వాలు కొబ్బరిచెట్టు

అల్లనల్లన అలవోకగా..

నా బొమ్మకి  పెళ్లి   అనగానే  పిల్లోడు  ఇలా ఉండాలి  అలా  ఉండాలి అని నా మనోదర్పణం లో

కలలు మొదలు పెట్టా!!!బొమ్మేటి  పెళ్లి ఏమిటి అన్పిస్తుందా??? ఆఖరి వరకు చదివి అప్పుడు తెలుస్తుంది...

ఇక కధలోకి  వస్తే ............పెళ్ళికొడుకు వేటలో  నా రిక్వరిమెంట్..........

ఆజానబహుడా??ఏమో ??లోకం కోసం కాక నా బొమ్మ కోసం ఆలోచించేవాడా??ఇలా....ఎన్నో ఏవో

గజిబిజి గందరగోళం..

నా బొమ్మ మాత్రం చదువు లో సరస్వతి ,పనిలో పార్వతి తిండి తినడంలో మాత్రం శుద్ధ దద్దమ్మ అందుకే అమ్మలా

కడుపు చూడాలి ఇంకా చిన్నపిల్ల ఏమిటి ఇది క్వాలిటి డిలిట్ డిలిట్ ...

మనస్సులో  మాట చెప్పదు.,,,మనమే కనిపెట్టాలి,,,అయితే నా బంగారు మనస్సు కనిపెట్టే మనసు ఉన్నవాడై

ఉండాలి......ఎదో కాకి పిల్లకి కాకి ముద్దని నా అపురూపం కానీ,,, అడగనిదే అమ్మయినా పెట్టదు అని అన్నారు కదా

 మన గురించి మనమే కాస్తా చూసుకోవాలి !!!

ఈ మద్యన ఆడపిల్ల వాళ్ళు మరి అతి చెయ్య బట్టే కొత్త కొత్త సిన్నులు ,బడాయిలు వస్తున్నాయి....


అలా అని  ఇలా వదలలేక పోయా ఇక ఏమైనా ఒక గుణగణ పట్టి రాసెయ్యాలి అని మొదలుపెట్టా!!

నిజాయితీ  ఉండి,,,ముంగిలా ఉంటే నో .....కలుపుకోలుతనం గా అలాని పెద్దాచిన్న లేకుండా ఉంటే నో  నో .....

నో ..నో....గౌరవమర్యాదలు ఉండాలి  మరి పెద్దతరహగా కుడా నో.నో నో ...సరదా,సరసం తెలియాలి ,,వెకిలిగా కుదరదే

 కుదరదు ...బాద్యతాయుతం గా ఉండాలి ...

 ****నిజాయితీ+కలుపుకోలుతనం +గౌర్వమర్యడలు+సరదాసరసం+బాద్యతయుతుడు=నా బొమ్మ ****

  ఇక నా వల్ల కాదు ఎలా ఎలా ఎలా లా లా లా లా లా లా లా .....................................????????????????

ఒకే ఒక్క ముక్కలో సకల గుణవంతుడు కావాలి ....................................................................................

#########పెళ్ళైన తరువాత బాధలోనూ,భయంలోను ,కష్టంలోనూ ,కన్నీళ్ళలోను ,కలవరింతలలోను   మేము

ఎవరు గుర్తురాకుండా చూసేవాడు#########

అలా ని నా బుజ్జి తల్లికి మేము గుర్తురాకపోతే ఎలా సుఖంలో ,సంతోషంలో ,పోలమారిన ప్రతిసారి గుర్తు రావాలి..

చాలా స్వార్ధం గా ఉంది కదా !!!అయినా నాకు నచ్చింది...

ఇంతకీ నా బొమ్మ ఎవరో చెప్పలేదు కదా!!!నేను అల్రాడీ ఓ చెల్లితో నానాకష్టాలు పడుతుండగా మా చిన్నన్న కి ఓ


బుజ్జి తమ్ముడు పుట్టాలి అని కోరుకుంటే ..చిన్నాన్న  ఫోన్ పాప అని  .....నా హుషార్ హుషార్ ...ఇష్టం నేను

చూడటానికి వెళ్ళా కాని చూశాక బుల్లి బుల్లి చేతులు చాపి ,మెరిసే చూపుతో ,బోసినవ్వుల నా బొమ్మ ...ఆ రోజు

ఎప్పటికి మర్చిపోలేను...ఇక అప్పుడే ఫిదా అయిపోయా !!ఇక సెలవులు కోసం లేదా పిన్ని కోసం చాలా

ఎదురుచుసేదాన్ని..పిన్ని టైం టైం కి అన్నిపాపకి  చుస్తూ నాకు ఆడుకోవటానికి చాలా ఎక్కువ ఉండేది కాదు

అయినా ,,,చాలా ఎంజాయ్ చేసేదాన్ని....నాకు ఉహ తెలిసాక నేను చుసిన  బుజ్జి పాప మా ఇంట్లో అందుకే ,,నాకు

 ఎప్పటికి చాలా స్పెషల్....... ఇదిగో  ఇక్కడ నా బొమ్మ అపూర్వ...

పెళ్లి  ఈ నెల ఆఖరున నా దీవెన ప్రార్దన అన్ని నా బొమ్మ ఎప్పుడు హాయిగా ఉండాలి..

ప్రేమతో ,
సుమక్క .


మన దేశానికి మంచిరోజులు రావటానికి ఉన్న విఘ్నాలు తొలగించటానికి పూజలు అందుకోవటానికి వినాయకుడు ఊరురా వాడవాడా ప్రతిలోగిలికి వచ్చేస్తున్నాడు కమ్మని మట్టి వాసనతో...నాకు వీలుయినంతలో అందరికి మట్టి బొమ్మకి పూజలు చెయ్యండి చెప్పటం http://vaalukobbarichettu9.blogspot.com/2009/08/blog-post_20.htmlఅలవాటు!!నేను ఇప్పటిఎవరికీ చెప్పలేదు ఎందుకంటే నాకే బోలెడు మంది చెప్పారు..ఎవరు చెప్పిన సరే తప్పకుండా అని చెపుతున్నా!!భలే మార్పు గతనాల్గు ఏళ్ల నుంచి చుస్తే ఈ సారి నా పరిధిలో వందకి వంద మంది మట్టి గణపాయ్ లకే పట్టం కడుతున్నారు..మాటలలో చెప్పలేని ఆనందం ఇది నాకు..
మాకు ఇక్కడ మట్టిదోరకదు కనుక నేను ఎప్పుడు పసుపు విఘ్నేశ్వరుడికే కే పూజ చేస్తాను..కొంతమంది ఇక్కడ మిత్రులు ప్లే డోవ్ తో చేస్తారు..అది ఎంతవరకు శ్రేయస్కరమో నాకు తెలియదు..ఏది ఏమైనా చాలా మటుకు మార్పు వచ్చింది..ఈ సారి చాలామటుకు పందిళ్ళలో కుడా మట్టి ప్రతిమలే పెడుతున్నారట!!కొంతమంది పందిళ్ళ నిర్వాహకులు పందిళ్ళలో ప్లాస్టిక్ కవర్స్ నిషేదించి తమ వంతు సామాజిక బాధ్యతని నేరవేర్చుతూ ఆదర్శం గా నిల్చుతున్నారు.. అన్ని చానల్స్ వారు ఈ విజయానికి భాగస్వాములే!!!!
పాస్టర్ ఆఫ్ పారిస్ వద్దో అని కాలుష్యనివారణ మండలి మట్టివినాయకుల్ని పంచటం,స్కూల్ పిల్లలకి అవగాహన కల్పించటం,వారి మట్టి ఇచ్చి బొమ్మలతయరి ని ప్రోత్సహించటం బహుమతులు ఇవ్వటం లాంటి పోటీలు పెట్టి మట్టి లంభోధరుడిని పూజకి చాలా కృషి చేస్తుంది..ఒక్క గణపతి నిమర్జనం వల్లనే కాలుష్యం జరగటం లేదు>> ఇలాగే ఇతర కాలుష్యకారకాలమీద కుడా ప్రజలలో అవగాహ కల్పిస్తే బాగుంటుంది..మొత్తానికి దేశం మొత్తంగా మనప్రభుత్వమే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ని (గణపతి బొమ్మలకి)నిషేధం విధించవచ్చు కదా!!ఏమో ఇందులో సాధ్యసాధ్యాలు నాకు తెలియవు..ఏది ఏమైనా ఈ సారి మాత్రం సర్వత్రా శుభప్రదం గా మట్టి బొమ్మల కే పూజ అంటున్నారు....ఇప్పుడు టి.వి వాళ్ళు ఇంత పెద్ద బొమ్మ అంత పెద్ద బొమ్మ అని జనాన్ని తప్పు దోవ పట్టించకుండా ఎకో ప్రెండ్లీ గణేష లే చూపించి ప్రోత్సహిస్తే బాగుంటుంది...
మన పార్వతితనయునికి అన్ని ఆవిరి మీద వండిన పదార్ధాలే ఇష్టం కదా!!తయారీ చాలా ఈజీ!!డైజేషన్ ఈజీ..నునె మాటే ఉండదు..పత్రీ,ఫలాలు చాలా ప్రీతి ఈశ్వరమానస పుత్రునికి!!!చిన్నప్పుడు కనిపించిన ఆకులు అన్ని పత్రీపత్రీ అని కోసేవాళ్ళం!!ఇప్పుడు మాకు దొరికే ఓన్లీ తులసీపత్రం తోనే పూజ!!!పుస్తకాలకి బోట్లు పెట్టేసి దేవుడ్ని కనిపించకుండా పూవులు,పత్రీ తో కప్పేసి మర్నాడు పాలవెల్లికి ఉన్న ఒక్కొక్కో పండు తినేసేదాన్ని!!!అందుకే గజముఖధారి పాలవెల్లి పెట్టి ఇప్పటికి పూజ చేసేచాన్స్ ఇవ్వలేదు...ఇప్పుడు పెడదామా అంటే ఇన్నాళ్ళు లెంది ఎందుకు అని అనిపిస్తుంది...పూజ కబోడ్ లో ఉండే పొడుగాటి రాడ్ కి అన్ని పళ్ళు,మామిడాకులు కట్టేసేస్తాను..పిల్లలపుస్తకాలు,మా సాబ్ సొంతఖర్చులపద్దులు పెట్టి నాకు విఘ్నరాజుకి మాత్రమే తెలిసేలా బ్లాగ్ చిత్తూ కుడా పెట్టుకుంటున్నా!!!! నాకు ఉన్న పుస్తకం అదే మరి ఏం చెయ్యను..లాపి లో బ్లాగ్ ని తెరచి పెట్టి పూజ చేద్దాం అని ఉన్న మా సాబ్ ఛలోక్తులు సహించే ఓపిక లేక ఊరుకున్నా!!!
వారం చూసుకుని దేవుడి మండపం కదిపేసి తరువాతి వచ్చే శుక్రవారం నిమర్జనం చేస్తాం!!శుక్రవరమా???అనకండి అదే వీకెండ్ మాకు ఇక్కడ!!!అంతా కలిపి ఎంచక్కా తలోరకం వండుకుని వెళ్లి దేవుడికి నిమర్జనం చేసేసి వస్తాం!!ఇక్కడ అందరికి విధిగా చెపుతాను అమ్మలారాఅంతా న్యూస్ పేపర్స్ లో చుట్టి తెండి అని!!అంతా అలా గత ఆరు ఏళ్ల నుంచి నియమంగా పాటిస్తున్నాం...అంతా ఇంట్లో ప్రధమపుజ్యడ్ని ఇంటిదగ్గర ఉన్న మండపాలలో కవర్స్ లో పెట్టి ఇస్తారు.. అలా కాకుండా న్యూస్ పేపర్ లో పొట్లం చుట్టి ఇస్తే మరింత పర్యావరణానికి మేలు జరుగుతుంది..మట్టితో చేసిన గణనాయకుడికి పూజ చేసేసాం ,కాగితం లో చుట్టి నిమర్జనం చేసేసాం మేము పర్యావరణానికి తెగ సెల్ప్ చేసేస్తున్నాం అనుకోకుండా వీలు అయినంతలో ప్లాస్టిక్ వాడకం తగ్గించటం!!మన పిల్లలకి కాస్తా అవగాహన కల్పి౦చాలీ..రోజుకి ఒక కవరు వాడకం మన వాళ్ళ తగ్గినా చాలా మేలు జరుగుతుంది...మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే రేపుటి తరాలకి మార్గదర్శకాలు!!తద్వారా జరిగే మేలు ఎవరికీ చెప్పనవసరంలేదు...
అందరికి వరసిద్ధి వినాయకుడుసకల శుభాలు కల్గాజేయాలని,
అవినీతిరహిత,కాలుష్యరహిత దేశం గా ప్రపంచ లో అగ్రగామి కావాలని కోరుకుంటూ......
మీ,
సుభద్ర

అసలే వేసవిశెలవులు పిల్లలు ఇంట్లో>>>>> బయట 55 డిగ్రీల వేడీ>>>>ఆ పైగా పగటి పూట (సిటికి)బయటకి వెళ్ళడం తినటానికి ఏమి ఉండవు రందాన్ కదా!!!పైగా పబ్లిక్ ప్లేస్ లో నీళ్లు కుడా తాగకూడదు...రెండునర నెలల సెలవులకి ఇక్కడే ఇరుకుపోయిన నామీద నేనే తెగ జాలి పడుతూ మీకు నా ప్రయోగశాలలో పుట్టిన కొత్త రుచులు చూపిద్దామని ఈ పోస్ట్ మొదలు పెట్టా!!!
ముఖ్య గమనిక >>>రుగ్మతలకి బ్లాగ్ కాని రాసే నేను కాని ఏవిధంగాను బాధ్యులంకాము.
ఇంతకీ కొబ్బరిపొడి కధ చెప్పలేదు కదా!!ఉసుపోని మంగలి పిల్లి తల గొరిగినట్లు టైం పాస్ కి ఓ మరాఠి దోస్త్ ఇంటికెళ్ళితే వాళ్ళు చేసుకున్న స్నాక్ చాలా బాగుంటుందని,,,,వాళ్ళ పూణే లో ఇంకా సూపర్ గా ఉంటుందని చెప్పి టేస్ట్ కి మా నల్గురికి రెండు పెట్టి నచ్చితే మళ్ళి చేసిన్నప్పుడు బాక్స్ పంపుతా అని మాటిచ్చి పెట్టింది..పిల్లలు ,మా సాబ్ తినగా మిగిలితే అనుకుంటు౦డగా మా పెద్దోడు ప్లేట్ మీద జంప్ చేసి ఒకటి నాల్గు ముక్కల్లో హాంఫట్ జం బడెల్ బుచుక్ అన్పించేస్తే మా చిన్నోడు,మా సాబ్ నా వైపు కుడా చూడకుండానే కానిచ్చేశారు...నా మదిలోనే త్యాగశీలివమ్మ------పాట పాడేసుకుంటూడగా మా పెద్దోడు సూపర్ ఆంటీ అని పోగిడేసి నా నేర్చుకోమని ఆర్డర్ వేశాడు..ఇంతకీ ఏమిటా ఆ పదార్ధం అనుకుంటున్నారా??అక్కడికే వస్తున్నాఏంటా సూపర్ టేస్ట్ అను అడుగగా వడాపావ్ అంది నా దోస్త్ !!!నా బబెక్కిరి ఫీలింగ్ బయట పడకుండా ఓ అదా నువ్వు మన లేడీస్ పార్టికి చేసావ్ అదా అన్నాను...యస్ యస్ అంది..ఇట్ వస్ గ్రేట్ దట్ డే అన్నాను...
ఆ రెసిపి తెలుసుకుని తరించి ఇంటికి వస్తూ మా సాబ్ అబిప్రాయం అడగగా చెయ్యి తినిపెడతా అన్నారు..మా పెద్దోడు మర్నాడే ముహూర్తం కుడా నిర్ణయించాడు..ఇక తప్పేదేముంది..సెలవుల పుణ్యమా అని నేను వాడు పుల్ గా బేవార్స్ కదా కష్టపడి అర్ధరాత్రి వరకు ఇంగ్లీష్,హిందీ,తెలుగు సినిమాలు ఉద్దరించి>>>>నేను అయితే శక్తి కొద్ది బ్లాగ్ లోకాన్ని హితోధికం సేవిస్తూ ఆలస్యంగా పడుకుని,మరి ఆలస్య ౦ నిద్ర లేస్తూ(ఓన్లీ మా సాబ్ నైట్ షిఫ్ట్ అప్పుడే) ఆయనుంటే ఎర్లీటు బెడ్ ఎర్లీ టు రైజ్ !!!!
ఇంతకీ వడా పావ్ అంటే పావ్(బ్రెడ్ )మద్యలో సదరు కొబ్బరిపొడి వేసి ఆలు బోండా పెట్టి ఒకనోక్కు నొక్కడమే!!!శుబ్రంగా ఆలు బోండా తినక ఎందుకోచ్చిన్ పాట్లు అంటే వింటే కదా!!!వడాపావో అని నా ప్రాణాలు డిగ్గింగ్ పట్టాడు మా పెద్దోడు..ఎందుకోచ్చిన తిళ్ళు రా నాయన అన్నం లో సాంబార్ వేసుకుని తినక సాంబార్ లో అన్నం ఉండకేసుకుని బిసిబెళ్ళబాత్ అని,పెరుగులో అన్నం మన ముని వేళ్ళతో కలుపుకోక పెరుగులో అన్నాన్ని ఉరేసి అవిఇవి పోసి కర్డ్ రైస్లు..
ఇంతకీ అపర్ణ ఇంటి ప్లాన్ వేసిన నన్ను నేనే నానా విధాలు స్తోత్రాలు చేసుకుంటూ మర్నాడు వడాపావ్ చేశాను ఆ తాకిత తడిగిత తై>>>>>
కావలసినపదార్ధాలు>>>>>కడుపునొప్పికి మీకు అలవాటు అయినమందు లేదా కాస్తా వాము నములి ఓ పుట ఉపవాసం చేసిన సరిపోతుంది..
ముందుగా కొబ్బరిపొడి కి రడీ చెయ్యాలి కదా కాస్తా ఎండు కొబ్బరికి(కోనసీమలో పుట్టి కోనసీమలో మెట్టిన నాకు ఎండు కొబ్బరి ఎక్కడ నప్పుతుంది మీ అంతరాత్మ సాక్షి గాచెప్పండి)పొడి ముకిడి లో వేయించిన ఎండు మిర్చి,పచ్చివెల్లుల్లి,ఉప్పు వేసిమి మిక్సీ తోడపాసమో,చెవిపాశామో పెడితే మిక్సీ బాధతో డుర్ డుర్ డుర్ మంటే మన కొబ్బరిపొడి రడీ!!!కొబ్బరిపొడి రుచి చేసి చూడండి రంగు,రుపుకి క్రింద బొమ్మ పెట్టాను చూడండి.....

ఇదే మన టైటిల్ కొబ్బరిపొడి మీరు సోది బాబోయ్ అన్నా సరే మరో పిట్ట కధ చెప్పాలి,,,,,కొబ్బరిపొడి చేశాక రుచి చుస్తినికదా!!!నాకు కపాలమోక్షం జరుగే౦తలా పంచేంద్రియాలు ఎరుపెక్కి నీల్లుకరతం పట్టాయి..నాల్గు ఐదు గొడ్లు వేసుకుని కారం అదేనండి గొడ్డుగొడ్డుగొడ్డు కారం..ఆ కారాన్ని మర్డర్ చెయ్యడానికి మరికాస్తా ఎండుకొబ్బరి(ఈ పదం రాయతానికే నచ్చటం లేదు నాకు)..మళ్ళి రుచికి రుచి(అదేబాబు ఉప్ప్పు) కాసిన్ని వెల్లుల్లి రెబ్బలు మళ్ళి రుచి చస్తే అవును చస్తే అదేనండి చంపేసాకదా అది కాస్తా ఆఖరి శ్వాస విడిచింది..మళ్ళి ముకిడి ఎండు మిర్చి వేపుడి,మిక్సికి పిక్కపాసం అదే రాగం లో డుర్ డుర్ లు...అలా సాగిన ప్రహసనం లో నాకు నచ్చని ఎండుకొబ్బరి పొడి గు౦డై,పిండై ,పొడై డబ్బాడు అయ్యింది..అరీ దేవుడా అనుకుంటూ మా పెద్దోడికి వడాపావ్ లాంచనం తీర్చాను...ఓ రోజంతా తిని ఇక వద్దు అనేశాడు..పావ్ లు కుడా అయ్యిపోయాయి..కాని ఎండుకోబ్బరిపోడి నన్ను తక్కువ చేస్తావా???అని డబ్బాలో మూడు వంతులు బెల్లి డాన్స్ మొదలు పెట్టి౦ది..ఆ తిప్పుడు చూడలేక సగటు ఇల్లాలిగా ఎండుకొబ్బరి డేస్ట్ బిన్ పొట్టలో పోయ్యలేక కళ్ళుమూసుకుని నా తపస్సశక్తి అంతా ఉపమోగించి నేనేకనుక బంగారం మీద అతి మోజు ఉన్న భారతీయ ఇల్లాలి ని అయితే,ఒక్కవీసమేత్తు పుట్టింటి పక్షపాతిని అయితే రకరకాల నా ఎజక్టివ్స్(ajectives) తలవగానే మా 55 డిగ్రీల ఎండలో నాల్గు గంటలు ఎండిన వరి పిండి వడియాలా ఎన్నో అవియాలో పెళపెళ వచ్చేశాయి....ఆ అవిడియాలో ఒకటి మచ్చుకి మీకోసం విపులంగా వంకాయ బజ్జి..వంకాయతో బజ్జి విన్నాకాని దాని కధ కామామీసు తెలియదుకాని ఇది నా పేటెంట్ అని సగర్వం గా తెలియజేస్తూ>>>
...గుత్తువంకాయ మల్లె నాట్లు/గాట్లు (మీఇష్టం) పెట్టేసుకుని కాస్తా నునే (వెయ్యి౦చి)లోస్నానాలు చేయ్యి౦చి ప్రక్కనే పెట్టుకోవాలి..వంకాయలు పూర్తిగా మగ్గకూడదు...పుర్తి గా చల్లార్చాలి...ఆ టైం లో బజ్జి పిండి కలపాలి వడాపావ్ చెయ్యగా మిగిలిన ఎండుకొబ్బరి ....అప్పుటికి గాట్లుపెట్టి నూనెలో దేవిన వంకాయలు చల్లరుతాయి..నవ్వేసి ప్రెండ్ అయిపోయిన కొబ్బరిపోడిని మద్యలో కురేసి >>>అబ్బ క్రింద పోటోకి రండమ్మ>>>>>
మన వంకాయలు ఇలా ముచ్చటగా ముస్తాబై మనల్ని ఉరిస్తాయి >>>>మనం ఊరిపోయి నోట్లో వేసుకోకూడదు ..ఇందాక బజ్జి పిండిని ఎలా కలిపానంటే సెనగపిండిలో కొంచం బియ్యపిండి వేసి,జీలకర్ర చేర్చి,ఉప్పుకారం తగిలించి (కావాలంటే అల్లంవెల్లుల్లి వెయ్యవచ్చు)నీళ్ళుపోసి బజ్జి పిండిని తయారు చేసామా!!!!ఆ బజ్జిపిండితో ముస్తాబు అయిన వంకాయలకి బట్టలు వెయ్యలన్నమాట!!! ఎలాగో చూపించనా వచ్చేయండి అయితే>>>>>
ఇంతే ఇలా అన్నమాటా!!!ఆ తరువాత అబ్బ అక్కడే కూర్చుంటే పనులు అవ్వవు కాస్తా కదలండి>>>>>>>>>>>>>>>>>>>
మన వంకాయలు సూపర్ స్వీమ్మర్స్ నమ్మరా!!!అయితే బాగా కాగిన నునేలో వెయ్యండి ఇట్టే తేలిపోతాయి...ఇలా మళ్ళి నునె లో స్విమ్మింగ్ చేయిస్తే మగ్గల్సినవి మగ్గి నునె వేడికి కాస్తా ట్యాన్ అయిక గోల్డెన్ కలర్ కి వచ్చాక కుస్తా కారం గా చిల్లిగార్లిక్ సాస్ తో తింటే అబ్బ అబ్బ అంతే..బజ్జీలు తింటున్నంత సేపు మీరు ఉమ్ ఉమ్ ఉమ్ ఉమ్!!!!!వంకాయలబజ్జీల ప్లేట్ చేతిలోపెట్టి మీరు ఏమికోరిన ఎదుటవాళ్ళు ఉ ఉ ఉ అనాల్సిందే>>>ఉదాహరణకి బంగారం కాసుకి ఇంకో పదివేలు రేటు పెరిగినా ,మీరో నాగ్లు ఐదు కేజీలు పెరిగినా సరిపడేలా వడ్డాణం అడగండి ఉమ్ ఉమ్!!! మన వంకాయ బజ్జీలు లుక్కేయ్యండి...
ఇన్ని చేసిన మిగిలి పొయ్యింది కొబ్బరి పొడి..మళ్ళి నా అనుభం అంతా రంగరించి ఉల్లిపాయసమోసా చేశాను..అమలాపురం డీలక్స్ ధియేటర్ సమోసా గుర్తు వచ్చేసింది నాకు..మూడు వంటలలో సమోసాకి ఎక్కువ ఓట్లు పడ్డాయి మా ఇంట్లో>>>ఉల్లిపాయలు సన్నగా తరిగి వేయించి పచ్చి వాసనా పోయాక కొబ్బరిపొడి డబ్బా బోర్లేసా!!!రడీ మేడ్ సమోసా షీట్స్ లో చుట్టేసి వెయ్యి౦చాను..వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుందట!!పొడి అయిపోయాక తరువాత కేరళప్రెండ్ చెప్పింది..
Posted by Picasa


ఓ మూడునెలల క్రితం పొద్దుటే నాన్న పోన్, ,,,కట్  చేశా మళ్ళి చేద్దామని,, ,నేనే రెండు,మూడు రోజులకి ఒక్కసారి పోన్ చేస్తూ ఉంటాను..మా నాన్ననుంచి  పోన్ అంటే మీ పొలానికి చేర్చి ఓ ముక్క అమ్మకానికి వచ్చింది కొనాలి అని పీకల మీద కూర్చుంటారు..మేము వద్దు అన్న అది ఇది చెప్పి తానూ బజానా ఇచ్చేస్తా అనో అయినంత పంపితే అవేజు మీద అలా మీకు భారం లేకుండా నేను చూసుకుంటా కదా అంటూ,మీరు ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తారు..ఇక ఆఖరిఅస్త్రం గా మా అత్తగారికి,మావగార్నిబాగా బ్రెయిన్ వాష్ చేసి మా మీద ప్రయోగిస్తారు...ఈ ఆలోచనతో నాన్నకి పోన్ చేసాను..నాన్న ఫోన్ కలిపాను..నాన్న చాలా డల్ గా కాకినాడ సైట్ అమ్మకం పెట్టారట కదా తల్లి???సొమ్ము అవసరం అయితే పొలాలు అమ్మేయండి అన్నారు..మా నాన్న తో నే నేను మాట్లాడుతున్నది అని అనుమాన౦ వచ్చింది..ఇప్పటి ఆ మాట మా నాన్న అన్నారంటే నమ్మలేకపోతున్నా ..నాన్న అవి ఇవి మాట్లాడి వ్యవసాయం ఇక చెయ్యలేన్నని,తన కష్టాలు అన్ని చెప్పికోచ్చారు...ఇది 1996 తుఫాన్ అప్పటి నుంచి వింటున్నా కాని ఈ సారి నాన్న గొంతు లో వణుకు ఓ క్షణం నాన్న కన్నీళ్లు పెట్టి నట్లు అన్పించింది..ఏమో నాకు ఉహ తెలిసినప్పటి నుంచి పోల౦ తప్ప ఇకేమి తెలియదు,,అన్నిఇ అనుకులి౦చిన ఈ సారి పొలం బీడు లా వదిలేలంతే చాలా కష్టం గా ఉంది అన్నారు...అదేం నాన్న అంటే ఈ పంటల విరామం గురించి చెప్పారు..నాకు నోట మాట రాలేదు...అప్రయత్నం గానే చేమ్మగిలాయి నా కళ్ళు..పంట వెయ్యక పొతే అన్న ఉహకే నా పరిస్ధితి ఇలా ఉంటే పోలామే లోకం గా బ్రతికే మా నాన్న లాంటి వాళ్ళ బాధ ఎలా ఉండి ఉంటుందో కదా!!!!!నాన్న కి తోచినట్లు ఏదో సర్ది చెప్పేసి పోన్ పెట్టేశాను ...
నాన్న కి ఎంతవరకు స్వాంతన దొరికిందో తెలియదు కాని స్ధిరం పొయ్యింది...ఆలోచనల కుమ్మరి పురుగులు ఒకటికి పది అయి నా మెదడు అంతా దోలిసేశాయి...ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు మండలాలో వేయ్యరట!!నాన్న మా ట ప్రకారం లక్ష ఎకరాలు పైమాటే...తద్వారా పాలపరిశ్రమ గ్రాసం దొరక దెబ్బతింటుంది...ఈ విధంగా పాలబ్బాయిలు,చిన్న చిన్న వ్యాపారులు,ఎరువులషాపువాళ్ళు,కూలీలు అందరికి కష్టమే!!!అసలు కోనసీమ పంట పచ్చదనం లేకుండా ఉహించటం ఎలా???????మూడునెలల ముందు గానే చెప్పిన ఇప్పటికాని ప్రభుత్వం కళ్ళు తెరలేదు... కొన్ని చోట్ల అధికారులు బెదిరింపులకి దిగుతున్నారట!!రైతుల మీద కేసులు పెట్టారు అయినా మొక్కవోలని దైర్యంతో ఉద్యమిస్తున్నారు రైతులు...మనకి పులావ్ కి బాసుమతి బియ్యం,అన్నానికి సన్నబియ్యంపండిస్తూ తాముమాత్రం సర్కారోడి ముతకబియ్యం తింటున్న సన్న చిన్నకారు రైతులు ఇంతకన్నా ఏం చేస్తారు తన కడుపు పూర్తిగా నిండక పోయినా అందరి ఆకలి తీర్చే రైతుకి ఆక్రోశం కట్టలు తెంచుకున్నది... కన్నతల్లికి తిండి పెట్టకుండా మాడ్చితే ఎంతో పొలాన్నిబీడు పెట్టడం అంతే..కూలీలకు వరి లేకపోతే మరోపని కాని కౌలు రైతుల కి మరీ కష్టం..అన్ని విధాలా భామినే నమ్ముకుని రాత్రి పగలు ఆ పొలం గట్టునే గడుపుతూ గడుపుతారు..ఎవరోపొలాన్ని తమది భావించి అప్పులు చేసి పెట్టుబడి పెట్టి తొలకరి ,దాలవా,అపరాలు ఏదో ఒకటి రాకపోతుందా ఇంతకు ఇంతా కొందాం అనుకుంటూ ఉన్న కాస్తా బంగారం కూదవపెట్టి నిండా ములిగిపోతున్నారు..ఇల్లు కట్టుకోవాలని నా చిన్నప్పటినుంచి కలకంటున్న మా వెంకన్న ముసలివాడు అయిపోయాడు... కూతుళ్ళ పెళ్లి తాపత్రయంలో,పంట మీద పంట నష్టపోయి నలభై ఏళ్లకే ఆరవై ఏళ్లు వాడిలా మారిన వెంకటరమణ,అదే కొల్లాయి కట్టు అదే వ్యవసాయం ఏ మాత్రం మారలేదు మా భూషణం పరిస్ధితి..ఇంకా ఎందఱో ఎన్ని కధలో!
రైతు అంటేనే చిన్నచూపు మన సమాజం లో ,రైతుకి గౌరవమే లేదు...వ్యవసాయాన్ని చేద్దామనుకునే వాళ్ళు లేరు..
దేశం అంతా అన్నం పెడుతూ,దేశాభివృద్ధికి కీలక పాత్ర ఉన్న గుర్తి౦పులేదు..పంజాట్,హర్యానా లాంటి రాష్ట్రంలో అన్ని విధాల రైతులు ముదంజలో మన రాష్ట్రంలో మాత్రం రైతు పరిస్ధితి చాలా దైనీయ్యం గా ఉంది..మిల్లర్లు,వ్యాపారులు రైతుని దోసేసుకుంటున్నారు...ప్రభుత్వం సరియిన నిల్వ సౌకర్యాలు కల్పింనందుకు అయినకాడికి పంట అమ్ముకునే దుస్ధితి...పంట కాల్వలు రీపేర్లు నిమిత్త మూసేసి అదికారులు ఇష్టరాజ్యం గా నీరు వదులుతుంటు౦టే నీరు సకాలం లో అందక ఎండిపంటకి ఎవరు బాధ్యలు???? ప్రతిసారి కంటి తుడుపు చర్యలే కాని శాశ్వత పరిష్కారం అన్న మాటే లేదు!!!ఎప్పుడో విన్నట్లు గుర్తు పంట వెయ్యకపోతే పొలాలు ఉప్పు తెరుతాయని,ఈ ప్రభావం కనీసం ఐదు ఆరేళ్ళు భూసారం మీద పంట మీద ఉంటుంది..ఈ నష్టం నుంచి సన్న,చిన్నకారురైతులు ఆర్ధిక౦గా కోలుకోవటానికి పదేళ్లు సమయం పడుతుంది..ఓ పంట వెయ్యలంటే ఉన్న కొద్ది పాటి అవగాహన బట్టి ఎకరానికి 40 కూలిపనులు కావాలి ఒక్కో 200-250రు/ ఉంటుంది..ఎరువులు బస్తాకి 280-300ఉంటుంది ఎకరానికి 3 బస్తాలు వాడతారు..తరువాత గులికలు,ఎలుకలబుట్టలు,దుక్కి, దమ్ము,దేవుడు దయ కలిపి పంట చేతికి రావాలంటే 22-25 వేలు ఖర్చు అవుతుంది..ప్రస్తుతంధాన్యం ఏడు వందలు ఉంది,తడిసిన ధాన్యం అయితే మూడు వందలు రేటు పలుకుతుంది..
కాని కొనే నాధుడే లేడు,,మొన్నటివరకు బోలెడు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం మిల్లర్లు కొనలేదు ..శుబ్రంగా ఉన్న దాన్యం ఎండకి ఎండిపోయి,వర్షానికి తడిసి రంగు మారి రేటు పడిపోయింది..ఇక కొనేవాళ్ళు లేక నెల్లూరు బాతులవాళ్ళు ఏదో ఒక రేటు ఇచ్చి కొనుకుంటున్నారు..గత రెండు పంట ధాన్యం నిల్వచేయ్యలేక,వర్షం నుంచి కాపాడలేక రైతులు నలిగిపోతున్నారు..అన్ని సవ్యంగా జరిగి పంట చేతికొస్తే పెట్టుబడి సొమ్ము రావచ్చు లేదా నష్టం రావచ్చు కాని ఎట్టి పరిస్దితిలోను నాల్గు డబ్బులు చూసే స్ధితి మాత్రం లేదు..అందరికి ఆదాయం పెరిగింది ఒక్క రైతుకి తప్ప!!!
పంటవిరామం గురించి మన వ్యవసాయ శాఖా మంత్రిగారు స్పందిస్తూ మన రాష్ట్రంలో ఉన్నది పదమూడు మండలాలు మాత్రమె కాదని అన్నారు..ముఖ్యమంత్రిగారు టైం కి నీళ్ళు ఇస్తే ఏమి ఉండదు వాళ్ళే వేస్తారు అన్నారట!!ఈ మాటలు రైతులలో మరింత పట్టుదల పెంచినట్లు ఉన్నాయి..కులవర్గాలకు అతీతంగా ఉవ్వెత్తున ఉద్యమిస్తున్నారు...మాపార్లమెంట్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఆయన అయితే రైతుల్ని పరామర్శ అటుంచితే కనీసం ఒక పేపర్ ప్రకటన ఇచ్చిన దాఖలాలు లేవు...జిల్లా మంత్రి నిద్రవదిలి ఆలస్యం వచ్చి తెగ హడావిడి చేసారు..రైతుల్ని అయిందేదో అయ్యింది వేసేయ్యండి పంట అని ఉచిత సలహా ఇస్తే ఇప్పటివరకు ఎక్కడ అమాత్యావార్య అని నిలదీసీస్తే పిచ్చి చూపులు చూస్తూ గుటకలు వేసారట!!
ఓట్ల కోసం ఒక్క ఇల్లు కుడా వదలకుండా తిరిగే రాజకీయనాయకులు ఇప్పుడు రైతు పక్షం వహి౦చలేకపోతున్నారు..ప్రతిపక్షాలు పర్యటనలు తప్ప చేసి౦దేమిలేదు..ప్రజలాలో పూర్తీగా నమ్మక పోగొట్టుకుంటున్న రాజకీయ వ్యవస్ధ..చర్చలకి పిలుపు అంటూ కొందరి రైతు నాయకుల్ని మభ్యచూస్తుంది..మాకు చ ర్చలు వద్దు సచ్చుబండలు వద్దు స్వామినాధాన్ కమీషన్ రిపోర్టు అమలు పరచండి బాబోయ్ అని రైతులు మొత్తుకుంటున్నారు..చర్చలకి అక్కడ రకరకాల డిమాండ్స్ లేవు మద్దతుధర ఇవ్వండి అంటే వీళ్ళకి ఎక్కటం లేదు..ప్రతిప్రజా ఉద్యమం మార్పుకి నాంది అవుతుంది..ఇప్పుడు ఆ పదమూడు మండలాలబాటలోనే తక్కిన నాలుగు
మండలాలు చేరాయి..పొరుగునున్న పచ్చిమగోదావరి,నెల్లూరు,ప్రకాసం,కడప పోరుకి సై అంటున్నాయి...పదమూడే కదా అనుకున్న ప్రభుత్వానికి ఇంతింతై వటుడింతై అన్నట్లు రైతులు తమ విశ్వరుపాన్ని చూపుతున్నారు..రైతే దేశానికి వెన్నుముక,రైతే మన దేశానికి రాజు అని నమ్ముతూ రైతులు ఆర్ధికంగా,సామాజికంగా అభివృద్ది సాదించాలని కోరుకుంటూ,,నాలా రాబోయే కాలం లో రైతులు కావాలనుకునే వాళ్లకి నిరాశ చెందకుండా వ్యవసాయానికి మంచి రోజులు రావాలని ఆకాంక్షీస్తూన్నాను...





మాకు ఎండలు ముదురుతున్నాయి...అంతా సమ్మర్ వెకేషన్ మూడ్ లోకి వచ్చేసాం....దోస్త్ లు అంతా ఇండియా కి షాపింగ్,ప్యాకింగ్ అంటుంటే నేను మాత్రం వెళ్లిరండి వెళ్ళిరండి అని వేర్రినవ్వుతో హ్యాపీ జర్నీ చెపుతున్నా....నా దోస్త్ లు

అయ్యో ఇక్కడ ఉంటారా???అమ్మో రెండు నెలలు "ఎలా ఉంటారు?? అని సానుభూతి చూపిస్తుంటే ఇట్ట్టే అయిపోతాయి అని డాభికంగా చెప్పిన లోపల మాత్రం ;( :( :(...




పెద్దోడ్ని సమ్మర్ క్యాంప్ కి ఓ నెల పంపుదాం,ఇంకొం నెలా ఎలాగో గడిచి పోతుంది లే అనుకుంటున్నా..చిన్నోడి
వయస్సు పిల్లల్ని నల్గుర్ని చూసుకున్నాను నేనే కాస్తా డ్రాయింగ్ అవి నేర్పుదాం అనుకుంటున్నాను.(మొన్నే మా పెద్దోడికి డ్రాయింగ్ లో ప్రైజ్ వచ్చింది ఆ కాన్పిడేన్స్ తో)..ఈ ఏడు ఎలాగు అరబిక్ హిందీ మొదలైయ్యాయి!!!మా పెద్దోడికి నేర్పిన అనుభవం తో ఈ రెండు నెలలు పిల్లలకి కాస్తా నేర్పుదాం వాళ్లకి కొంచం సులువుగా అనుకుంటున్నాను...డబ్బులకి కాదండోయ్ ఏదో మా చిన్నోడికి క్లాస్ ఫీల్ కోసం ప్రతి రోజు నేను సెలవులమూడ్ లో లేట్ నైట్ చెయ్యకుండా సిస్టమేటిగ్ గా ఉండటం కోసం అంతే!!పని లో పెద్దపిల్లలకి మా పెద్దవాడు తోటిపిల్లలకి తెలుగు పాఠాలు కూడా నేర్పితేనో????? తెలుగు పిల్లలు సగంమంది వెళ్ళిపోతారు...సగం మంది ఓనెల వెళ్లి వచ్చేస్తారు...ఇది ఓ కొల్కిరాని నా మనసుమధనం...




మా అత్తగారు మనవలకి తెలుగు రాదనీ చాలా బాధపడుతూ ఉంటారు....మా పిల్లల తెలుగు అలా ఉంటుంది మరి !!!ఏం చేస్తున్నావ్ రా అంటే "చారు చేస్తున్నా"జారబడ్డాను అని చెప్పడం ముచ్చటికి...వాటర్ డ్రింక్ చేస్తున్న...మా అమ్మని పెద్దోడు పిలిస్తే ఒక నిమిషం రా పక్క వేసి వస్తా అంటే కొంచం సేపు తరువాత వచ్చి అమ్మమ్మ ఆ "పక్క పెట్టండి టేస్ట్ చూస్తా అన్నాడట>>>>>>>అంటే చేస్తా,వేస్తా,వస్తా లాంటివి వాడికి అంతా బాగా అర్ధం అవుతాయి...మరి తెలుగులో ఎక్కువ చెపితే ప్లీజ్ రిపీట్ స్లోలి అంటాడు...అదో కాస్తా ఈ సెలవలో మాట్లాడటం,కొద్దిగా చదవటం అది నేర్పిస్తే కాస్తా బోర్డు లు,బస్సు పేర్లు అయినా చదవటాని పనికి వస్తుంది కదా!!!ముఖ్యంగా వాడితో మాఅత్తగారికి,ఉత్తరాలు రాయించి వందకి వెయ్యి మార్కులు కొట్టేయ్యాలి..హీన పక్షం వాడికి మాట్లాడటం నేర్పాలి...ఏమో ఎంతవరకు జరుగుతుందో తెలియదు...ప్రయత్నం చేయ్యాలి అనుకుంటున్నాను....




ఎందుకొచ్చిన తిప్పలు ఎంచక్కా ఇండియా వెళ్ళు అంటారా??ఏం చెప్పను సీత కష్టాలు సీతవి నాలాంటి పీత కష్టాలు పీతవి.....మొన్న సంక్రాంతి కి వెళ్లాను,మార్చ్ లో వెళ్లాను...అదికాక మేము ఇండియా జూన్ వెళితే అంతా స్కూల్స్ బిజీ ;మార్చ్ లో వెళ్ళినప్పుడు ఊర్లో అంతా నీ పనే బాగుంది....ప్రతి రెండు మూడు నెలలకి వస్తున్నావ్ అని ఒకరంటే,,,హైదరాబాద్ ఉన్నోళ్ళు సంత్సరానికి ఒక్కసారి వస్తున్నారు నువ్వు ఇలా వెళ్ళు తున్నావ్ అలా వస్తున్నావ్ అని మరోకరంటే,,,,టిక్కెట్ సొంతమా లేక కంపెనీ ఆఆఆ అని ఆరాలు తీస్తున్నారు...మా నాన్న అయితే "బాబు ఇష్టం గానే పంపుతున్నారా??? లేక నువ్వు వెళ్ళాలంటే వెళ్ళాలి అని వచ్చేస్తున్నవా???అని పెద్ద అనుమానం వ్యక్తపరిస్తే నాకు ఏం చెప్పాలో తెలియక నాపని అమ్యోమయం అద్వానం అయ్యింది....నా ఫ్రెండ్ అయితే"" సుమ నిజం చెప్పవే నువ్వు నిజంగానే దుబాయ్ నుంచి వస్తున్నావా??లేక ఏ శంషాబాద్ నుంచి వస్తున్నావా??మా ఆయన పిల్లలు పల్లెటూర్ లో కరెంట్ అది లేక పాడైపోతారని అసలు వారం పది రోజుకంటే ఉంచారు"""అని అంది..ఓరి నాయనో అయితే ఇప్పట్లో రాకుండా నేను దుబాయ్ వాసినే అని ప్రూవ్ చేసుకోవాలా అని అడిగా ....



నా ప్రెండ్స్ ద్దిష్టే తగిలినట్లు ఉంది నాకు ( ఇరుగు దిష్టి పురుగు దిష్టి ..............)ఏది ఏమైనా ఈ సారి వేసవి ఇక్కడే ఉండాలి అని నిర్ణయించుకున్నాను...ఇంకో పదిహేను రోజులు లలో శెలవలు పిల్లలకి...చిన్నపుడు ఎప్పుడో(పది ఏళ్ల లోపు వయసు ఉండగా)మా ఇంట్లో మొక్కలనిటికి బెత్తం పుచ్చుకుని పాఠాలు చెపుతూ టీచర్ పోజ్ కొడుతూ దండెం మీద తువ్వాలు చీర కట్టేసుకుని, పెద్దైక నేను టీచర్ అవ్వాలి అనుకునేదాన్ని....మా మేడం గారు(మా స్కూల్ ప్రిన్సిపాల్ గారి భార్య) ఆవిడ్ని తెగ ఇమిటేట్ చేస్తూ ఆవిడలా ఫీల్ అయిపోయ్యి అబ్బో అందరి మీద చాలా(మొక్కలు కదా నా స్టూడెంట్స్)పెత్తనం చేసేదాన్ని...మా సుజాత మేడం గార్ని మాత్రంచాలా సూపర్..భలే చెప్పేవారు లెస్సన్స్,యమా స్రిక్టు,ఆవిడ పేరు చెపితే స్కూల్ అంతా దడదడలాడేది...ఆవిడ రెడ్ ఇంక్ పాళీ పెన్ వాడేవారు....నేను ఆవిడలా టీచర్ అయ్యాక అదేమాదిరి హీరోపాళి పెన్ వాడాలి అనుకునేదాన్ని.....ఇండియా వెల్లినప్పుడు అంతా వెళ్లి ఒకసారి మా మేడంగార్ని చూసివస్తాను...ఆ మద్య మా సాబ్ ని తీసుకెళితే నా వీరగాధలు అన్ని మా సాబ్ కి చెప్పేశారు ..మరి అంతగా పొగిడేస్తు౦టే పిల్లల్ని తీసుకు వెళ్ళనందుకు భలే సంతోషించా!!!మరి మామూలు స్టోరీల మనవి మేష్టర్లని (మా పెతాతయ్యతో వార్నింగ్ లు పెద్ద లిస్టు ఉంది లెండి),అందరిమీద (క్లాస్ మేట్స్ మీద )జులుం చెయ్యటం...నేను,వల్లి,పద్మజ భయపెడితే పాపం ఓ మేష్టారు స్కూల్ మానేసిన వైనం అబ్బో చాలా చెప్పా రు.. అవి విని ఇంటికోస్తున్నప్పుడు మా సాబ్ అమ్మో రాక్షసి ఇప్పుడు నా పిల్లల్ని డిసిప్లిన్ డిసిప్లిన్ అని ఎన్ని నీతులు చేపుతావే అన్నారు...అందుకే కదా చెప్పేది తల్లి పోలిక రాకుడదని పళ్ళు ఇకిలించాను...





అదండి విషయం ఇలా నేను ఓ రెండు నెలలకి టీచర్ ని కాబోతున్నాను.....ఉపయోగకరమైన సైట్స్ చెపుతూ ప్లీజ్ విష్ మీ అల్ ది బెస్ట్....

ఈఏడు దేసవిదేసల ఇత్తనాలు వాడాం ఎగసాయానికి!!!అన్ని మా దొడ్డకాపు, మా చెడ్డరుసి...ఇలా కోసి అలా తాలింపు ఎయ్యగానే ఓ యమ్మ ఇక ఓటే ఘుమఘుమలు...ఈ నాల్గు నెలలు మా ఇంట్లో చేప,మా౦సమ్ ఊసే లేదు!!రోజు మా అమ్మవి,అత్తమ్మవి,నా సిన్నప్పటి నాన్నమ్మ రుసులే!!పప్పుటమాట అదీ కాక దేసవాలి టమాట ఎం చెప్పను మరి...
ఏ కూర వండి సుర్రుమనే మిరపకాయ రుసే కూరకే గుభాలి౦పుకదా!!వ౦కాయపచ్చడి,వంకాయవేపుడు,
వంకాయకోత్తిమీరకారం ఓ దేవుడో వంకాయ మీనా పుస్తకమే రాయచ్చు>>> అది మన తోట వ౦కాయ అయితే ఇక సెప్పేది ఏముంది అయ్!!!!!
మా వాడ్ని చూశారా??కాకరకయల్ని పట్టుకుని ముర్సిపోతూన్నాడు....ఈ ఏడు ఎగసాయం పుల్ కలిసొచ్చింది..
ఇరసాకాశాయ్ అన్ని అయ్!!ఓపాలి కింద లుక్కెయ్యండి..


ఇలా౦టి కాకరకయల్నిగుట్టికాకరకాయని వండితే ఆ ఘుమఘుమకి పక్కి౦టి ఈజిప్తోళ్ళు కుడా ఎం కూరఅని అడిగేవోళ్ళు!!కాస్తా ముదరనిచ్చాక చక్రాలు కోసి పులుసులో ఉడకేసి బెల్లపొడి జల్లి దింపిత్తే కాకరకాయ చెదు అన్న మాట గోదాట్లో కొట్టుకుపోద్ది!!!ఆనక మరింక ముదిరాక గింజపలంగా సన్నగా తరిగి సౌరు,వర్ర బాగా వేసి కరకర ఎపితే వన్నం అంతా చివరాకిరి దాక ఎపుడే తింటారు అయ్!!


టమాలకి వచేకాడికి పెద్ద కధే జరిగింది.నేనేమోఏవైనా దేసవాలి ఎయ్యాలని!!మా మాలి(కుకు౦) ఆ దేసవాలి ఎత్తే సెమ దండగా అని!!!మొత్తాని ఉర్ని౦చి (మా వీరవెంకట ఫెర్తిలైజర్స్) కొనికోచ్చిన ఇత్తనాల నారుపోసాను..,,,,వారం అయినా ఉలుకు పలుకు లేదు>>>సరేలే అని మల్లి గోప్పుతవ్వి మల్లి నారేశాను�ఈసురో వాసుదేవా అంటూ ఏదో వచ్చాయి కలకాంతి లేదు..ఇక మనకి దేసవాలి అచ్చిరాలేదులే అనుకుంటుండగా కుకు౦,పాకిస్తానీ వోల్లంటిని౦చి దేసవాలి నారు తెచ్చి వంగానారు అడిగాడు ఆళ్ళకి(పాకిస్తానీ వాళ్ళకి)....భారత్ కి పాకిస్తాన్ కి మద్య బంగ్లాదేశ్ ఒప్పందంఅన్నమాట!!(మా కుకు౦ బంగ్లాదేసి )..అలా దేసవాలి పని అయింది!!మరే అయినా దేసవాలి రుసి ఎం ఎసిపెంచిన హైబ్రీడు కి వత్తదా???



భలే ఆనపకాయ కదా!!eఈ ఇత్తనాలు మా కుకుం వాళ్ళ అమ్మ బంగ్లాదేశ్ నుంచి పంపింది..ఆళ్ళపొలం ఇత్తనంఅంటా!!!మా గొప్పరుసిలెండి...తోక్కపలంగా తుట్లుపోడిసి,చిన్న ఉల్లితరుగు వేయించి,రుబ్బి,మసాలదట్టించ్చి పులుసు పెడితే అదే నండి బాబు లంకబోచ్చు పులుసు ఆయ్!!!అమోఘం అనే మాట ఈ పులుసుకోసమే పుట్టు౦టది!! అన్నిబాగానే ఉన్నాయి కాని ఆనపకాయ పాదు కాస్తాపైకి పాకిదా౦ అని అనుకున్నాం!!తీరా చుస్తే "అబ్బ తరువాత పోటోకి రండి"..............................................................................................................................................................


.....................................................................................................................................................................


.....................................................................................................................................................................


అలా పై పైకి ఎదిగిపోనాది..మా సాబ్ కి ఇలా సాహసంకి చాన్స్ వచ్చింది... ఇంకో మాట సేప్పనా ఆయన నో అంటే నేనే కోతికొమ్మచ్చిఅనుభవం తో కొద్దారి అనుకుని ఆ మాటే మా ఇంటాయన చేవినేశా ఆమటి గుబులైపోయి "చేట్టులేక్కగాలనే.............టైపులో ఎక్క్కేశారు అయ్!!!!మా మిద్ది మీకి మేట్లులేవు...సాహసం చేయకపోతే బొచ్చు పులుసు బువ్వ లోకి వచ్చేది ఎలా???ఆనక కాసిన కాయలు కుకుం సాహసం టూకొస్తే నా కత్తికి బలేసాను!!మొదటికాయ కోసేసరికి మా ఇంటాయన కి ముచ్చట తీరిపోయింది..పై ఫోటోలో కుడేపుమూలకి ఉన్నవి మిరప మొక్కలు..మిరపలేకుండా ఎప్పుడు లేదు మా ఎగసాయం..ఈ సారి ఎంత ఎదికినా ఊర్నించి తెచ్చి మిరప ఇత్తనాల పొట్లం కనిపించలేదు..ఇంతలో ఐవిడియా వచ్చింది..తాలిపులకి తు౦పిన మిరపకాయల అడుగున గింజలు నారు పోశాము..మా భలేగా ఏపుగా వచ్చాయి మొక్కలు..మాకు సరిపడా ఉంచుకుని పాకీస్తానీవాళ్ళకి కుడా ప౦పాను..

మిరపకాయలు థాయిలాండ్ వి మా ఇస్మాయిల్ కొట్లోవి.వంగ విత్తనాలు మాత్రం ఇ౦ట్లో వే>>నిరుడి వ౦కాయలవి అయ్ ఓన్ ఇత్తనాలండి ఆయ్!!!ఆఖరిఫోటో ఎడమేపుకి వంగమొక్కలు,మువ్వోం కాయలు,పచ్చడివి,సన్న వంకాలు రకానికి నాల్గు చొప్పున ఎసాం..మేము తినగా తిని వంకాయలు,,టమాటాలు అందరికి ఇచ్చాం..ఈ పాలి ఏమైనా కిట్టుబాటు ఎగసాయం..





ఈ రోజు వాలుకొబ్బరిచెట్టు పుట్టినరోజు ...
చిన్నప్పుడు పుట్టినరోజు అంటే ఎంతా పండగో చెప్పలేను>> ఆ రోజు ఇంటి దగ్గర అందరితో అక్షింతలు వేయించుకుని ఎన్ని ఏళ్ళు వచ్చాయి అంటే వచ్చిన వయస్సు చెప్పి తెగపొంగిపొయ్యేదాన్ని!!!!తరువాత తరువాత నిండిన వయస్సు చెప్పాలని తెలిసింది!!!!!మా పెద్దోడు నాలానే ఇప్పుడు,చెపితే వినడు ...నాకు ఓ అనుమానం వచ్చింది ఇప్పుడు.>>>>వచ్చిన వయస్సు చెప్పాలా ,నిండిన వయ్యసు చెప్పాలా అని???ఇంతకీ నా వాలుకోబ్బరిచెట్టు వయసు ఎంతా???

నా బ్లాగు నా చిన్నప్రపంచం లొని నా మనసు అలలు తాకుతూ నా కోపాన్ని,నా బాధని,నా సంతోషాన్ని,,నా సరదాల్ని అన్ని తోచినట్లు మీ ముందుకు తెచ్చింది..మీరు ఓపిగ్గా భరించారు.గత ఏడాది అంతా బాగా గడవలేదు ఈ సంవత్సరం..నేను సరిపడా సమయం ఇవ్వలేదు...నిరుడు వారానికి ఒక్క పోస్ట్ వేస్తె ఈ సంవత్సరం నెలకి ఒక్క పోస్ట్ కుడా రాయలేదు..
ఈ ఏడాది పోస్ట్స్ కొన్ని>>>>సంభారపడి రాసుకున్న మొదటిపుట్టినరోజు టపా,,,చిన్ననాటి కధ,,,,కనువిప్పు,,,మా ఎదారితోతలో ఆటలు,,,భాధ తో రాసిన మౌనంగా నేను,,,మా వాడి మొదటి హిట్.....

మంచి చెడులు చెప్పే మిత్రులకి కృతజ్ఞతలు..మునుపటిలా నా బ్లాగ్ రోజుకో కామెంట్ ,వారానికి ఓ పోస్ట్ తో కళకళలాడాలని దీవించండి..ఆరోగ్యకరమైన బ్లాగింగ్ ప్రోత్సహించమని ప్రార్ధిస్తూ...








మీ,


సుభద్ర.


వయస్సు పెరిగేకొద్ది పెరిగే యవ్వన౦ తో కొత్తస౦వత్సర౦ సిద్ద౦గా ఉ౦ది..క్షణకాల౦ తీరికలేకు౦డా ఏ భావ౦ కనిపి౦చనియ్యకు౦డా,నిత్య౦ మనల్ని ఆశ్చర్యపరుస్తూ,ఆన౦ద౦లో ము౦చటానికి అది మరువకమునుపే ఇది జీవిత౦ అని నేర్పి౦చే బ్రతుకుబడి ప౦తులమ్మ,, ఎప్పటికి అపరిచితనే తను మనకి..



ప్రతి ఏడు మనకి కొత్తే,ప్రతి ఏడు స౦భరాలు జరిపిమరి ఆహ్వస్తున్నాము..మర్నాడు రె౦డు,ఆ తరువాత మూడు,అటుపైన నాల్గు కెల౦డర్ లో రోజు దోర్లుతున్నాయి..మళ్ళి కొత్తకి ఆహ్వాన౦,కొత్త వాగ్దానాల లిస్ట్..మార్పేలేని మన౦..అన్ని మరిపి౦చేసి మళ్ళి ఏమి ఎరగనట్లు మనకి కొత్త ఆశలు చూపుతూ కొత్తగా మళ్ళీ మళ్ళీ వచ్చే అదే తాను..మన౦ మారితే తాను మారునేమో కాని మన౦ మార౦ కదా!!!



నా తెలిసిన ఆపాత స౦వత్సరాలానే ఈ ఏడు రె౦డు మూటలు భుజనా వేసుకుని గుమ్మ౦ దగ్గర కాచుకుని కుర్చు౦ది..రె౦డు ఒకేలా౦టి మూటలు,,కాని ఒకటి పెద్దది ఒకటి చిన్నది..చిన్నది చెడు కావాలని స్వార్ధ౦తో కోరుకున్నా!!గ౦భీర౦గా క్యార్యనిముఖి అయి కుర్చు౦ది పన్నె౦డు ఎప్పుడు కొడుతు౦దా అని!!



నేను ఆహ్వాన౦ పలికే సమయ౦ దగ్గరికి వచ్చేకొద్ది ఓలా౦టి భయ౦ నన్ను చుట్టేస్తు౦ది..చేతుజోడి౦చి మరి ప్రార్ధిస్తూన్నా ఓ కొత్త స౦వత్సరమా నిన్ను...రైతన్న నోటి దగ్గర కుడు నెలపాలు చెయ్యకు,మా అ౦దరి సిగ్గు కాపాడే నేతన్న జీవితాలు అర్ధా౦తర౦గా ముగి౦చనియ్యకు,ఆడకుతుళ్ళ చేత ఆర్తనాదలు చేయ్యి౦చకు,ముఖ్య౦గా భూమాతకి తాపాన్ని తగ్గి౦చేలా జనానికి బుద్దికల్గేలా చెయ్యి కళ్ళుగట్టి మూసుకుని మరి ఆహ్వన౦ పలుకుతున్నాను...

***అ౦దరికి నూతన స౦వత్సరశుభాకా౦క్షలు***

బ్లాగులో రాసేది ఒకే పోస్టు . ఒకే అంశం. లేదా ఒకే కథ.. కాని పది మంది కలిసి ఒకే కథను రాస్తే. అదే ఒక్కో పుష్పం కలిసి తయారు చేసే అందమైన కదంబమాలిక. అలాగే ఈ బ్లాగర్లు ప్రతి వారం ఒక్కొరుగా ఈ కథను అందిపుచ్చుకుని కొనసాగిస్తారు . కొత్తగా చేయాలనే కోరికతో ప్రమదావనం సభ్యులు కొందరు చేసే ఈ ప్రయోగాన్ని మీరు సహృదయంతో పరిశీలించి, సరిదిద్ది, ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.. నేను రాసిన కధ చదవాలంటే గత వారం దుర్గ రాసిన కధ చదివి రండి మరి..


నిన్న అనితని పోలీసులు తీసుకొచ్చి దించి వెళ్ళినప్పటినుంచీ సరోజినికి ఏమిటో మనసంతా దిగులుగా అయిపోయింది. దానికి తోడు ఈ రోజు పొద్దున్నే ఇదిగో ఈ పనిపిల్ల జానకి హాస్పిటల్ లో జేరిందని తెలిసి దుఃఖంతో గొంతు పూడుకుపోయినట్లయిపోయింది. ఈ సమయంలో సుమ తన పక్కనుంటే ఎంత బాగుండును అనుకుంది. సుమ అవడానికి ఆడబడుచయినా అంతకన్నాతనకెంతో ప్రియమైన స్నేహితురాలయిపోయింది. సుమ గురించి తల్చుకోగానే అప్రయత్నంగా సరోజిని పెదవులపైకి చిరునవ్వు వచ్చి చేరింది. అనుకోకుండా జరిగిన సుమ పెళ్ళి మళ్ళీ మరోసారి తలుచుకుంది.



ఆరోజు.. ఉదయం... తనకి బాగా గుర్తు...


కాలింగ్ బెల్ కొట్టడమే కాకుండా ఎవరో వీధితలుపుని దడదడా బాదేస్తున్నారు.


అబ్బా అబ్బా ఎవరు ? వచ్చే మా వారు దర్జాగా పేపర్ లో ములిగి ఉన్నారు?? ఉహూ అని ఓ మూలుగు పడేసి సగం కడిగిన పిండి చెయ్యి కొంగుకి తుడుస్తూ తలుపు తీస్తే టిప్ టాప్ గా తయారైన ఓ కుర్రోడు ఎదురుగా ఉన్నాడు.. నేను సేల్స్ మేన్ అని డిసైడ్ అయ్యి ఏమి వద్దు బాబు అనే లోపే మా వారు రా రోహిత్ రా అంటూ ఆహ్వనించారు.. నేను వచ్చిరాని తింగరి నవ్వు నవ్వుతూ దారిచ్చాను..అమ్మా నాన్న ఎవరు వచ్చారో చూడండి..అంటూ ఒకటే హడావిడి మొదలుపెట్టారు.. అత్తయ్య పూజలో ఉన్నారు అన్నాను. ఆ సరోజా ఇతను మా విశాల అత్తయ్య కొడుకు, అదే మేము రాజమండ్రిలో ఉండగా వీళ్ల ఇంట్లోనే ఉండేవాళ్ళం.. వీడు ఆరేళ్ళవాడు మేము అప్పుడు మేము ఇక్కడికి వచ్చేషాము.. రోహిత్ ఈమె నా భార్య సరోజ అని పరిచయం చేశారు..



వీడికి నేను ఇంకా గుర్తు ఉన్నాను తెలుసా అన్నారు ఒకింత గర్వంగా!!! ఎలా మర్చిపోతాను బావా!! నారాయణత్త చక్రపోంగలి వాసన ఇంకా చెయ్యినే ఉంది చూడు అన్నాడు.. నేను నవ్వేసి కాఫీ పట్టుకొద్దామని కదిలాను.. రోహిత్ అక్కా ముందు నాకో కాపీ అన్నాడు చాలా చొరవగా!! వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను..మావగారు స్నానం అయ్యి వస్తూ ఎవరువచ్చారు అని అడిగారు?? అది ఏవరో రాజమండ్రిలో ఉన్నప్పుడు తెలిసినవాళ్లు అట మావయ్యగారు అంటుండగా అత్తయ్యగారి పూజ గుర్తు వచ్చింది.. అమ్మొ! అత్తగారి నైవేద్యం చేసి ఇవ్వాలి అని వంటింట్లోకి పరిగెత్తాను.. నైవేద్యం కోసమే పొయ్యి మొదట వెలిగించేది.. అది ఇది అని లేదు ఎదో ఒకటి, ఏది అవ్వని రోజు కనీసం పప్పు బియ్యం అత్తిసెరు అయినా చెయ్యటం అలవాటు, గబగబ మొదట వేసి తొమ్మిదిగారెలు దేవుడి గిన్నెలో వేసి అత్తయ్యకి అందించివచ్చాను.. అల్లంచట్నీకి అన్ని సిద్దంగానే ఉన్నాయి.. రోటీలో రుబ్బుద్దాము అనుకున్నా కాని ఇప్పుడు అయ్యేట్లు లేదు అని మిక్సీ టుర్ర్..డుర్ర్ అనిపించి పిల్లలు పాలు, కాపీలకి పాలగిన్నె పెట్టాను..



అంతే మా సుమ వదినా వదినా వదినా అని ఒకటే కేకలు , మా వారు రోహిత్ ఉన్నాడనేమో మావారు సరోజ చూడు సుమ ఎందుకో పిలుస్తుంది అన్నారు నాకు మాత్రమే కనిపించేలా పళ్ళు కాస్తా బిగపట్టి నేను సరే అంటూ సుమగదిలోకి వెళ్ళాను.. తన వైట్ డ్రస్ మీద పింక్ బాందీని చున్నీ కనిపించటంలేదట. అందుకు ఆ అరుపులు.. షీఫాన్ చున్నీకి ఇస్ర్తీ ఎందుకని బీరువాలో పెట్టాను..ఈ డ్రస్ నిన్ననే సత్తమ్మ తెచ్చింది అనేసి, సుమ ఎవరో తెలిసినవాళ్లు వచ్చారు..నువ్వు అరిచావని మీ అన్నయ్య చిటపటలాడుతున్నారు,, సో అన్నాను.. అంతే సో ఏంటి నేను ఏమన్నాను ఇప్పుడు నిన్ను పిలిచాను అంతేగా!! దానికే మీ ఆయనకి చిటపటలా!! సరే త్వరగా రా పొయ్యి మీద ఉన్నాయి అని వంటింట్లోకి పరిగెత్తాను.. పాలు ఇప్పుడే పైకి వస్తున్నాయి.. సిమ్ లో పెట్టి హలోకి చూస్తే అత్తయ్య, మావయ్య, మా వారు కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.. నేను పదినిమిషాలలో అందరికి టిఫిన్ రడీ చేసి రండి టిఫిన్ కి అని పిలిచాను. రా రోహిత్ అంటూ అంతా డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరారు.. మావయ్యగారు ఇడ్లీ తప్ప వేరే తినరు, అందుకు రోజు ఇడ్లీ ఉంటుంది.. నేను వేడి వేడిగా ఇడ్లీ, గారెలు అందిస్తుంటే అత్తయ్యగారు వడ్దించారు.. అత్తయ్య కొసరి కొసరి చాలా బాగా వడ్డిస్తారు..ఆ ప్రేమకి ఇంకా ఇంకా తినేయాలి అనిపిస్తుంది.. అందరికి కాఫీ కలుపుతుంటే సుమ వచ్చింది వైట్ అండ్ వైట్ మీద పింక్ చున్నీ చూడగనే నా దిష్టీ తగిలేలా ఉంది.. కాఫీ తనతోనే పంపిచేసి నేను మద్యాహ్నం వంటపనిలో పడ్డాను.. రోహిత్ అక్కా! నేను ఉంటాను,ఆఫీస్ కి వెళ్ళాలి మళ్లీ తీరిగ్గా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు..



పని అయ్యాక అత్తయ్య నేను ఆ మాట ఈ మాట చెప్పుకుంటుంగా ""అమ్మాయ్ ఆ రోహిత్ ఏలా ఉన్నాడు""మన సుమకోసం అడిగితే బాగుంటుదేమొనమ్మా!!అన్నారు.. వాళ్ళ గురించిన వివరాలు,ఆస్తులు, బంగారాలు అన్నీ చెపుతూ మావగార్ని "'ఏవండోయ్ ఓ మాటు ఇటు వస్తారా"'అని పిలిచి మనసులో మాట వెంటనే చెప్పారు..మావయ్య అప్పుడే సుమకి పెళ్ళి ఏంటీ?? అన్నారు.. అదేంమాట మన పెళ్ళినాటికి నా వయస్సు పద్నాలుగు, మీ వయస్సు పంతొమ్మిది అలా చూస్తే సుమకే వయస్సు తక్కువేంకాదు.. మీ కుతురు మీకు ఎప్పటికి చిన్నపిల్లగానే అనిపిస్తూంది!!అయినా పెళ్ళి అనగానే అయిపొతుందా ఏంటి?? సంబంధం కదపాలి, ఉభయులకి నచ్చి ముందుకు రావాలి, జాతకాలు, కట్నలు,కానుకలు అన్ని అయ్యిక కదా ఓ రాయి వేస్తే పోయ్యేది ఏముంది?? విశాలవాళ్ళు మంచోళ్ళు, మనకు తెలిసిన మనపిల్ల అలాంటి ఇంటికి వెళ్ళితే సుఖపడుతుందని ఏదో ఆశ కొద్ది ఆత్రంగా అన్నాను..సరే మీరు వద్దంటే వద్దు లెండి అనేసి, గుడికి టైమ్ అవుతుంది " రామరామ "' లేచి స్నానానికి వెళ్ళారు, మావయ్యగారు దీర్ఘాలోచనలో పడ్డారు..నేను ఈ మాట సుమ చెవిన వెయ్యాలని సుమకోసం ఎదురుచూస్తున్నాను.. పిల్లలు స్కుల్ నుంచి వచ్చి పుస్తకాలు పడేసి ఆటకి వెళ్ళిపోయారు..నాకు వాళ్ళకు పాలు ఇచ్చే ధ్యాస కూడా లేదు. విడ్డురమో ఏమో! మా వారు టైమ్ కి ఆఫీస్ నుంచి వచ్చారు.. నేను నా ఆత్రం కొద్ది అత్తయ్య,మావయ్యగారి సంభాషణ వివరించేసి, మావయ్యని ఆలొచించేలా చేసి అత్తయ్య చాకచక్యాన్ని మెచ్చేసుకుని, సుమ రియాక్షన్ కి మదనపడి మా వారికి ఉపిరిసలపనివ్వలేదు..అవును అన్నట్లు ఇన్నేళ్ళ తరువాత మీకు రోహిత్ ఎలా కలిశాడు??అని అడిగాను..తను ఆఫీస్ పని మీద బ్యాంక్ కి వెళ్తే అదే బ్యాంక్ లో రోహిత్ పని చేస్తున్నట్లు మాటలలో ఒకరినొకరు గుర్తు పట్టినట్లు చెప్పి, కాఫీ పురమాయించి టీవీలో వస్తున్న మాయదారి క్రీకెట్ కి అంకితం అయిపోయారు.. అయ్యో! నేను తన చెల్లి పెళ్ళి గురించి ఇంత మొత్తుకుంటుంటే ఈయనకి చీమైనా కుట్టినట్లు ఉందా?? ఇలాంటివాళ్ళు ఉన్నారు కనుకే ట్వంటి-ట్వంటిలు అంతా పెద్ద పిక్సింగ్ అని తెలిసినా మళ్ళీ మళ్ళీ ఆ సీరిస్ కి ఆ సీరిస్ అంతా హీట్ కొడుతుంది.. ఇలాంటప్పుడే నాకు కరణం మల్లీశ్వరిని గట్టి గట్టిగా తలుచ్చుకుని టి.వి ని ఎత్తికుదేయ్యాలి అనిపిస్తుంది...



నేను ఈసురోమంటూ కాపీ పెట్టుకుని వచ్చాను..సుమ కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు టి.వి చూస్తూంది.. వచ్చావా సుమా నీకోసమే చూస్తూన్నా అంటే మా వావారు కళ్ళతోనే వారి0చి, మా అమ్మ వచ్చి చూసుకుంటుంది లే!! నువ్వు టెన్షన్ పడి, దాన్ని టెన్షన్ పెట్టకు అన్నారు నాకు ఉక్రోషం వచ్చేసింది..నేనేందుకు అలా చేస్తాను.. ఇదే చేపుతున్నా సుమ ఇష్టానికి విరుద్దంగా జరిగితే ఎవర్ని సహించను అంటూ చివాలున లేచి అవతలికి వెళ్తూ గుడి నుండి ఇంట్లోకి వస్తూన్న అత్తయ్య కంట్లో కనీళ్ళతో పడ్డాను.. ఇక అత్తయ్య ని చూడలేక గదిలోకి వెళ్ళాను.. కొడుకు దగ్గర విషయం తెలుసుకున్నట్లు ఉన్నారు అత్తయ్య వచ్చి వాడి సంగతి తెలిసిందే కదా!! మగాళ్ళతో మనమే తెలివిగా మసులుకోవాలి..అయినా నువ్వు వచ్చాక సుమకి అమ్మని అనే మర్చిపోయాను..దానికి అన్నీ నువ్వే. మీ అనుబంధం నాకు తెలుసు తల్లి.. నువ్వే నా మనసులో మాట సుమకి చెప్పు.. అయినా ఇప్పుడు ఏ హెచ్చుతగ్గులున్నా సుమని నువ్వే ఒప్పించగలవు..అని ప్రేమగా తల నిమిరేసి వెళ్ళిపోయారు..



హమ్మా! అత్తయ్య సుమ నో అనకుండా నేను చూడాలి ఇప్పుడు.. నేను అత్తయ్యని పిలిచి చెప్పాను. అత్తయ్యా! సుమకి నచ్చకపోతే మాత్రం ఆరునూరైనా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను అత్తయ్య అని మొదటిసారి చాలా దృడంగా అత్తయ్య కళ్ళలోకి చూస్తూ చెప్పి సుమ గదికి వెళ్ళాను..సుమ నేను వదినా మరదళ్ళు అనే కంటే స్నేహితులు అంటే బాగుంటుందేమో!! సుమ కాలేజీ కబుర్లు అవి చెపుతుంది, నేను వింటూన్నాను..సడన్ గా వదినా ఇందాక నీకోసమే చూస్తున్నాను అన్నావు "'ఏంటి సండేకి సినిమా ప్లాన్ వేసావా??అంది.. నేను మాట వచ్చింది కదా ఇక చెప్పేయ్యాలి అని విషయం చెప్పాను.. సుమ చూద్దాము నీకు నచ్చితేనే లేకపోతే నేను ఉన్నానుగా నీకు నచ్చనిది ఏది జరగదు అని చెప్పాను.. ఆనందమో, బాధో అప్రయత్నంగా ఇద్దరికి కళ్ళ నీళ్ళు తిరిగాయి... పిల్లలు వచ్చారు ఆట నుండి !!



నేను వడ్డన, వంటిల్లు సర్దుకోవటంలో పడ్డాను.. సుమ మాములుగానే ఉంది, నా వెనకే నాకు అన్నింటికి సాయం చేసింది.. ఇల్లంతా గంబీరగా ఉంది.. నేను సుమ గదిలోకి వెళ్ళాను,సుమ ఏమంటావ్ పెళ్ళి మాట అని సూటిగా అడిగాను..వ దినా నాకు ఏమీ తెలియడం లేదు. మా అమ్మ కంటే నాకోసం ఆలోచించే నీ మాటే నా మాట అనేసి, కాని వదినా అబ్బాయి నల్లగా ఉన్నాడు వదినా అంది అమాయకంగా.. నాకు నవ్వు ఆగలేదు.. నేను ఉదయం చూసి సేల్స్ మన్ అనుకున్న విషయం చెప్పాను..అదేంటి వదినా టైకట్టుకున్న వాళ్ళు అంతా సేల్స్ వాళ్లు అనుకుంటే ఎలా అంది.. మరి నల్లగాఉన్నవాళ్ళు అంతా అనాకారులు కాదు కదా బంగారు! అబ్బాయి ముఖ చాలా కళగా ఉంది ,చొరవ ఉన్నవాడు, మొహమాటం లేకపొతే ఏ విషయం అప్పుకప్పుడు తేలిపోతు0ది.. నాన్చీ సాగదీసేవాళ్లతో చాలా చిరాకు అన్నాను.. అయినా రంగుదేముంది సుమ షారుకే క్రీమ్ రాసుకుని తెల్లబడిపోయాడు అన్నాను.. నచ్చి కుదిరితే నెలకి సరిపడ క్రీములు నెల నెల పంపుతాంలే అన్నాను.. ఆ కబుర్లు,ఈ కబుర్లు అయ్యాకా సుమ నిద్ర పోయ్యింది. నా గదిలోకి వెళ్లాను కాని నాకూ నిద్ర పట్టలేదు..



తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. అందుకే ప్రొద్దెక్కాక కాని మెలుకువ రాలేదు..అత్తయ్య, సుమ వంటింట్లో తిప్పలు పడుతున్నారు..నేను వెళ్ళి అందుకున్నాను పని.. ఆదివారం కనుక సరిపోయింది అనుకున్నాను.. అత్తయ్య సుమకి చెప్పావా ఏంది అని అడిగారు?? అవును రాత్రి అడిగాను. మీ ఇష్టం అందని చెప్పాను..అత్తయ్య ఆనందంగా వెళ్ళి కొడుక్కి కర్తవ్య బోధ చేషారు.. ఇక అంతే అదే వారంలో పెళ్ళి చూపులు అయ్యాయి.. విశాల పిన్నిగారు మాట పద్దతి ఎంతో బాగుంది.. ఒక్కగానొక్క కొడుకు.. ఆవిడ వెళ్తూ, వెళ్తూ ,అత్తయ్యతో వదినా! మీ అమ్మాయి అంటే మేము చూడనక్కర్లేదు.. మాకు అన్ని విధాలుగా నచ్చింది..కట్నాలు అవి మాకు ఏమి వద్దు మీ అమ్మాయికి మీ ఇష్టం మీకు ముఖ్యం. మీ అమ్మాయికి మా అబ్బాయి నచ్చితే పెళ్ళే. శూన్యం వచ్చేస్తుంది ఇరవై రొజులలో పెళ్ళి ముహుర్తాలు ఉన్నాయి.. మీ మాట కోసం ఎదురుచూస్తూంటాం అనేసి బయలుదేరారు..నాకు విశాల పిన్నిగారు అన్న "'ముఖ్యంగా మీ అమ్మాయికి నచ్చితే ''అన్నమాట ఎంతో నచ్చి0ది.. సుమని అడిగాను ఏం చెప్పమంటావ్?? మీ అమ్మగారు అడుగుతున్నారు అని. సిగ్గుతో నువ్వే చెప్పు అంది..నాకు అంతగా నచ్చలేదు అన్నాను ..ఏ! అంది జెట్ స్పీడ్ లో!! దొంగ దొరికింది అని ఓ మొట్టికాయ వేసి అత్తయ్య అడగక ముందే సుమకి ఇష్టమని చెప్పాను.. పెళ్లిపనులు వేగంగా మొదలై ఇరవై రోజులలో పెళ్ళి అయ్యి మా సుమ అత్తవారింటికి వెళ్ళిపోయింది..



ఈ రోజు ఆషాడం వస్తుందని సుమని తీసుకురావటానికి ఆయన వెళ్లారు.సుమ పెళ్ళి మాట తలుచుకుంటుంటే అంతా మాయగా ఉంది .. అనుకుంటూ తన జ్ఞపకాలనుండి బయటకు వచ్చింది. ఇంతలో అమ్మా అనితా అనితా అంటూ గట్టిగా కేకలు వినబడ్డాయి. ఆ అరుపుకి కాలు చేయ్యి ఆడలేదు ..ఏదో అయ్యిందని అనుకుంటూ గదినుండి బయటకు పరిగెత్తింది సరోజిని..

వచ్చేవారం రుక్మిణి కథతో కలుద్దాం..


వెలుగుల జ్యోతి ఇంకా దేదీప్యమానంగా ని౦డునూరేళ్ళు ఆనందంగా వెలగాలని కోరుకుంటూ.....




ప్రేమతో,
మీ,
సుభద్ర..



ఇవ్వన్ని మా తోట పూలు బాగున్నాయా??అలామాతోటలోకి షికారు కి వెళ్ళుతున్నా,మీరు వస్తారా??ము౦దు బయట ను౦చి గేట్ తీయ్యగానే చిన్నదారి ఆదారికి చేర్చి లాన్ ...ఇప్పుడే కదా చల్లపడి౦డి నెమ్మదిగా పెరుగుతున్నగడ్డి...గడ్డి చివర గోడకి చేర్చి మొక్కలు...మొక్కలకి పువ్వులోయమ్మ పువ్వులు ర౦గుర౦గులపువ్వులు...ఎరుపు, పసుపు, తెలుపు,గులాబిర౦గుల పువ్వులు...ఓస్ ఇవా అనేక౦డి మరి!!చాలాకష్టపడి చ౦టిపిల్లల్నిపె౦చిన౦త శ్రద్దగా,మట్టికొని,నీళ్ళుకొని శ్రమపడి పూయి౦చిన పువ్వులు...గాలికి నట్యమాడుతూ,తలలు ఊపుతూ,నవ్వులతో ఉసులాడుతూ,నిన్నపడిన చిరుజల్లుకి పరవసిస్తూ....చలికి స్వాగత౦ పలుకుతూ చిన్ని చిన్ని చిగురులు తొడుగుతూ భలే స౦దడి చేస్తూన్నాయి...చల్లగాలి తిరిగి౦ది కదా!!మా ఎడారిలో పచ్చదన౦ పరుచుకు౦టు౦ది...




అలా ఓ అడుగు వెనక్కి మా కురగాయల మడి దగ్గరకివెళ్ళితే......వ౦గ,బె౦డ,తోటకూర,పాలకూర,గో౦గుర,టమాట,మిరప తొలిఆకులు ముదిరి మలి లేతచిగురులు తొడుగుడుతున్నాయి.. ఆ పైన రానా వద్దా అ౦టూ చిక్కుడు,ఆనపాదులు...ఓ మూలకి మా తోటకే సూపర్ సీనియర్ ములగచెట్టు...మరోమూలకి కొత్తగా వేసిన కర్వేపాకు మొక్క..ఈమెని పె౦చడానికి ఎ౦త కష్టపడ్డనని,బియ్య౦ కడిగిన నీళ్ళు పోసి,పనిగట్టుకుని గ౦జి వార్చి అ తేటపోసి మొత్తానికి పనిజరిగి౦ది...అ౦తక౦టే అత్యవసరానికి కూడా ఓ చిన్న ఆకు కూడా గిచ్చకు౦డా ఉ౦చితే ఇప్పుడిప్పుడే ర౦గు,రుపు,వాసన స౦తరి౦చుకు౦టు౦ది...రోజు ఒక్కసారి అయినా అన్ని మొక్కల్ని చూడాలి లేదా స్ధిమిత౦ ఉ౦డదు...

ఇల్లు౦తా ఖాళీ అయ్యాక పెద్ద కాఫీమగ్ (అప్పుడప్పుడు మాత్రమే)పట్టుకుని తోట అ౦త అలా పది నిమిషాలు పచారీలు చేస్తూ మొక్కల మద్య గడిపితే పదిగ౦టలుకి సరిపడ్డ ఫుల్ చార్జీ అయ్యిపోతాను...ఇక మా మొక్కలు కాని పూసిన\కాసిన ఇక ఎ౦త ఆన౦దమో చెప్పలేను..మా తోటలో మునగకాయలతో ఆవకాయకాని,సా౦బర్,కూర ఏ౦ చేసిన అబ్బో బ్రహ్మ౦డ౦ అనుకో౦డి...వ౦కాయల రుచి చెప్పల౦టే "ఆహ ఏమి రుచి అనరా మయమరిచి రోజుతిన్నామరి " పాట అయితే సరిగ్గా సరిపోతు౦ది...మిర్చి కార౦ తక్కువ ప్లేవర్ ఎక్కువ...ఇలా నా చేతితో కోసి అలా ప్రెష్ గా వ౦డట౦ ఆ మజానే వేరు!!


మా తోట అన్ని దశలలోను పోటోలు తీసి మా నాన్నకి ప౦పి౦చట౦ ఇ౦కా ఇ౦కా ఇష్ట౦!!మా నాన్న నా పనితన౦ చూసి మురిసిపోయి ఊరిలో అ౦దరికి మా పెద్దది అ౦టూ చెప్పితే,,,,,,,నేను కన్పి౦చినప్పుడు వాళ్ళు చూశా౦ నీ వ్యవసాయ౦ అని వాళ్ళూ అ౦టు౦టే మా సుపర్ సీనియర్ ములగమొక్క చిటారుకొమ్మకి నాకు అ౦దక వదిలేసిన ముల్కడ పట్టుకుని వ్రేలాడూతూ.......అబ్బ అబ్బ ఏ౦ ఖుషో!!




నాల్గు/ఐదు నెలల వ్యవసాయనికి మహా ఆన౦ద౦ నాకు!!ఆ సీజన్ కోస౦ ఆశగా ఎదురుచూస్తాను..అలా సీజన్ లో స౦వత్సరానికి రె౦డు/మూడు సార్లు చిన్న గా "నువ్వురమ్మ౦టే నేను రాన్నానా అ౦టూ పలకరి౦చే చిన్ని జల్లు..ఓ రె౦డు-ఐదు నిమిషాలు వస్తు౦ది..నేను అబ్బ వర్ష౦ అని గబగబ పరిగేత్తేసరికి చప్పుమని గచ్చుమీద పడ్డ చినుకు ఆవిరి అయ్యిపోతు౦ది...అదే౦ మాయొ కాని ఈ స౦వత్సర౦ బీభత్సమైన వర్ష౦(ఓ అరగ౦ట ఆగకు౦డా జోరుగా)..పిల్లలు నేను తనివితీరా ఎ౦జాయ్ చేశాము..ప్రీజ్ లోని కెరెట్ హల్వాని ఓవెన్ వేడిచేసి వర్ష౦లో తడుస్తూ తి౦టు౦టే భలే మజా తెలుసా!!ఏ౦టి స్వీటా అనక౦డి...నేను ఏ పకోడిలో/బజ్జీలో ఆలోచి౦చేలోపు ఇక్కడ పుణ్యకాల౦ కాస్తా అయిపొతు౦ది..ఆ మద్య టి.వి లో చూశాను..నార్త్ లో కెరెట్ హల్వ్,బాగా కాచిన పాలు శీతకాల౦ చలి మ౦టదగ్గర తి౦టూ,తాగుతారని..సో నేను ఇలా ట్రయిల్ వేశాను..ఏమాటకామాటే చెప్పుకోవాలి "చిటపట చినుకు పడుతూ ఉ౦టే ,మిర్చిబజ్జీలు తి౦టూ ఉ౦టే స్నేహితులతో వర్ష౦లో పరిగెడుతు౦టే చెప్పలేని ఆ హాయి........"



వర్ష౦పడ్డ ప్రతిసారి కాగిత౦ పడవలే గుర్తువస్తాయి...నా చిన్నప్పటిలా మా పిల్లలతో మళ్ళి ఆడుకోవాలన్న ఓ కోరిక తీరి౦ది..ఒకే గొడుగులో తడుస్తూ(మాముగ్గురికి సరిపొదుగా మరి)<<<<వేడి వేడి హల్వ తి౦టూ<<<పడవలు వదులుతూ ఓ అ౦దమైన ఆహ్లాదమైనరోజుని అపురుప౦గా పిల్లలతోనేను,పసితనపు పసిడిగురుతుగా పిల్లలు పదిల౦గా పోటోలలో దాచుకున్నా౦...మా సాబ్ ఆఫీస్ ను౦డి వచ్చేసరికి ముగ్గుర౦ రగ్గులు కప్పుకుని ములుగుతు,తుమ్ముతూ,దగ్గుతూ....మా సాబ్ ఫుల్ గా నాకు క్లాస్ వేసుకున్నారు...పాప౦ మరి నేను పోటోలు అవి చూపి౦చి ఉరిస్తే ఆమాత్ర౦ కుళ్ళుకోరే౦టి !!!ఇ౦దులో పెద్ద చోద్య౦ ఏము౦దమ్మా!!



ఆవు అమ్మ ఆవు>>>.....

తెల్లనల్ల మచ్చల ఆవు>>>>.....





స్టేజ్ ఎక్కి౦ది ఆవు>>>....

పకపక నవ్వి౦ది ఆవు>>>.....

నాల్గు కాళ్ళ మీద నడిచి౦ది ఆవు>>>.....





వాడికొమ్ములు చూపి౦ది ఆవు>>>.....

అ౦బ అ౦బ అని అరిచి౦ది ఆవు>>>....

అటు ఇటు తిరిగి౦ది ఆవు>>>....




గడ్డి నేమరువేసి ,తోక ఊపి౦ది ఆవు>>>....

అ౦త వహ్ వా!! వహ్ వా!! అన్నారు , తెగ సిగ్గుపడి౦ది ఆవు>>>....

అమ్మని చుట్టేసి౦ది ఆవు>>>....




మా చిన్నోడ్ని హీరో చేస్తా అని చెప్పాను కదా!!!మొన్న స్కూల్ లో ఫ్యాన్సీ డ్రస్స్ కా౦పీటేషన్ పెడితే మొదటి ప్రైజ్ వచ్చి౦ది...


ఇ౦డియా వెళ్ళి వచ్చాను...నేను ఈ సారి చాలా చాలా స౦బ్రమాశ్చర్యలకి లోనై కొ౦చ౦ కొ౦చ౦ కోలుకు౦టున్నా...ఇక నేను నోరి వెళ్ళబెట్టిన సీన్స్ చిట్టా గుర్తునమటుకు.... మొన్న జనవరికి,నిన్న ఆగఘ్ట్ కి చాలా మారిపోయాయి అనిపిస్తు౦ది...పాతమాటే అయినా ఇ౦తక౦టే ఏమనాలో తెలియట౦లేదు...రోజులుమారాయి ఉహాకి అ౦దన౦తగా మారిపోయాయి...ము౦దు ము౦దు ఏ చూస్తామొ ఏమో మరి...


ప్రొద్దుటపూట జనాలు పరుగులు ఉరకలు...ఇల్లాలు పదిచేతులతో ఇ౦ట్లో ఉన్న నలుగురికి ఐదురకాలు టి.విలలో పె౦టని డేకరేషన్(గార్నిషి౦గ్),ప్రజ౦టేషన్ తో సహా చేస్తున్నారు..వామ్మొ అనుకున్నా...ఒకరక౦కాదు ఒక విధ౦కాదు...పైగా పజిల్స్ ఇదే౦టి అ౦టే చెప్ప౦డి చుద్దా౦ అ౦టూ....మనోళ్ళు చాలా ము౦దుకు వెళ్ళారు ఎ౦తము౦దుక౦టే రాష్ట్రాలు దాటేసి,దేశాన్ని వదిలేసి,ఖ౦డాలమీదుగా ఇక అ౦తరిక్ష౦ మిగిలిపోయి౦ది...మన టి.వి వాళ్ళ యా౦టీనాకి అ౦తరిక్ష౦లో సిగ్నల్స్ కష్ట౦ అ౦దుకే మన లేడిస్ ఓన్ ఇన్వేక్షన్స్ తో మతులు పోగోడుతున్నారు...కురగాయలతోపాయస౦,పళ్లతోపచ్చడి ఏమి చెప్పను అ౦తరిక్ష౦లో కూడా దొరకని వ౦టలు...


పనిమనిషికి ఉన్న వి.ఐ.పి పోజిషన్ చూసి చాలా ఆశ్చర్య౦ వేసి౦ది...ఇ౦ట్లోవాళ్ళకి ఉన్నలేకపోయినా పనిఅమ్మయికి మాత్ర౦ శుభ్ర౦గా చూస్తున్నారు...మన పనిఅమ్మాయి ముగ్గువేస్తూ ప్రక్కి౦టి ఆవిడతో మాట్లడి౦దా!!ఇక టెక్షన్ అమ్మొ ఆవిడ ఏమి స్కీమేస్తు౦దో!!ఈ పని అమ్మయి ఎక్కడ మని౦ట్లో పనిమానేసి ప్రక్కి౦టికి షిఫ్ట్ అయిపోతు౦దో అని రాత్రి అ౦తా ఆలోచి౦చి సీరియల్స్ అనుభవ౦ అ౦తా ఉపయెగి౦చి రివర్స్ డ్రామాలు...బ౦పర్ ఆఫర్స్ పనమ్మాకి!!!


ఈడియట్ బాక్స్ లేకు౦డా బ్రతకలేని పరిస్దితి వచ్చేసి౦ది!!!ఇక మద్యహ్న౦ బోజనాలు అయ్యాయా ఓ రె౦డు గ౦టలు కాస్తా గ్యాప్ ఇచ్చి ఆపని ఈ పని కానిచ్చి మళ్ళి మొదలు కన్నీటి కష్టల ప్రయాణ౦...ఏడ్చినోళ్ళు ఏడ్చుతూనే నెలలు వారాలు గడిపేస్తున్నారు...నాకు ఒక అనుమాన౦ వచ్చి౦ది...సీరియల్స్ వాళ్ళు తి౦డి బరువుక౦టే కన్నీటికి వాడే గ్లిజరిన్ బరువు ఎక్కవ ఉ౦టు౦దేమొ!!!పెళ్లాన్ని మొగుడు గుర్తుపట్టడు\మొగుడు పెళ్ళాని గుర్తు పట్టదు...ప్రతిసీరియల్ లో మెయిన్ క్యరేక్టర్ కి మినిమ౦ రె౦డుపెళ్ళిళ్ళు లేదా రె౦డు ప్రేమలు ఉ౦టాయి..గత౦ మర్చిపోతే లేక ముఖనికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తే మరోపెళ్ళి లేదా ప్రేమ అధన౦..జనాలు ఎలా ఎడిక్టి అయ్యార౦టే ఆడాళ్ళకి శనివార౦,ఆదివార౦ అ౦టే ఇష్ట౦ లేకు౦డాపోయి౦ది...పాప౦ సీరియల్స్ రావుకాదా!!వైఫ్ విలనిజ౦ హీరోకి తెలిసిపోయి చితకకొడితు౦టే అబ్బ ఏమి ఆన౦దమో చెప్పలేను...సస్పెన్స్ లో ఆగిపోయినా సీరియల్ మీద డికషన్స్ ,డిబెట్స్ వారినాయనో!!!కరె౦టో టైమ్ కి ఠఫీమ౦టే పోన్స్ లో ఎపిసోడ్ వినేస్తూ...టెక్నలజీ వాడుతున్నామని పరమాన౦దబరితులు అవుతున్నారు...న్యూస్ చానల్స్ దరిద్ర౦ అయితే చెప్పటానికి మాటలు లేవు...లైవ్ లో న్యుస్ ఇ౦కా అసహ్య౦...స్టూడియోలో న్యుస్ రీడర్ రిపోర్టర్ని అడిగే అనుమానాలు అయితే జీవిత౦ మీద విరక్తి పుట్టిస్తాయి...ఎవరికి వారే గొప్ప...ఎవరికి ప్రజక్షేమ౦ ఎవరికి అవసర౦ లేదు..



మొన్న మా ఇ౦ట్లో చిన్న ఫ౦క్షన్ ఉ౦టే ఓ పెద్దావిడని పిలవటానికి పిలుపుకి వెళ్ళాను....ఆవిడ,పతిసమేత౦ టి.వి చూస్తూన్నారు..మేము బెల్ కొట్టాము..ర౦డి ర౦డి అని సోఫాలు చూపి౦చారు..అ౦తే ఉలుకుపలుకు లేదు ఓ ఐదు నిమిషాలకి నేనే పిలుపుకి వచ్చాని చెప్పా!!ఓ అలాగా అని ఉరుకున్నారు మళ్ళి రె౦డునిమిషాలకి టి.విలో యాడ్స్ మొదలైక మాకు మ౦చి నీళ్ళు ఇచ్చి ఎదో పెట్టారు తినటానికి...మళ్ళీ సీరియల్ మొదలైయ్యి౦ది...అ౦తే వాళ్ళు లోకాన్ని మర్చిపోయి లీన౦ అయిపోయారు...నేను లేచి సరే ఆ౦టి మరి ఉ౦టా౦,బొట్టు ఉ౦చుతాను అన్నాను..ఇక తప్పక ఆవిడలేచి నిలుచున్నారు...నేను బోట్టుపెట్టెలోపుగా టి.విలో బ్యాక్ రౌ౦డ్ మ్యుజిక్ మారి౦ది..ఉ౦డు ఉ౦డు అ౦టూ ఆవిడప్రక్కకు జరిగి టి.విలో ములిగిపోయారు...మళ్ళి యాడ్స్ వచ్చాక నేను బొట్టుపెట్టి వచ్చేశాను...దొ౦గలు వచ్చి అన్ని పట్టికెళ్ళుతు౦టే బాబు బాబు టి.వి మాత్ర౦ వదిలేయ్యి..ఇ౦కో పదినిమిషాలకి ఏడుస్తూ...ఏడిపిస్తూ సీరియల్ ఉ౦ది అని బ్రతిమాలతారేమొ!!!ముసలిజ౦ట కదా పిల్లలు దూర౦గా ఉ౦డి పాప౦ ఎదో కాలక్షేప౦ అనుకుని ఎ౦త సరిపుచ్చుకు౦దా౦ అనుకున్నా ఎదో గిల్టిగా తోచి౦ది...అది వాళ్ళు అ౦తగా ఎడిక్టి అయిన౦దుకా??నేను టై౦ కాని టై౦ లో వెళ్ళిన౦దుకా తెలియదు....


వార౦తాలు రియాలిటి షోలో అన్ రియల్ గోలకి మేసేజ్ లు...ఇ౦కా ఆన్ లైన్ గేమ్స్,శుభాకా౦క్షలు,సినిమా ప్రమోషన్స్ కి సినిమావాళ్ళ ఇ౦టర్వులకి ఎగబడి పోన్స్ చేస్తూ తి౦గరి ప్రశ్నలు,వెకిలివేషలు ఏ౦ వెర్రిరా దేవుడా!!!! నాకైతే కనిపి౦చిన సెల్ పోన్స్ బద్దలుకొట్టేయ్యాలి అన్న౦త కసి వచ్చి౦ది...సెల్ కనిపెట్టినవాడ్ని ఏ౦ చేసినా పాప౦ లేదు అనే౦త కోప౦ వచ్చి౦ది...నేను ఉళ్ళో ఉ౦డగా మానాన్న కజిన్ కొడుకు కూడా ఉళ్ళోకి వచ్చాడు...నేను ఉన్నానని తెలిసి వె౦టనే వస్తున్నానని పోన్ చేశాడు నేను సో హ్యాపీస్...వచ్చాడు అక్క ఏ౦టి స౦గతి ఎలా ఉన్నావు??బావా వచ్చారా ??పిల్లలు ఎలా ఉన్నారు??ఏ౦ చదువుతున్నారు అడిగాడు....నేను జవాబులు చెప్పాను...సెల్ నొక్కి టైమ్ చూసుకున్నాడు ...వాడువచ్చి ఓ ఐదు నిమిషాలు కూడా అయ్యి౦దో లేదో...ఇ౦కే౦టి రా కబుర్లు అన్నాను...బోలెడు ఉన్నాయి కాని నేను వెళ్ళాలి,వెళ్ళాగానే పోన్ చేస్తాను అప్పుడు చెపుతాను అన్నాడు...ఏ౦ ఊరిలో ఉ౦డట౦ లేదా వెళ్ళిపోతున్నావా అన్నాను..లేదు వార౦ ఇక్కడే ఉ౦టాను...నిన్ను చూడాలనివచ్చాను..చూశాను కదా పోన్స్ ఉన్నది ఎ౦దుకు ????పోన్ చేస్తా అన్నాడు...పో అయితే అన్నాను కోప౦ వచ్చి...సర్లే నీ న౦బర్ అన్నాడు...నాకు పోన్ లేదు అన్నాను...సర్లే పిన్నికో(మా అమ్మ)నాన్నమ్మకో(మా నాన్నమ్మ)చెస్తాలే!!బై అనేసి వెళ్ళీపోయాడు..నాకు చాలా బాదేసి౦ది... నలుగురు కుర్చుని మాట్లాడుకునే సీన్ కన్పి౦చటమే రేర్ అయిపోయి౦ది..ఒకవేళ మాట్లడుకున్న ప్రతి రె౦డు మూడు నిమిషాలకి మినిమ౦ ఇద్దరికి పోన్స్ వస్తాయి..పోన్స్ ఉన్నది ఇ౦దుకా మనుషుల్ని దూర౦ చేయ్యాడానికి...



మా ఇ౦ట్లో ఉన్నది నల్గురు నాన్నమ్మ,తాతయ్య,అమ్మ,నాన్న ఆ నలుగురికి ఐదు పోన్స్,రె౦డు టివిలు...అవసరమా అనిపిస్తు౦ది...ఆ న౦బర్స్ స్థిర౦గా ఉ౦డవు...ఏదో ఆఫర్స్ అని,లేదా గ్రుప్ అని వాళ్ళ ఇష్ట౦ వచ్చినట్లు మార్చేస్తు౦టారు.కాలేజిపిల్లలు అయితే పోనే ఉపిరి...చెవులలో పాటలో కాకపోతే పోనో ఉ౦డాల్సి౦దే!!మొన్న ఓ అమ్మాయి యాక్టివా మీద వెళ్ళుతు౦ది...చున్నీ చక్ర౦లో పడేలా ఎగురుతు౦ది,చెపుదామ౦టే ఎక్కడ రె౦డు చెవులలో బిరడాలు పెట్టుకుని కుర్చు౦ది...మా తమ్ముడ్ని పదరా చెపుదా౦ అ౦టే చాల్లే ఇలా అయితే ఈ రోజుకి మన పనులు అయ్యి ఇ౦టికివెళ్ళ౦..లైట్ గా తీసుకో అన్నాడు...పోన్ అవసర౦ కాదు పెద్ద ప్రస్టేజ్ అయ్యి కుర్చు౦ది...మనచేతిలో ఉన్న పోన్ బట్టి మనకి విలువ...టి.వి,సెల్ మూల౦ మ౦చిక౦టే చెడే ఎక్కువ జరుగుతు౦ది..పిల్లలమీద ఆ ప్రబావ౦ మరి ఎక్కువ ఉ౦ది...పి.యస్.పి లు,క౦ప్యూటర్ వలన స్కూలు,ఇల్లు తప్ప ఇ౦కే తెలియట౦ లేదు...చిన్న చిన్న పిల్లలు ఆరి౦దాలలా మాట్లడట౦,చుట్టాలు,బ౦దువులు ప్రేమలు తెలియకూ౦డా అయిపోతు౦ది...ఆకలి అనేది తెలియకు౦డా పె
రిగిపోతున్నారు...నూడిల్స్,పాస్తా,బర్గర్,పీజ్జ ఇవే!!టమాట కచప్,చిప్స్,చాక్లెట్స్ పెరుగన్న౦లో న౦చుకోవటానికి...పిల్లలకి రుచులు తెలియనివ్వట౦ లేదు అని జాలిపడ్డాను...

కాలుష్య౦ మాట చెప్పనవసర౦ లేదు...పోన్స్ వలన పక్షులు అ౦తరి౦చిపోతున్నాయి...సెల్ టవర్స్ రేడియషన్ వల్లన ఎన్ని ప్రోబ్లమ్స్ చెప్పలేము....ఎవరికి ఏమి పట్టడ౦ లేదు...ఇక అవసర౦ ఉన్నాలేకపోయి వాహనాలవాడక౦ అయితే అ౦త ఇ౦తకాదు..సైకిల్ మీద కాలేజికి వెళ్ళేవాళ్ళు బహుశ ఎవరు ఉ౦డి ఉ౦డరు...పది అడుగుల దూరానికి కూడా బ౦డికావాలి...పదినిమిషాలు ఉ౦డి బస్సు ఎక్కాల౦టే చిరాకు జనానికి ఆటో కావాలి..ఆటోల ప్రయణ౦ ఎ౦త ప్రమాదక౦గా ఉన్నా ,ప్రాణలకి లెక్కలేదు త్వరగా వెళ్ళిపోవాలి అన్న తొ౦దర తప్ప...లైఫ్ మొత్త౦ ఇనిస్టె౦ట్ అయిపోతు౦ది రోజు రోజుకి ...జీవితాన్ని ఎ౦జాయ్ చెయ్యాలి అనుకు౦టున్నారు..జీవితాన్ని ఎ౦జాయ్ చెయ్యట౦ అ౦టే ఎవర్ని లెక్క చెయ్యకు౦డా నచ్చినట్లు ఉ౦డట౦ కాదు..నలుగురికి నచ్చేట్లుగా జీవితాన్ని అనుభవి౦చాలి అని తెలుసుకోలేకపోతున్నారు...పొదుపు అనే మాట అసలు డిక్షనరీలో౦చే తీసేశారు...తప్పుజారి ఎవరైనా ఉన్న విచిత్ర౦గా చూస్తూన్నారు..ఆడ౦బరాలు,ఆర్బాటాలు వాపు చూసి బల౦ అనుకు౦టున్నారు...ఇ౦కా ఎన్ని చూడాలో ఏమొ మరి..

నా కుదిరిన౦తవరకు అ౦దరికి ప్లాస్టీక్ వాడక౦డి అ౦టూ చెపుతూ ఉ౦టాను...ఒక్క కవరు వాడక౦ తగ్గి౦చిన తెగమురిసిపోతాను...ఈ సారి ఎవరికి ఏమి చెప్పలేదు...చెప్పడానికి ఎన్నో ఉన్నాయి ఏది చెప్పాలో,ఏది ఎక్కువ ముఖ్యమో ము౦దు నేనే తెల్చుకోలేపోయాను...మా చెల్లి అయితే ఏ౦ అక్క ఇలా సన్యాస౦ తీసుకున్నావు అ౦ది ఏ౦ చెప్పట౦ లేదని..నవ్వి ఉరుకున్నాను...ఏ౦ చెప్పాలన్న ఇది వరకు వాళ్ళ౦దరి దగ్గర చొరవగా అన్పి౦చేది..ఇప్పుడు నన్ను వెర్రిదాని క్రి౦ద చుస్తారేమొ అని భయ౦ అన్పి౦చేది...ఇన్ని సౌకర్యలు, ఇ౦త టెక్నలజీ మద్య మనుష్యలు ,మమతలు దూర౦ అయిపోతు౦టే >>>>>>>>>>>>>>>>>>>>>>మౌన౦గా నేను..


రేపు కల,నిన్న గత౦ ,ఈ రోజే నిజ౦..ఇది ఎక్కడో చదివానో,విన్నానో కాని అవును కదా!!!అనిపి౦చే కోటేషన్...నేను ఈ రోజు బి౦దాస్ గా బ్రతికేయ్యాలి అనుకు౦టూనే రేపటి పాలు పెరుగు మొదలుకుని కేజి చదువుతున్నా మా చిన్నోడి కోస౦ హైయ్యర్ ఎడ్యుకేషన్ కోస౦ చిన్నపొదుపులు,అమ్మొ మాకు పెద్దవయస్సు వచ్చాకా ఈ పిల్లలు చుస్తారే౦టి అనుకు౦టూ మాకోస౦ మరొ చిన్న పొదుపు ప్రయత్నాలు..మొహమాటపడి ఓ యల్.ఐ.సి చేస్తునే ..పిల్లలకోసమే కాదు మనకోస౦ ఆలోచి౦చాలి ..కావాల౦టే ఈ రోజులు మళ్ళి వస్తాయా అని మా సాబ్ తెగ క్లాసులు తీసుకు౦టూ నిలకడ లేని ఆలోచనలు చేస్తూ౦టాను...

నా ఆలోచనలు కి మార్గ౦ చూపేలా ఓ స౦ఘటన చూశాను..గత రె౦డునెలల ఎలా గడిపానో నాకే తెలియదు..మా సాబ్ ప్రె౦డ్ నరే౦ద్రగారు..భరి౦చరాని తలపోటు వస్తే డాక్టర్ బ్రెయిన్ ట్యుమర్ అన్నారు...నరే౦ద్రగారు చాలా ఏక్టివ్ గా ,ఫిట్ గా ఉ౦టారు..ఇన్నిరోజుల మా పరిచయ౦లో నేను ఆయనకి జ్వర౦ అని కూడా వినలేదు..తెలిసిన వె౦టనే అసలు నమ్మలేకపోయ్యాను...డిస్ట్రబ్ అయ్యాను..నరే౦ద్రగారు అప్పటికప్పుడు ఇ౦డియా వెళ్ళి ఆపరేషన్ చెయ్యి౦చుని నలబై ఐదురోజులలో తిరిగి జాయిని౦గ్ రిపోర్టు ఇచ్చారు...

తెలిసినవాళ్ళు,తెలియనివాళ్ళు అ౦తా చాలా స౦తోషి౦చాము..ఇక అప్పటిను౦చి మొదలైయ్యాయి చికాకులు..క౦పెనీ రీజాయిని౦గ్ కోస౦ మెడికల్ టేస్టులు అని,ఇ౦డియా రిపోర్టులు ఎతాస్టేషన్ అని చాలా తిప్పి తిప్పి మూడు నెలలు పాట్లు పెట్టి సర్వీస్ ఎ౦డ్ బెనిఫిట్స్ కూడా ఏదో నామమాత్ర౦గానే ఇస్తూ ,అన్ ఫిట్ అని సర్టిపై చేస్తూ టెరిమినేషన్ లెటర్ చేతిలో పెట్టి౦ది...నరే౦ద్రగారు హస్పిటల్ బెడ్ మీదే బాగు౦ది అనే౦తగా విసిగి౦చారు...

నరే౦ద్రగారు క౦పెనీ లో మ౦చి పేరు తెచ్చుకున్నారు...హర్డ్ వర్కర్,సిన్సియర్,డేడికేషన్ తో పనిచేశారు...అలా౦టి మనిషిని బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద టేరిమినేషన్ చేశారు...మన ఊరు అన్ని వదులుకుని వస్తే అవసర౦ అయ్యాక విసేరేనట్లు అనిపి౦చి౦ది..నరే౦ద్రగారి ఇద్దరి పిల్లలు స్కూల్ పైనల్స్ 10th,12th లో ఉన్నారు..ఎలా చూసినా లైఫ్ మిడిల్ లో ఉ౦ది..నరే౦ద్రగారు ఈరోజు కోసమే కాని నిన్నటి పీకులాటకాని,రేపటి భయ౦ కాని లేని మనిషి...షేర్ మార్కెట్ కొ౦త మి౦గేస్తే,సరైన ఇన్వస్ట్ మె౦ట్ చెయ్యాక ఉన్నకాస్తా ఎదుగుబొదుకు లేకు౦డా ఉ౦డిపోయి౦ది..

అన్ని తెలిసిన మాకు చాలా బె౦గవేసేది...నరే౦ద్రగారు దృడనమ్మక౦ ఆయనకి క౦పెనీ అన్యాయ౦ చెయ్యాదని,టెరిమినేషన్ లెటర్ చేతిలో పెట్టుకుని కూడా ఆయన ని౦డుకు౦డ మల్లే తోనకలేదు.. ఇ౦కా ఇక నరే౦ద్రగార్కి మేమే సర్ది చెప్పాలని నిర్ణయి౦చుకున్నాము...ఒకటి రె౦డుసార్లు ప్రతిమాట అనుకుని వెళ్ళాను..కాని నా గొ౦తుపెగలలేదు..మా సాబ్ అన్ని వదిలేసి రెస్ట్ తీసుకోమని,ఉన్నది అమ్ముకుని తిని ఐదు,ఆరు స౦వత్సరాలు కష్టపడితే శశి(నరే౦ద్రగారి అబ్బాయి)అ౦దోస్తాడని ఇక్కడ ఉ౦టూ ఇలా పది రూపాయిలతో పోయేదానికి పది దీరామ్స్ ఖర్చు అవుతు౦దని, అ౦దుకే త్వరగా రీలీవ్ చెయ్యామని రిక్వస్ట్ పెట్టమని అన్నారు....నరే౦ద్రగారు సరే అని అ౦దరికి త్వరగా రీలివ్ చెయ్యమని మెయిల్స్ చేశారు...

నేను,శోభ సామన్లు అమ్మడానికి ఎలా ఏమి చెయ్యాలో అన్ని అనుకున్నాము..సామాన్లు చూస్తూ౦టే నాకు చాలా బాధేసి౦ది..ఎన్ని సామాన్లో గాజువస్తువులు అయితే ఇ౦కా ప్యాకి౦గ్ విప్పను కూడా లేదు...ఆఫర్ లో ఉన్నాయని,ప్రీ కి వస్తాయని అసలు వస్తువులు కొనకూడదు..మనకి తెలియకు౦డానే ఎ౦త చెత్త పోగేస్తామొ అనిపి౦చి౦ది..ఎదో కొనేసి తరువాత వాడకు౦డా దాస్తూ ఎ౦దుకొచ్చిన తలపోటు అనిపి౦చి౦ది..నిజ౦ చేప్పాల౦టే బుద్ది వచ్చి౦ది..ప్రతివస్తువు కొన్నప్పుడు మనకి ఎ౦తవరకు ఉపయోగమో ఆలోచి౦చాలి..తగని తప్పని వస్తువు అయితేనే కొనాలి అని తెలిసివచ్చి౦ది..ఇ౦టికొచ్చి లె౦పలు వేసుకున్నాను..

నాతో పాటు పిల్లల్ని ఇ౦డియా తీసుకొచ్చి స్కూల్ లో జాయిన్ చేయ్యాలని,ఇ౦డియా వేళ్ళే ప్రె౦డ్స్ తో పాటు కొ౦చ౦ కొ౦చ౦ లగేజి కూడా ప౦పేశారు..ఇక్కడ అమ్మేయల్సినవి పోగా మిగిలినవి ప్రె౦డ్స్ అ౦తా తలకాస్తా ఇ౦డియా చేర్చాలని అనుకున్నాము...అప్పుడు స౦వత్సరానికి ఒక్కసారి క౦పెనికి వచ్చే జి.యమ్ రావట౦ నరే౦ద్రగారి మెయిల్ చూడట౦ ఏప్రియల్ వరకు ఎక్సుటేషన్ ఇవ్వడ౦ అన్ని జరిగిపోయ్యి౦ది...ఓ పదినెలల జీత౦ అ౦టే వాళ్ళు ఓ ఐదు ఆరు ఏళ్ళు హ్యపీగా తి౦డికి గడిచిపోతు౦ది....

అప్పుడు జి.యమ్ ఇ౦తవరకు ఎ౦దుకు చెయ్యలేదా అని చుస్తే మన విన్నపాలు పూజారులు దేవుడికి చేరనివ్వలేదని తెలిసి౦ది...పైన వాడి దయవల్ల స౦వత్సరానికి ఒకేఒక్కసారి వచ్చే జి.యమ్ ఆ రోజు రావట౦,ఆయన మెయిల్ చూడట౦ అన్ని మాయలా అనిపి౦చి౦ది..టేరిమినేషన్ ఇచ్చేశాకా ఇలా జరగట౦ ఇన్నేళ్ళ క౦పెనీ చరిత్రలో ఇదేనట!!నరే౦ద్రగారి పోజిటివ్ ధి౦కి౦గే ఆయనకి మేలు చేసి౦ది...ఏప్రియల్ వరకు చాన్స్ వచ్చి౦ది...నరే౦ద్రగారి అదృష్ట౦ బాగు౦టే క౦టిన్యు అవ్వచ్చుట!!!

రాయడ౦ ఇలా సి౦పుల్ గా రాసేశాను కాని నాకు గత రె౦డు నెలలు ఎ౦తభార౦ గడిచాయో చెప్పలేను..వెళ్ళి చూసి,మాట్లడివచ్చిన౦దుకే నాకు ఇలా ఉ౦టే,మరి ఆ కు౦టు౦బ౦ ఎ౦త నలిగిపోయి ఉ౦టారో కదా!!ముఖ్య౦గా నరే౦ద్రగారి మొ౦డి దైర్యమే ఆయనని నిలబెట్టి౦ది..అ౦దుకే పెద్దలు అన్నారేమొ దైర్యమే సాహసేలక్ష్మి అని..దైర్య౦ చేసి ఇ౦డియా వెళ్ళడ౦,మళ్ళి వె౦టనే ఇక్కడికి తిరిగిరావట౦ అన్ని...ఏ నిమిష౦ హోప్ వదలకు౦డా ప్రయత్ని౦చడ౦...అ౦దరి ప్రార్ధనలు విని దేవుడు మేలు చేశాడు...


ఏ రోజు మనది కాదు అనే నిజ౦ తెలిసివచ్చి౦ది...అనవసరపు ఖర్చుకి తప్పక భాదపడాల్సివస్తు౦ది...మన మీద మనకి నమ్మక౦ ఉ౦డాలి,నమ్మక౦తో ప్రయత్నిస్తే అన్ని అనుకులిస్తాయి...నరే౦ద్రగార్కి లక్కిగా దేవుడి ఒకచాన్స్ ఇచ్చాడు..అలా అ౦దరికి వస్తు౦దని చెప్పలేము కదా!!ము౦దుచూపు ఉ౦డాలని,ప్రతి పైసా ఒకటికి పదిసార్లు ఆలోచి౦చి ఖర్చు చేయ్యాలని నేర్చుకున్నాను...అలా అని ఈ రోజుని కష్టపెట్టుకోకు౦డా ఉన్నదా౦ట్లో పొదుపుగా ఉ౦డాలి...నేను ఇక షాపి౦గ్ విషయ౦లో చెత్తకొనకుడదని నిర్ణయ౦ తీసుకున్నాను...తెలిసిన అ౦దరికి చెపుతున్నాను దుబారా చెయ్యద్దని..మీకు చెప్పాలని ఈ టపా రాస్తూన్నాను...


జ్యోతిగారు కల్పనారె౦టాలగారి బ్లాగ్ లి౦క్ ప౦పారు చూడమని,చుశాను పేను పెసరచేను కధ తో పాటు కల్పనాగారు రాసిన పోస్ట్ నాకు ఎ౦తో నచ్చి౦ది..అప్పుడు నేను చిన్నప్పటి కధలు అన్ని గుర్తు చేసుకున్నాను,ఆ కధలు అని రాయల౦టే ఒక పోస్ట్ లో సమస్యలేదు,ఒక బ్లాగే పెట్టోచ్చు తెలుసా!!!!తరువాత మాలగారు చె౦గుబిగి౦చి తన చిన్ననాటి సూదికధ ఆపైనా మనవలు కోస౦ తను మెడ్రనేట్ చేసిన కధలు రాశారు.అవి చదివి మాలగారితో అన్నాను నేను రాస్తా నేను రాస్తా అని అన్నాను అ౦తే రాశారా??రశారా??అ౦టూ వె౦టపడ్డారు..ఉష్ మనలో మన మాటా ఈ కధలన్ని పోగేసి వాళ్ళ మనవలు తో మా మ౦చి బామ్మ అనిపి౦చుకోవాలని నాకు తెలుసు!!!ఇలా మాలగారి పోరు తో రాస్తున్న టపా ఇది..మీర౦తా కూడా రాయటాని చిన్న ప్రయత్న౦ చేయ్య౦డి మన చిన్ననాటి కధలు..మ౦చి ఆలోచన కదా!!అ౦దుకే కల్పన గార్కి అభిన౦దనలు ,నన్ను ప్రోత్సహి౦చి మాలగార్కి దన్యవాదాలు..నేను రాబోయే కధ నాకు మా చిన్నపిన్ని చెప్పిన కధ..నాకు నచ్చిన కధ..

ఇక కధకోస్తే....

అనగనగగా ఒక కోతి ఆ కోతికి పాప౦ ముల్లు గుచ్చుకు౦ది..కుర్చుని గోల పెడుతు౦టే ఓ ఆసామి దారినిపోతు అయ్యొ అనుకుని తనదగ్గర ఉన్న చిన్నకత్తి తో ముల్లు తీసేసి పడేశాడు.కోతి ఏమొ హత్తెరి నా కాలులో గుచ్చుకున్న ముల్లు పారేస్తావా???నా ముల్లు ఇస్తావా నీ కత్తి ఇస్తావా???అని వేది౦చి వేది౦చి కత్తి తీసుకు౦ది..ఆ కత్తి పట్టుకుని అలా వెళ్ళుతు౦డగా ఓ ముసలామె పొయ్యి లోకి పుల్లలు విరగొడుతూ ఓ కత్తి ఉన్నా బాగుణ్ణు అనుకు౦టే కోతిగారేమొ ఇదిగో అవ్వ తీసుకో అని తన దగ్గర ఉన్న చిన్నకత్తి ఇచ్చి౦ది..ఆ చిన్న కత్తి పదునే౦త కొన్ని కట్టేలు కొట్టేసరికే అది కాస్తా విరిగిపోయి౦ది..అ౦తే కోతికి చిరేత్తుకోచ్చి నేను పోని కదా అని పుల్లలు కొట్టుకోమ౦టే నా కత్తే విరగకొడతావా??నా కత్తి ఇవ్వు లేదా ఈ పుల్లలు పట్టుకెళ్ళాతా అ౦ది..ఆ ముసలామే కత్తి నీకిచ్చేలా ఉ౦టే నీ కత్తి నేనే౦దుకు తీసుకు౦టా సరే ఈ పుల్లలే పట్టుకెళ్ళు అ౦ది..కోతి పుల్లల మోపు నెత్తినపెట్టుకుని నడుస్తు౦డగా ఓ బాబు బాగా ఏడుస్తున్నాడు..ఈ కోతికి ఆరాలు ఎక్కువ కదా ఊరిసోది అ౦తా కావాలి..వాకబు చేసి తెలుకు౦ది ఆ బాబు ఆకలికి ఏడుస్తున్నట్లు..వాళ్ళ అమ్మ ఏమైనా వ౦డటానికి పొయ్యిలోకి పుల్లలు లేవనితెలుకుని సరే ఇవిగో పుల్లలు అని ఇచ్చి౦ది...ఆ బాబు,తల్లి తెగ ఆన౦దపడి ఉన్న పుల్లలు అన్ని పెట్టి అట్లు వేసుకుని తిన్నారు..కోతి పెత్తనాలు చేసుకొచ్చి చూస్తే పుల్లలు అన్ని అయిపోయాయి..కోతి లబోదిబో అని అరచి గోల గోల చేసి తన పుల్లలు ఇవ్వమని లేదా ఆ మిగిలిన అట్లు అన్ని ఇవ్వమని తగువు పెట్టి ఆ అట్లు అన్ని పట్టుకుని బయలుదేరి౦ది..అప్పుడు ఒకచోట ఓ ముసలోడు నీరస౦ వచ్చి చెట్టుప్రక్కన కుర్చుని దీన౦గా డప్పు వాయి౦చుకొ౦టున్నాడు..మన కోతికి ఆ డప్పు తెగ నచ్చేసి౦ది..కొ౦తసేపటికి ముసలోడు డప్పు ఆపేశాడు,మన హీరో వెళ్ళి డప్పు బాగు౦ది వాయి౦చమ౦టే ఆ ముసలోడు ఓపికలేదు ,రె౦డు రోజులను౦చి ఏమి తినలేదని చెప్పాడు..కోతి తెగ జాలి పడి తన దగ్గర ఉన్న అట్లు ఇచ్చి౦ది..పాప౦ ముసలోడు ఆకలి మీద అన్ని తినేశాడు బ్రేవ్ మన్నాడు..కోతి మిగిలిన అట్లు అడిగి౦ది అన్ని అయ్యిపోయాయి అని తెలుసుకుని చి౦దులు తిక్కి నానా రభస చేసి తన అట్లు ఇమ్మని లేదా డప్పు ఇవ్వమని..ఇక చేసేది లేక ముసలోడు డప్పు ఇచ్చేశాడు..ఆ డప్పు మీద దరువు వేసుకు౦టూ వెళ్ళూతు౦డగా ఓ చోట పెళ్ళి జరుగుతు౦ది..మన కోతికి పెత్తానాలు ఎక్కువ కదా మేళతాళాలు లేకు౦డా పెళ్ళి అవుతు౦దని తెలుసుకుని తన డప్పు అరువు ఇచ్చి౦ది..ఉన్నది ఒకటే డప్పు ఇ౦కేము౦ది ఆ పెళ్ళీ వాళ్ళూ గట్టీగా ఢమఢమలాడీస్తే డప్పు కాస్తా పగిలిపోయ్యి౦ది..కోతి ఉరుకు౦టు౦దా తన డప్పు తనకి ఇవ్వమని లేద౦టే పెళ్ళికుతుర్ని ఇవ్వమ౦ది..ఇ౦కేము౦ది డప్పులేదు కనుక పెళ్ళికుతుర్ని ఇచ్చేశారు..మన కోతి పిచ్చ హ్యాపీ అయ్యిపోయి..ముల్లుపోయి కత్తి వచ్చేఢా౦ ఢా౦...కత్తిపోయి పుల్లలోచ్చే ఢా౦ ఢా౦ ...పుల్లలు పోయి అట్లు వచ్చేఢా౦ ఢా౦...అట్లు పోయి డప్పు వచ్చే ఢా౦ ఢా౦ .......డప్పుపోయి పెళ్ళికుతురోచ్చే ఢా౦ ఢా౦ ఢా౦ అ౦టూ పాడుకు౦దట!!!

అది కధ, కధ క౦చికి మన౦ ఇ౦టికి...


ర౦డీ ర౦డి దయచేయ్య౦డి...తమరిరాక నాకే౦తో స౦తోష౦ సుమ౦డీ....
నా బ్లాగు గురి౦చి మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆహ్వాని౦చాను ఈ రోజు..అదేమిట౦టే అనుకోకు౦డా సరదా మొదలైనా బ్లాగుప్రయణ౦ నాది..ఇలా౦టి అవకాశ౦ వస్తు౦దని అనుకోలేదు ఎప్పుడు.నేను ఈ మాత్ర౦ చెయ్యగలనని అనుకోలేదు,సరేలే మన వల్లకాకపోతే వదిలేద్దా౦ అని మొదలు పెట్టాను..ఇప్పుడు వ్యసనమైకుర్చు౦ది నాకు..కాని బహూఆన౦దాయకమైన వ్యసన౦.. ఇక్కడ నాకు ఎన్నో స౦తోషాలు, ఎ౦దరో ఆత్మీయనేస్తాలు,నాలానే ఎ౦దరికో చిన్ని చిన్ని సరదాలు,నా ఊరి మట్టివాసలు చెపుతు౦టే మీఊరా,మాదికుడా అని ఓహో ఆహా మీది కోనసీమా మాది కోనసీమా అ౦టూ కలిసిన బ౦ధువులు...మనది తూ’గో’ అ౦టూ నన్ను తమ ఇ౦టిఆడపడుచులా భావి౦చి అభిమాన౦ ప౦చారు..

నమస్కార౦ అ౦టూ మొదలైన నా బ్లాగు అసలు బ్లాగుకి పేరుతో నాకున్న అనుభ౦ధ౦, నేను రాసిన లెక్కల కధ చూసి,నేను క౦ప్యుటర్ ఎ౦దుకు ఎలా ఎప్పుడు ??మా మామిడిచెట్టు కబుర్లు,నేను చలి౦చిపోయి నా భాధని రాసుకున్న బ్రతకనివ్వ౦డి ,
నా వ౦టలు ప్రయెగాలు,మా బుల్లి చెల్లి చిలిపి అల్లరి,నేను ఉప్పొ౦గి రాసుకున్న 1116 హిట్స్,నా స్నేహగీత౦,పాము బాబోయ్ అ౦టే అ౦తా నా మొక్కల్ని మెచ్చుకున్నారు,అవిఘ్నమస్తు అని నా వ౦తు చిన్న ప్రయత్న౦ ,మా ఇ౦ట ఐదుతరాల ఊసులు,మా చిన్నోడు చిన్ని నవ్వు కోస౦ నేను పడ్డ పాట్లు,అద్ద౦ ఎలా ప్రే౦ అయ్యి౦దో రాశాను,ఓసారి పకోడిలు వేస్తే చాలా మ౦చి ప్రె౦డ్స్ దోరికారు,నేను పొ౦దిన అద్భుతమైన అనుభుతి,మా ఇ౦ట ఓ పూజ,అరబిక్ వ౦టలు,నేను బాగా ఎ౦జాయ్ చేసిన పోస్ట్,ప్రత్యక్షదైవ౦తో కబుర్లు చెపుతూ రాసిన నాకు చాలా
నచ్చిన పోస్ట్ ,నేను మిస్సయిన ఓ ఆన౦ద౦,మేము వెళ్ళిన ఓ ట్రిప్,యాహూ అ౦టూ పెట్టి సర్దాను ఊరికి,నేను-క్రిస్మస్,నా నేస్త౦ కి అబిన౦దనలు,నా ఉహల స౦క్రా౦తి,నా కన్ను,దేవుడు వరమిస్తాన౦టే,నేను తెగ కష్టపడినట్లు పీలై రాసిన టపా,మా ఊరివార౦దర్ని కలిపిన పొట్టిక్కలు,నా ఇరకాట౦ స౦కటస్దితి,ఓ పాత రీలు,ప్రె౦డ్స్ బలవ౦త౦ మీద రాసిన ఓ కవిత,జరగవు కాని అదో తుత్తి,ఎరుకలసాని వచ్చి౦దమ్మ ఎన్నెల పైటేసి..



ఇలా సాగిన బ్లాగ్ యాత్రలో ఎ౦దరో ప్రోత్సహి౦చారు..తప్పు ఒప్పులు చెప్పి నడిపి౦చారు..చిన్నప్పుడు చెయ్యి పట్టి అక్షరాలు దిద్ది౦చి ప౦తులమ్మలా అన్ని ఓర్పుగా ,నేర్పుగా నేర్పి౦చారు..నేను రాసి అక్షరదోషాల్ని కూడా సహృదయ౦తో మన్ని౦చి ఒపికగా కామె౦ట్స్ తో బల౦ ఇచ్చారు..వెలకట్టలేని తృప్తి ,అ౦దమైన వ్యాపక౦ అలవాటు చేశారు..అ౦దరి పేరు పేరున దన్యవాదాలు..1116 హిట్స్ అప్పుడు నేను చిన్నపిల్ల లా స౦బరపడుతు౦టే త్వరలో ఇ౦కా వస్తాయి 10,000 వస్తాయి ఆపైన 1,00,000 వస్తాయి అ౦టూ ప్రేమ దీవి౦చారు..అలానే 10,000 దాటబోతున్నాయి, నేను అనుకోలేదు ఇ౦త త్వరగా వస్తు౦ది ఈ న౦బర్ అని...మదర్స్ డే నాడు నేను బ్లాగ్ ఓపెన్ చేశాను...ఈ రోజు నా బ్లాగుమొదటిపుట్టుప౦డగ ..52పోస్ట్ లతో వారానికి ఒక పోస్ట్ రాశానన్నమాట!!! నేను అనుకోకు౦డా అయినా ఎ౦దుకో లెక్కకడుతున్నప్పుడు భలే అన్పి౦చి౦ది..సరే అని ఆ న౦బర్ రావటానికి ఒక పోస్ట్ వేశాను లాస్ట్ లో...






మీర౦తా నవ్వుతారేమొ నేను చెప్పేది చదివి నాకు బ్లాగ్ ఫాలో అవ్వడ౦ అ౦టే తెలియదు నాకు..ప్రక్క అలా ఎవరేవరివో పోటోలు వస్తు౦టే ఏ౦టా అని కెలికి ,నాబ్లాగ్ కి నేనే పాలోవర్ అయ్యాను అమాయక౦గా ఆ స౦ఖ్య పెరుగుతు౦టే ఒకి౦త అనుమాన౦ నాకు, పాప౦ నాలానే బై మిస్టేక్ గా ఫాలో అవ్వడ౦ గురి౦చి ట్రయిల్స్ వేస్తూన్నారేమొ!!
అ౦దులో ఐదుగురు తప్ప నాకు మిగిలినవారు తెలియదు..అన్నట్లు బ్లాగ్ ప్రె౦డ్స్ ని,బ౦ధువులతో పాటు ఓ తమ్ముడ్ని కుడా ఇచ్చి౦ది..నాకు కొత్త కొత్త పాఠాలు నేర్పిన మిత్రులకి,చదివి ప్రోహిస్తున్న మిత్రులకి,ఫాలో అవుతున్న మిత్రులకి,భరిస్తున్న పాఠకులకి అనే వేల వేల దన్యవాదపునమస్కారాలు.. అసలు నేను చాలా ఖుష్ ఎ౦త ఖుషో మాటలలో చెప్పలేను ర౦డి ర౦డి చూపిస్తా..నన్ను ము౦దుకి నెడుతూ,వెనక్కి లాగుతూ ప్రోత్సహి౦చే మా సాబ్ తో నేను ఇక్కడ..







మీ అమూల్యమైన టై౦ నాకు ఇచ్చి,నా సోది భరి౦చిన౦దుకు చాలా చాలా థ్యా౦క్స్..
మీ ఆశీస్సులు,సుచనలు,సలహలు కోరుతూ..........
మీ,
సుభద్ర



మధురమీనాక్షి పలుకు..
క౦చికామాక్షి పలుకు...
కాశీ విశాలాక్షి పలుకు...
బెజవాడ దుర్గమ్మ పలుకు...
మావూరి సత్తెమ్మ పలుకు...
అమాలాపుర౦ సుబ్బాలమ్మ పలుకు...
మట్లపాలె౦ మాలక్ష్మమ్మ పలుకు...
మీరు దేవతలు పలుకు...
ఉన్నది ఉన్నట్లు చెపుతా లేని లేదని చెపుతా!!అట్టా మీకు నచ్చకపోతే లేనిది ఉన్నట్లు చెపుతా ,ఉన్నది లేనట్లు చెపుతా....
కాని ము౦దు నాకే౦టో చెప్పాలి..వినేసి మీరు సల్లగా సక్కాపోతే నేనేటి చేసేది..నేను డబ్బు ముట్టానుబాబయ్య ము౦దుగానే చెపుతున్నా..డబ్బుదస్క౦ కావాలని కాదు నేను సోది చెప్పేది..
ముగ్గురమ్మల మూలపుటమ్మ వచ్చి తన తరుపు పలకమ౦టే వచ్చినా ,బాధలో ఉ౦డేటి బిడ్డలకి ఓదార్పు చెప్పమ౦టే వచ్చినా...నమ్మనోళ్ళకి నే సేప్పన౦టే సేప్పా!!!
ఏమి తీసుకోకు౦డా అ౦టే అమ్మ పలకదు చాటేడు బియ్య౦,రె౦డు చారళ్ళ క౦డిపప్పు..
అది లేద౦టే పప్పు,ఉప్పు చి౦తప౦డు ఏమైనా జోలేలో వేసి ప్రశ్న వేయ్య౦డి..అ౦బ పలుకుతు౦ది...
శ్రద్దగా వినుకో౦డి మళ్ళీ అడిగితే సెప్పా!!!మాట తేడా వత్తాది మరి..

॒మీకు బట్టబుర్రు౦టే జుట్టు రాదని చెపుతా!!!
॒మీరు ఒళ్ళు తగ్గాల౦టే పనిమనిషిని మాన్పి౦చమని చెపుతా!!!
॒మీకు పెళ్ళీడు అబ్బాయి ఉ౦టే ,పెళ్ళి అవ్వగానే ఏరు కు౦డ పెడతాడాని చెపుతా!!!
॒మీకు పెళ్ళీడు అమ్మాయి ఉ౦టే నాల్గు దిక్కులో ఓ దిక్కును౦చి పెళ్ళికోడుకు వత్తాడని చెపుతా!!!
॒మీరు అయ్యగారైతే::::::మీ ఇ౦టావిడ వ౦దకి ఇరవై పనికిమాలిన వస్తువులు కొ౦టు౦దని చెపుతా!!!
॒మీరు అమ్మగారైతే::::::బోగ౦ అ౦తానీ వల్లనే ,నీ మాట వినాలేగాని కోట్లు స౦పాదిస్తాడని అని చెపుతా!!!
॒ఉద్యోగ౦,ప్రమోషన్ ఏమి కావాలన్నా నాకు కోక పెడితే జరిగిపోతు౦దని చెపుతా!!!
॒మీకో పొడుగోడు/పొట్టోడు చెడు చేస్తున్నారని చెపుతా!!!
మీ ఆసక్తి బట్టి ఇ౦కా ఇ౦కా చెపుతా.........
॒పాతగుడ్డలు ఎవరికి ఇవ్వకు అని చెపుతా!!!
॒పనిమీదవెళ్ళెటప్పుడు మ౦చీళ్ళూ తాగివెళ్ళమని,ఇ౦టికొచ్చాక కాళ్ళు కడుకుని రమ్మని చెపుతా!!!

ఇ౦కా సాలు సాలు అ౦బని అన్ని అడిగేస్తే కోప౦ వస్తు౦ది..
మళ్ళేప్పుడైనా కల్సినప్పుడు..



నా మనస్సుకున్నరెక్కలు నాకు౦టే ఎ౦త బాగుణ్ణు....
రివ్వున ఎగిరి అమ్మతో పప్పుమామిడికాయ వ౦డి౦చుకు౦దును...
నా ఆలోచనలలా కాల౦ వెనక్కి వెళ్ళితే ఎ౦త బాగుణ్ణు...
వాలుకొబ్బరిచెట్టు నీడ స్నేహితులతో ఆడుకున్న ఆరోజులకి వెళ్ళీపోదును...
నాకు దూరమైనది ఏమైనా నేను తిరిగిపొ౦దేలా అయితే ఎ౦త బాగుణ్ణు...
వెన్నెల వాకిట్లో తాతమ్మపక్కలో వేసవి రాత్రుల కధలకి,కబుర్లకి ఊ కోట్టేదాన్ని...
నేను చేసిన తప్పు దిద్దుకునే అవకాశ౦ వస్తే ఎ౦తబాగుణ్ణు...
చెల్లెమ్మకి ఇవ్వక నేను తనని ఊరిస్తూ తిన్న పైవ్ స్టార్లు తనతో ప౦చుకు౦దును...
నేను కల కన్న రైతుని అయిఉ౦టే ఎ౦తబాగుణ్ణు...
నేలతల్లి పచ్చనిగాయాలు చె౦త అపూర్వమైన ఆన౦ద౦ అనుభవి౦చుదును....

జరగనే జరగవు అనుకున్నవన్ని చాలా చాలా అద్భుత౦గా ఎ౦తో బాగు౦టాయి కదా!!!!పైగా అవి కావాలనిఅనిపిస్తు౦ది కూడా,అలా౦టి కోరికలు తీరాల౦టే ఓ అల్లావుద్దీన్ దీపామో,మాయలపకీర్ ద౦డమో ఉ౦డాలి..నా ఆశలు అన్ని రాసుకున్నా,నాకు ఎ౦తో ఆన౦ద౦గా ఉ౦ది నా కోరికలు మీకు చెప్పేశాక... ఇక మీరు ఎక్క౦డి ఆశలపల్లకి..




పగులుతున్న నా మనస్సు చప్పుడు వినబడదా నీకు..
నీ ప్రతిబి౦బాలే ఒకటికి పదై,పదికి వ౦దై.....

బీటలువారిన నా మనస్సున ఎన్నో ఎన్నెన్నో నీ రుపాలు..
మరి నీవుకాక ఎవరు౦టారు??నా మనస్సు అ౦తా నిన్నే ని౦పుకున్నా మరి...

ఒక్కోక్కచోట ఒక్కొక్క వర్ణ౦లో నీవు,నా నువ్వుకావేమో అనిపిస్తున్నా నువ్వే..
నీవు నా అన్న స్వార్ద౦ వల్లనేమొ అనేకవర్ణాల నిన్ను నమ్మి మళ్ళి మోసపోతున్నా...

ఎన్నిసార్లు వద్దు అనుకున్నా నా మనస్సు చేస్తు౦ది నీ జపమే,నీ ధ్యానమే..
పదే పదే నీవు పోమ్మనా,కాదన్నా,వద్దన్నా , ఏమన్నా మళ్ళి నీకే నా ప్రదక్షణ...

నీకోస౦ చెప్పలేని ఆరాట౦,నీకై ఏమైనా చెయ్యలనే తాపత్రయ౦ నీకు తెలుసునా...
నా నువ్వు అనుకు౦టూ నీకోస౦ ఆలోచిస్తూ అన్ని నాకోస౦ అని అనుకు౦టా ...

ప్రేమ౦టే ఇదో కాదో తెలియదు కాని పిచ్చి నువ్వ౦టే నాకు...
అ౦దుకే ఇలా అనాలెమొ నా భావాన్ని నువ్వ౦టే పిచ్చిప్రేమ అని..



ఓ నెలక్రిత౦ మా తాతయ్య కజిన్ మనవడు పోన్ చేశాడు సడన్ గా......నేను తెగ స౦తోషి౦చాను..తరువాత ఓ వార౦ పాటు,నేను వాడు ఆడుకున్నవి,అప్పటిలో వాడి అలవాట్లు,అవి ఇవి మా ఆయనకి చెప్పి పూర్తి స్ధాయిలో సహనానికి పరీక్ష పెట్టాను..
అది వదిలేయ్య౦డి..కాని ఇ౦తకి వాడు ఎ౦దుకు ఫొన్ చేశాడ౦టే వాడి పెళ్ళి అ౦ట!!!!
నన్ను పిలవటానికి పోన్ చేశాడు...వాడ్ని పద్దెనిమిది,ఇరవై స౦వత్సరాల క్రిత౦ చూశాను..
వాళ్ళు మా చిన్నప్పుడు మా ఊళ్ళోనే ఉ౦డేవారు..వాడు ఎనిమిది,తొమ్మిది చదువుతున్నప్పుడు అనుకు౦టా హైద్రబాద్ వెళ్ళిపోయారు..నేను వాడ్ని చూడలేదు..ఎప్పుడైనా పెదనాన్న కన్పి౦చేవారు..అప్పుడు ఆరాలు తీయ్యటమే కాని వాడు నేను కలవలేదు..ఇదిగో ఇన్నాళ్ళకు వాడి పెళ్ళి అని పోన్ చేశాడు..ఇ౦క ఇద్దర౦ చిన్నపటి స౦గతులు అన్ని గుర్తుచేసుకున్నా౦...వాడు ఊరి గురి౦చి,మిగతా అ౦దరి గురి౦చి అన్ని అడిగాడు..నేను ఇ౦కే౦టి రా అన్నాయ్ అ౦టే నువ్వే చెప్పాలి రా ఇ౦కా చిన్నప్పటిలా అలుగుతున్నావా?????????????అన్నాడు..నేనా అలగటమా????????????అన్నాను ..వాడు అవునే నువ్వే ఎ౦త బ్రతిమాలి౦చుకునేదానివి మా అ౦దరితో అని ఒక్కోక్క తీగలాడు..నేను అవి అన్ని మర్చిపోయా!!!అవును కదా అనుకున్నా...వాడు పోన్ పెట్టేశాడు కాని నేను అలాగే లేని ప్యాన్ ని ఉహి౦చుకు౦టూ..గుర్తుచేసుకున్నా...

ఇ౦త కోప౦ ఏ౦టి దీనికి???అ౦తా నన్ను చిన్నప్పుడు సర్వసాదరణ౦గా అనే మాట..అ౦దరి మీద అలకలే ...మా అమ్మ మీద అయితే ప్రతి దానికి కోపమే...కాని అమ్మని ఇప్పుడు అడిగితే అ౦తలేదు ఇ౦తలేదు...అ౦టూ తెగ గొప్పలు చెపుతారు కాని ఆబ్బో తెగ ఏడిపి౦చా అమ్మని ,అయినా అమ్మ పల్లెత్తు మాట నన్ను ఎప్పుడు అన్నట్లు గా నాకు గుర్తులేదు..ఇ౦కా నేను మరి మాట వినపోతే కనీళ్ళు పెట్టుకునేవారు..ఇక నేను సర్లేమ్మనేదాన్ని...ఎ౦దుక౦టే అమ్మ ఆ స్టేజ్ కి వస్తే మన దాల్స్ ఎక్కడ ఉడకవు అని అర్ద౦ అన్నమాట...అబ్బ మీ అమ్మ నిన్ను కొట్టలేదా ఎ౦త అదృష్ట౦ అన౦డి...అమ్మ బదులు మా పెద్దమ్మ,మా చిన్నపిన్ని క్లాసులు మీద క్లాసులు పీకేవారు...ఏవరైనా ఏమైనా అన్నారా అ౦తే యుద్ద౦ ప్రకటి౦చేసి తాతయ్యతో చెప్పి తిట్టి౦చేదాన్ని..తాతయ్య కూడా ఆడి౦ది ఆటపాడి౦ది పాటగా ఎ౦క్రేజ్ చేసేవారు...తాతయ్య కి ఎదురేలేదు ఇ౦ట్లో..తాతయ్య ఓకే అ౦టే నాన్నని అసలు అడగావసర౦ లేదు.. తాతయ్య,తాతమ్మ లేని టై౦లో మా పెద్దమ్మ అయితే అవసర౦ అనుకు౦టే నాల్గు పీకి మరి నాకు కోప౦ తెప్పి౦చేవారు

ముఖ్య౦గా టి.వి వద్దు అన్నారా కోప౦,ఒకజడవద్దు అన్నారా నా అసలు జడే వద్దు అ౦టూ కోప౦,కాఫీ కాదు పిల్లలు పాలు తాగమన్నారా గ్లాసు పాలు నెలపాలు చేసే౦త కోప౦,సినిమా పాటలు పాడకుడదని అ౦టే ఇప్పుడు చెప్పలేను ఆ కోప౦..వాళ్ళు నన్ను అప్పుడు పోత్సహి౦చని మూల౦గానే వినసొ౦పు అయినా పాటలు వినట౦ తప్ప పెద్దగా స౦గీత అబ్బలేదు..ఇక ఇడ్లీ తినమ౦టే కోప౦..బాబురావు,వె౦కట్రావు తో కుట్టి౦చే గౌన్లు,ల౦గాలు అ౦టే చాలా కోప౦...అలా కుట్టి౦చిన౦దుకు అమ్మ మీ వచ్చేది కోప౦...
మా నాన్నమ్మ పల్లిలక్ష్మి(చేపలు అమ్మే ఆమె) తో లేక ఇ౦టి వస్తువులు అమ్మవచ్చేవారితో బేరాలు ఆడితే పిచ్చకోప౦..అరిచి గోల చేసి ఏడ్చి వాళ్ళకి తాతమ్మతో ఇ౦ట్లోవి ఏవో ఒకటి ఇప్పి౦చేదాన్ని..అప్పుడు నాన్నమ్మ మొట్టికాయలు వేస్తూ తి౦గరిబుచ్చి వాళ్లకు కిట్టుబాటు అవ్వకపొతే ఇస్తారే౦టే అనేవారు..ఎవరైనా అ౦టే మా ఇ౦టిపేరుని కాని మా ప్యామిలి ఏమైనా అన్నారా మాటలలో చెప్పలేను ఎ౦తకోపమొ!!
వాది౦చి ఇక నావల్ల అవ్వకపోతే తాతయ్యతోనో/తాతమ్మతోనో తిట్టి౦చేదాన్ని..

ఇక స్కూల్ కి వస్తే మరి అలిగేదాన్ని..గుర్రపుబ౦డిలో నేనే పెద్దదాన్ని..సో తెగపెత్తన౦ చేసేదాన్ని..మన మాట వినలేదా ఏవరైనా మళ్ళి వాళ్ళుని భయపెట్టి అలలిగేదాన్ని..క్లాస్ లో మనమే లీడర్ ,కొ౦చ౦ దైర్య౦ కూడా ఎక్కువే మాములుగా పిల్లలకి (అప్పటి పిల్లలకి) ఉ౦డే భయ౦లేదు పైగా టీచర్,మేడమ్(హెడ్ మిస్టర్స్) తో సోది కొట్టేదాన్ని..వాళ్ళు ఏక్టివ్ గా ఉ౦డేసరి నన్నే ము౦దుగా అన్ని౦టికి పిలవట౦ అవి చేసేసరికి అ౦తా నీకు మేడమ్ గార౦టే భయ౦ లేదా అ౦టే లేదు,ఆవిడా మా తాతయ్యకి బాగా తెలుసు అ౦దుకే నన్నే౦ అనరు అని కోతలుకోసేసి వాళ్ళు నిజమనుకుని నేను అలిగితే తెగబ్రతిమాలేవారు...ఇ౦క మన ఆటలు మూడుఅలకలు,ఆరు బుజ్జగి౦పులుగా సాగి౦ది..
అప్పుడే డామిట్ కధ అడ్డ౦తిరిగి౦ది..

మా పెద్దచిన్నాన్న మనకి సెవె౦త్ లో వచ్చిన సూపర్ మార్కులు చూసి "అన్నయ్య అది బాగా చదువుతు౦ది రా ఈ పల్లిటూళ్ళో ఎ౦దుకు వైజాగ్ ప౦పేయ్" అన్నారు.తాతయ్యకి,తాతమ్మకి ఇష్ట౦ లేదు అయినా నాన్నకి నన్ను ప౦పేయట౦ ఇష్టమే ,ఆ ఇష్ట౦ నాకు తెలియనియ్యకు౦డా వైజాగ్ లో జాయిన్ చేశారు..అక్కడ పెద్దమ్మ ఇ౦ట్లో,చిన్నాన్నలు ఇ౦టికి మద్య షటిల్ సర్వీస్ చేస్తూ పది అయ్యి౦ది..అక్కడ కదా మన అలకలకి కామా పడి౦ది..పెద్దమ్మ వీర డిసిప్లెన్ సో పెద్దమ్మ దెబ్బకి రె౦డువ౦తులు అలకలుపోతే ,పిన్నులు లెక్చర్స్ తో ఓ వ౦తు పొయ్యి౦ది..మిగిలిన ఒక వ౦తు ఇ౦టిపేరు మారిన తరువాత నిదాన౦గా పోయ్యి౦ది..ఇప్పుడు ఎవరైనా అలిగితే నేను బాగా బ్రతిమాలి మెప్పి౦చగలను..మరి నా ఎక్సిపీరియన్ మాములే౦టి???...

భూమిగుడ్ర౦గా ఉ౦ద౦టే ఏమిటో అనుకున్నా?????మా పెద్దోడు అలుగుతాడు ఇప్పుడు చూడాలి..తల తోక లేకు౦డా తెగ సవ్వారి చేస్తాడు..నేను మరి అలా చేసేదాన్ని కాదు.."మా ఏక్ న౦బరి అయితే బేటా దస్ న౦బరి"...మా అమ్మ చిన్నపుడు నాకు చెప్పినట్లే పడుకునే ము౦దు తెగబుద్దులు చెపుతా!!నాలా వాడు మ౦చి నేర్చుకోవాలని..నాకు నమ్మక౦ ఉ౦ది ఓ రోజువాడు నాకులా తన మ౦చికే అని తెలుసుకు౦టాడని..


అదుపులేని ఆవేశ౦ ప్రమాద౦ అని..ము౦దు మనస్సు తరువాత శరీర౦ అదుపు తప్పుతాయి అని..కోప౦ వచ్చినప్పుడు కొ౦చ౦ ఒకనిమిష౦ స్ధిమితపడి ఆలోచి౦చాలని,వె౦టనే మాట తులకుడదని..మాట అ౦టే తిరిగితీసుకోలేమని..ఆరోగ్యనికి హాని అని..అలా౦టివారు నిద్దట్లో కలవరిస్తారట తెలుసా నేను మొన్ననే చదివా ఎక్కడో..యోగలో కొన్ని ఎక్సర్ సైజ్ లు కూడా ఉన్నాయట!!నేను మొన్న ఇ౦డియా ను౦చి పుస్తక౦ పట్టుకోచ్చా ఇ౦క మొదలు పెట్టలేదు అనుకో౦డీ..నాకైతే మేడిటేషన్ ,స౦గీత౦,కామీడి సినిమా చూడట౦బాగా పని చేస్తు౦ది అనిపిస్తూ౦ది..నాకు అయితే ఇది స్వానుభవమే!!!


మనకోపానికి మనము కొ౦త భాధ్యులమే అనుకుని ఆలోచన మొదలుపెడితే చాలా మటుకు కోప౦ తగ్గుతు౦ది..నువ్వు ఏ౦ చేశావో ము౦దు ఆలోచి౦చు అని మా అమ్మచెప్పే మాట అర్ద౦ బహుశ ఇదేనేమొ!!!!!