సరదాల్ని అన్ని తోచినట్లు మీ ముందుకు తెచ్చింది..మీరు ఓపిగ్గా భరించారు.గత ఏడాది అంతా బాగా గడవలేదు ఈ సంవత్సరం..నేను సరిపడా సమయం ఇవ్వలేదు...నిరుడు వారానికి ఒక్క పోస్ట్ వేస్తె ఈ సంవత్సరం నెలకి ఒక్క పోస్ట్ కుడా రాయలేదు..
ఈ ఏడాది పోస్ట్స్ కొన్ని>>>>సంభారపడి రాసుకున్న మొదటిపుట్టినరోజు టపా,,,చిన్ననాటి కధ,,,,కనువిప్పు,,,మా ఎదారితోతలో ఆటలు,,,భాధ తో రాసిన మౌనంగా నేను,,,మా వాడి మొదటి హిట్.....

మంచి చెడులు చెప్పే మిత్రులకి కృతజ్ఞతలు..మునుపటిలా నా బ్లాగ్ రోజుకో కామెంట్ ,వారానికి ఓ పోస్ట్ తో కళకళలాడాలని దీవించండి..ఆరోగ్యకరమైన బ్లాగింగ్ ప్రోత్సహించమని ప్రార్ధిస్తూ...








మీ,


సుభద్ర.


వయస్సు పెరిగేకొద్ది పెరిగే యవ్వన౦ తో కొత్తస౦వత్సర౦ సిద్ద౦గా ఉ౦ది..క్షణకాల౦ తీరికలేకు౦డా ఏ భావ౦ కనిపి౦చనియ్యకు౦డా,నిత్య౦ మనల్ని ఆశ్చర్యపరుస్తూ,ఆన౦ద౦లో ము౦చటానికి అది మరువకమునుపే ఇది జీవిత౦ అని నేర్పి౦చే బ్రతుకుబడి ప౦తులమ్మ,, ఎప్పటికి అపరిచితనే తను మనకి..



ప్రతి ఏడు మనకి కొత్తే,ప్రతి ఏడు స౦భరాలు జరిపిమరి ఆహ్వస్తున్నాము..మర్నాడు రె౦డు,ఆ తరువాత మూడు,అటుపైన నాల్గు కెల౦డర్ లో రోజు దోర్లుతున్నాయి..మళ్ళి కొత్తకి ఆహ్వాన౦,కొత్త వాగ్దానాల లిస్ట్..మార్పేలేని మన౦..అన్ని మరిపి౦చేసి మళ్ళి ఏమి ఎరగనట్లు మనకి కొత్త ఆశలు చూపుతూ కొత్తగా మళ్ళీ మళ్ళీ వచ్చే అదే తాను..మన౦ మారితే తాను మారునేమో కాని మన౦ మార౦ కదా!!!



నా తెలిసిన ఆపాత స౦వత్సరాలానే ఈ ఏడు రె౦డు మూటలు భుజనా వేసుకుని గుమ్మ౦ దగ్గర కాచుకుని కుర్చు౦ది..రె౦డు ఒకేలా౦టి మూటలు,,కాని ఒకటి పెద్దది ఒకటి చిన్నది..చిన్నది చెడు కావాలని స్వార్ధ౦తో కోరుకున్నా!!గ౦భీర౦గా క్యార్యనిముఖి అయి కుర్చు౦ది పన్నె౦డు ఎప్పుడు కొడుతు౦దా అని!!



నేను ఆహ్వాన౦ పలికే సమయ౦ దగ్గరికి వచ్చేకొద్ది ఓలా౦టి భయ౦ నన్ను చుట్టేస్తు౦ది..చేతుజోడి౦చి మరి ప్రార్ధిస్తూన్నా ఓ కొత్త స౦వత్సరమా నిన్ను...రైతన్న నోటి దగ్గర కుడు నెలపాలు చెయ్యకు,మా అ౦దరి సిగ్గు కాపాడే నేతన్న జీవితాలు అర్ధా౦తర౦గా ముగి౦చనియ్యకు,ఆడకుతుళ్ళ చేత ఆర్తనాదలు చేయ్యి౦చకు,ముఖ్య౦గా భూమాతకి తాపాన్ని తగ్గి౦చేలా జనానికి బుద్దికల్గేలా చెయ్యి కళ్ళుగట్టి మూసుకుని మరి ఆహ్వన౦ పలుకుతున్నాను...

***అ౦దరికి నూతన స౦వత్సరశుభాకా౦క్షలు***

బ్లాగులో రాసేది ఒకే పోస్టు . ఒకే అంశం. లేదా ఒకే కథ.. కాని పది మంది కలిసి ఒకే కథను రాస్తే. అదే ఒక్కో పుష్పం కలిసి తయారు చేసే అందమైన కదంబమాలిక. అలాగే ఈ బ్లాగర్లు ప్రతి వారం ఒక్కొరుగా ఈ కథను అందిపుచ్చుకుని కొనసాగిస్తారు . కొత్తగా చేయాలనే కోరికతో ప్రమదావనం సభ్యులు కొందరు చేసే ఈ ప్రయోగాన్ని మీరు సహృదయంతో పరిశీలించి, సరిదిద్ది, ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.. నేను రాసిన కధ చదవాలంటే గత వారం దుర్గ రాసిన కధ చదివి రండి మరి..


నిన్న అనితని పోలీసులు తీసుకొచ్చి దించి వెళ్ళినప్పటినుంచీ సరోజినికి ఏమిటో మనసంతా దిగులుగా అయిపోయింది. దానికి తోడు ఈ రోజు పొద్దున్నే ఇదిగో ఈ పనిపిల్ల జానకి హాస్పిటల్ లో జేరిందని తెలిసి దుఃఖంతో గొంతు పూడుకుపోయినట్లయిపోయింది. ఈ సమయంలో సుమ తన పక్కనుంటే ఎంత బాగుండును అనుకుంది. సుమ అవడానికి ఆడబడుచయినా అంతకన్నాతనకెంతో ప్రియమైన స్నేహితురాలయిపోయింది. సుమ గురించి తల్చుకోగానే అప్రయత్నంగా సరోజిని పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది. అనుకోకుండా జరిగిన సుమ పెళ్ళి మళ్ళీ మరోసారి తలుచుకుంది.



ఆరోజు.. ఉదయం... తనకి బాగా గుర్తు...


కాలింగ్ బెల్ కొట్టడమే కాకుండా ఎవరో వీధితలుపుని దడదడా బాదేస్తున్నారు.


అబ్బా అబ్బా ఎవరు ? వచ్చే మా వారు దర్జాగా పేపర్ లో ములిగి ఉన్నారు?? ఉహూ అని ఓ మూలుగు పడేసి సగం కడిగిన పిండి చెయ్యి కొంగుకి తుడుస్తూ తలుపు తీస్తే టిప్ టాప్ గా తయారైన ఓ కుర్రోడు ఎదురుగా ఉన్నాడు.. నేను సేల్స్ మేన్ అని డిసైడ్ అయ్యి ఏమి వద్దు బాబు అనే లోపే మా వారు రా రోహిత్ రా అంటూ ఆహ్వనించారు.. నేను వచ్చిరాని తింగరి నవ్వు నవ్వుతూ దారిచ్చాను..అమ్మా నాన్న ఎవరు వచ్చారో చూడండి..అంటూ ఒకటే హడావిడి మొదలుపెట్టారు.. అత్తయ్య పూజలో ఉన్నారు అన్నాను. ఆ సరోజా ఇతను మా విశాల అత్తయ్య కొడుకు, అదే మేము రాజమండ్రిలో ఉండగా వీళ్ల ఇంట్లోనే ఉండేవాళ్ళం.. వీడు ఆరేళ్ళవాడు మేము అప్పుడు మేము ఇక్కడికి వచ్చేషాము.. రోహిత్ ఈమె నా భార్య సరోజ అని పరిచయం చేశారు..



వీడికి నేను ఇంకా గుర్తు ఉన్నాను తెలుసా అన్నారు ఒకింత గర్వంగా!!! ఎలా మర్చిపోతాను బావా!! నారాయణత్త చక్రపోంగలి వాసన ఇంకా చెయ్యినే ఉంది చూడు అన్నాడు.. నేను నవ్వేసి కాఫీ పట్టుకొద్దామని కదిలాను.. రోహిత్ అక్కా ముందు నాకో కాపీ అన్నాడు చాలా చొరవగా!! వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను..మావగారు స్నానం అయ్యి వస్తూ ఎవరువచ్చారు అని అడిగారు?? అది ఏవరో రాజమండ్రిలో ఉన్నప్పుడు తెలిసినవాళ్లు అట మావయ్యగారు అంటుండగా అత్తయ్యగారి పూజ గుర్తు వచ్చింది.. అమ్మొ! అత్తగారి నైవేద్యం చేసి ఇవ్వాలి అని వంటింట్లోకి పరిగెత్తాను.. నైవేద్యం కోసమే పొయ్యి మొదట వెలిగించేది.. అది ఇది అని లేదు ఎదో ఒకటి, ఏది అవ్వని రోజు కనీసం పప్పు బియ్యం అత్తిసెరు అయినా చెయ్యటం అలవాటు, గబగబ మొదట వేసి తొమ్మిదిగారెలు దేవుడి గిన్నెలో వేసి అత్తయ్యకి అందించివచ్చాను.. అల్లంచట్నీకి అన్ని సిద్దంగానే ఉన్నాయి.. రోటీలో రుబ్బుద్దాము అనుకున్నా కాని ఇప్పుడు అయ్యేట్లు లేదు అని మిక్సీ టుర్ర్..డుర్ర్ అనిపించి పిల్లలు పాలు, కాపీలకి పాలగిన్నె పెట్టాను..



అంతే మా సుమ వదినా వదినా వదినా అని ఒకటే కేకలు , మా వారు రోహిత్ ఉన్నాడనేమో మావారు సరోజ చూడు సుమ ఎందుకో పిలుస్తుంది అన్నారు నాకు మాత్రమే కనిపించేలా పళ్ళు కాస్తా బిగపట్టి నేను సరే అంటూ సుమగదిలోకి వెళ్ళాను.. తన వైట్ డ్రస్ మీద పింక్ బాందీని చున్నీ కనిపించటంలేదట. అందుకు ఆ అరుపులు.. షీఫాన్ చున్నీకి ఇస్ర్తీ ఎందుకని బీరువాలో పెట్టాను..ఈ డ్రస్ నిన్ననే సత్తమ్మ తెచ్చింది అనేసి, సుమ ఎవరో తెలిసినవాళ్లు వచ్చారు..నువ్వు అరిచావని మీ అన్నయ్య చిటపటలాడుతున్నారు,, సో అన్నాను.. అంతే సో ఏంటి నేను ఏమన్నాను ఇప్పుడు నిన్ను పిలిచాను అంతేగా!! దానికే మీ ఆయనకి చిటపటలా!! సరే త్వరగా రా పొయ్యి మీద ఉన్నాయి అని వంటింట్లోకి పరిగెత్తాను.. పాలు ఇప్పుడే పైకి వస్తున్నాయి.. సిమ్ లో పెట్టి హలోకి చూస్తే అత్తయ్య, మావయ్య, మా వారు కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.. నేను పదినిమిషాలలో అందరికి టిఫిన్ రడీ చేసి రండి టిఫిన్ కి అని పిలిచాను. రా రోహిత్ అంటూ అంతా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు.. మావయ్యగారు ఇడ్లీ తప్ప వేరే తినరు, అందుకు రోజు ఇడ్లీ ఉంటుంది.. నేను వేడి వేడిగా ఇడ్లీ, గారెలు అందిస్తుంటే అత్తయ్యగారు వడ్దించారు.. అత్తయ్య కొసరి కొసరి చాలా బాగా వడ్డిస్తారు..ఆ ప్రేమకి ఇంకా ఇంకా తినేయాలి అనిపిస్తుంది.. అందరికి కాఫీ కలుపుతుంటే సుమ వచ్చింది వైట్ అండ్ వైట్ మీద పింక్ చున్నీ చూడగనే నా దిష్టీ తగిలేలా ఉంది.. కాఫీ తనతోనే పంపిచేసి నేను మద్యాహ్నం వంటపనిలో పడ్డాను.. రోహిత్ అక్కా! నేను ఉంటాను,ఆఫీస్ కి వెళ్ళాలి మళ్లీ తీరిగ్గా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు..



పని అయ్యాక అత్తయ్య నేను ఆ మాట ఈ మాట చెప్పుకుంటుంగా ""అమ్మాయ్ ఆ రోహిత్ ఏలా ఉన్నాడు""మన సుమకోసం అడిగితే బాగుంటుదేమొనమ్మా!!అన్నారు.. వాళ్ళ గురించిన వివరాలు,ఆస్తులు, బంగారాలు అన్నీ చెపుతూ మావగార్ని "'ఏవండోయ్ ఓ మాటు ఇటు వస్తారా"'అని పిలిచి మనసులో మాట వెంటనే చెప్పారు..మావయ్య అప్పుడే సుమకి పెళ్ళి ఏంటీ?? అన్నారు.. అదేంమాట మన పెళ్ళినాటికి నా వయస్సు పద్నాలుగు, మీ వయస్సు పంతొమ్మిది అలా చూస్తే సుమకే వయస్సు తక్కువేంకాదు.. మీ కుతురు మీకు ఎప్పటికి చిన్నపిల్లగానే అనిపిస్తూంది!!అయినా పెళ్ళి అనగానే అయిపొతుందా ఏంటి?? సంబంధం కదపాలి, ఉభయులకి నచ్చి ముందుకు రావాలి, జాతకాలు, కట్నలు,కానుకలు అన్ని అయ్యిక కదా ఓ రాయి వేస్తే పోయ్యేది ఏముంది?? విశాలవాళ్ళు మంచోళ్ళు, మనకు తెలిసిన మనపిల్ల అలాంటి ఇంటికి వెళ్ళితే సుఖపడుతుందని ఏదో ఆశ కొద్ది ఆత్రంగా అన్నాను..సరే మీరు వద్దంటే వద్దు లెండి అనేసి, గుడికి టైమ్ అవుతుంది " రామరామ "' లేచి స్నానానికి వెళ్ళారు, మావయ్యగారు దీర్ఘాలోచనలో పడ్డారు..నేను ఈ మాట సుమ చెవిన వెయ్యాలని సుమకోసం ఎదురుచూస్తున్నాను.. పిల్లలు స్కుల్ నుంచి వచ్చి పుస్తకాలు పడేసి ఆటకి వెళ్ళిపోయారు..నాకు వాళ్ళకు పాలు ఇచ్చే ధ్యాస కూడా లేదు. విడ్డురమో ఏమో! మా వారు టైమ్ కి ఆఫీస్ నుంచి వచ్చారు.. నేను నా ఆత్రం కొద్ది అత్తయ్య,మావయ్యగారి సంభాషణ వివరించేసి, మావయ్యని ఆలొచించేలా చేసి అత్తయ్య చాకచక్యాన్ని మెచ్చేసుకుని, సుమ రియాక్షన్ కి మదనపడి మా వారికి ఉపిరిసలపనివ్వలేదు..అవును అన్నట్లు ఇన్నేళ్ళ తరువాత మీకు రోహిత్ ఎలా కలిశాడు??అని అడిగాను..తను ఆఫీస్ పని మీద బ్యాంక్ కి వెళ్తే అదే బ్యాంక్ లో రోహిత్ పని చేస్తున్నట్లు మాటలలో ఒకరినొకరు గుర్తు పట్టినట్లు చెప్పి, కాఫీ పురమాయించి టీవీలో వస్తున్న మాయదారి క్రీకెట్ కి అంకితం అయిపోయారు.. అయ్యో! నేను తన చెల్లి పెళ్ళి గురించి ఇంత మొత్తుకుంటుంటే ఈయనకి చీమైనా కుట్టినట్లు ఉందా?? ఇలాంటివాళ్ళు ఉన్నారు కనుకే ట్వంటి-ట్వంటిలు అంతా పెద్ద పిక్సింగ్ అని తెలిసినా మళ్ళీ మళ్ళీ ఆ సీరిస్ కి ఆ సీరిస్ అంతా హీట్ కొడుతుంది.. ఇలాంటప్పుడే నాకు కరణం మల్లీశ్వరిని గట్టి గట్టిగా తలుచ్చుకుని టి.వి ని ఎత్తికుదేయ్యాలి అనిపిస్తుంది...



నేను ఈసురోమంటూ కాపీ పెట్టుకుని వచ్చాను..సుమ కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు టి.వి చూస్తూంది.. వచ్చావా సుమా నీకోసమే చూస్తూన్నా అంటే మా వావారు కళ్ళతోనే వారి0చి, మా అమ్మ వచ్చి చూసుకుంటుంది లే!! నువ్వు టెన్షన్ పడి, దాన్ని టెన్షన్ పెట్టకు అన్నారు నాకు ఉక్రోషం వచ్చేసింది..నేనేందుకు అలా చేస్తాను.. ఇదే చేపుతున్నా సుమ ఇష్టానికి విరుద్దంగా జరిగితే ఎవర్ని సహించను అంటూ చివాలున లేచి అవతలికి వెళ్తూ గుడి నుండి ఇంట్లోకి వస్తూన్న అత్తయ్య కంట్లో కనీళ్ళతో పడ్డాను.. ఇక అత్తయ్య ని చూడలేక గదిలోకి వెళ్ళాను.. కొడుకు దగ్గర విషయం తెలుసుకున్నట్లు ఉన్నారు అత్తయ్య వచ్చి వాడి సంగతి తెలిసిందే కదా!! మగాళ్ళతో మనమే తెలివిగా మసులుకోవాలి..అయినా నువ్వు వచ్చాక సుమకి అమ్మని అనే మర్చిపోయాను..దానికి అన్నీ నువ్వే. మీ అనుబంధం నాకు తెలుసు తల్లి.. నువ్వే నా మనసులో మాట సుమకి చెప్పు.. అయినా ఇప్పుడు ఏ హెచ్చుతగ్గులున్నా సుమని నువ్వే ఒప్పించగలవు..అని ప్రేమగా తల నిమిరేసి వెళ్ళిపోయారు..



హమ్మా! అత్తయ్య సుమ నో అనకుండా నేను చూడాలి ఇప్పుడు.. నేను అత్తయ్యని పిలిచి చెప్పాను. అత్తయ్యా! సుమకి నచ్చకపోతే మాత్రం ఆరునూరైనా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అత్తయ్య అని మొదటిసారి చాలా దృడంగా అత్తయ్య కళ్ళలోకి చూస్తూ చెప్పి సుమ గదికి వెళ్ళాను..సుమ నేను వదినా మరదళ్ళు అనే కంటే స్నేహితులు అంటే బాగుంటుందేమో!! సుమ కాలేజీ కబుర్లు అవి చెపుతుంది, నేను వింటూన్నాను..సడన్ గా వదినా ఇందాక నీకోసమే చూస్తున్నాను అన్నావు "'ఏంటి సండేకి సినిమా ప్లాన్ వేసావా??అంది.. నేను మాట వచ్చింది కదా ఇక చెప్పేయ్యాలి అని విషయం చెప్పాను.. సుమ చూద్దాము నీకు నచ్చితేనే లేకపోతే నేను ఉన్నానుగా నీకు నచ్చనిది ఏది జరగదు అని చెప్పాను.. ఆనందమో, బాధో అప్రయత్నంగా ఇద్దరికి కళ్ళ నీళ్ళు తిరిగాయి... పిల్లలు వచ్చారు ఆట నుండి !!



నేను వడ్డన, వంటిల్లు సర్దుకోవటంలో పడ్డాను.. సుమ మాములుగానే ఉంది, నా వెనకే నాకు అన్నింటికి సాయం చేసింది.. ఇల్లంతా గంబీరగా ఉంది.. నేను సుమ గదిలోకి వెళ్ళాను,సుమ ఏమంటావ్ పెళ్ళి మాట అని సూటిగా అడిగాను..వ దినా నాకు ఏమీ తెలియడం లేదు. మా అమ్మ కంటే నాకోసం ఆలోచించే నీ మాటే నా మాట అనేసి, కాని వదినా అబ్బాయి నల్లగా ఉన్నాడు వదినా అంది అమాయకంగా.. నాకు నవ్వు ఆగలేదు.. నేను ఉదయం చూసి సేల్స్ మన్ అనుకున్న విషయం చెప్పాను..అదేంటి వదినా టైకట్టుకున్న వాళ్ళు అంతా సేల్స్ వాళ్లు అనుకుంటే ఎలా అంది.. మరి నల్లగాఉన్నవాళ్ళు అంతా అనాకారులు కాదు కదా బంగారు! అబ్బాయి ముఖ చాలా కళగా ఉంది ,చొరవ ఉన్నవాడు, మొహమాటం లేకపొతే ఏ విషయం అప్పుకప్పుడు తేలిపోతు0ది.. నాన్చీ సాగదీసేవాళ్లతో చాలా చిరాకు అన్నాను.. అయినా రంగుదేముంది సుమ షారుకే క్రీమ్ రాసుకుని తెల్లబడిపోయాడు అన్నాను.. నచ్చి కుదిరితే నెలకి సరిపడ క్రీములు నెల నెల పంపుతాంలే అన్నాను.. ఆ కబుర్లు,ఈ కబుర్లు అయ్యాకా సుమ నిద్ర పోయ్యింది. నా గదిలోకి వెళ్లాను కాని నాకూ నిద్ర పట్టలేదు..



తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. అందుకే ప్రొద్దెక్కాక కాని మెలుకువ రాలేదు..అత్తయ్య, సుమ వంటింట్లో తిప్పలు పడుతున్నారు..నేను వెళ్ళి అందుకున్నాను పని.. ఆదివారం కనుక సరిపోయింది అనుకున్నాను.. అత్తయ్య సుమకి చెప్పావా ఏంది అని అడిగారు?? అవును రాత్రి అడిగాను. మీ ఇష్టం అందని చెప్పాను..అత్తయ్య ఆనందంగా వెళ్ళి కొడుక్కి కర్తవ్య బోధ చేషారు.. ఇక అంతే అదే వారంలో పెళ్ళి చూపులు అయ్యాయి.. విశాల పిన్నిగారు మాట పద్దతి ఎంతో బాగుంది.. ఒక్కగానొక్క కొడుకు.. ఆవిడ వెళ్తూ, వెళ్తూ ,అత్తయ్యతో వదినా! మీ అమ్మాయి అంటే మేము చూడనక్కర్లేదు.. మాకు అన్ని విధాలుగా నచ్చింది..కట్నాలు అవి మాకు ఏమి వద్దు మీ అమ్మాయికి మీ ఇష్టం మీకు ముఖ్యం. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చితే పెళ్ళే. శూన్యం వచ్చేస్తుంది ఇరవై రొజులలో పెళ్ళి ముహుర్తాలు ఉన్నాయి.. మీ మాట కోసం ఎదురుచూస్తూంటాం అనేసి బయలుదేరారు..నాకు విశాల పిన్నిగారు అన్న "'ముఖ్యంగా మీ అమ్మాయికి నచ్చితే ''అన్నమాట ఎంతో నచ్చి0ది.. సుమని అడిగాను ఏం చెప్పమంటావ్?? మీ అమ్మగారు అడుగుతున్నారు అని. సిగ్గుతో నువ్వే చెప్పు అంది..నాకు అంతగా నచ్చలేదు అన్నాను ..ఏ! అంది జెట్ స్పీడ్ లో!! దొంగ దొరికింది అని ఓ మొట్టికాయ వేసి అత్తయ్య అడగక ముందే సుమకి ఇష్టమని చెప్పాను.. పెళ్లిపనులు వేగంగా మొదలై ఇరవై రోజులలో పెళ్ళి అయ్యి మా సుమ అత్తవారింటికి వెళ్ళిపోయింది..



ఈ రోజు ఆషాడం వస్తుందని సుమని తీసుకురావటానికి ఆయన వెళ్లారు.సుమ పెళ్ళి మాట తలుచుకుంటుంటే అంతా మాయగా ఉంది .. అనుకుంటూ తన జ్ఞపకాలనుండి బయటకు వచ్చింది. ఇంతలో అమ్మా అనితా అనితా అంటూ గట్టిగా కేకలు వినబడ్డాయి. ఆ అరుపుకి కాలు చేయ్యి ఆడలేదు ..ఏదో అయ్యిందని అనుకుంటూ గదినుండి బయటకు పరిగెత్తింది సరోజిని..

వచ్చేవారం రుక్మిణి కథతో కలుద్దాం..